హెమింగ్ వే చివరి రోజులు
అమెరికా రచయిత ఎర్నెస్ట్ హేమింగ్ వే రాసిన ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’నవలకు నోబుల్ పురస్కారం వచ్చింది .ఎన్నో కధలూ నవలలు యుద్ధ వార్తలూ రాశాడు .అతని వాక్యాలలో విస్ఫు లింగాలు ఉండవు . కాని ప్రతి మాటా, వాక్యం అర్ధ వంతం గా ఉంటుంది .వేట అంటే ఇష్టం .ఆఫ్రికన్ సఫారి చేశాడు .. నలుగురు భార్యలని చేసుకొన్నాడు .సంపాదనా బాగానే ఉంది .అయినా తరచూ డిప్రెషన్ కు లోనయ్యే వాడు .దానికి షాక్ ట్రీట్ మెంట్ అవసరమయ్యేది .ఆ బాధ ను తట్టుకోలేక పోయే వాడు .గుర్రపు స్వారీ బాగా చేసే వాడు .ఇన్ని ఉన్నా ఏదో వెలితి అతన్ని పట్టి పీడించింది చివరి రోజుల్లో నరక యాతనే అనుభవించాడు .ఈ విషయాలన్నిటిని మైకేల్ రేనాల్డ్స్ ‘’హెమింగ్ వేస్ ఫైనల్ ఇయర్స్ ‘’పేర ఒక పుస్తకం రాశాడు.దాన్ని చదివాను .చాలా బాగా రాశాడు .అప్పీలింగ్ గా ఉంది .అసలే హెమింగ్ వే అంటే వీర అభిమానం ఉంది నాకు .అందుకని శ్రద్ధగా చదివాను .అందులోని ముఖ్య విషయాలను తెలియ జేస్తాను .
‘’All stories if continued far enough end in death and he is not true story teller who would keep that from you .There is lonelier man in death except the suicide ,than that man wo has lived many years with a good wife and outlived her ‘’అని హెమింగ్ వే రాశాడు ‘’డెత్ ఇన్ ది ఆఫ్టర్ నూన్ ‘’లో .old man and sea’’ లో ముసలి హీరో ను సింబాలిక్ గా చంపటం ఉంది దీనిపై స్పందిస్తూ ‘’the symbolic killing off the old hero must always be an incomplete act ,for even in death and discard the hero retains a dangerous amount of negative mantra ‘’అన్నాడువిమర్శకుడు ఫ్రెడరిక్ టర్నర్ .పై రెండు చోట్లా ఉన్న వాక్యాలు హెమింగ్ వే మరణం పై ఆత్మ హత్య పై ముందు మాటల్లా ఉంటాయన్నాడు .దీనికే కోన సాగింపు గా ‘’a man might not control all the variables ,but neither could be fail to try ‘’అన్నాడు .
నలుగుర్ని పెళ్లి చేసుకొన్నా ఎవరి తోనూ సరిగ్గా ప్రవర్తించక అందర్నీ ఇబ్బంది పాలు చేశాడు .వాళ్ళూ ఇతన్ని ఇబ్బంది పెట్టారు .ఆదాయం కంటే ఖర్చు ఇబ్బడి ముబ్బడి అయ్యేది .చివరి పెళ్ళాం మేరి ‘’ఎక్సట్రావగంట్ ‘’‘’గా ఖర్చు పెట్టింది .టాక్స్ కట్టక పోవటం ,పరువు తగ్గి పోవటం ,చిన్నప్పుడే మెదడు కు దెబ్బ తగలటం ,ఎప్పటికప్పుడు ప్రమాదం అంచులలో పడటం ,యుద్ధాల్లో ప్రత్యక్ష చర్యల్లో ఉండటం ,రెండవ ప్రపంచ యుద్ధం, క్యూబా యుద్ధాలలో అనేక దేశాల్లో తిరగటం ,నిలకడ లేని తనం ,ఆడ గాలి తగిల్తే యెగిరి వెళ్లి వాలటం తో జీవితం సవ్యం గా సాగ లేదు .ఇదంతా నోబెల్ ప్రైజ్ రాక ముందు స్తితి .అది వచ్చిన తర్వాత కొంత నిలకడ వచ్చింది .అయితే అది ‘’టూ లేట్ ‘’అవటం ,అయినా బాలన్స్ లేక పోవటం ,వీటికి తోడూ బుర్రకు ఎలెక్ట్రిక్ షాక్స్ లతో విసిగెత్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు .
‘’Only Ernest could cure Ernest .He need only begin to write powering his pain into his work .’’ఇదీ 1950లో అతని పరిస్తితి .భార్య ఇతని రచనలు చూసి ‘’పరిపక్వ స్తితి లో మనుషులు బాగా రాస్తారు .కాని నువ్వు చెండాలం గా రాస్తున్నావు ‘’అని ఎత్తి పొడిచేది .ఆవిడా జర్న లిస్టు అవటం తో ఆవిడ వ్యాసంగం లో ఆవిడ ఉండేది .అయన రాసిన ఓల్డ్ మాన్ నవలలో హీరో అయిన ముసలాడు 84రోజులు తాను పట్టుకోవాలను కొన్న చేప దొరక్క తిరిగి ఫ్రస్ట్రేషన్ లో పడి పోతాడు .అప్పుడు టి.ఎస్.ఇలియట్ రాసిన ‘’the end is where we start from ‘’అనే వాక్యం డబ్ల్యు .బి.ఈట్స్త్స్ రాసిన ‘’consume my heart away sick with desire –and fastened to dying animal.It knows not what it is and gather me –into the artifice of eternity ‘’వాక్యాలను గుర్తు చేస్తాడు .ఓల్డ్ మాన్ నవల ‘’లైఫ్ మేగజైన్ ‘’లో మొత్తం ఒకే సారి ప్రచురించి రికార్డు సృష్టించింది .అది రెండు మిలియన్ ల కాపీలు అమ్ముడయింది .అదొక రికార్డ్ .26రోజుల పాటు ఇది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది .
హెమింగ్ వే పుట్టిన నెల జులై .ఇటలీ లో దెబ్బ తిన్న నెల కూడా అదే .పెళ్ళీ ,పెటాకులు ,ఇల్లు కొనటం ,చివరికి ఆత్మ హత్య కూడా జులై నెల కావటమే విడ్డూరం .హెమింగ్ వే ను అమెరికా దేశపు ప్రతిజ్నకు మాటకు మూర్తీభవించిన రూపం (ఎమ్బాడిమేంట్) అంటారు .అదృష్టం ,ధైర్యం ,ప్రతిభ ,హాస్యం ,కష్టపడటం ,కష్ట జీవితాన్ని అనుభవించటం ,తో ఇది సాధ్యం చేశాడు .’’pursuit is happiness .man alone is not fucking god and that any story followed far enough would end badly .he was a prize available to a writer .he remodeled American short fiction ,changed the way characters speak ,confronted the moral strictures ,confining the writer left behind a shelf of books telling us how we were in the first half of the this century .he is a classic American story ,big two hearted river .his ambition ,eternity ,creative drive ,sense of duty ,belief in hard work and faith in strenuous life ,carried him to the pinnacles of his profession ,provided him wide recognition and considerable wealth ,before destroying him ,when he could no longer meet their demands .It is an old story older than written words ,the story the ancient Greeks (tragedy ) would recognized ‘’అన్న’’ కోడా ‘’లోని అతని వాక్యాలే అతనికి అశ్రు తర్పణాలు .ఎందరికో స్పూర్తి అయిన ఎజ్రా పౌండ్ కవి ని జైలు పాలు చేస్తే ,విడుదల కోసం అహరహం శ్రమించిన మనీషి హెమింగ్ వే .సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత స్వయం గా వెళ్లి అందుకో లేదు .ఒక స్టేట్ మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు .’’writing at its best ,a lonely life For a true writer each book should be a new beginning where he tries again for something that is beyond attainment .He should always try for something that has never been done or that others have tried and failed .then sometimes with great luck ,he will succeed .it is because we have had such great writers in the past that where he can we go ,out where no one can help him ‘’.అని అ నాటి సమాజం లో రచయితలకుఎజ్రా పౌండ్ లాంటి కవులకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు .రచయితల స్వేచ్చ కోసం పోరాడిన మనిషి హెమింగ్ వే .ఇన్ని మంచి గుణాలున్నా అస్తిమిత మనస్తత్వం అతన్ని రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మా హత్య చేసుకోనేట్లు చేసింది .తను నమ్మిన గుర్రమే అతడిని కింద పడేసి లేక లేని స్తితికల్పించింది .హోటల్ రూమ్ లో చివరి రోజులు గడిపి కోరి మరణాన్ని పొందిన అభాగ్యుడు మేధావి అయిన హెమింగ్ వే .ఎందరో కవులకు ,యువరచయితలకు ప్రేరణా ,ఆదర్శం , మార్గ దర్శి గా నిలిచాడు. అతని రచనా శిల్పం అనన్య సాధ్యం .చిన్న చిన్న వాక్యాలలో ఏంతో గొప్ప సత్యాలుంటాయి .మస్తాత్వాన్ని కాచి వడపోసి పాత్రల చేత పలికిస్తాడు .ఆ సంభాషణా చాతుర్యం మళ్ళీ ఏ అమెరికన్ రచయితకూ అలవడ లేదు .కదా కధనం లో ఒక ‘’రోల్ద్ మోడల్’’ ఎర్నెస్ట్ హెమింగ్ వే .
20-10-2002ఆదివారం నాటి నాఅమెరికా (హూస్టన్ ) డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-3-14-ఉయ్యూరు