మా నవ రాత్రి యాత్ర -10
ఖజురహో కళలహో అదరహో
ఖజురహో శిల్ప శోభ
హిందూ దేవతా విగ్రహ నిర్మాణానికి అత్యున్నత వైభవం కల్పించింది ఖజురహో .అనేక తరహాల హావభావ శోభా విలసితమైన విగ్రహాలకు ఇది తార్కాణ.పర్వతం అంత భారీ దేవాలయము వెలుపలి లోపలి గోడలన్నీ శిల్పాక్రుతులతో పరవశం కలిగిస్తాయి .గోడలపై ఉన్న శిల్పకళా చాతుర్యం చూస్తె ఒకే విధమైన అపూర్వ శిల్పకళా సృష్టితో ఆకర్షించి అంతా ఒకటేనన్న భావం కలుగుతుంది .ఒక్క అంగుళం కూడా వదలకుండా గోడలన్నీ శిల్ప కళతో జీవం పోసుకోన్నాయి .రెండున్నర నుండి మూడు అడుగుల ఎత్తుఉన్న శిల్పాలు 872 కందరీయ దేవాలయం గోడలపై ఉన్నాయి .విశ్వనాధాలయం పై 674,విగ్రహాలున్నాయి .వరాహ దేవాలయం లోని వరాహ మూర్తి శరీరం పై 672హిందూ దేవతా మూర్తులు శిల్పీకరించ బడి ముక్కున వేలేసుకొనేట్లు చేస్తాయి .పనికి రాని రాయి ని ప్రతిదానినీ అద్భుత శిల్పం గా మలిచారు శిల్ప బ్రహ్మలు .ఒక కన్య కాళ్ళు జాపుకొని ఉన్న విగ్రహం ,స్నానం చేసిన తర్వాత తడి జుట్టు నుండి రాలి పడుతున్న జల బిందువులు ,ఒక సురసుందరి కాలి లో ముళ్ళు తీసుకోవటం ,కండరాలు నాడులు అన్నీ అతి స్పష్టం గా కని పించేట్లు చెక్కి దివ్య విభూతిని కలిగిస్తాయి .వీటికి సాటి శిల్పాలు ప్రపంచం లో ఇంకా ఎక్కడా మనకు కనిపించవన్న మాట .ముమ్మాటికీ నిజం అని ధంకా బజాయించి చెబుతున్నారు శిల్ప రహస్య వేత్తలు .ఇవికాక దర్బారు సీన్లు ,యుద్ధ విన్యాసాలు ,రాజులు కొలువై ప్రజల ఫిర్యాదులు వినటం సలహాలివ్వటం వగైరా మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని సంతృప్తినీ కలిగిస్తాయి .
ఈ అద్భుత శిల్ప రాశి మధ్యలో ఖాళీ ఉండి శోభాయమానం గా ఉన్నాయి.కైమూర్ ఇసుక రాయి ని ఖజురహో విగ్రహాల నిర్మాణానికి వాడారు .ఇది సూక్ష్మ శిల్పీకరణకు మైనం లాగా ఒదిగి పోతుంది .అందుకే ఈ రాయి తో ఆభరణాలు ,వస్త్రాలు ,నీటి బిందువులు ,జుట్టు వెంట్రుకలు ,బట్టల మడతలు ,శరీరం ముడుతలు అన్నిటినీ స్పష్టం గా కని పించేట్లు చెక్క టానికి అనువుగా ఉన్న రాయి ఇది .అందుకే అంతటి శిలా సౌందర్యం వెల్లి విరిసింది .శిల్ప శాస్త్ర విధానాన్ని తు చ తప్పక పాటించి మలచిన విగ్రహాలివి .ముఖం కోడి అండాక్రుతి లో ఉండాలని శిల్ప శాస్త్రం చెబుతోంది .నుదురు ధనువు లా ,కళ్ళు విశాలం గా కొనదేలి మత్స్యాక్రుతిగా ,కంటి రెప్పలు వేపాకుల్లా ,గడ్డం మామిడి టెంకలా కాళ్ళూ చేతులూ పద్మాలు గా ,చాతీ విశాలం గా ,పిరుదులు చనులు బలం గా విశాలంగా ఉండాలన్నది శిల్ప శాస్త్ర నియమ మే .దాన్నే పాటిం చారీ శిల్పులు .
ఖజురహో లో సమాంతర శిలలపై నిలువు శిలలు ఉంచి కప్పు ఆకృతిని కల్పించారు .సిమెంటు గానుగ సున్నం చాలా తక్కువగా వాడారు .గ్రానైట్ శిలను ముందే శిల్పం గా చెక్కి ఉంచాల్సిన స్థానం లో అమర్చారు .ఖజురాహో శిల్పుల ప్రతిభా సామర్ధ్యం సృజనా నైపుణ్యం వైవిధ్యం మాటలకు అందనివి .ఆదిశేషుడు కూడా వాటిని పొగడటానికి చాలదు అని పిస్తుంది .
ముఖ్య దేవతా విగ్రహాలైన శివుడు ,విష్ణు ,సూర్యుడు జైన తీర్ధన్కరులను ఆగమ శాస్త్ర నియమాలకు లోబడే శిల్పీకరించారు .మిగిలిన వాటిని తమ సృజనతో తీర్చి దిద్దారు .ఇదొక విభాగం.సాధారణ దేవతా విగ్రహాలను అంటే అప్సరసలు ,సుర సుందరిల విగ్రహాలను లోపలి గోడలపై చెక్కటం రెండవ విభాగం .కొన్ని విగ్రహాలు ‘’త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ ‘’ను ఇవ్వటం పరమాశ్చర్యమేస్తుంది .ఖజురహో సుందరులు శిల్పుల ఊహా వికాసానికి మచ్చుతునకలు .పరిపుష్టమైన అంగ సౌష్టవం తో ఉలి నుంచి జాలువారిన సుందరీమణులు .శరీరం లోని ప్రతి అణువునూ వంపులు సొంపులను అన్నిటినీ ప్రతిఫలింప జేశాడు ముఖ్య శిల్పి .ఆవలింతలు బట్టలు విప్పి వేయటాలు ,కుచాలను హత్తుకోవటాలు గోరింటాకు పెట్టుకోవటం ,వేణువు ఊదటం ,నృత్య ప్రదర్శనను అత్యంత సమర్ధం గా చేయటం ,జాబులు రాయటం ,రాస్తూ కలాన్ని పెదిమకు ఆనించి పెట్టుకోవటం ,నిరాశా నిస్పృహ విరహం తో వేదన చెందటం ఓహ్ ఒకటేమిటి సకల భంగిమలు ఆ శిల్పి చిత్రీకరించి జీవం పోశాడు .సేవకులు సేవికలు సజీవం గా కనిపిస్తారు .
ఖజురహో ఆలయ గోడలపై ఉన్న శృంగార భంగిమలు మైధున క్రీడకు చెందినవి .ఇవి మూడవ విభాగానికి చెందినవి .రతిక్రీడల తో అనేక భంగిమల్లో చెక్కిన శిల్పాలు కామ శాస్త్ర కేళీ విలాసానికి చెందినవే ‘’ the couple exibit gymnastic or un natural poses described in texts like kaama sootra ,rati rahasya ,ananga ranga .They fornicate in standing ,sitting ,supine ,side and reverse positions .They engage oral sex extravaginal or autocratic sex .the lady mounts the man like mounting a tree .She bends and stands on all fours 0n the ground like a cow ,while theman performs from behind .she engulfs aman in coital embrace like a creeper embraces a tree .the main performer stand on his or her head supporting other .The make up picks up and supports the girl on his this by flexing his necks while the lady wraps her arms around his neck .A man has sex with a mare .A nude male and female showing genetial organs or touching one another form of erotic sculpture .Sexula congress in group or plural intercourse wherein four persons participate with one women or three women with one man is another type of erotic sculpture in khajuraho temples .ఇటువంటివన్నీ మూడవ విభాగానికి చెందాయి .
నాలుగో విభాగం లో గ్రూపు డాన్సులు ,సంగీత వాద్య కారులు ,వేట దృశ్యాలు ,జంతువులతో పోరాటాలు ,సైనిక కవాతులు ,శిల్పాలు చెక్కే శిల్పి బొమ్మలు ఉన్నాయి సమకాలీన చరిత్రకు అడ్డం పట్టేవే ఇవన్నీ .అయిదవది చివరిదీ అయిన విభాగం లో వ్యాలంలేక శార్దూలం ,కోరల సింహం దానితో ఒరాడే యోధుడు .ఏనుగు ముఖాలు చిలుకలు ఎలుగు బంటి శిల్పాలు ఇందులో చేరతాయి .దాదాపు ఇవన్నీ ప్రతికాత్మికాలే నని గ్రహించాలి .ఖజురహో దేవాలయాలు రెండు తరగతులకు చెందాయి ఒకటి లక్ష్మణ కందరీయ ,మహాదేవ, దేవి, చిత్ర గుప్త,విశ్వనాధ ఆలయాలు .వీటి బయటి గోడలపై శృంగార భంగిమ లున్న శిల్పాలెన్నో ఉన్నాయి .ఇక రెండవ తరగతికి చెందిన వాటిలో చతుర్భుజ ,పార్శ్వనాధ ,ఆదినాధ ,జవారి ,వామన దులాదేవ ఆలయాలున్నాయి ఇవి 1050-1150కాలం లో నిర్మితమైనవి .ఇందులో అసభ్యకర శృంగార శిల్పాలు అతి తక్కువ గా ఉన్నాయి .దులాదేవ దేవాలయం లో చాలా శృంగార భంగిమలున్న చిత్రాలున్నయన్నది నిజమే .జవేరి వామన దేవాలయాలలో ఈ దృశ్యాలు కనీ పించవు .ఆదినాధ చతుర్భుజ దేవాలయాలలో ఈ శృంగార వాసన అసలే కనీ పించక పోవటం విచిత్రం గా ఉంది .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు