చిన్న బుష్ ది పెద్ద చరిత్రే
Ambling into history ‘’అనే పేరు తో ఫ్రాంక్ బ్రూని అనే జర్నలిస్ట్ అమెరికా ప్రెసిడెంట్ సీనియర్ బుష్ కుమారుడు అమెరికా ప్రేసిడెంటూ అయిన జార్జి డబ్ల్యు బుష్ జీఎవితం పై రాసిన పుస్తకం చదివాను ఎన్నో మనకు తెలీని ఆసక్తికర విషయాలు అందులో ఉన్నాయి వాటినే తెలియ జేస్తున్నాను .దీనిని ‘’the unlikely odyssey of George W Bush ‘’అన్నారు .
తడబడుతూ అడుగు లేసిన బుష్ చివరికి 9/11సంఘటన వల్లగొప్పగా ఎదిగాడు .పరిస్తితులను తన చేతిలోకి తీసుకొన్నాడు దానికి అవసరమైన విధానం లో స్పందించి పని చేశాడు ,పెరిగాడు కూడా .ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కొడుకు మళ్ళీ ప్రెసిడెంట్ అవటం వీల్లతోనే ప్రారంభమైనట్లు అని పిస్తుంది .స్కూలు కాలేజీ చదువుల్లో బుష్ ది సాధారణ ప్రతిభ మాత్రమె .ఇంగ్లీష్ లో కొన్ని ఆటలను సరిగ్గా ఉచ్చరించాతమూ రాదు చిన్న బుష్ కు .ఒకదానికొకటి చెప్పి తను కన్ఫ్యూజ్ అయి ఇతరుల్ని చేయటం అతనికి అలవాటే .అయినా సందర్భాన్ని బట్టి ఒక మంత్రం లాంటి వాక్యాన్ని ఉపయోగించి ప్రజల్ని ముగ్ధుల్ని చేశాడు .ఫ్రాంక్ బ్రూని ఆనే విలేకరి ‘’న్యూయార్క్ టైమ్స్ ‘’ప్రతినిధి .బుష్ ఎలక్షన్ ప్రచారాన్ని చాలా దగ్గర గా ఉండి కవర్ చేశాడు మీడి యాలో .అతని భాషలోనే ‘’it is an unimaginable honour to represent the great people of this country ‘’అని ప్రచారం లో చాలా వినయం గా చెప్పేవాడట బుష్ .బుష్ కు ఫ్రాంక్ 9/11సమయం లో కమ్మ్యూనికేషన్ ఇంచార్జి ,కమాండర్ ఇన్ చార్జి కంఫోర్తర్ ఇంచార్జి ‘’గా వ్యవహరించాడు .’’the country will define our times ,not be defined by them ‘’అని అంటాడు .
ఒ.నీల్ అనే విశ్లేషకుడు ‘’we have a situation lie this that really requires and a domestic leader ‘’అన్నాడు బుష్ నిజం గానే అలా ప్రవర్తించాడు .బుష్ ప్రపంచ రంగస్థలాన్ని కమాండ్ చేశాడని పొగిడాడు .తనదైన శాలి నాయకత్వం తో దీన్ని బుష్ సాధించాడు .మనసుకు పట్టే ‘’కాప్టి వేటింగ్’’వాక్యాలను వాడి ప్రజలకు చేరువైనాడు .’’America has never been proven by cities of gold ,but by citizens of character ‘’అణా వాక్యం తో ప్రత్యర్ధులకు మాటల కొరడా దెబ్బల రుచి చూపించాడు .దీనికి కారణం 1988లోనే ‘’బుడ్డ బుష్ ‘’తాగుడు మానేశాడు .ఆ సమయం లో తండ్రి సీనియర్ బుష్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు .కుటుంబం అంతా చాలా మంచి ప్రవర్తన తో ప్రజల్ని ఆకర్షించి తండ్రికి ఎక్కువ ఓట్లు పడేట్లు చేశారు అప్పుడే అప్పటిదాకా పచ్చి తాగు బాటుగా ఉన్న చిన్న బుష్ తాగుడు పూర్తిగా మానేసి మాట నిలబెట్టుకొని తండ్రి హృదయానికి దగ్గరయ్యాడు ప్రాజభిమానాన్ని సంపాదించాడు .ఇప్పటికీ బుష్ కుటుంబం లో చక్కని’’ ఫామిలీ ఎట్మాస్ ఫియర్ ‘’ఉంటుంది .మన చంద్ర బాబు లాగా ‘’this is responsible era’’అన్నాడు బుష్ .
‘’the great challenge for America is to make sure the American dream touches every willing heart ‘’అన్న వాక్యం అమోఘ మంత్రం ళా ప్రజలపై పని చేసిన్దాంటాడు రచయితా .’’Bushes were indeed an exemplary family with values to respect and emulate ‘’అని కీర్తించాడు బుష్ ఇంట్లో ఎప్పుడూ ఇంకో ఫామిలీ మెంబర్ గురించి చక్కగా మంచిగా మాట్లాడుకొంతారట .’’who cheat on their wives will cheat their country ‘’అనే వాడట బుష్ .’’Bushness itself was proof of civic righteousness ,of the impossibility of wrong doing ‘’అని రచయితా భావించాడు .ఎక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా బుష్ తన స్వంత ఈకల దిండు ,పరుపు వెంట తీసుకొని వెళ్ళే వాడట .అందుకే కస్టపడి పైకి రాగలిగి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు బుష్ అని ముగిస్తాడు జర్నలిస్ట్ బ్రూని .
కాన్రాడ్
అమెరకా రచయిత కాన్రాడ్ రిచెర్ పై ఎడ్విన్ జి గాస్టన్ రాసిన పుస్తకం ఆద్యంతం ఆకర్షణీయం గా ఉంది .కాన్రాడ్ చాలా మృదు స్వభావం ,ప్రశాంత చిత్తం ఉన్న రచయిత .ఆరిజోనా రాష్ట్రం లో పుట్టాడు. అది 1913లో 48వ రాష్ట్రం గా యూనియన్ లో చేరింది .’’దిసీ ఆఫ్ గ్రాస్ ,’’ది ట్రీస్’’’’ది టౌన్ ‘’నవలలను 1945-50 మధ్య కాన్రాడ్ రాశాడు .అతని రచనలన్నీ వేదాంత భావన ,శాస్త్రీయ ద్రుక్పదాలతో ఉంటాయి .తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’ఆన్న పేరుతో రాశాడు .ఒకే భార్య తో జీవితాంతం కాపురం చేసిన దాదాపు ఏకైక అమెరికన్ రచయిత కాన్రాడ్ .అందరి మన్ననలూ పొందిన రచయిత .కాన్రాడ్ జీవితం లోని అన్ని ఘట్టాలను రచయిత గాస్టన్ గొప్పగా ఆవిష్కరించాడు .మొదటి పేజీ నుంచి చివరిపేజీ దాకా ఏ పేజీని వదలకుండా చదివించిన పుస్తకం .లోతైన విశ్లేషకుడు మేధావి కాన్రాడ్ అని తెలిసింది .
31-10-2002గురువారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మే డే శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-14-ఉయ్యూరు