రా’’చ ‘’కీయ ద్విప్లేట్స్ -18(గోడ దూకుళ్ళ పర్వం )
1-‘’కావూరి ‘’ఎంట్రీకి’’ సైకిల్’’ వాలాల’ ’నో నో ‘’
ఉభయ భ్రస్టత్వం తో ‘’సాంబ ‘’భవిత ఏమౌనో’’ ?
2-ఎక్కడా చెల్లక’’ కారెక్కిన’’ దంపతులు ‘’కొండా’’
అవుతుందేమో ‘’కారు కూతలతో’’ కారు నెత్తిన పెద్ద ‘’బండా?’’.
3-కిరణ్ కు అమెరికా నుంచి వచ్చిఝలక్ ఇచ్చిన ఉపాధ్యక్షుడు ‘’ శైలజా నాధుడు ‘’
కిరణ్ శాంక్షన్ చేసిన డబ్బుతో ‘’గుండె దిటవు’’ చేసుకొని ‘’ నల్లారిని’’ చేశాడిప్పుడు ‘’అనాధుడు’’.
4-‘’గులాబి’’ కండువా కప్పుకొన్న జానపద పాటలవీరుడు ‘’రసమయి ‘’
ఇక ‘’చంద్రన్న పదాలతో ‘’మురిపించి కలిగిస్తాడా ‘’హాయి హాయి ‘’.
5-రండి బాబూ రండి! వెనక్కోచ్చి ‘’ చేయి’’ అందుకొని తీసుకోండి ‘’కాంగి టికెట్లు ‘’
పొన్నాలా ,రఘువీరా’’ బేల పిలుపులకు’’ పారి పోతూ అభ్యర్ధులు కలిగిస్తున్న ‘’ఇక్కట్లు ‘’.
6- భాజపా, దేశం ల మధ్య ఊరిస్తూ పొడుస్తున్న ‘’పొత్తు ‘’
ఆలస్యం చేస్తూ బేర సారాలతో వేస్తున్నారు’’ ఎత్తుకు పై ఎత్తు’’ .
7-చంద్ర గిరిలో అరుణ కుమారి ‘’గల్లా ‘’
గెలిచి సైకిల్ కిస్తుందా బోణీతో ‘’నింపు తుందా గల్లా ‘’?
8-‘’దేశం’’ టికెట్ కోసం పరుగుదీస్తున్నహాస్య గాడు ‘’వేణు మాధవ్ ‘’
పార్టీలో కితకితలూ పక పకలే ఊదేస్తుందా’’ మాధవుని’’ వేణువ్’’?.
9-ఉయ్యూరు నగర ఎన్నికలలో వందేళ్ళ లో మొదటి సారి అడ్రస్ లేని’’ కాంగిరేసు’’
‘’సారధి’’ లేక ‘’బండి ‘’ లేక,’’ఎక్కే వారూ’’ లేక డీలా పడి దూరం చేసుకోంది ‘’రేసు ‘’.
10-రాష్ట్రం లోఉన్నాయి ‘’మూడు ముదనస్టాలు’’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-14-ఉయ్యూరు