కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3
జయదేవ్ తొమ్మిదో తరగతి చదువుతూండగా డి.ఏం కే వాళ్ళు స్కూలు గేటు ముందు నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట .అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ చీటా లైట్ ‘’అగ్గి పెట్టెలకు ప్రసిద్ధి .వాటి లేబుల్స్ సేకరించి దాచుకొనే వారట స్కూలు పిల్లలు .చిన్నయ సూరి గారి ‘’సంజీవకుడు ‘’పాఠం తన కెంతో ఇస్టమని ఆ వాక్య విన్యాసం తనను అమితం గా ఆకర్షించిందని దాన్ని బట్టీ పట్టి గట్టిగా చెప్పే వాడినని సంతోషం గా చెప్పాడు. జయదేవ్ రాసిన ‘’అరాక్నిడ ‘’ అనే కదా బాల మిత్ర లో అచ్చు అయిందని అది రెండవ కద అని అన్నాడు .కన్నన్ అనే అయన తెల్ల వారు జామున ఠంచన్ గా నాలుగింటికి అందరికి విన బదేట్లు పాఠాలు చదివేవాడని ఇది అందరికి మేలు కొలుపు గా ఉండేదని జ్ఞాపకం చేసుకొన్నాడు .షేక్స్ పియర్ ను శేషప్ప అయ్యర్ అంటారని తంజావూరు వాడని లండన్ చేరి నాటకాలు రాశాడని ఇంటర్ లో జయ బృందం జోకేవాళ్లట..ఇంగ్లీష్ పుస్తకం లో ‘’లీన్ ఛీ అల్తాంగి ‘’అనే పాఠాన్ని నారాయనయ్యర్ అనే ‘దంచేసే వాడట ‘’.పిల్లలు గోల చేస్తున్నా తన పాఠం ఆపే వాడు కాదు .ఒక సారి ప్రిన్సిపాల్ వచ్చి చూసి ఇక నుంచి ఆయనా ,ప్రిన్సిపాల్ కూడా వీళ్ళ క్లాసుకు రామని చెప్పాడట .అది పెద్ద పనిష్మెంట్ అని,యెంత బతిమి లాడినా ఒప్పుకోలేదని ,అల్లరి చేసిన వాడిని కుర్రాళ్ళంతా బహిష్కరించామని ,అందరూ వెళ్లి ప్రిన్సిపాల్ ను బతిమాలారు .అప్పుడు మెత్త బడి ఇద్దరూ క్లాసులు తీసుకోన్నారట ‘’కింగ్ లియర్ హాజ్ ఎక్సూజేడ్ అస్ ‘’అని కరుణాకర్ ఆనందం గా వారిద్దరి తో బాటు క్లాసులోకి వచ్చాడట .నారాయణ్ గారి క్రాఫు తమాషా గా ఉండేదని జుట్టు చేరిగేది కాదని ,అందుకని ఆయన్ను ‘’నాలుగు క్రాఫుల నారాయణ్ ‘’అనే వాళ్ళమని ఆయన బ్రహ్మ చారి అని ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఆర్టికల్స్ రాసేవాడని అంతిమ క్షణాలు కాలేజి హాస్టల్ లోనే గడిపాడని చెమర్చిన కాళ్ళ తో జయ జ్ఞాపకం చేసుకొన్నాడు .
బంధు మిత్రులతో బందరు దగ్గరున్న చిలకల పూడి లో పాండురంగని దర్శనం మధురాను భూతి అన్నాడు .తన వీధిలో కన్నేలమ్మ అనే ఆమె ఎంతో మంది ఆడవాళ్ళకు పురుళ్ళు పోసిన ఆవిడ అని చెప్పాడు .చాకలి పేట అంబాల్ విలాస్ లో ‘’మఖమల్ పూరి ‘’ప్రసిద్ధం .దాని పై బాదం పప్పులు తరిగి ,దోస విత్తులు ,చల్లి కొబ్బరి ని తీగేలుగా కత్తిరించి ,కుంకుం పువ్వుతో కలిపి మడత పూరీ మీద చల్లి ప్లేట్ లో పెడితే అదే మొఖమల్ పూరి .బియ్యం తో చేసిన నూడిల్స్ నే ఆ రోజుల్లో ‘’ఇడియప్పాలు ‘’ అనే వారట .పాల బొందాలను ‘’గ్యాప్ చిప్ పలహారం అని సరదాగా పిల్చే వారట .పేణీలు ఆ రోజుల్లో ఫేవరేట్ చిరుతిండి .బాల అనే బాలల పత్రిక లో ‘’లటుకు –చిటుకు ‘’బాగా నచ్చేదన్నాడు .బాపట్ల లో బొబ్బిలి యుద్ధం నాతాకం చూశానని అందులో బుస్సీ ‘’ది బాబ్లి వారు చాలా మాంచి వారు అని నాకే తెల్సు’’ అని ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడుతుంటే సరదాగా ఉండేదట .
జయదేవ్ నాన్న స్నేహితుడు ‘’రాహుకాలం ‘’దాటే దాకా ఏ పనీ చెయ్యడని అందుకని ఆయన్ను ‘’రాహుకాలం అంకుల్ ‘’అనే వాళ్ళమని చెప్పాడు .ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ జెర్రి పాకితే మంత్రం వేసేవాడని తనకు అలానే నయం చేశాడని స్టేషన్ నుంచి ‘’మెసేజ్ ‘’పంపిస్తే చాలు ఆయన మంత్రం చదివే వాడని వెంటనే దద్దుర్లు మాయంయ్యేవని చెప్పాడు .అలాగే ‘’పాముల నరసయ్య ‘’గారు మెసేజ్ తోనే మంత్రం చదివి పాము కాటు మరణం నుండి కాపాడేవారని ,జెర్రి మంత్రం వేసే స్టేషన్ మాస్టర్ కద ను ‘’ఇల్లస్త్రేటేడ్ వీక్లీ ‘’ప్రచురించింది అని చెప్పాడు .మెసేజ్ అందగానే ఆ వ్యక్తీ పేరు తో చెట్టుకి ఒక తాడు కట్టే మంత్రం చదివే వాడట .ఎన్నో మైళ్ళ దూరం లో ఉన్న వాళ్ళ జెర్రి విషం యిట్టె దిగి పోయేదట .సైన్సు కు ఇది విరుద్ధం గా ఉన్నా అంతా సత్యమైన విషయమే నని నిర్దారాన్ గా జయ దేవ్ చెప్పాడు .తమ ఇంట్లో ఒక ఆంటీ పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు పాట పాడాడని ,విన్న పెళ్లి కూతురాంటి మనసిచ్చి పెళ్ళికి ఒప్పు కొండట .పెళ్లి కూతురు పాడటం విన్నాం కాని, పెళ్లి కొడుకు పాడటం వింత గా ఉంది .ప్రముఖ లేడీ కార్టూనిస్ట్ ‘’రాగతి పండరి ‘తన శిష్యురాలని గర్వం గా చెప్పాడు .
రవీంద్ర సదన్ లో సత్యజిత్ రే ను ,మృణాల్ సేన్ ను చూడటం తనకు పండుగ అన్నాడు .’’విదేశీ సినిమాలలో హాస్యం ‘’పై జయదేవ్ స్వాతి, విజయ పత్రిక లలో వ్యాసాలూ చాలా రాశాడు .ఒక సారి రైల్ ఆక్సి డెంట్ జరక్కుండా కాపాడిన డ్రైవర్ కు రూపాయి నోట్ల దండ వేసి ప్రయాణీకులంతా కృతజ్ఞత చెప్పటం గుర్తు చేసుకొన్నాడు .అరవ తెలుగు లో ‘’తంగ సాల ‘’అంటే నోట్లూ నాణాలు ముద్రించే మింటు .’’టంకశాల’’ తంగ సాల అయిందేమో ?’’ప్రళయ కావేరి ‘’ అనే పులికాట్ సరస్సు లో మంచి నీర్రు ఉప్పు నీరు కలిసి నీరు రు చప్పగా ఉంటుందట .తన పి.హెచ్ డి .థీసిస్ కు కాలేజి అటెండర్ రామ దాసు చేసిన సాయం మర్చి పోకుండా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు .
దర్శకుడు వంశి తీసిన ‘’లేడీస్ టైలర్ ‘’సినిమాకు పోస్టర్ డిజైన్ చేసింది జయదేవ్ .సినిమా అడ్వర్టైజ్ మెంట్ కు ఇదే మొదటి ప్రయోగం .తనికెళ్ళ భరణి హ్యూమరిస్టూ మాత్రమే కాదు’’ పరమ బోళాలా హ్యూమరిస్ట్ ‘’అన్నాడు దేవ్ .ఆ సినిమాలో ‘’జ భాష ‘’ఆయన స్వంతమే నని తొడ మీద మచ్చ అయిడియా బాగా పేలిందని అన్నాడు .దని కొండ హనుమంత రావు మాట్లాడితే అన్నీ బూతులే వస్తాయని చెప్పాడు .వెల్ డన్ పత్రిక అధినేత భావానారాయణ జయదేవ్ తో ఒక తెలుగు వాచకానికి బొమ్మలు వేయిన్చుకోన్నాదట .బొమ్మల కద ‘’దుమ్బ్లార్ క్లుమ్పెన్ ‘’అనే అర్ధం పర్ధం లేని పేరు పెట్టానని చెప్పుకొన్నాడు .ఆంద్ర భూమి సంపాదకుడు కనకాంబర రాజు తను రాసిన ‘’పొడ్యూసర్లోస్తున్నారు ‘’నవలకు తన తోనే కవర్ కార్టూన్ వేయిన్చుకోన్నాదట .యువ లో వేస్సిన కార్టూన్ లకు వెంటనే డబ్బు పంపేవారని అందులో ‘’ఎలికమ్మాయి ‘’బొమ్మల కద సూపర్ హిట్ అని చెప్పాడు .అందులో తాతలు దిగి వస్తారు అన్న సామెత ను నిజం చేశానన్నాడు .వాకాటి పండు రంగారావు గారు ‘’ఆంద్ర పత్రిక ‘’ను ‘’ఆంద్ర సచిత్ర వార పత్రిక ‘’అనే పేరు పెట్టారని గుర్తు చేసుకొన్నాడు .ఆ పత్రిక లో ఒక సారి ఎడిటర్ ను చూడ టానికి తానూ వెళ్ళినప్పుడు అక్కడ నట భూషణ్ శోభన్ బాబు విజిటర్స్ లాంజ్ లో కూర్చున్నా తననే ముందు లోపలి పిలవటం మర్చి పోలేనంటాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-14-ఉయ్యూరు