పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం )
సూరి శాస్త్రిలోని’’ నాటక సూరి ‘’విషయం ఇప్పుడు తెలుసు కొందాం ఆయన రాసిన నాట్యాంబుజం ,నాటక అశోకం లలో నాకు నచ్చినవి ,అందరికి ఉపయోగ పడేవి మాత్రమె సూక్ష్మం గా తెలియ బరుస్తాను .తాను నటుడు కాని కవి కాని సంగీతజ్ఞుడు కాని కాదని ,అయితే కావ్య సంగీత అభినయాలలో రసస్వరూపాన్ని ,సరసం గా అనుభవించే విమర్శక లక్షణం ఎలాగో తనకు అబ్బిందని అనేక నవలలు కావ్యాలు ,నాటకాలు ఎక్కువగా చదవటం వలన చిత్రాలలోని భావాలను అర్ధం చేసుకో గలిగే నేర్పు ఉండటం వలన అనేక నాటకాలు చూడటం వలన మంచి చెడ్డలు గ్రహించే నేర్పు అలవడిందని వినయం గా చెప్పుకొన్నారు శాస్త్రి గారు .పాపట్ల కాంతయ్య జగ్గయ్య పేటకు చెందిన నాటక సంగీత నిపుణుడు అని ఆంద్ర దేశాన్ని కొంతకాలం ఉర్రూత లూగించాడాని పాటలు రాసి బాణీలు (మట్లు)కట్టి ప్రసిద్ధి చెందాడని చెప్పారు .నెల్లూరు నాగరాజా రావు ‘’నాట్య యోగి’’ అన్నారు .అయితే ఆయన నెల్లూరు యాస కొంత ఇబ్బంది పెట్టేదన్నారు .
బళ్ళారి రాఘవ సాత్వికాభినయం లో నిపుణుడని సమ్ప్రదాయిక పాత్రలను నూతన వ్యాఖ్యానం తో కొత్త కోణం లో ఆవిష్కరించారని ,నాటకాన్ని ఆధునికత వైపుకు మళ్లిం చాడని ,,నాటక రంగం లో నిజ జీవితం లో గొప్ప సంస్కరణా వాది అని చెప్పారు మొదలి వారు .ఉయ్యూరు లో ‘’హిందూ నాటక సమాజం ‘’అనేది ఉండేదని అందులో ‘’వంగల దీక్షితులు ‘’హాస్య పాత్ర ను బాగా పోషించాడని ,బందరు గొడుగు పేట నాటక కంపెనీ లో కూడా దీక్షితులు హాస్య పాత్రలు వేసి మెప్పించాడని వ్యాఖ్యానం లో నాగ భూషణ శర్మ గారు తెలియ బరచారు .ఇది ఉయ్యూరు లో ఉన్న నాకే ఇంతవరకు తెలియని విషయం .అలాంటి ‘’హసకుడు ‘’సూరి శాస్త్రి గారి భాషలో మా ఉయ్యూరులో ఉండి నట్లు తెలిసి గర్విస్తున్నాను .స్టేజి మేనేజర్ ను ‘’రంగ సంపాదకుడు ‘’అనే భలే మాటలో ఇమిడ్చారు .తెలుగు పౌరాణిక నాటకాలలో విదురుడు ‘’తెల్లని చట్ట కుదురు మురికి తల పాగా తో ,చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని యముడి కోసం ఎదురు చూస్తున్న వాడి ‘’లాగా ఉంటాడట .కాని దైతా గోపాలం మంచి లక్షణాల తో మైలవరం వారి ద్రౌపదీ వస్త్రాపహరణం లో నటించి భారత స్పూర్తి కల్గిన్చాడట .’’భక్తీ ,నిర్వేదం తో కూడిన రస బరిత కీర్తనలు పాడేటప్పుడు అద్భుతం గా పాడి నటించి మెప్పించాడు సంగీతజ్ఞుడైన గోపాలం ‘’అని శ్లాఘించారు .
పింగళి లక్ష్మీ కాంతం ధర్మ రాజు నిజ తత్వాన్ని అర్ధం చేసుకొని నభూతో గా అభినయించాడు .మేధా సంపన్నుల గుణ విశ్లేషణాన్ని చక్క గా ఆవిష్కరించాడని ,చెప్పారు ఈ పాత్ర పోషణ లో పింగళి వారిని మించిన వారు లేరని ఖచ్చితం గా చెప్పారు .యడవల్లి సూర్య నారాయణ ‘’నాట్య సర్వాది కారి ‘’అన్నారు .నటనకు కావలసిన అన్ని లక్షణాలు సూర్య నారాయణ లో ఉండటం అపూర్వం అన్నారు .నాటక రంగానికి అంతకు ముందు లేని గౌరవం తెచ్చాడని,నటరాజుకు కావలసిన ‘’గుణ సహస్రముల మూట ‘’గా ఉండి ,ఆత్మ గౌరవానికి ఆలవాలం గా ఉన్నాడని కీర్తించారు . మల్లాది గోవింద శాస్త్రి ‘’మంచి పాట కాడు’’ అన్నారు .భాష ను వికార పరచకుండా నటించినవాడు
కర్ణుడి వేషం సాధారణం గా’’ బక్క చిక్కిన సన్నాసే’’ వాడే వేసే వాడట .యనమండ్ర శీనయ్య మాత్రం కర్ణుని పౌరుషాన్ని మనస్శుద్ధిని ,క్షాత్ర గుణ తేజాన్ని గొప్ప గా చూపించి శీనయ్య లాంటి కర్ణ పాత్ర దారి ఆంద్ర దేశం లో లేదు అని పించుకోన్నాడని అభి నం దించారు . .ముద్రా రాక్షస నాటకం లో పింగళి లక్ష్మీ కాంతం రాక్షసా మాత్యుని పాత్రను అభినయ సౌష్టవం తో మహా మంత్రి పోకడల తో సాటి లేని విధం గా నటించారని చెప్పారు .శాస్త్రి గారు ముగ్గురు మరాఠీలు ‘’ను ‘’ముగ్గురు పఠానీలు ‘’అంటారు .
రామ దాసు వేషం లో బళ్ళారి రాఘవ ప్రశంస నీయం గా నటించాడని ,ప్రభుత్వం సొమ్ము రామాలయ నిర్మాణానికి ఖర్చు పెట్టి నందుకు భౌతిక శిక్ష అనుభవించటం న్యాయ మనే తలచేట్లు నటించటం ఇది వరకేన్నడూ ఎవరూ చేయ లేదన్నారు .రామ దాసు నిర్మల భక్తీ కి తార్కాణం గా బళ్ళారి వారు అభినయించి తనకు సాటి లేరని నిరూపించు కొన్నారన్నారు .నాటక సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారాలు సూచించారు శాస్త్రి గారు .పరికరాల విషయం లో పొదుపు పాటించాలని తెల్ల గుడ్డ తెర చాలని దుస్తులను కాలానికి తగినట్లు వేసుకోవాలని అర్ధ జ్ఞానం కలిగేట్లు నటులకు శిక్షణ ఇవ్వాలని,రెండు గంటల లోపే నాటక ప్రదర్శన ఉండాలని నటులు భాగ స్వామ్యులవ్వాలని సూచించారు
సారంగ ధర నాటకాన్ని బహిష్కరించాలని నిర్ద్వందం గా ప్రకటించారు పురాణం వారు ..చిత్రాంగి తప్పు లేక పోవటం రాజు అనుచితం గా శిక్షించటం చివరికి ఎవరి వల్లనో సారంగుడు బతకటం తప్పు అన్నారు నిజానికి రాజే శిక్షార్హుడు అంటారు .తెనాలి రామ విలాస సభ వారు బందరులో ప్రదర్శించిన ‘’కన్యా శుల్కం ‘’నాటకం లో రామప్ప పంతులు గా తంగిరాల ఆంజనేయులు బాగా చేశాడన్నారు .గోవిందరాజుల సుబ్బారావు గిరీశం గా ‘’ఇరగ దీశాడు ‘’.పులిపాటి వెంకటేశ్వర్లు కరటక శాస్త్రి గా నప్పాడు .ప్రతాప రుద్రీయం నాటకం లో పెరిగాడి ‘’సారా సేమ్బు శీను ‘’,యుగంధరుడి బిచ్చగాని వేషం ,బైరాగి చేష్టలు కద కు తోడ్పడ వన్నారు శాస్త్రి గారు. కాని ఈ నాటకం లోని ‘’చెకు ముకి ‘’పాత్ర కు సరి సమాన మైన పాత్ర ఆంధ్రా నాటక పాత్రలలో కనీ పించాదన్నారు .ముంజులూరి కృష్ణా రావు యుగంధరుడు గా రాణించలేక పోయాడన్నారు ..మాధవ పెద్ది వెంకట్రామయ్య ‘’వల్లీ ‘’పాత్రను జీవింప జేశాడని పొగిడారు .మొత్తం మీద ప్రతాప రుద్రీయం ప్రదర్శనకు అనుకూల మైనదని చిత్ర విచిత్ర దృశ్య సమాహారమని ,వేదం వారి ప్రతిభకు తార్కాణ అని కితాబిచ్చారు .
మృచ్చకటిక నాటకం లో ‘’శకార’’పాత్ర స్వభావం తమాసా గా ఉంటుందని దీన్ని ఏలూరు మోతే నారాయణ రావు గారి ఆధ్వర్యం లో( సీతారామాంజనేయ నాటక సమాజ అధిపతి )బాగా ఆడే వారని తెలుగు నాటక రంగం లో కొత్త రూపకాన్ని ప్రవేశ పెట్టి రసిక జన రంజనం చేశారని చెప్పి పురాణం సూరి శాస్త్రి గారు పుస్తకాన్ని ముగించారు
పురాణం సూరి శాస్త్రి గారివి వారి బందరు ఇల్లు ఫోటోలు జత చేయ బడ్డాయి చూడండి .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-3-14-ఉయ్యూరు