మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్
Posted on March , 2014 by విహంగ మహిళా పత్రిక
చంద్ర మతి అని పేరొందిన చంద్రికా బాలన్ మళయాళ ,ఇంగ్లీష్ భాషల్లో మంచి మహిళా సాహితీ వేత్త .కల్పనా సాహిత్యాన్ని విమర్శను రెండు భాషలలోను రాసిన మహిళా సవ్య సాచి .మలయాళం లో ఇరవై ఇంగ్లీష్ లో నాలుగు పుస్తకాలను రాసి పేరు పొందింది .అందులో పన్నెండు కదా సాహిత్యానికి చెందినవే .మధ్యయుగ మలయాళీ కవిత్వం పై గొప్ప పరిశోధన చేసి వ్యాసాలూ రాసింది .రెండు వ్యాస సంపుటాలు ,రెండు జ్ఞాపకాలు ,అయిదు ఆంగ్లం నుండి మలయాళం లోకి అనువదించిన పుస్తకాలు రాసింది .
కేరళ లోని తిరువనంతపురం లో చంద్ర మతి జన్మించింది .కేరళ యూని వర్సిటి నుండి ఆంగ్ల సాహిత్యం లో మాస్టర్ డిగ్రీ పొందింది .తిరువనంత పురం లోని ఆల్ సెయింట్స్ కాలేజి లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసింది .1993 -94 లో మధ్యయుగ భారతీయ సాహిత్యానికి ఎక్సిక్యూటివ్ ఎడిటర్ గా పని చేసింది .ఆమె సాహితీ వ్యాసంగానికి ప్రభుత్వం ప్రొఫెసర్ శివ ప్రసాద్ ఫౌండేషన్ అవార్డ్ ను ప్రదానం చేసింది .1999లో విశిష్ట ఉపాధ్యాయ గౌరవాన్ని అందుకోంది.2002లో కేరళ లో అత్యుత్తమ లెక్చరర్ గా పురస్కారం అందుకొన్నది .కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ,పద్మనాభ అవార్డ్ ను పొందింది .సాహిత్య అకాడెమి తరఫున పది మంది రచయితల తో స్వీడెన్ కు సాంస్కృతిక సౌహార్ద పర్యటన చేసింది .ఈ పర్యటన ‘’రీన్ డీర్’’ రచన చేయటానికి దోహద పడింది .పద కొండు విశిష్ట పురస్కారాలనందుకొన్న ‘’కేరళ విద్యా కుట్టి’’చంద్ర మతి .
ఆంగ్లం లో చంద్ర మతి వి.కే.కృష్ణ మీనన్ ,బెస్ట్ లవేడ్ స్టోరీస్ ,ప్రైవేట్ గార్డెన్ ,క్రిటికల్ స్పెక్ట్రం రచనలు చేసింది .మలయాళం లో ఆర్యా వరతం దివి గ్రామం ,రీన్ డీర్ ,స్వయం స్వంతం ,బేతాళ కధలు ,దైవం స్వర్గతి ,చంద్ర మతి కధలు ,షెర్లాక్ హోమ్స్ మొదలైన వి ఉన్నాయి .ఇవికాక తమిళ వ్యాస సంపుటి లో మధ్యకాల మళయాళ కవిత ,పెరిల్ల ప్రసంగై,నిన్జన్ ఒరు వీడు మొదలైనవి ఉన్నాయి .అనువాద గ్రంధాలలో తక్కై శివ శంకర పిళ్ళై ,జాను అనే నవల ,వంచన ,కలింజ కాలన్జిల్ వగైరా ఉన్నాయి
చంద్రికా బాలన్ 17-1—1954 న జన్మించింది .చంద్ర మతి కలం పేరు తో రచనలు చేసింది .అరవై ఏళ్ళ వయసులో మళయాళ ,ఆంగ్లాలలో సవ్య సాచిగా సాహితీ వ్యాసంగాన్ని కొన సాగిస్తున్న చంద్ర మతి అభినంద నీయురాలు .
– గబ్బిట దుర్గా ప్రసాద్