రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -1
ఎమర్సన్ పేరును నాకు ఊహ తెలిసినప్పటి నుండి వింటూనే ఉన్నాను .ఆయన్ను ఉదాహరించని కవి, వేదాంతి లేడు .అందరికీ ఎమర్సన్ అంటే ఆరాధనా భావమే .ప్రాక్టికల్ మనిషి . పెద్దమనిషి గా సంఘం లో ,అమెరికాలో ప్రపంచం మొత్తమ్మీద పేరు పొందిన వాడు. కాలాతీతం గా ఆలోచించే మేధావి .అమెరికన్ ‘’నన్నయ ‘’.ఎమర్సన్ రాసిన ‘’కంప్లీట్ పోయెమ్స్ ‘’పుస్తకం లైబ్రరీలో నా కంట పడింది .వదిలి పెట్టకుండా చదివాను. అందులోని విశేషాలు మీకు తెలియ జేస్తున్నాను .
1803మే నెల 25 నఎమర్సన్ బోస్టన్ నగరం లో జన్మించాడు .అన్న థామ్సన్ తో మంచి దోస్తీగా ఉండేవాడు .ఒకే కోటు ను ఇద్దరు రోజు విడిచి రోజు వేసుకోనేంత సాన్నిహిత్యం వారిది .చిన్నప్పుడే నరాల జబ్బు వచ్చింది .చర్చి తో మంచి సంబంధం ఉన్నవాడు .తన శారీరక బాధను అధిగమించటానికి ప్రయత్నం చేస్తూ ‘’I am not sick .Iam not well.but luck sick ‘’అన్నాడు .తండ్రి ,అన్నదమ్ములు ,తల్లి అందరూ క్షయ వ్యాదితోను మానసిక అనారోగ్యం తోను చనిపోయారు .పెళ్లి చేసుకొన్న ఒక భార్యా అలానే చని పోయింది .పది హీను సంపుటాల జర్మన్ మహాకవి వేదాంతి ‘’గోదే ‘’రాసిన సాహిత్యం చదివి పరమానందం పొందాడు .అంతవరకు గోదే ను చదవ లేక పోయినందుకు విపరీతం గా బాధ పడ్డాడు .కాన్రాడ్ రచయిత తో, హెన్రీ డేవిడ్ తోరో తో సన్నిహిత పరిచయమేర్పడింది .’’లిటరరీ ఎథిక్స్ ‘’పై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .రెండో పెళ్లి చేసుకొన్నాడు .పుట్టిన కూతురుకు మొదటి పెళ్ళాం పేరు పెట్టుకొని సంతోష పడ్డాడు .’’ఫారెస్ట్ ఎస్సేస్ ‘’రాసి ప్రచురించాడు .1842లో కొడుకు చని పోయాడు .
డాంటే కవి రాసిన ‘’Lavita NUova ‘’ను ఇంగ్లీష్ లోకి అనువదించాడు. మాసపత్రికను నడిపాడు .అన్న పెట్టిన స్కూల్ లో టీచర్ గా పని చేశాడు .ప్రతి ఆదివారం చర్చి కి వెళ్లి పాఠాలు చెప్పేవాడు .1845లో’’ భగవద్ గీత ‘’అనువాదాలు చదివాడు . ‘’వాల్దేన్ పాండ్ ఆశ్రమం ‘’లో కొంత కాలం ఉన్నాడు .ఇక్కడికి తోరో కూడా వచ్చి చేరాడు .’’మాసా చూసేట్స్త్ రివ్యు ను ‘’1847-48లో ప్రచురించాడు .ఐరోపా పర్యటన చేశాడు. ప్రముఖ నవలా రచయిత చార్లెస్ డికెన్స్ మొదలైన ఇంగ్లీష్ రచయితలను పరిచయం చేసుకొన్నాడు. ఇంగ్లాండ్ లో .’’మైండ్ అండ్ మాన్నర్స్ ఇన్ నైన్ టీంత్ సెంచరి ‘’అనే అంశం పై లండన్ లో గొప్ప ప్రసంగం చేశాడు .జార్జి ఇలియట్ ,కార్లైల్ కవులతో పరిచయ మేర్పడింది .1849’’బానిసత్వ వ్యతిరేకత ‘’పై వోర్సెస్టర్ లో ఉపన్యసించాడు .1850లో ‘’రిప్రేసెంటటివ్ మాన్ ‘’ను రాసి ప్రచురించాడు .అనేక సంస్థలకు, ఆపదలో ఉన్న వారికి ఎందరికో ఆర్ధిక సహాయం చేశాడు .
అమెరికా జాతీయ కవి ‘’వాల్ట్ విట్మన్ ‘’రాసిన కవితా సంపుటి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’చదివి అబ్బురపడి ‘’I give you joy of your free and brave thought ‘’అని మనసారా మెచ్చుకొన్నాడు .1856లో ‘’ఉపనిషత్తులు ‘’అన్నీ చదివి జీర్ణించుకొన్నాడు .పెర్షియన్ అరెబిక్ కవిత్వాన్ని అందులో ‘’హేబిజ్ ‘’కవిత్వాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .1860లో ‘’వాల్ట్ విట్మన్ ‘’కవిని కలిశాడు .అనేక ప్రదేశాలలో అనేక సందర్భాలలో ఎమర్సన్ మహా ప్రేరణ పూర్వక ఉపన్యాసాలు చేసి జాతిని చైతన్యం చేశాడు .1862లో మిత్రుడు ‘’దోరో ‘’టి బి తో మరణించాడు .అతన్ని కీర్తిస్తూ ‘’the country knows not yet ,or in the least part ,how great a son it has lost ‘’ అని వాపోయాడు .కెనడా ,మిడ్ వెస్ట్ ,నార్త్ వెస్ట్ దేశాలన్నీ తిరిగి ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశాడు .’’బోర్డ్ ఆఫ్ విజిటర్స్ టు దిమిలిటరీ అకాడెమి ‘’కి ప్రభుత్వం ఆహ్వానించింది .అందులో1863లో ‘’ఫార్ట్యూన్ ఆఫ్ రిపబ్లిక్ ‘’పై ఉపన్యసించాడు .1864లో ఎమర్సన్ ను ‘’అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ ‘’కు ఎంపిక చేసింది ప్రభుత్వం .’’ది గులిస్తాన్ ‘’ప్రచురించాడు .మంచి స్నేహితుడు ‘’నతానియాల్ హతారన్ ‘’రచయిత హఠాత్తుగా మరణించాడు .దీనికి చింతిస్తూ ‘’the painful solitude of the man which I suppose could not longer be enduced and he died of it .’’అని అందరూ తనను ఒంటరి వాడిని చేసి వెళ్లి పోతున్నారని వ్యధ చెందాడు వేదాంతి ఎమర్సన్ .
‘’ ఫిసాలఫీ ఆఫ్ దిపీపుల్ ‘’అనే విషయం పై చిరస్మరణీయ ప్రసంగం చేశాడు .1868లో ‘’ఎమ్మా లాజరస్ ‘’అనే 19ఏళ్ళ అమ్మాయి రాసిన కవిత చదివి ,ముచ్చటపడి అభినందించి ఆ అమ్మాయితో ప్రోత్సాహకరం గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .’’కొటేషన్ అండ్ ఒరిజినాలిటి ‘’పై గొప్ప ప్రసంగం చేశాడు .జీవితకాలం లో 300పైగా ఉపన్యాసాలిచ్చిన మహా వక్త ,ఉపన్యాసకుడు ఎమర్సన్ .తనకభిమానులైన షేక్స్ పియర్ ,విలియం బ్లేక్ ,మిల్టన్ ,చాసర్ లపై లెక్క లేనన్ని ప్రసంగాలు చేశాడు .1870లో ‘’సొసైటీ అండ్ సాలిట్యూడ్ ‘’గ్రంధం ప్రచురించాడు .’’నేచురల్ హిస్టరీ ఆఫ్ ఇంటలేక్ట్’’పై స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు . 1872లో లండన్ పర్యటించి రస్సెల్ వగైరా లతో పరిచయం ఏర్పరచుకొన్నాడు .ఈజిప్ట్ వగైరా దేశాలు తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .1873లో స్టువార్ట్ మిల్ ,బ్రౌనింగ్ కవులతో భేటీ చేసి భావ వినిమయం చేశాడు .ఆల్డస్ హక్స్లీ ,జాన్ రస్కిన్ లతో సమావేశామైనాడు .
ఎమర్సన్ 1874లో అమెరికా వెళ్లి అక్కడ తన రచన ‘’పార్నాస్సస్ ‘’ప్రచురించాడు .1876లో ‘’ సెలక్టెడ్ పోయెమ్స్ ‘’అచ్చు వేశాడు 1877-81.మధ్య మతి మరుపు వచ్చి ఇబ్బంది పడ్డాడు ఆ మహా మేధావి వక్తా .1882లో ఎమర్సన్ మరో ముఖ్య మిత్రకవి ‘’లాంగ్ ఫెలో ‘’మరణించాడు .చూడటానికి వెళ్ళిన ఎమర్సన్ ‘’where are we? what house? who is the sleeper ?’’అని అడిగితె చూసిన వాళ్ళు ఎమర్షన్ తీవ్ర మరపురాని తానాన్ని గుర్తించి మహా మేదావికా మరపు? అని కన్నీళ్లు పెట్టుకొన్నారు ఈ వ్యాధినే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ ‘అంటున్నారు ..అంతగా ఆయన జ్ఞాపక శక్తి క్షీణించింది .79సంవత్సరాల సుదీర్ఘ జీవన యానం సాగించిన మహామేధావి ,స్పూర్తిదాత ,ఎమర్సన్1882ఏప్రిల్ 27న స్వంత ఇంట్లోనే మహాభి నిష్క్రమణం చేశాడు .తన జ్ఞాపకాలను కాలం తెర పై లిఖించి జీవితం చాలించిన మహాకవి ,రచయిత ,వేదాంతి తత్వ వేత్త ,దార్శనికుడు విమర్శకుడు ఎమర్సన్ .
ఎమర్సన్ కు బాటని ,జియాలజీ సబ్జేక్ట్ లు మహా ఇష్టం .గ్రీకు వేదాంత శాస్త్రం ,పెర్శియంకవిత్వం పై ఆయనకు అధారిటి ఉంది .ఎమర్సన్ రచనలలో ‘’intellectual breadth and a challenging continuing modernity ‘’ఉండి’’unique among American poets of his time ‘’అని పించుకొన్నాడు .ఎమర్సన్ అంటే ‘’incomparable intelligence –mystical private meditative sides of one of the greatest of all American writers ..’’న్యూ ఇంగ్లాండ్ అని పిలువబడే మాసా చూసేట్స్ రాష్ట్రం పై ఆయనకున్న నిశిత పరిశీలన అనితర సాధ్యమైనది .దాని లాండ్ స్కేప్ లపైన ఆయన దృష్టిని ‘’closed observation of the New England ‘ s landscape with far reaching spiritual explorations ‘’అని శ్లాఘించారు విశ్లేషకులు .
ఎమర్సన్ కవితా విలువల గురించి తరువాత తెలుసు కొందాం .
సశేషం
28-10-2002సోమవారం నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-14-ఉయ్యూరు