శ్రీవాణి పలుకులో ఆ బాల గోపాలం
మా కంభం పాటి మంగళ గిరి శాస్త్రి హెడ్ మాస్టారి అబ్బాయి ,ఉయ్యూరు స్టేట్ బాంక్ లో పనిచేసి అందరి అచేత ‘’మణ్యం ‘అని ఆప్యాయంగా పిలిపించుకొంటు స్నేహితుల్తో కలిసి ‘’ఫిల్మ్ క్లబ్ ‘’ను ఉయ్యూరులో స్థాపించి మమ్మల్ని సభ్యులుగా చేర్చి ‘’అంకూర్ ,చోమన దడి’’ మొదలైన అనేక మంచి సినిమాలను నెలకొకటి వేస్తూ చూపిస్తూ నస్తాల్లోను చెరగని ధైర్యం తో కోన సాగించి ఆర్ట్ ఫిలిం విలువను తెలియ బరచి మా మిత్రులు ఆంజనేయ శాస్త్రి కాంతారావు ,సూపర్వైజర్ పూర్ణ చంద్ర రావు హిందీ మేష్టారు రామారావు ,మీసాల రెడ్డిగారు లతో సాన్నిహిత్యాన్ని పొంది వాళ్ళ నాన్నగారి బృందం తో మాతో వాలీబాల్, బాద్మింటన్ సాయంవేళ ఉయ్యూరు కాలేజిగ్రౌన్డ్స్ లో ఆడిస్తూ ఆడుతూ మా అబ్బాయి రమణకు ముఖ్య స్నేహితుడైన మా ఇంటి దగ్గరే ఇల్లు కట్టుకొని బదిలీపై విశాఖ చేరి న శ్రీ సుబ్రహ్మణ్యం ఈ రోజు విశాఖ నుండి ఉయ్యూరు ఏదో పని మీద వచ్చి విశాఖలో రాచకొండ శర్మ గారు తన మామగారికిచ్చిన ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’చూసి ఆ పుస్తకం ఒక కాపీ ఉంటె ఇవ్వమని కోరి, వాటితో బాటు సరస భారతి ప్రచురించిన పుస్తకాలు నేను ఇవ్వగా తీసుకొని ,ఇంకెవరికైనా ఇవ్వండి అని ఇచ్చిన మరికొన్ని పుస్తకాలు అందుకొని తను తెచ్చిన ‘’సుపద ‘’ద్విమాస పత్రికను ‘’శ్రీ వాణి పలుకు ‘’’మార్చి నెల ప్రారంభ సంచికను నాకు అందజేసి ‘’పలుకు ‘’పై అభిప్రాయాన్ని పలకమని కోరి వెళ్ళారు .ఆ పనే ఇప్పుడు చేస్తున్నాను .సుపద ను ఇదివరకే ఆయన నాకు పరిచయం చేయగా రెండు మూడేళ్ళు తెప్పించి మానేశాను .
సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆశీస్సులతో వెలువడిన ప్రారంభ సంచిక ఇది .62పేజీలతో కేవలం 20రూపాయల వెలకు ఆబాల గోపాలాన్ని అలరించే ఉద్దేశ్యం తో ప్రారంభమైంది .దీనికి మణ్యం దంపతులు వ్యవస్థాపకులు .బహుశా వారబ్బాయే ననుకొంటా ‘’మూర్తి’’ నిర్వాహకులు . ముచ్చటైన ముఖ చిత్రం తో రంగుల హంగుతో పత్రిక బాగుంది .మాతృభాషా బాల సాహిత్యాల పట్ల మమకారం తో ను వైజ్ఞానిక విషయాలు అందించాలని, పిల్లల ఊహా శక్తికి నిదర్శనం గా ,బాలసాహిత్యం లో చేయి తిరిగిన ‘’పూర్వ అపూర్వ రచయితల’’ రచలను చేరుస్తూ ఆ సాహిత్యం పై ఏంతో కృషి చేసిన కో .కు .కు, చక్రపాణికి అంకితమిచ్చి మంచిపనే చేశారు .పదమూడు కధలతో ,మూడు గేయాలు పాటలతో లెక్కల చమక్కులు ,వేద గణితం తో, ప్రముఖుల స్మరణ తో నవ్వుకుందాం అని పిలిచి నవ్విన్చేట్లు చేసిన జోకులతో సుభాషితం, మాటల పల్లకి ,సుడోకు బొమ్మల రామాయణం తో, సైన్స్ ప్రాజెక్ట్ ను జోడించి వైవిధ్యాన్ని సాధించారు .అల్లరి పద్యం తో సరదానూ చేశారు .
దేవుడే అందరి కంటే గొప్ప శిల్పిఅని మహాశిల్పి బిరుదు ఆయనకే దక్కుతుందని వినయం గా చెప్పిన శిల్పి కద బాగుంది .దెయ్యాలలోను మంచి చెడు ఉన్నాయని, ఇంటిని పట్టించుకోకుండా తిరిగే క్రీడాకారుల జీవితంలోని నరకాన్ని గురించి చెప్పిన కధలు అవసరమైనవే .రెండు విక్రమార్క కధలు ఉత్సాహాన్నిస్తాయి .రామానుజం తాళ్ళపాక తిమ్మక్క ధ్రువుడు లలో ఆధునిక ,పూర్వ ,పురాణ విషయాలు తెలుసుకో తగ్గవి .బుద్ధుని జీవితకాలపు స్వయం శక్తి కద స్వయం నిర్ణయం మహోపకారం చేస్తుందని రుజువు చేసింది .చదువుల తల్లి సరస్వతీ దేవి మాట గా ‘’శ్రీవాణి పలుకు ‘’వెలువడటం ఆర్షభావ పరంపరకు , సంస్కృతీ సంపన్నతకు నిదర్శనం .అచ్చుతప్పులు పెద్దగా లేకుండా ఏంతో జాగ్రత్తగా తెచ్చినందుకు అభినందనలు .
ఈ ప్రయత్నం ప్రతి నెలా ఫలించి మరింత వినూత్న సమాచారం తో ప్రాచీనతను ఆధునికతను మేళవించి ప్రతి సంచికా వెలువడాలని ,వారు ఆశించి నట్లు ‘ఆబాల గోపాలాన్ని ‘’ఆ బాల గోపాలుని ‘’ఆశీస్సులతో అలరించాలని ,పత్రికా నిర్వహణ కష్టమే అయినా ధైర్యం తో ముందుకొచ్చిన మూర్తి గారిని, సత్యనారాయణ గారిని వారి వెనక ఉన్న మణ్యం దంపతులను ఆశీర్వ దిస్తున్నాను .
‘’శ్రీ వాణి పలుకు ‘’మాస పత్రిక విశాఖ దగ్గరున్న భీముని పట్నం నుండి వెలువడుతోంది .అభిరుచి ఉన్న వారు ఈ కింది చిరు నామా వారిని సంప్రదించ వచ్చు .
Editor –sreevani paluku ‘’10-37-140 –ananda vanam –back of bank colony –bheemuni patnam –vishakha patnam -521163
Email –sreevanipaluku @gmail.com
గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు