మా నవ రాత్రి యాత్ర -18(చివరి భాగం )
తిరుగు ప్రయాణం
16 ఏప్రిల్ బుధవారం తెల్లావారు జామున మేము ఉంటున్న రైల్వే రిటైరీ రూములకు ఆనుకొనే ఉన్న ఒకటవ నంబర్ ప్లాట్ ఫాం మీదకు సామాను చేర్చాము .జైపూర్ –కోయంబత్తూర్ సూపెర్ ఎక్స్ప్రెస్స్ సరిగ్గా నాలుగు పదికి స్టేషన్ చేరింది .మా ఎసి కంపార్ట్మెంట్ లోకి చేరాం మాకు ఈ బోగీలో రిజర్వేస్స్హన్ భోపాల్ నుంచే దొరికింది .ఉజ్జైన్ నుంచి ఎస్ 5లో భోపాల్ వరకు శర్మ ముందే రిజర్వ్ చేశాడు .సామాన్లతో మళ్ళీ మళ్ళీ మారలేమని ఎసి కంపార్ట్ మెంట్ లోనే చేరిపోయాం నిజానికి మా బెర్త్ లు ఖాళీగానే ఉన్నాయి కండక్టర్ ను మేనేజ్ చేసి ఎవరో ఆక్క్యుపై చేశారు. మా సీట్లకేమీ ఇబ్బంది లేదు కూర్చున్నాం .ఉజ్జైన్ నుంచే భోపాల్ లో ఉన్న విజ్జి స్నేహితురాలు ప్రీతికి ఫోన్ చేసి ఈ ట్రెయిన్ లో వస్తున్నామని ,అవకాశం ఉంటె స్టేషన్ లో కలవమని మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది .ఉదయం ఏడు గంటలకు భోపాల్ చేరాం .ప్రీతి భర్త శాస్త్రిగారు వాళ్ళమ్మాయి మా బోగీలోకి వచ్చి పలకరించారు .మేము వాళ్లకు ప్రసాదం దేవుడి ఫోటో ఒక బాగ్ లో ఉంచి అందజేశాం .పది నిమిషాలే భోపాల్ లో ట్రెయిన్ ఆగింది .మాకు కేటాయించిన బెర్త్లకు చేరి కూర్చున్నాము .
ప్రీతికరమైన ప్రీతి ఇడ్లీలు ,పెరుగన్నం
ప్రీతీ ఫామిలి మమ్మల్ని చూసి ఏంతో సంతోషించారు .ప్రీతీ కుటుంబం చేత అమెరికాలో డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేయించిన సంగతి గుర్తుకొచ్చింది .వాళ్ళు వీడ్కోలు చెప్పి దిగి వెళ్లి పోయారు .ఒక తెలుగాయన భోపాల్ లో ఎక్కారు. నా వయస్సు వారే .భమిడి పాటి సుబ్రహ్మణ్యం గారు .కృష్ణా జిల్లా కౌతవరం లో జన్మించారట .అక్కడే విద్యాభ్యాసం .తండ్రి భమిడి పాటి మృత్యుంజయుడు గారు జిల్లా పరిషద్ హైస్కూల్ లో హెడ్ మాస్టారుగా చేశారట .భోపాల్ లో బి హెచ్ ఇ లో లో ఉద్యోగం చేస్తూ నలభై ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారట .అక్కడ ఆ సంస్థ కట్టించిన బాలాజీ దేవాలయ నిర్మాణ సంఘంలో అధ్యక్షులుగా ఇప్పటికీ సేవ చేస్తున్నారు .సరదాగా గడిచి పోయింది ఆయన తో సంభాషణం .ఆయన తిరుపతి వెళ్తున్నారు
ప్రీతీ కారీ బాగ్ లో ఎమిచ్చిందో చూశారు మా వాళ్ళు .ఫ్లాస్క్ నిండా కాఫీ పోసిచ్చింది ప్రీతీ. తాలో అరా ముందు తాగేశాం .తరువాత ఇడ్ళీలపై పడ్డాం. మనిషికి నాలుగు ఇడ్లీలు వంతున పాక్ చేసి మహా రుచికరమైన చట్నీ పెట్టింది .ఇడ్లీలు పచ్చడీ అదరహో అని పించాయి .గుటకలేస్తూ హాయిగా తిన్నాం .ఎన్ని రోజులయిందో కడుపులో తృప్తిగా ఏదైనా పడి .తృప్తిగా తినేశాం మళ్ళీ కాఫీ తాగాం .మందులేసుకోన్నాం .బెర్తుల మీదకు చేరాం .కాసేపు నిద్రపోయామేమో .కింద భమిడి పాటి వారు మా అమ్మాయితో పిచ్చా పాటీ మాట్లాడుతున్నారు .మాఎదురు కింది బెర్త్ మీద ఇద్దరు గున్న యేనుగుల్లాంటి అమ్మాయి అబ్బాయి ఎక్కిన దగ్గర్నుంచి నాన్ స్టాప్ కబుర్లే కబుర్లు .మొగుడూ పెళ్ళాలు అని పించలేదు . సహా ఉద్యోగులేమో?
పగలల్లా ప్రయాణం .నాగ పూర్ వచ్చేసరికి హైదరాబాద్ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఫోన్ చేశారు .’’మాస్టారూ!మహిళా మాణిక్యాలు పుస్తకం అందింది. మహా గొప్పగా ఉంది .ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి సంపాదించారో ఆశ్చర్యం గా ఉంది .చాలా గొప్ప ప్రయత్నం .వైవిధ్యం అద్భుతం .’’అని మెచ్చుకొన్నారు .నేనునాగ్ పూర్ లో ఉన్నానని ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పి ,కృతజ్ఞతలు తెలియ జేశాను .ప్రసాద్ గారేప్పుడూ నన్ను ‘’మాస్టారూ ‘’అని సంబోధిస్తారు .అదీ ఆయన సంస్కారం .
పదహారవ తేదీ రాత్రి రెండుగంటలకు మా రైలు విజయవాడ స్టేషన్ చేరింది .ముందే మా ఆస్థాన డ్రైవర్ రాముకు ఫోన్ చేయటం వలన కారు తెచ్చి రెడీ గా ఉంచాడు. సామాను మేమే తీసుకొని స్టేషన్ బయటికి తెచ్చాం .కారు లో సామాను ఎక్కించి బయల్దేరాం .పదిహేడు గురువారం ఉదయం మూడుమ్బావు కే ఉయ్యూరులో మా ఇంటికి చేరుకొన్నాం .
ఉదయం శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారికి నేను కాశీలో ఇచ్చిన మాట ప్రకారం ఫోన్ చేసి మాట్లాడాను .2012జనవరి లో బెజవాడ పుస్తక మహోత్సవం లో శ్రీ తిరుమల రామ చంద్ర ,శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యు వారి శతజయంతి వేడుకలలో పద్మిని గారు మాట్లాడిన విశేషాలు ఆసభా విశేషాలు నేను మర్నాడే సరసభారతిలో వ్యాసం గా రాశాను .ఆ విషయం ఆమె సోదరి చూశారట .ఆ విషయం తనతో చెప్పారట .బేజ వాడ పుస్తక మహోత్సవం వారు ఫోటోలు ఆ వివరాలు పంపిస్తామని చెప్పి ఇంతవరకూ పంపలేదని నాదగ్గర ఆ వ్యాసం ఉంటె పంపమని కోరారు మెయిల్ అడ్రస్ తీసుకొని పంపించాను .ఆమెను సాహితీ బందులో చేర్చాము .అప్పటి నుండిన రేగ్యులర్ గా సరసభారతి ఆర్టికల్స్ పంపుతూనే ఉన్నాం .సరసభారతి ప్రచురించిన పుస్తకాలు ఆరోజే ఆవిడకు కొరియర్ లో పంపాను .మర్నాడే ఆమెకు అందగా ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పి నాక్రుషి కి ఎంతగానో మెచ్చుకొని నన్ను మరో ‘’జానుమద్ది హనుమచ్చాస్త్రి’’ ‘’అని మెచ్చారు .’’అంత సీను నా దగ్గర లేదని ‘’చెప్పానామెకు వినమ్రంగా ..ఆమెతో మాట్లాడటం నాకూ ఆనందం కలిగింది .మన సరస భారతి బ్లాగ్ కు ఆమె వీర అభిమాని .
ఓంకారేశ్వర్ విశేషాలు
మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగా క్షేత్రం ఉంది .ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్లు .ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’.నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది .అన్ని నదులూ తూర్పు దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం .అదీ ఈక్షేత్ర ప్రశస్తి .ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుదు ,పైన ఓంకారేశ్వరుడు ఉంటారు.ఇక్కడ ఓంకారేశ్వర్ లో కింద ఓంకారేశ్వరుడు ,పైన మహా కాలేశ్వరుదు ఉండటం విచిత్రం .గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది .కింద ఓంకారేశ్వరుడు ,మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుదు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి .శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులోఉన్నాయి .నర్మదానది నర్మదా ,కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది .ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి మాం దాత్రు పురి అని పిలుస్తారు .ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట .ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు .
పురాణ గాధ
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు .మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు .ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారం లో ఉండిఓంకారేశ్వర్ , దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి .వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది .ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు విన్ధ్యుడి పూజ గ్రహించాడు .తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు .’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే .మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు .సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రం లో ఘోర తపస్సు చేశాడు .ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి .తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతం గా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు .సంతోషించిన శివుడు ప్రణవాకారాం లో జ్యోతిర్లింగం గా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు .ఓంకారేశ్వరుదని ,పార్దివాకారం లో అమలేశ్వరుడని రెండు పేర్ల తో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు .
ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు .ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధ రించారు .ఇక్కడి గౌరీ సోమనాధ మందిరం లో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం .రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట.అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు .
మామ లేశ్వర జ్యోత్రిర్లింగం
నర్మదా నదీ తీరం లో శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంది .ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం అభిషేకం మనమే చేసుకో వచ్చు వెనక పార్వతి అమ్మవారు శివ లింగం వెనుక ఉంటారు .ఒకప్పుదు నారదుడి ప్రేరేపణ తో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహిమ్పబడి దేవతల కోరికపై ఇక్కడే మా మలేశ్వరుడిగా ఉంది పోయాడు వరగర్వం తో వింధ్య పర్వతం మేరువు ను దాటి గర్వం గా పెరిగి పోయింది.సోర్యుదు ఉత్తరాదిశాలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అంధకారం ఽప్పుదు దేవతలు విష్ణువు ను ప్రార్ధించారు వింధ్య గర్వం హరిన్చాటా నికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమెసాధ్యమని చెప్పి కాశీ పంపాడు మహర్షిని ప్రార్ధించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు సరేనన్న మహర్షి కాశీ విశ్వనాదుడిని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు .శిశ్యుదు వంగిగురువుకు నమస్కరించాడు తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగెఉంది పొమ్మని శిష్యుడిని శాసించాడు అప్పటి నుండి అలానే వింధ్య పర్వతం ఉందిఽన్తె ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట
ఓంకారేశ్వరుడు
ఆలయ శిల్పాలు
maa
మ మలేశ్వర జ్యోతిర్లింగం
మా నవ రాత్రి యాత్ర సర్వం సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు