కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2
భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తుంటే జయదేవ్ మరో కార్టూనిస్ట్ సత్య మూర్తి చూస్తున్నారు .అందులో పూజారి కి జందెం లేక పోవటం బాపు గమనించ లేదు .వీళ్ళు చూసి గోనుక్కున్తుంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది తీసేసి జందెం వేసి మళ్ళీ తీశారట .రాజీ పడనీ తత్త్వం బాపు అని దీన్ని బట్టి అర్ధమవుతుంది .ఆయన అబ్సర్వేషన్ మహా గొప్పది అంటాడు జయదేవ్ .ఒకసారి చిరంజీవిని ‘’జాకీ చాన్ రజనీ కాంత్ మీకూ చిన్నపిల్లల ఫాన్లు లక్షల్లో ఉండటానికి కారణం ఏమిటి ‘’/అని అడిగితే ‘’హీరో కళ్ళల్లో అమాయకత్వం కనీ పిస్తే పిల్లలు విపరీతం గా అభిమానిస్తారు ‘’అని చెప్పాడట అది ముమ్మాటికి నిజం అన్నాడు జయదేవ్ .వంశ వృక్షం షూటింగ్ లో అనిల్ కపూర్ కి తెలుగు పలకటం రాక పొతే వీరి స్నేహితుడు గోపాల్ నేర్పి నానా తంటాలు పడి పలికిం చాడట .శశి ధర్ అనే కార్టూనిస్టు తనకు బాపు బొమ్మ లాంటి అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని ఉందని బాపు ,వీరి సమక్షం లో అంటే బాపు ‘’నన్నే పెళ్లి చేసుకో అయితే ‘’అన్నాడట .
బాపు ఇంట్లో ప్రఖ్యాత గజల్ గాయకుడు మొహిదీ హసన్ చిత్రం ఫ్రేం కట్ట బడి ఉంటుంది .ఆయన గజల్స్ అంటే బాపు కు ప్రాణం ట .ఒక సారి మద్రాస్ లో ఆయన కచేరికి జయదేవ్ బృందం బాపు ఇచ్చిన పది వంద రూపాయల టికెట్ తో వెళ్లి విన్నారు .రెండు గంటలు పాడినా మెహిదీ గారు అలిసి పోలేదట .బాపు ఇచ్చిన పది టికెట్ల డబ్బు బాపుకు ఇచ్చారు వీరిద్దరి టికెట్లు తప్ప ఎవరూ వీరి దగ్గర కోన లేదన్నది కొస మెరుపు .’’రైలు బండి తేలు కొండి’’ లాగా ఉంటుందని చమత్కరించాడు జయ .’’తేలు కొండి,దొర బండి, రైలు బండి ‘’అని చిన్నప్పుడు పాడే వారట .
హైదరా బాద్ లో జరిగిన వరల్ద్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ లో మారియా మిరండా ,విన్స్ అనే ప్రముఖ కార్టూనిస్టులు వచ్చారట .అప్పుడు సంతకాలు మీద కార్టూన్ ఎలా గీయ వచ్చో జయదేవ్ గీసి చూపి అందర్నీ ఆశ్చర్య పరచాడు .జయదేవ్ స్వాతి బలరాం ప్రేరణ తో ఆ పత్రికలో ‘’సంతకాలతో సరదా చిత్రాలు ‘’గీసి కొన్ని వందల మంది సంతకాలకు చిత్రాలు గీసి ప్రతిభ చాటుకున్నాడు .శంకు అనే కార్టూనిస్ట్ జయదేవ్ కు మంచి మిత్రుడు .శంకు ప్రోద్బలం తోనే బాపు ‘’మిస్టర్ పెళ్ళాం ‘’సినిమా తీశాదట .అమరా వతి కధలు ను డైరెక్ట్ చేసి శంకు మంచి పేరు పొందాడు .తృప్తి ఆనే కధలో జయదేవ్ కూడా నటించాడట .శంకు చాలా తాపీ గా ఉండే మనిషి అంటాడు జయ .చిన్నప్పుడు తాటికాయ లతో తానూ చిన్నప్పుడు తోపుడు బండి తయారు చేసి ఆడటం ‘’ట్రెడ్లింగ్ ఏ హూప్ప్ ‘’ను గుర్తుకు తెస్తున్దన్నాడు .
బాబు అనే కార్టూనిస్ట్ ‘’వెంకన్నాస్ కోల్డ్ ‘’అనే బొమ్మల కదా ఆంద్ర పత్రిక వీక్లీ లో అద్భుత విజయం సాధించిందని గుర్తు చేసుకొన్నాడు .కొండప్ప నాయుడు అనే కుర్రాడు ఇంగ్లీష్ నేర్పమని వస్తే అతనికి ఏ బి సి డీ లేరావని తెలిసి ఇంకో మేస్టారి దగ్గరకు పంపి నేర్పించి తర్వాత తానూ నేర్పానని అతను క్రమం గా ఎదిగి లా చదివి హైదరా బాద్ చేరి కృష్ణ మోహన్ గా పేరు మార్చుకొని తెలుగు దేశం పార్టీకి జుడీషియరీ హోదాలో సలహా దారై అన్న గారి అభిమానం పొంది ఏంతో ఎదిగి పోయాడని సంబర పడ్డాడు దేవ్ .కృష్ణ మోహన్ విజయానికి కారణం ‘’రహస్యాన్ని రాహస్యం గా ఉంచటం ‘’అని కష్ట పడితే ఫలితం వెంట పడుతుందని జయ అంటాడు కృష్ణ మోహన్ ను చూస్తె గర్వ కారణం గా ఉంటుందని చెప్పాడు .దర్శకుడు రవి రాజా పిని శెట్టి జయ దేవ్ శిష్యుడే ట.రంగుల తీపి మిథాయి దానితో సైకిలు, తేలు గడియారం చేసితినిపించే అతన్ని గురించి గుర్తు తెచ్చుకొన్నాడు .కర్రపుల్లకు ఐస్ కరీం అంటించి ఇంటింటికీ తిరిగే సేను కుల్ఫీ ఐసు వచ్చిన తర్వాతా తెరమరుగైన విధం వర్ణించాడు .వెలగ పండు గుజ్జు లో బెల్లం కలిపి తింటే మహా రంజు గా ఉంటుందన్నాడు .మనం అందరం చిన్నప్పుడు తినే ఉన్నాం .వారానికో సారి ఒళ్లంతా నూనె పట్టించి కుంకుడు రసంతో తలంటి స్నానం నెల రోజుల కోసారి విరోచనాల మందు లేక సునాముఖి చారు తాగాటమూ జయదేవ్ కు గుర్తుంది .
వాళ్ళ చాకలి పేట లో కాలేజి పెట్టటానికి ఒక పెద్ద హుండీ ఏర్పాటు చేసి దాని లో అందరూ డబ్బులు వేసేట్లు చేసి ఆ డబ్బుతో కాలేజి ని నిర్మించిన రామ సామి శెట్టి గారిని కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు .ఇండియన్ ఇంకు తో వేసిన మొదటి బొమ్మ ను జయ మర్చి పోలేదు .కూతురికి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షకు తర్ఫీదు నిచ్చాడు. ఆమె చదివి డాక్టర్ అయిన్ది కొద్ది మంది స్టూడెంట్ లకు ట్యూషన్ చెప్పి ఏం బి బి ఎస్ పాస్ చేయించాడు .వారితో బాటూ తానూ పి హెచ్ డి .పాస్ అయ్యానని చెప్పుకొన్నాడు .ఒక సారి కొడుకు ను కాలేజీ లో చేర్చటానికి సుందర రావు అనే ఆయన వచ్చాడట .ప్రిన్సిపాల్ ‘’ఈజ్ హి యువర్ వోన్ సన్ ? ‘’ అనిఆ యన్ను అడిగితె ‘’మై వైఫ్ సేస్ సో ‘’అన్నాడట సుందరరావు అంతే మారు మాట్లాడకుండా సీటిచ్చాడు ప్రిన్సిపాల్ .ఈ ఉదంతం అందరికి తెలిసి పగల బడి నవ్వు కొన్నారట .
జయదేవ్ ‘’జగ్గు మగ్గు పెగ్గు ‘’ అనే బొమ్మలకార్టూన్ కదా సీరియల్ గా వేశాడు .ఆ రోజుల్లో మద్రాస్ లో తెలుగు సినిమా టికెట్టు ‘’నాలుగుముక్కాలణా ‘’ఉండేది అంటే కాని తక్కువ అయిదు అణాలు .దాచుకోన్నవో లేక మామ్మ కొంగు నుండి తెలీకుండా దోచుకోన్నవో లేక బంధువులు ఇంటికి వస్తే ఇచ్చిన డబ్బులతోనో సినిమా చూసే వాడు .ఇది మనకూ అనుభవమైనదే ,జయదేవ్ గుర్తు చేసుకొన్న ఇంకో విషయం కూడా ఉంది .అదే ‘’చింత పండు కాండీ ‘’కొబ్బరి పుల్ల చివర చింతపండు బెల్లం ఉప్పు కలిపి ఉండగా చేసి గట్టిగా నొక్కితే వచ్చేదే ‘’చింత పండు కాండీ ‘మేమూ చిన్నప్పుడు తిన్నాం .దీన్ని గోడ సున్నానికి అంటించి తింటారు అన్న కొత్త విషయం చెప్పాడు దేవ్ .దీని వల్ల ప్రత్యెక రుచి వస్తుందట .ఈ కాండీ ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూంటే గొప్ప అను భూతి .గంటలకు గంటలు దీన్ని చీకుతూ కాలక్షేపం చేయచ్చు ఇందులో ఇనుము ఖనిజ లవణాలు గ్లోకోజు ,కాల్షియం అన్నీ ఉండి బల వార్ధకం గా ఉంటుందని జయ దేవుని ఉవాచ .
తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో’’ బిజావ్ .’’పోర్టబుల్ టైప్ రైటర్ అంటాడు .దీని తోనే తన పి.హెచ్ డి థీసిస్ తో సహా కొన్ని వందల పేజీలు టైప్ తానే చేసుకోన్నానని’’ ఆ బుజ్జి ముండ’’ ను వదలి పెట్టకుండా ఇంకా భద్రం గా నే దాచుకోన్నానని ఆప్యాయం గా మెచ్చుకొన్నాడు దాన్ని .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-14-ఉయ్యూరు