మా నవ రాత్రి యాత్ర -6
అదరహో ఖజురహో
ఖజురహో స్టేషన్ ను చూస్తె కొత్తగా నిర్మించి నట్లని పించింది .అప్ప్రోచ్ రోడ్లూ కొత్తవే ,పర్యాటక కేంద్రం గ అభి వృద్ధి చేయటానికి కృషి చేస్తున్నట్లని పించింది .విమానశ్రయమూ ఏర్పడింది .
స్టేషన్ నుంచి ఊరిలోకి ఎనిమిది కిలో మీటర్ల దూరం .రోడ్డు కచ్చా పచ్చా గా ఉంది .దారికి రెండు వైపులా ‘’ఇప్ప చెట్లు’’ విరగ బూసి ఉన్నాయి .ఇప్పపూలు రాలి నేలమీద విపరీతం గా పడుతున్నాయి .వాటిని చిన్నా పెద్దా ఆడా మగా అంతా సంచుల్లోకి యేరుకోంటు న్నారు .ఇప్పపూవు భద్రాద్రి రామయ్యకు ప్రసాదం అని మనకు తెలుసు .ఇప్పపూవు సారా మంచి ‘’కిక్ ‘’ఇస్తున్దంటారు. కనుక దానికోసం ఏరి సొమ్ము చేసుకొంటున్నారు .దారిలో మోదుగ చెట్లు అగ్గి పూలతో మధ్య ప్రదేశ్ ఎండలకు సాక్ష్యం గా కని పిస్తున్నాయి .సూర్యా హోటల్ లో రూమ్ బుక్ చేశాడు మా అబ్బాయి శర్మ .హోటల్ వాడు పంపిన ఆటోలో హోటల్ కు చేరాము .సౌకర్యం గానే ఉంది ..వేడి నీరు వస్తోంది .పళ్ళు తోముకొని వేడి నీట జలకాలాడి సిద్ధమయ్యాం .
ఇండికా కారు బుక్ చేశాడు మా వాడు .డ్రైవర్ ను ఎనిమిదింటికి రమ్మని చెప్పాం .హోటల్ లో కాఫీ తాగుదామని అడిగితె ముప్ఫై రూపాయలన్నాడు .అమ్మో అని పించింది .డ్రైవర్ వచ్చేసరికి రెడీ అయ్యాం .కారు లో బయల్దేరి దగ్గరలో ఉన్న ‘’మద్రాస్ హోటల్ ‘’కు చేరాం .ఇంకా ‘’పొయ్యి వెలిగించిన ‘’వాసన కని పించలేదు .వెళ్ళిపో బోతుంటే ‘’ఓనరైన అమ్మాయి ‘’అయిదు నిమిషాల్లో కాఫీ ,పది నిమిషాల్లో టిఫిన్ రెడీ అవుతుందని ఉండమని చెప్పింది .కూల బడిపోయాం .నాకేమీ తినాలని పించలేదు. ఆ వాతావరణం చూసి .రెండు కాఫీలు తెప్పించి నలుగురం తాగాం .ప్రభావతి సాదా దోసె ఆర్డర్ ఇచ్చి తిన్నది .పరవాలేదని చెప్పింది .కాలే కడుపుతో పొద్దున్న తిన్న హార్లిక్స్ బిస్కట్ల తో మళ్ళీ కారు ఎక్కి దగ్గరలో నే ఉన్న ఖాజురాహో దేవాలయ సముదాయాలను దర్శించటానికి వెళ్లాం .కారు బయటే ఆపేసి మమ్మల్ని లోపలి తోలాడు. డ్రైవర్ టికెట్టు కూడా ఉంది మనిషికి పది రూపాయలు .ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని ఆ విశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పరచి కాపలా పెట్టి ఆ విలువైన శిల్ప సంపదనిరక్షిస్తోంది ..మంచి నీటి సౌకర్యం ,పచ్చగడ్డి తివాచీలు కూర్చోటానికి బెంచీలు అన్నీ సౌకర్యాలు కలిపించింది .సాయం వేళ ‘’లైట్ అండ్ సౌండ్ ‘’లతో ఈ శిల్ప రహస్యాలను తెలియ జేసే ప్రోగ్రాం ఉంది .మేము సాయంత్రం తిరుగు ప్రయాణం కనుక ఆ అవకాశం ఉపయోగించుకో లేక పోయాం .
మొదటగా వరాహ దేవాలయం చూశాం .అక్కడే లక్ష్మణ దేవాలయం ఉంది .చిత్రగుప్తుడికి ,శివుడికీ ఆలయాలున్నాయి .ప్రక్కనే మాతం గేశ్వరాలయం ఉంది .అమ్మవారి గుడీ ఉంది. అన్నీ ‘’జైగాంటిక్ టెంపుల్స్ ‘’ అని పించాయి అ.న్ని ఆలయాల గర్భాలయాలు ఒకే రీతి లో ఉండటం విశేషం .నందీశ్వరాలయం బృహత్తరం .పన్నెండుకు పైగా ఆలయాలున్న మహా ప్రాంతం ఇది .ఎండ ముదరక ముందే చూడాలి లేక పొతే వేడి తట్టుకోలేము .ఆలయాల శిఖరాలు మహా సున్నితం గా మలచ బడ్డాయి .కామ శాస్త్ర శిల్పాలే ఎక్కడ చూసినా వివిధ భంగిమల్లో కని పిస్తాయి .యేదేవాలయం లో ను నిత్య పూజ లేదు .మాతగేశ్వరాలయం లో పెద్ద పాను వట్టం మీద ఆరేడు అడుగుల ఎట్టు రెండడుగుల వెడల్పు పసుపు రంగు శివ లింగం ఉంది .పాను వట్టం మీదనే కూర్చుని పూజారి పూజ చేస్తాడు .మనమూ దాని మీదే నడవాలి .తమాషా అని పిస్తుంది ..ఒక్కో ఆలయానికి కనీసం ఇరవై ఎత్తైన నిలువు మెట్లు ఉంటాయి .ఇవి ఎక్కి దిగాలి అంటే ఏంతో ఓపిక కావాలి .మా ఆవిడ రెండు దేవాలయాలు మాత్రమె చూసి నీడలో కూల బడింది .మా అబ్బాయి మరో రెండు చూసి చతికిల పడ్డాడు .పట్టు వదలని విక్రమార్కులం లాగా నేనూ మా అమ్మాయి అన్ని దేవాలయాలు చూసి పిచ్చ పిచ్చగా ఫోటోలు తీశాము. దేనినీ వదలలేదు .ఆ అమ్మాయి ‘’ఐ పాడ్ ‘’తో తీసిన ఫోటోలు బాగా పెద్దవిగా ‘’అదరహో గా ‘’వచ్చాయి .నాది తొమ్మిదేళ్ళ నాడు అమెరికా లో కొన్న కోడాక్ .బుజ్జి ముండ ఎన్ని వేల ఫోటోలు ఇప్పటి దాకా తీసిందో తెలీదు .అద్భుతం గా పని చేస్తోంది .వీడియో కూ పని కొస్తుంది
.
ఇవన్నీ చూసి అక్కడి నుండి జైన దేవాలయానికి తీసుకెళ్ళాడు ‘’ డ్రైవర్ రాముడు’’ .ఇవాళ ‘’మహా వీర్ జయంతి ‘’అని అక్కడికి వెళ్ళేదాకా తెలీదు.మాకు. జైనులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శిస్తున్నారు .పార్శ్వనాధ ,ఆది జైన ఆలయాలను దర్శించాం తెలీకుండానే .మహా పర్వదినాన జైన మహా వీర సందర్శనం జరగటం మా పూర్వ జన్మాసుకృతం అని పించింది .మధ్యలో మరో రెండు దేవాలయాలు చూపించి మమ్మల్ని ‘’ఖజురహో వాటర్ ఫాల్స్ ‘’కు పది హీను కిలో మీటర్ల దూరం డ్రైవ్ చేసి తీసుకెళ్ళాడు .కారుకు ఎంట్రన్స్ ఫీజు మనమే కట్టాలి .ఫీజు మూడు వందలు ఎండ అదిరి పోతోంది .కాళ్లు కింద పెట్టాలంటే బెదురూ గా ఉంది .అలాగే దిగి మా ఆవిడను కారులోనే ఉంచి మేము ముగ్గురం చూశాము .అక్కడ ఒకతను దీని వివరాలు చెప్పాడు .అతని చేతిలో ఇరవై పెట్టాను .
అతను చెప్పిన దాని ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్ని పర్వతం బ్రద్దలై లావా ఎగా చిమ్మి ఈ కొండ ప్రాంతం ముక్కలు ముక్కలుగా చీలి ఒక పెద్ద ,ఒక చిన్న జల పాతాలేర్పడ్డాయి .వేసవిలో కూడా నీరు పై నుంచి కిందికి ప్రవహిస్తూనే ఉంటుంది జూన్ జులై నెలల్లో ఈ ప్రదేశం అంతా అంతులేని జల రాశి తో కళకళలాడుతుంది .అప్పుడు దీని సౌందర్యం వర్ణనాతీతం అన్నాడు .దీని ప్రక్కనే అభయారణ్యం ఉంది .ఇక్కడ వాల్కనో వలన అనేక రంగుల శిలలేర్పడ్డాయట. డోలమైట్ ,క్వార్జ్, గ్రానైట్ మొదలైనవి .ఇవన్నీ చూసి డ్రింకులు అంటే ‘’స్ప్రైట్ ‘’ఆరగా ఆరగా తాగుతూ హోటల్ సూర్యా కు చేరే సరికి దాదాపు రెండు గంటలైంది మధ్యాహ్నం .మా వాళ్ళు ఇక కాలు తీసి కాలు బయట పెట్టలేమంటున్నారు .రమణా అలసి పోయాడు .ఇంకా రెండు దేవాలయాలున్నాయన్నాడు డ్రైవర్ .
ఆడవాల్లిద్దర్నీ హోటల్ రూమ్ కు చేర్చి నేను రమణ ,మద్రాస్ హోటల్ కు వెళ్లాం .నేనూ వాడు ఇడ్లీ ఆర్డరిచ్చి తిన్నాం చట్నీ సాంబారు ఇచ్చాడు .నాకెందుకో లోపలి పోలేదు .ఏదో ‘’కతికా ‘’.వాడు దోసె కూడా తిన్నాడు .తల్లీ కూతుళ్ళకు ఇడ్లీ దోసె పార్సెల్ చేయించుకొని ,మజ్జిగ కొని రమణ ను రూమ్ దగ్గర దిమ్పాను .డ్రైవర్ తో మిగిలిన రెండు దేవాలయాలు చూడటానికి బయల్దేరా. మా వాళ్ళు వెళ్ళద్దని గోల .వెళ్లి తీరాల్సిందే నని నేను పట్టు బట్టాను .సరే అందులో ఒకటి ‘’బలరాముడి’’ దేవాలయం రెండవది ‘’వామనావతార్’’ దేవాలయం .రెండూ చూసి రూము కు చేరే సరికి మధ్యాహ్నం మూడు దాటింది .సాయంత్రం అయిదూ నలభై అయిదుకు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ పట్టుకోవాలి .కాసేపు రెస్ట్ .తరువాత నాలుగున్నరకే సామాను సర్దేసి హోటల్ దగ్గరే ఉన్న ఆటో మాట్లాడుకొని స్టేషన్ కు బయల్దేరాం శర్మ మాట్లాడిన ‘’పాకేజ్ ‘’ప్రకారం ఖజురాహో చూపించటానికి ఇండికా కారుకు 1750రూపాయలు ,హోటల్ రెంట్ అయిదు వందలు .హోటల్ రెంట్ ఫరవా లేదు కాని కారు డబ్బులు దండగే అని పించింది .అంత దూరం తిరిగిందేమీ లేదు .చలికాలం ఆటో చాలు లేక పొతే మామూలు కారు చాలు .కాని వేసవి కనుక తప్పదని సర్డుకోన్నాం .మా అమ్మాయి రాత్రి నుంచి ‘’లూజ్ మోషన్స్ ‘’తో బాధ పడుతోంది .చెబితే తిడతానేమో నని చెప్పలేదు .ఈ ఉడుకు ప్రదేశం లో ఇప్పటికే మూడు ప్రాంతాలలో తిరుగుడు తెల్ల వారు జామున లేవటాలు దారిలో తిండి లేక పోవటాలు అన్నీ కలిసి అందర్నీ బాధించాయి
నాకూ అలానే ఉన్నా ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక నాకే అర్ధం కాలేదు .దాదాపు అన్ని దేవాలయాల 600మెట్లూ ఎక్కి దిగానంటే నాకే ఆశ్చర్యం గా ఉంది. కాళ్లు తేలి పోతున్నాయి .పడతానేమో నని మా వాళ్ళు మధ్య మధ్యలో హెచ్చరిస్తున్నారు .’’ఈ సీతయ్య ఎవరి మాటా వినడు ‘’అన్నట్లు మొండిగా అంతా ఎక్కి, దిగి, కలయ తిరిగి చూసి ఆనందాన్ని సంతృప్తినీ పొందాను .ఎప్పటి నుంచో ఖజురహో చూడాలనే తాపత్రయం .మా అమ్మాయి వలన ఈ’’ నవరాత్రి మహాత్మ్యం’’ లో తీరింది .ఇక్కడ అంతా వర్షాధార పంటలే .బావుల నీటి తో వ్యవసాయం .సెనగ పంట బాగా పండుతుంది .ఖజురహో అంటే ‘’ఖర్జూర వనం ‘’అని అర్ధం .దాదాపు ఎడారి ప్రాంతం లా ఉంటుంది .కాని పంటలు బాగా నే పండిస్తున్నారు .ఖజురాహో విశేషాలు ఈ సారి రాసి అదురహో అని పిస్తాను .ట్రెయిన్ అయిదింటికే స్టేషన్ లోకి వచ్చింది .ఇక్కడి నుంచే బయల్దేరాలి. ఒకే ఒక ఎసి బోగీ .ఎక్కి కూర్చున్నాం .ఇంతలో కోసూరు నుండి ఆదినారాయణ ఫోన్ చేసి పెదముత్తేవి వార్షికోత్సవం పందొమ్మిదో తేదీ అని గురువు గారు సీతా రామ యతీంద్రుల వారుచెప్పారని నన్ను తప్పక వచ్చి మాట్లాడమని ఆదేశించారని చెప్పారు సరే నన్నాను .
ఆ తరువాత నా శరీరం నా స్వాధీనం లో లేదు .వెంట వెంటనే మూడు విరేచనాలు అయ్యాయి .విపరీతం గా నీరసం గా ఉంది. వెంట తెచ్చుకొన్న ‘’నేట్రం మూర్ ‘’హోమియో మందు వడ దెబ్బ తగల కుండా ప్రయాణం మొదట్నించీ వేసుకొంటూనే ఉన్నాము .దానితో బాటు ‘’ఫెర్రం ఫాస్ ‘’కూడా ఇప్పుడు వాడాను. కొంత ఉపశమనం గా ఉంది .నిద్ర బానే పట్టింది .రాత్రి రెండు గంటలకు ఝాన్సీ చేరాం .అక్కడ ఇండోర్ ఎక్స్ప్రెస్ ను తెల్లవారు జామున నాలుగింటికి ఎక్కి ఉజ్జైన్ మధ్యాహ్నం పదకొండింటికి చేరుకొన్నాం .ణా బాధ సంగతి మా వాళ్లకు చెప్పా లేదు చెబితే ‘’తకిట తడికిం ‘’అవుతుందని మూసుక్కూర్చుని. ఉజ్జైన్ లో రైల్వే రిటైరింగ్ రూమ్ కు చేరిన తర్వాత నెమ్మదిగా చెప్పాను .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు