హెర్మన్ మెల్ విల్లీ –
‘’ రేబెకా స్టేఫాఫ్ ‘’రాసిన ‘’హెర్మన్ మెల్ విల్లీ ‘’పుస్తకం చదివాను .ఆద్యంతం మహాద్భుతం గా రాసిన్దామే .మెల్ విల్లీ జీవితం లోని ఏ విషయాన్ని వదలలేదు .మేల్విల్లీ చేసిన అనేక సముద్ర ప్రయాణాలను మనమే చేస్తున్నామా అన్నంత అనుభూతి కలిగించింది రచయిత్రి..మేల్విల్లీ ‘’south seas’s exploration ,typce ,white jacket నవలలు రాసినా ‘’మోబీ డిక్ ‘’నవలతోనే ప్రసిద్ధుడయ్యాడు ,చరిత్ర సృష్టించాడు .చని పోయిన తర్వాత కొద్ది కాలం అతని ని మరచి పోయినా ,1920లో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు .జనం మళ్ళీ చదివి కొత్త వ్యాఖ్యానాలు చేసి చిరాస్మరణీయుడిని చేశారు .దుర్భర జీవితం గడిపి ,జీవితాన్ని నౌకా జీవితాన్ని ఔపోసన పట్టి ‘’అద్భుత యాత్రా సాహిత్యం ‘’సృష్టించాడు .’’నర మాంస భక్షకుల హంతకుల (కానిబాల్స్)‘’బారిన పడి కొద్దిలో తప్పించుకొని బయట పడ్డాడు .జీవిత చరమాంకం లో సంతృప్తికర జీవితాన్ని గడిపాడు .
మెల్ విల్లీ 1918ఆగస్ట్ ఒకటిన న్యూ యార్క్ లో పుట్టాడు .1991సెప్టెంబర్ 28న అక్కడే మరణించాడు .డెబ్భై మూడేళ్ళు జీవించాడు .ప్రఖ్యాత అమెరికన్ రచయిత నేతానియాల్ హతారన్ ను గురువుగా మేల్విల్లీ భావించాడు .గాలాపగాస్ ఐలాండ్స్ ను ‘’ఎంచాన్తేడ్ ఐలాండ్స్ ‘’అంటారు. ఇవి ఒక్కోసారి కనిపించకుండా అదృశ్యామౌతాయట .అదీ వీటి ప్రత్యేకత .డార్విన్ కు ఈ దీవులు పరిశోధనా కేంద్రాలైనాయి .సముద్ర తిమింగిలాలను ‘’వేల్స్ ‘’అంటారు వీటిని వేటాడే విధానాన్ని మెల్ విల్లీ గొప్పగా వర్ణించాడు .వేల్స్ ను వేటాడటం లో ‘’దిలైన్ ‘’అంటే హార్పూన్ అనే దానికి కట్టబడిన బలమైన త్రాడు .హార్ప్పోన్ తో పొడిచి వేల్ నుపడవ దగ్గరకు లాగుతారు .మెల్ విల్లీ దీనికి మరో భాష్యం చెప్పాడు .’’మనుషులను బంధింఛి లోపలి .నెట్టి జీవితం ద్వారా బయటికి లాగటం ‘’అదే అంతరార్ధం.అతని మాటల్లోనే ఆ వేదాంత ధోరణి తెలుసుకొందాం ‘’All men live enveloped in whale lines .All are born with halters round their necks but it is only when caught in the swift ,sudden turn of death ,that mortals realize the silent subtle ever present perils of life .And if you be a philosopher though seated in a whale boat ,you would not at heart feel one wit more of terror than though seated before your enemy fire with poker and not a harpoon by your side ‘’ఇలా సింబాలిక్ గా మోబీ డిక్ నవల అంతా రాస్తాడు మెల్ విల్లీ .ప్రకృతిలోనే నరమాస భక్షణ ఉందన్నాడు .దానిపై స్పందిస్తూ ‘’pray up on each other .carrying on eternal war since the world began .’’అన్నాడు .ఇందులో ‘’పిప్ ‘’అనే వాడి పాత్రను గురించి చెబుతూ ‘’pip symbolizes the power of the sea both to terrify and destroy men also to return them to a state of child like innocence ‘’అని భాష్యం చెప్పాడు .
melvillee route of melvillie sea voyage
మోబీ డిక్ పై రచయిత్రి రేబెకా ‘’మోబీ డిక్ కు ప్రతీక మోబీ డిక్ మాత్రమే .అది అన్నిటికీ ప్రతీక గానే నిలుస్తుంది .మనిషి కంట్రోల్ లో లేనిదీ ,అతనికి అందు బాటులో లేనిదీ ప్రతిదీ మోబీ డిక్ ‘’అని అర్ధం చెప్పింది .ఇందులో తెల్ల తిమింగిలం అంటే మంచికి ,స్వచ్చతకి చిహ్నం .వేల్ అంటే తప్పించుకోలేని చావుకు ప్రతీక .అదొక మనుష్యులను వినాశనం చేసే భౌతిక ప్రపంచం .అయితే ఆ పని తెలివి తక్కువగానో లేక బుద్ధి లేకుండానో చేసే పని మాత్రం కాదు .అందులో దురుద్దేశ్యం ఏమీ లేదు ‘’అని వ్యాఖ్యాతలు తెలిపారు . మేల్విల్లీ వేల్ ను ప్రక్రుతి కి సింబల్ గా ,పారిశ్రామిక టెక్నాలజీకి వికృత చేస్ట గా భావించాడని చాలామంది వ్యాఖ్యానించారు .ఇందులో వర్ణించ బడిన ‘’స్పెర్ం వేల్’’కు రెండు కళ్ళు మనిషికి ఉన్నట్లుగా కాకుండా రెండు వైపులా ఉంటాయి .అదీ ప్రత్యేకత .అందుకే అది వాటితో రెండు విడి విడి ప్రతిబింబాలను ఒకే సారి చూడ గలుగుతుంది .ఇందులోనూ మెల్ విల్లీ భావం ,అంతరార్ధం ఉంది .ప్రతి వాడూ ప్రతి దాన్ని ‘’మల్టిపుల్ ఇమేజేస్ ‘’గా చూడాలి .వేల్ ప్రపంచాన్ని ద్వంద్వ భావం తో చూస్తున్దన్నమాట .కాని మనిషి ఒకే సారి ఒకే దాన్ని చూస్తాడు .అదీ ఇద్దరికీ ఉన్న భేదం .’’whale knows reality not a single picture ,but is made of many layers of meaning ‘’అని భావించాలి .తిమిగిలం తెలుపుదనం లో ప్రపంచపు యదార్ధ అర్ధం దాగి ఉందంటాడు .అది మనిషి మేధా పరిధికి అందదని, జీవిత రహస్యాన్ని,జీవిత పరమార్ధాన్ని అనుభవం ద్వారా చేదించి తెలుసుకోవాలని అంటాడు .ఒక రకం గా అదేమీ రహస్యం కానే కాదన్నాడు .
నావికా యానం లోని విశేషాలనూ మెల్ విల్లీ ప్రతీకాత్మకం గా వర్ణిస్తాడు .’’యుద్ధ యోధుడిగా మనిషి సముద్రయానం చేస్తున్నట్లే ,ఈ భూమి కూడా గాలిలో ప్రయాణం చేస్తోంది .మరణం తప్పని మానవులం మనం వేగం గా ,ఎన్నటికీ మునిగి పోనీ నౌకాయానం చేస్తున్నాము .దేవుడే నావికాదిపతి. పైన మిల్కీ వే మాత్రమె దారి చూపేది .భగవానుడే సుప్రీం కెప్టెన్ .మనం ప్రయాణించే నౌకా తీరం మారి పోతూ ఉంటుంది .తీరానికి సుదూరం గా జీవితకాలాల బాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాం .మన చిట్ట చివరి గమ్యం మాత్రం రహస్యమే. మనకు తెలీనే తెలియదు .నౌక నడిపే నావికులకూ అధికారులకూ అంతు బట్టదు ..మనం ఎక్కడికి చేరాలో ముందే రాసి ఉంచాడు దేవుడు .లేక పొతే సృష్టి నుంచి మనం జారి పడి పోయి ఉండేవాళ్ళం కదా ‘’అన్నాడు మహాద్భుత వేదాంత భావన తో .
అందుకే ‘’there is no secret .-that may be the secret of Moby Dick ‘’అంటారు .
ఈ భావనలన్నిటిని దృష్టిలో ఉంచుకొని మెల్ విల్లీ ని ‘’existentialist’’అంటే అస్తిత్వ వాదిఅన్నారు .ప్రపంచం ఈదలేని మహా సముద్రమని ,మనిషి తన పనులకు తానే బాధ్యత వహించాలని ‘’భావం .మోబీ డిక్ నవలలో ‘’ఆహాబ్ ‘’అనే పాత్ర భగవంతుని నమ్మడు .అంతేకాక తనకంటే తెలివి గల జీవి ప్రపంచం లోనే లేదనే గర్వం కూడా ఉన్న వాడు .అందుకే ఈ నవలలో వాడు చనిపోతాడు .అంటే రచయిత వాడిని చని పోయేట్లు చేశాడు .మరో పాత్ర ‘’ఎశామల్ ‘’సముద్రం గొప్ప తనానికి లొంగి దాని కారుణ్యానికి క్రుతాజ్ఞాతా భావం తో ఉంటాడు. అందుకే ఆ పాత్ర చివరిదాకా ఉంటుంది .ఈ కధనంతటిని మెల్ విల్లీ వాడితోనే చెప్పిస్తాడు
మోబీ డిక్ నవలలో మరో విశేషాన్ని విమర్శకులు గుర్తించారు .అదే ‘’ the contrast between isolation and community .next to his mono mania ,Ahab’s chief characteristic is his isolation from the other people .’’కనుక మనిషి సంఘ జీవిగా మనుగడ సాగించాలి. నన్ను ముట్టుకోకు నా –కాకీ ‘’అన్నట్లు గా వ్యవహరించ రాదు అని మోబే డిక్ సారాంశం .’’రేచెల్ ‘’ను అన్వేషించ టానికి ఆహాబ్ సహక రించాడు. అందుకే వేల్ వాడిని వేటాడి చంపేసింది .మానవుల మధ్య దయ రక్షణా అనే బంధాలు చాలా బలహీనం గా ఉన్నాయని చెబుతూనే అవే మనకు ఆధారాలన్నాడు మెల్ విల్లీ .అవే మనకు పరిష్కారా మార్గాలని తెలిపాడు .మోబీ డిక్ నవల ఒక సాహస కృత్యం మాత్రమె కాదు .అది జీవితం మొత్తం వేదాంత భాషలో స్పష్టం చేసిన దిక్సూచి .ప్రపంచం మొత్తం మేల్విల్లీ రాసిన మోబీ డిక్ నవలను శిరస్సున ధరించి పూజించింది .అతని ప్రతిభా సర్వస్వమ ని కీర్తించింది .’’the individual is a part of the whole ‘’అనేది మోబీ డిక్ నవల లోని సారాంశం .ప్రపంచాన్నితన ద్రుష్టి తో చూసి గొప్ప భాష్యం గా మోబీ డిక్ నవలను తీర్చి దిద్దాడు మెల్ విల్లీ మహాశయుడు .
‘’along with mark Twain’s “Huckle Berri Finn ‘’and Walt Whitman’s “”leaves Of grass ‘’Moby Dick is considered a caandidate for the greatest Amercan book ‘’అని చిరస్థాయి ని కలిగించారు విశ్లేషకులు .మేల్విల్లీ ఈ నవలలో తన నాణ్యమైన విశాలమైన మిరుమిట్లు గొలిపే భావ ప్రకటన చేశాడని కొనియాడారు .’’each individual mind or soul is an un fathomable mystery ‘’అని ఇందులోని పిండితార్ధాన్ని పండితులు లాగారు .
మేల్విల్లీ ‘’I love all men who dive ‘’అన్నాడు .థాట్ డైవేర్షన్ ‘’అంటే మెల్లీ కి అమిత ఇస్టం .షేక్స్పియర్ మీద వీరాభిమానం .అందుకే మోబీ డిక్ నవలే అయినా కవితాత్మకం గా మనోహరం గా మార్మికం గా మహిమాన్వితం గా ఉంటుంది .ఇందులోని’’ రూపకాలన్నీ’’(మెటాఫర్లు ) అతని జీవితానికి చెందినవే .ఎన్నో విషయాలు తెలుస్తాయి .అతని మిస్సోరీ ,మిసిసిపి ,యీరీ నదుల మధ్య చేసిన పర్యటనలను చదివితే మనమూ అతని వెంట ఉండి అనుభవం పొందినట్లుగా ఉంటుంది .మరుగై పోయిన ఒక మహా రచయిత మెల్ విల్లీ ని మళ్ళీ అమెరికన్ లు చదువుతూ సార్ధకత పొందుతున్నారంటే వారికి జేజేలు
.
24-10-2002నాటి ణా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-14-ఉయ్యూరు