మా నవ రాత్రి యాత్ర—16
శ్రీ మహా కాళేశ్వర విశేషాలు
ఉజ్జయిని లోని మహా కాలేశ్వర జ్యోతిర్లిన్గానికి ఒక ప్రత్యేకత ఉంది .దక్షినాభి ముఖంగా ఉన్న ఈశ్వరుడు శ్రీ దక్షిణా మూర్తి గా అర్చింప బడటం ఇక్కడి విశేషం .పన్నెండు జ్యోతిర్లింగ మహా క్షేత్రాలలో ఒక్క ఉజ్జయిని లోనే శంకరుడు దక్షిణా మూర్తిగా కొలువై ఉన్న దివ్య క్షేత్రం .మరెక్కడా ఇలా లేదు .దక్షిణాభిముఖం గా స్వయం భువు డై శివుడు విరాజిల్లిన దివ్య ధామం .శ్మశానం నుంచి తెచ్చిన చితా భస్మము తో రోజూ తెల్లవారు ఝామున అభిషేకం చేయటం ఇక్కడి మరో విశేషం .దీని తరువాత హారతినిస్తారు ఈ మొత్తం కార్యక్రమాన్ని ‘’భస్మ హారతి’’ అంటారు
స్థల పురాణం ప్రకారం క్షిప్రా నదీ తీరం లో ఉన్న ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు ఇరుగు పొరుగు రాజులు ఎప్పుడూ సిద్ధం గా ఉండేవారు .ఉజ్జయిని రాజు శిక్షకు గురి అయిన శ్రీకరుడు అనే చిన్నపిల్లాడు అపాయాన్ని గ్రహించి పూజారికి చెబుతాడు . పూజారి రాజుగారికి ఈ విషయం చెప్పే లోపే బ్రహ్మ వరం తో మాయారూపి ,అయిన ‘’దూషణుడు ‘’అనే రాక్షసుడి అండతో శత్రురాజులు ఉజ్జయిని పై విరుచుకు పడతారు .అప్పుడు శ్రీకరుడు ,పూజారి కలిసి కైలసనాధ శివుడిని ప్రార్ధిస్తారు .వారి మొర ఆలకించిన రుద్రుడు ప్రళయ కాల మహా ఘోష తో మహా కాళేశ్వరుని గా ఉగ్రాతి ఉగ్ర రూపం లో అవతరించి శత్రుసేనలను చీల్చి చెండాడి దూషణా సురుడిని సంహరించి రాజ్యాన్ని సంరక్షిస్తాడు .తరువాత భక్తుల కోరిక మేరకు మహా కాలేశ్వరుదు అనే పేరిట జ్యోతిర్లిన్గమై దక్షినాభిముఖం గా వెలసి దక్షిణా మూర్తిగా పూజలు అందుకొంటూ భక్త వరదుడి గా ప్రసిద్ధి కెక్కాడు .ఆలయం లో వాత్సల్య గణపతి స్వామి పార్వతీ దేవి విగ్రహ రూపం గా దర్శనమిస్తాడు .
మహాకాలేశ్వరాలయం లోనే ‘’తాంత్రిక శివ నేత్ర ‘’ఆరాధన జరుగుతుంది .శివుని ముందు నందీశ్వరుడు ప్రక్క వైపున పార్వతి ఉంటారు .మూడవ అంతస్తులో ‘’నాగ చంద్రేశ్వర స్వామి ‘’ఉంటాడు .దీనిని నాగ పంచమి నాడు మాత్రమె దర్శించాలి.అప్పుడే ఆలయం తెరచి ఉంచుతారు .ఉజ్జయిని నగరాన్ని ప్రభావితం చేసి భక్తుల హృదయాలలో కొలువు దీరాడు మహా కాలేశ్వరుదు .సతీదేవి’’ పై పెదిమ ‘’ఇక్కడ పడటం చేత శక్తి పీఠం గా వెలసిల్లింది. అమ్మవారు కాళికా దేవి .
ఆలయాన్ని షాసుద్దీన్ సుల్తాన్1234లో ధ్వంసం చేశాడు .1736లో సింధియా రాజు హిందూ పద షాహిషా బిరుదాంకితుడు శ్రీమంత్ రానోజీ రావు షిండే మహారాజు ,పీష్వా బాజీ రావు ,ఛత్రపతి సాహూ మహా రాజ్ లు కలిసి పునర్నిర్మిచారు .
ఉజ్జయిని విశేషాలు
మహోజ్వల ధార్మిక స్థలం గా ఉజ్జయినీ నగరం వెలిగింది .క్రీపూ నుండి దీని కీర్తి దిశాన్తాలకు వ్యాపించింది .విక్రమార్క చక్ర వర్తిపాలించిన నగరం .ప్రాచీన కాలం లో అవంతి అనే పేరుతొ పిలువ బడింది. స్కాంద పురాణం లో దీనికి కనక ,శ్రుంగా ,పద్మావతి ,కుశస్తలి ,కుముద్వతి అనే పేర్లున్నాయి .మహా కాలేశ్వరాలయం అద్భుత నిర్మాణం .పరిణత శిల్ప శోభా విలసితం .భూగర్భం నుండి అయిదు అంతస్తులలతో ఆలయం ఉంటుంది .మెట్లు దిగుతూ వెళ్లి దర్శించాలి . ఆలయం లోని ‘’కోటి తీర్ధ కోనేటి ‘’లో అభిషేక జాలం లభిస్తుంది .విశాల మైన మూడు ప్రాకారు దాటి వెడితే మహాకాళేశ్వర జ్యోతిర్లింగా దర్శన ప్రాప్తి కలుగుతుంది .
ఉజ్జయిని లోని కాలభైరవ స్వామి మద్య ప్రియుడు ఎంత మంది భక్తులు మద్యాన్ని అందించినా పూటు గా సేవిస్తాడు. సీసాలో మద్యాన్ని స్వామి నోటి దగ్గర పెడితే శబ్దం చేస్తూ ఖాళీ అయిపోవటం విచిత్రం .దీనికి హేతువాదులేవరూ కారణాలు కనుక్కోలేక పోయారని అంటారు .కాల భైరవ దర్శనం తో హత్యా పాతకం పోతున్దని విశ్వాసం .తాంత్రిక పూజలకు కేంద్రం .
కాళిదాస మహా కవి నాలుకపై కాళికా దేవి బీజాక్షరాలను రాసి మహాకవిగా మార్చిన ప్రదేశం ఇదే .ఇక్కడి కాళికా దేవిని ఘాట్ కాళీ అంటారు .
భర్తృహరి కవి సుభాషితాలు రాసిన గుహలు ఉజ్జయినికి ఏడు కిలో మీటర్ల దూరం లో సిప్రా నది ఒడ్డున ఉన్నాయి . ఉజ్జయినికి అయిదు కిలో మీటర్ల దూరం లో శ్రీకృష్ణుడు అన్నగారు బాల రాముడితో స్నేహితుడు సుదాముడనే కుచేలునితో’’ సాందీప మహర్షి ‘’వద్ద విద్య నేర్చిన సాన్దీపముని ఆశ్రమం ఇక్కడే ఉంది. ఇక్కడ కుచేలుని విగ్రహం ఆకర్షనీయం .
మహా కాలేశ్వరాలయం దగ్గరే ‘’హర సిద్ధి మాత ‘’ఆలయం ఉన్నది .ఈమె ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఆరాధ్యదైవం .భేతాళ కధలలో పట్టు వదలని విక్రమార్కుని కధలు ఇక్కడే జరిగాయి .దీనికి దగ్గరలో కృష్ణ చైతన్య ,ప్రభు నిర్వహణలో ఉన్న ద్వారకాధీశ ,గోపాల విగ్రహాలున్నాయి .కొండపై మంగళ నాధుని పేర కుజుడిని ఆరాధించే గుడి ఉంది .మంగళ వారం విశేష పూజలు జరుగుతాయి .మహా భారతకాలం లో ఉజ్జయినిలో ఖగోళ పరిశోధనలు జరిగేవి 1730రాజా జై సింగ్ నిర్మించిన అయిదు నక్షత్ర శాలలు అంటే అబ్సర్వేతరీలలో ఒకటి ఉజ్జయిని లోనే ఉంది మిగిలినవి ధిల్లీ ,కాశీ మధుర జైపూర్లలో ఉన్నాయీక్కద సామ్రాట్ యంత్రం ,రిగ్నేష్ యంత్రం నారీ వలయ యంత్రం భీతి యంత్రం ఇప్పటికీ పరిశోధకులకు ఉపయోగాపడుతూనే ఉండటం విశేషం .
కాలిదాస మహా కవి ‘’మేఘ సందేశం ‘’కావ్యం లో ఈ నగర శోభను వర్ణించాడు .ఉజ్జయినికి కాళిదాసుకూ అవినాభావ సంబంధం ఎక్కువ .
ఔరంగ జేబు ఆలయ పాలన కోసమూ ధనం అందజేశాడు .కవీన్ద్రాచార్య సరస్వతి అనేకవికి రక్షణ కల్పించాడు అయన రాసినవి సింధియా లైబ్రరీలో భద్రపరచారు .ఉజ్జైన్ లో సూర్య దేవాలయం ఉన్నట్లు స్కాంద పురాణం చెప్పింది .దాని దగ్గర సూర్య కుండం బ్రహ్మ కుండం ఉన్నట్లు పేర్కొన్నది .మహమ్మద్ ఖిల్జీ నగరాన్ని చల్లగా ఉంచేందుకు చుట్టూ తటాకాలు నిర్మించాడు .ఇక్కడ విక్రమాదిత్యుని పేరా విక్రం యూని వర్సిటి ఉంది .మౌర్యుల గుప్తుల కాలం లో నలందా తక్షిశిలా ల తో బాటు ఉజ్జయిని కూడా గొప్ప విద్యాకేంద్రం .’’నాలెడ్జి సిటి ‘’అంటారు ఉజ్జైన్ ను .ఇక్కడి కాళిదాస ఎకాడమి సంస్కృత సాహిత్యాన్ని సంస్కృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేస్తూన్నది .మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస సమ్మాన్ ‘’అనే పురస్కారాన్ని విశేష ప్రజ్ఞాకన బరచిన సాహితీ వేత్తలకు కళా కారులకు అంద జేస్తోంది .విక్రమాదిత్యుని పేర ‘’విక్రమ కీర్తి మందిరం ‘’ఉంది .ఇక్కడి బజార్లకు సంస్థలకు చాణక్య, చంద్ర గుప్త ,మౌర్య మొదలైన పేర్లు ఉండటం గర్వించదగిన విషయం .
కాళికాదేవి
కాళికాదేవి
మహా కాలేశ్వ రాలయం
తరువాత ఓంకారేశ్వర యాత్ర చేద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు