మా నవరాత్రి యాత్ర -12
ఖజురహో కళలహో అదరహో
ఖజురహో దేవాలయాల వైవిధ్యం
ఖజురహో దేవాలయాలు దేవ విహార భూములు .ఈ దేవాలయ సముదాయం శివుడికో విష్ణువు కో లేక జైన తీర్ధంకరులకో అన్కితమివ్వబడ్డాయి . ఎనభై అయిదు దేవాలయాలకు నేడు ఉన్నవి పాతిక మాత్రమె.సౌకర్యార్ధం వీటిని మూడు గ్రూపులుగా చేశారు పడమటి తూర్పు ,దక్షిణ దేవాలయాలుగా వీటిని పేర్కొంటారు .
పశ్చిమ దేవాలయాలు
పశ్చిమ వైపున్న దేవాలయాలకు అందమైన ఉద్యాన వనం స్వాగత మిస్తుంది .ఇవి బ్రమీతా రాజ నగర్ రోడ్ లో ఖజురహో గ్రామానికి పడమర గా ఉన్నాయి .ఇవి రెండు వరుసలలో ఉన్నాయి .చుట్టూ ఫెన్సింగ్ తో ప్రవేశ ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది .ఒకప్పుడు ఇది అంతా పెద్ద తటాకం .ఇక్కడి లక్ష్మణ ,విశ్వనాధ దేవాలయాలను మహా రాజులు నిర్మించారని ,మూడవది అతి పెద్దది అయిన కందరీయ మహాదేవ ఆలయాన్ని రాజసం గా నిర్మించారని చెబుతారు .ఇందులోని పెద్ద ఆలయాలు ఎక్కువ భాగం తూర్పు ముఖం గా ఉండి ఉత్తర దక్షిణా లకు వ్యాపించి ఉంటాయి .ఇందులో ఉన్నవి శివ లేక విష్ణు ఆలయాలే .చిత్ర గుప్త దేవాలయం ఒక్కటే సూర్య దేవాలయం .
1- చౌసత్ –యోగిని దేవాలయం
ఇది తొమ్మిదో శతాబ్ది ఆలయం .ముతక గ్రానైట్ రాయితో నిర్మింప బడిన ప్రాచీన ఆలయం .శివ సాగర్ జలాశయం ప్రాంతం నుండి నిర్మాణానికి గ్రానైట్ తెప్పించి వాడారు .దాదాపు అయిదున్నర మీటర్ల ప్లాట్ ఫారం పై చతుర్భుజా కారం గా31 మీటర్లు , 18మీటర్ల కొలత లో ఉంది అరవై ఏడు చుట్టూ దేవతలతో కనిపిస్తుంది .చిన్న గూడులలో దేవతా విగ్రహాలుంటాయి. గుండ్రం గా ఉండే శిఖరం ఉంటుంది .ఇందులో ఖజురహో శైలి కొద్దిగా నే ప్రదర్శిత మౌతుంది .బ్రాహ్మణి ,మహేశ్వరి మహిషాసుర మర్దిని పెద్ద విగ్రహాలు అబ్బుర పరుస్తాయి .మహేశ్వరి హింగులాజీ విగ్రహాలు తరువాత చేరాయి
2-లాల్ గాన్ –మహాదేవాలయం
క్రీ.శ 900లో నిర్మించారు .చౌసాత్ యోగిని దేవాలయానికి ఎనిమిది వందల మీటర్ల పడమర ఈ ఆలయం ఉన్నది పిరమిడ్ ఆకారపు నిర్మాణం .ప్రవేశ భాగం శిదిలై పోయింది .సంధి కాలానికి చెందినా ఆలయం ఇసుక రాయి ని మొదటి సారిగా గ్రానైట్ తో బాటు ఎక్కువగా వాడారు .ప్లాట్ ఫారానికి గ్రానైట్ ను శిఖరానికి’’ సాంద్ స్టోన్’’ ను వాడారు .ప్రవేశం లో విరిగిన నంది విగ్రహం ఉంది .పడమటి ముఖపు ఆలయమిది శివునికి అంకితమైన ఆలయం .
3-వరాహ ఆలయం
ఇది 900-925కాలపు నిర్మాణం .వరాహ విగ్రహం ఒక చిన్న ఎత్తైన గుడి లాంటి ఆకారం లో ఉంటుంది భారీ విగ్రహమే .పిరమిడ్ పై కప్పు ఉంది .విష్ణువు యొక్క వరాహావతారమే ఈ విగ్రహం .తోమ్మిదడుగుల పొడవు ఆరడుగుల ఎత్తుఉన్న విగ్రహం ఇది .ఏక నల్ల శిలా నిర్మితం. వరాహం శరీరం పై 672హిందూ దేవతలా విగ్రహాలు ఉండటం ఆశ్చర్యం ఆకర్షణీయం కూడా .భూదేవతను శేష నాగుడు కాపాడే ముచ్చట గా ఉంది .వికసించిన పద్మ శిల్పం మనోహరం .ఇది పూర్తిగా ఇసుక రాయితో చేయబడింది .బ్రహ్మ ,లాల్ గువాన్ మహాదేవ దేవాలయాలు గ్రానైట్ ,ఇసుక రాయి వాడకపు సంధికాలం లోనివి .
4-మాతంగేశ్వరాలయం
900-925కాలం లో నిర్మించ బడింది .శివుడికి అంకి తం గర్భాలయం లోపెద్ద శివ లింగం ఉంది మూడున్నర అడుగుల కైవారం తో ఎనిమిదిన్నర అడుగుల భారీ శివలింగం మెరిసి పోతూ పసుపు రంగులో ఉంటుంది .విశాల మైన గౌరీ పట్టా అంటే పాను వాట్టం ఉంటుంది .మూడు వైపులా కిటికీలున్నా చతుర్భుజ ఆలయం బ్రహ్మ దెవాలయానికీది విస్తృత రూపం .ఈ ఆలయం లోనే ఖజురాహో శిలల్ప శైలి . వికసించటం ప్రారంభమైందని చెబుతారు .పాను వాట్టం పైనే నడిచి లింగాన్ని దర్శిస్తారు .పూజారి కూడా దాని మీదే కూచుని పూజాదికాలు చేస్తాడు
5-పార్వతి ఆలయం
950-1000కాలం లో కట్టిన ఆలయం విశ్వనాదాలయానికి దక్షిణాన ఉన్నది .గర్భాగ్రుహం హాలు ఉన్నాయి ద్వారం పై వైష్ణవ దేవతా విగ్రహాలు ,గర్భ గుడిలో గౌరీ దేవి విగ్రహం ఆమె వాహనమూ ఉంటాయి. దీనికి దగ్గరలో అంతకు ముందు వందేళ్ళ క్రితం ఛాత్రపూర్ రాజు కట్టిన ప్రాచీనఆలయమిది .
6-లక్ష్మణ దేవాలయం
930-950కాలం నాటిది .శివ సాగర్ సమీపం లోని అతి విశాలమైన ఎత్తైన దేవాలయం .చండేలా రాజుల శిల్ప కళా తృష్ణ కు శిల్ప కళా వైభావానినికి నిదర్శనం .పరిపూర్ణతకు ఉదాహరణ.చతుర్భుజుడైన వైకుంఠ విష్ణుదేవునికి అంకితమైంది .యశోవర్మ రాజు కట్టించిన ఆలయం .ఎత్తైన విశాలమైన ప్లాట్ ఫారం పై నిర్మింప బడింది .సహజం గా ఇది’’ గరుడుడి’’కి అన్కితమివ్వ బడింది .బ్రాహ్మణి అనే దేవి ఉంటుంది .కందరీయ ,మహాదేవ ,విశ్వనాధ ఆలయాలు పంచాయతన ఆలయాలు .లక్ష్మణ ఆలయం లో నాలుగు మూలలా దేవతా విగ్రహాలున్నాయి .కిందినుంచి పైకి మెట్లు ఎక్కి చేరాలి .గుర్రపు వరుసలు ఏనుగుల వరుస ఒతేలు యుద్ద్ధ దృశ్యాలు నృత్యకారులు సంగీత కారులు ,రతి భంగిమలలో అనేక దృశ్యాల శిల్పాలు బయటి గోడపై ఉంటాయి .లోపల రెండు మకర తతోరణాలతో భాగాలున్నాయి .స్తంభాల ఆలయం లో అప్సరసలు కొలువై ఉన్నారు .ఇక్కడి ఎనిమిది శిల్పాలు తంత్ర విభాగం లో ఎనిమిది విశేషాలు .గర్భాలయానికి ద్వారం పై సింహాలు విష్ణు అవతారాలు ,నవ గ్రహాలూ సాగర మధనం చేకబడ్డాయి సురసున్దరిలు అపసరాలు దేవి సేవలో తరిస్తూ కానీ పిస్తారు .మధ్యయుగపు కళకు నిదర్శనం గా దేవి సేవికలు సేవాభావం తో ఎదురు చూడటం నాట్య గణపతి అద్భుత కళా ఖండాలుగా ఇక్కడ దర్శన మిస్తాయి .
7-విశ్వనాదాలయం
దుగావాన్ అనే శిధిల సరస్సు ఒడ్డున ఉంది .1002కాలపు నిర్మాణం .శివునికి అంకితం .దంగా దేవా రాజు దీన్ని నిర్మించాడు .లక్ష్మణ కండరీయ దేవాలయ శైలి ఇక్కడా కని పిస్తుంది .ఎత్తైన ప్లాట్ ఫారం పై ఆలయం నిర్మితమైంది .దంపతులు వాహన శ్రేణులు సప్త మాతృకలు గణేష్ వీరభద్ర విగ్రహాలు ఉన్నాయి అందమైన ముఖ ద్వారం గర్భాలయానికి దారి తీస్తుంది .మధ్యాహాలు చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉన్నాయి ఒక చేతిలో చిలుక వేరొక చేతిలో పండు ఉన్న స్త్రీ శిల్పం బాగుంటుంది మధ్య హాలుపైకప్పుపై అనేక పుష్పాలు చెక్కబడి కను విందు చేస్తాయి .అంది విగ్రహం తూర్పున ఉంది పిరమిడ్ ఆకారపు కప్పు ఉంటుంది .
8-నంది విగ్రహం
విశ్వనాదాలయానికి అను బంధం గా నంది విగ్రహం ఉంది .ఇది బృహన్నంది.శివాభిముఖం గా ఉంటుంది పిరమిడ్ రూఫ్ ఉంది .
9-చిత్ర గుప్తాలయం
పదకొండవ శతాబ్ది ఆలయం .సూర్య దేవుడికి అంకితం .జగదాంబాలయానికి దక్షిణాన ఉంటుంది .మూడు అంతస్తుల చోప్రా అనే టాంక్ ఉంది. ముఖ్య దేవుడు సప్తాశ్వ రధ సారధి సూర్య దేవుడు ముఖ ద్వారం పై చెక్కారు .దశావతారాలూ ఉంటాయి దీన్ని భరత్ జి దేవాలయం అంటారు .గర్భాలయం లో సూర్య దేవుడి నిలువెత్తు విగ్రహం ఉంటుంది .
10-జగదాంబా దేవి ఆలయం
ఇదీ పదకొండవ శతాబ్ది ఆలయమే .విష్ణువుకు అంకితం గర్భ గుడిలో పార్వతి మాత విగ్రహం ఉంది.తూర్పు ముఖ ద్వారం .చిత్రగుప్తాలయపు నమూనానే .కాళికాలయమనీ అంటారు .బయటి గోడలపై శిల్పాలు అత్యంత నాణ్యమైనవని గుర్తించారు .విష్ణు, యమ దేవతా విగ్రహాలున్నాయి .చందేల కళ సంపూర్ణం గా వికసించిన వైభవం ఈ ఆలయం లో కని పిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-14-ఉయ్యూరు