అమెరికాలోశ్రీ శంకర జయంతి
శ్రీ శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి -4-5-2014ఆదివారం సందర్భం గా అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరం లో మా అల్లుడు ఛి కోమలి సాంబావధాని తమ ఇంటిలో శాస్త్రోక్తం గా 3-5-14శనివారం ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకం శ్రీ శంకర స్తుతి ,శంకర స్తోత్రపారాయణం ,శ్రీ శంకరాచార్యుల అష్టోత్తరపూజ మొదలైన కార్య క్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను .మనం మరచి పోతున్న మన విలువలను, సంస్కృతిని అక్కడ అమెరికాలో పాటిస్తూ నిలబెట్టుతూ ,వ్యాపింప జేస్తున్నందుకు అతనికి సహకరిస్తున్న వారికి ,ఈ కార్యక్రమం లో పాల్గొని తమ వంతు ధర్మాన్ని నిర్వహిస్తున్న వారందరికీ సరసభారతి తరఫున ,మా కుటుంబం తరఫునా హృదయ పూర్వక అభినందనలు అంద జేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయ వంతం అవ్వాలని ,ప్రతి ఏడాది శ్రీ శంకర జయంతిని ఇలాగే ఘనం గా అక్కడ నిర్వహిస్తూ ఆదర్శం గా నిలవాలని ,ఆర్ష ధర్మ ప్రచారానికి ఇదొక మార్గమని ,సంస్కృతీ పరి రక్షణకు ఇది వేదిక కావాలని ఆ కాంక్షిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు