దక్షిణాఫ్రికా కధలు
‘’సదరన్ ఆఫ్రికన్ స్టోరీస్ ‘’అని పెంగ్విన్ వారు ప్రచురించిన పుస్తకం’’జమ్ ఘాన్ ‘’ లైబ్రరి లో కన బడింది .దాన్ని తెచ్చి ఆబ గాచదివాను .భలే గా ఉన్నాయి .ప్రతి కదా ఒక ఆణి ముత్యం లా ఉంది . అందరూ చదవాల్సిన గొప్ప కదా సంకలనం .చదివి ఉండక పొతే చాలా నష్ట పోయి ఉండే వాడిని అని పించింది .ఈ కదా సంకలం చేసిన వాడు స్టీఫెన్ గ్రే .వైవిధ్యం ,మంచి నేటివిటి ఉన్న కధలు ఇవి.
ఫ్రాంక్ బ్రౌన్ రాసిన ‘’ది డవ్ అండ్ జాకాల్ ‘’కద సింప్లీ సూపర్బ్ అని పించింది .చిలిపి గా చిన్న పిల్లల కద లా ఉంది .ఆలివర్ స్క్రీనర్ రాసిన ‘’ది ఉమన్స్ రోజ్’’ కూడా బాగా ఉంది .’’ది స్కూల్ మాస్టర్ ‘’కధను పాలిం స్మిత్ రాశారు .చాలా హృదయానికి హత్తుకొనే లా ఉన్న కద ఇది .’’ది డెత్ ఆఫ్ మకాబా ‘’చాలా నేచురల్ గా ఉన్నది .సి.ఇ మొకాన్గో రాసిన ‘’సేబోలిలో కమ్స్ హోం’’కద ఆఫ్రికా లోని మూఢా చారాలకు అద్దం పడుతుంది .జాన్ బేబీ రాసిన ‘’ది డ్రాట్ ‘’కద,చిన్న కధే అయినా తెల్ల జాతి వాళ్ళ నల్ల జాతి వాళ్ళ మధ్య విరోధం వైషమ్యం ,ప్రతీకారాలను గొప్ప గా చూపించిన కద.
‘’ బాయ్ బాయ్ ‘’అనే కద ను’’ కెరీ మొట్సిసి ‘రాశారు .బాయ్ అనే కుర్రాడి చిలిపితనానికి ఈ కదా కధనం అద్భుతం గా ఉందని పించింది .బాగా ఆకట్టుకొన్న కద ఇది .’’రిచర్డ్ రైవ్ ‘’ రాసిన ‘’ది బెంచ్ ‘’కదలో నల్ల వాళ్ళ హక్కులను కాల రాచే తెల్ల వాడి ప్రతాపం ,దాన్ని ఎదిరించి ధైర్యం గా జైలుకు వెళ్ళిన నల్ల వాడి గొప్పతనం సహజం గా చిత్రీకరించిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది .’’కీన్ లిపెంగా ‘’రాసిన ‘’ది రోడ్ టు మిగోవి ‘’ ఒక కండక్టర్ కద ఉంది .బస్సు ప్రయాణం అందులో బాధలూ సరదాలు ,భలేగా ఉంటాయి .’’ఎల్సా జాబర్ట్ ‘’రచించిన ‘’మిల్క్ ‘’కద గొప్ప గా ఉన్నది .ఇందులో ‘’రేప్’’చేయ బడిన ఆవిడకు పిల్లాడు పుడితే ,గొంతు నులిమి చంపేసిన కద దయనీయం గా మానవీయం గా గుండెల్ని పిండేసే లా సెంటి మెంట్ ,మసాలా దట్టిం చకుండా సహజ సుందరం గా ఉంది.
ఈ కదా సంకలం చేసిన స్టీఫెన్ గ్రే గురించి కొన్ని విశేషాలు .గ్రే దక్షిణాఫ్రికా రచయిత ,విమర్శకుడు .కేప్ టౌన్ లో 1941పుట్టాడు కేప్ టౌన్ యూని వర్సిటి ,కేంబ్రిడ్జ్ యూని వేర్సితి అమెరికా లోని అయోవా యూనివర్సిటీలలో చదివాడు . జోహాన్స్ బర్గ్ లోని రాండ్ ఆఫ్రికన్ యూని వర్సిటి లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1992వరకు పని చేశాడు .మంచి కవి కూడా అయిన గ్రే ఎనిమిది నవలలు రాశాడు .దాక్షినఫ్రిక చరిత్ర ను తిరగ రాశాడు .హోమో సెక్సువాలిటీ పై వ్యాసాలూ రాశాడు .దియేటర్ కూ రచనలు చేసి మెప్పు పొందాడు .
ఇన్ని మంచి కధలు ఆఫ్రికా నుంచి రావటం ,వాటిని చదివే అవకాశం నాకు రావటం మహదానందం గా ఉంది .
20-10-2002 ఆదివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-3-14-ఉయ్యూరు
Most respected sir,I want to talk to you,may i know your mobile number please?