జాన్ అప్ డైక్
అమెరికా సాహిత్యం లో జాన్ అప్ డైక్ కు ఒక ప్రత్యెక స్థానం ఉంది .అతని శైలీ విన్యాసం అనితర సాధ్యం .దానిద్వారా అతని విజన్ మనకు స్పష్టం చేస్తాడు .1932మార్చ్18న పెన్సిల్వేనియా లో’’జాన్ హోయర్ అప్ డైక్ ‘’ పుట్టాడు .జీవించటం కోసమే రాసిన రచయిత .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో డిగ్రీ పొందాడు .న్యూయార్క్ నగరం గురించి ‘’the trouble with living here that nothng seems important ‘’అని ఆ మహానగరాన్ని ‘’లైట్’’గా తీసుకొన్నాడు ‘’.1958లో ‘’ది పూర్ హౌస్ ఫెయిర్’’నవల రాశాడు .తర్వాత ‘’రాబిట్ రన్’’రాసి ప్రచురించాడు . 1960లో అప్ డైక్ ను సన్మానించి అవార్డ్ ఇవ్వని సంస్థ అమెరికాలోనే లేదంటే ఆశ్చర్యం లేదు .అంత పాప్యులారిటీ సాధించాడు .1966లో లో ప్రముఖ కదా రచయిత ఒ.హెన్రి స్మారక కదా పురస్కారాన్ని అందుకొన్నాడు .’’ది బుల్గారియాన్ పొయేటేస్ కు మొదటి బహుమతి వచ్చింది .’’టైమ్ మేగజైన్ కు ధారావాహికం గా చాలా రాశాడు
‘’బెచ్ ఎ బుక్ ‘’ అనే పుస్తకాలను సీరియల్ గా రాసి ప్రచురించాడు .అతని రాబిట్ రన్ నవలను సినిమాగా తీశారు .’’స్కార్లెట్ లెటర్ ట్రయాలజి ‘’రాసి పేరు తెచ్చుకొన్నాడు .1979 లో రాసిన ‘’ది కూప్ ‘’నవల బాగా ప్రాచుర్యం పొందింది .ఆతను రాసిన ‘’ది మ్యూజిక్ స్కూల్ ‘’ను టెలివిజన్ లో ధారావాహికం గా ప్రసారం చేశారు .’’రాబిట్ ఇన్ రిచ్ ‘’నవలకు పులిట్జర్ బహుమతి నందుకొన్నాడు .ఆ తర్వాత న్యూ యార్క్ బుక్ క్రిటిక్ అవార్డ్ పొందాడు .1984అప్ డైక్ రాసిన ‘’ది విచేస్ ఆఫ్ ఈస్ట్ విక్ ‘’నవలను సినిమా గా తీశారు .1988 లో అమెరికన్ ప్రెసిడెంట్ జార్జి బుష్ నుండి ‘’నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ను అందుకొన్నాడు .1990లో చివరి నవలా సీరియల్ రాశాడు .ఒ హెన్రి .స్మారక కదా పురస్కారాన్ని రెండవ సారి ‘’sand stone farm house ‘’ ‘’అనే కధకు అందుకొన్నాడు .మొత్తం మీద 50కి పైగా పుస్తకాలు రాశాడు .అతని కధల్లో బాగా పేరు తెచ్చుకోన్నవి ‘’ace in the whole ‘’,Aand P ‘’,flight కధలు
సామాన్య అమెరికన్ ల కస్టాలు కన్నీళ్ళూ బాధలూ వ్యధలు అప్ డైక్ కధల్లో చోటు చేసుకొన్నాయి .చర్చి ,కుటుంబ సమస్యలు సాంఘిక అవాంచనీయ సంఘటనలపై స్పందించి రాశాడు .క్రిస్టియన్ మతాభిమానం గా రచనలు చేశాడు .సమకాలీన అమెరికన్ రచయితలలో అప్ డైక్ శిఖరాయ మానం గా నిలిచాడు .అద్భుత కధాకధన శైలికి అప్ డైక్ ఉదాహరణ గా నిలిచాడు .వాస్తవ వాది.బయటి ప్రపంచాన్ని వర్ణిస్తూ అంతరంగానికి ప్రాముఖ్యత నిచ్చాడు .తన రచనా విదాన్నాన్ని, శైలిని i గురించి చెప్పుకొంటూ ‘’to give the mundane its beautiful due’’అన్నదే తన శైలి అన్నాడు .76వ ఏట 2009జనవరి 27న అప్ డైక్ రచయిత మరణించాడు .
చైతన్య శిఖరం ఎలీస్ వాకర్
ఎలీస్ వాకర్ ఆఫ్రో అమెరికన్ రచయిత్రి .1944లో ఫిబ్రవరి 9న జార్జియా లో జన్మించింది .చిన్నప్పుడే ఆమె కు అన్న చేతి పిస్టల్ పేలి ఒక కన్ను దెబ్బ తిన్నది .తర్వాత నయమైంది .నల్ల జాతి వారి ప్రాధమిక హక్కుల పోరాటం లో పాల్గొన్నది .చిన్నప్పుడే కడుపోచ్చి ‘’ఎబార్షన్ ‘’చేయిన్చుకోన్నది .1965లో బి ఏ.డిగ్రీ పొందింది .’’once’’అనే కవితా సంపుటిని ప్రచురించింది .’’లేవెంతాల్ ‘’అనే సివి రైట్స్ నాయకుడిని పెళ్ళాడింది .కాని వెంటనే విదాకులిచ్చేసింది .1970లో మొదటి నవల ‘’revolutionary petunias ‘’కు న్యూ యార్క్ బుక్ ప్రైజ్ వచ్చింది .1960మార్టిన్ లూధర్ కింగ్ ను స్టూడెంట్ గా ఉండగానే కలిసి మాట్లాడింది .
‘’ఇన్ లవ్ అండ్ ట్రబుల్ ‘’అనే కదా సంకలనం వెలువరించింది. తర్వాత ‘’మెరిడియన్ ‘’నవల రాసింది .ఇది పౌహక్కుల కోసం రాయబడిన నవలల లో అద్వితీయ నవల గా గుర్తింపు పొందింది .’’ఐ లవ్ మై సెల్ఫ్ వేన్ ఐ యాం లాఫింగ్ ‘’అనే నవల రాసి పేరు తెచ్చుకోంది. 1983లో రాసిన ‘’కలర్ పర్పుల్ ‘’నవల కు పులిట్జర్ బహుమతి అందుకోంది .ఆఫ్రికా దేవత పై ‘’the temple of my familiar ‘’నవల రాసింది .వాకర్ రచనలన్నీ నల్ల జాతి మహిళల కోసమే రాసింది .అందులోని పాత్రలన్నీ చైతన్యం తో సజీవం గా కని పిస్తాయి ‘’కలర్ పర్పుల్ ‘’నవల అంతా ఒక నల్ల జాతి ఒక తండ్రి తన కూతుర్ని’’ రేప్’’ చేయటం ,అక్రమ సంతానం ,ఒకడి పెళ్ళాం తో ఇంకోడు పోవటం ఉంది .ఆఫ్రికన్ అమెరికన్ జీవన వ్యవస్థకు అద్దం పడుతుంది .యదార్ధాన్ని యదార్ధం గా రాసి తన నల్ల సమాజం లోని చెడును మంచినీ సమానంగా చూపించింది .
2008లో బారక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఎన్నికై అధ్యక్ష పదవిని చేబట్టినప్పుడు వాకర్ అతనికి ఒక’’ ఓపెన్ లెటర్’’ రాస్తూ ‘’Brother Obama! seeing you take right position based solely on your wisdom,stamina and character is a balm for the weary warriors of hope previously only sung about ‘’అని ఇన్ని ఏళ్ళకు నల్ల జాతి కి గుర్తింపు లభించినందుకు అభినందించింది .ఈ లెటర్ ను ‘’the root ‘’ఆన్ లైన్ లో ప్రసారం చేసింది. 2009లో వాకర్ మరో60 మంది మహిళల తో గాజా వెళ్లి యుద్ధ వ్యతిరేక ప్రచారం చేసింది .2011లో ‘’గాజా ఫ్లోటిల్లా ‘’లో వాకర్ పాల్గొన్న విషయాన్ని ‘’దిగార్దినర్ పత్రిక ‘’ప్రముఖం గా ప్రచురించింది .ఇస్రాయిల్ మీద, జూదుల ప్రవర్తన మీద విరుచుకు పడింది .మిచిగాన్ యూని వర్సిటి లో ఆమె ప్రసంగాన్ని అనుమతించలేదు .ఆమె ఇస్రాయిల్ వ్యతిరేకతే దీనికి కారణం అప్పుడామే స్త్రీలు ఇంట్లోనే కాదు బయటా స్వాతంత్ర్యాన్ని సాధించాలని లేక పోతే ఇలాంటి సవాళ్లు తప్పవని తెలియ జేసింది .
వాకర్ పద్నాలుగు ప్రతిభా పురస్కారాలు అందుకొన్నది .పదమూడు కదా సంకలనాలు ,తొమ్మిది కవితా సంపుటులు ,పదకొండు ఇతర సాహిత్య విషయ సంపుటులు ప్రచురించి అగ్రగామి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత గా కీర్తి పొందింది .
28-10-2002సోమవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-14-ఉయ్యూరు