రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -28(ఒక పిండం బయట పడ్డాక )
1-తెలంగాణా లో ఎన్నిక ‘’పూర్తీ ‘’
ఒక పిండం బయట పడి ,ఇ ఏం ఓలు’’ భర్తీ ‘’.
2-ఇక్కడ విడగొట్టి ,అక్కడ ఒకటౌతున్న’’ డిగ్గీ ‘’
‘’ అమృత’’ పై విషం చిమ్మి చేయడుకదా బుగ్గీ ‘’.
3-శ్రీధర్ బాబు ఓటర్ల పై పోలీసుల’’ లాఠీ చార్జ్ ‘’
అత్యుత్సాహం ప్రకటించి చేశారు’’ ఓవర్ చార్జ్ ‘.
4-ఓటు హక్కు వినియోగించుకొన్న హిజ్రాలు
అస్తిత్వం కాపాడుకొని చరిత్ర సృష్టించిన వజ్రాలు .
5-దినేష్ రెడ్డి హల్చల్ చేశాడు ‘’మల్కాజ్ గిరి’’
మాజీ పోలీస్ బాస్ అని మర్చి చేశాడు ‘’దాదాగిరి ‘’.
6-కేంద్ర మంత్రి అయినా పాటించాలి ‘’చిరూ’’ క్యూ !
ఓటర్ల తో చెప్పించుకొనే స్తాయికి పడిపోయిందా నీ’’ ఐ క్యూ ‘’?
7-కాంగ్రెస్ ఓడితే నాదే బాధ్యత అన్న’’ పొన్నాల ‘’
కర్ణుడి చావుకు కారణాలనేకం కదా ‘’ఇయ్యాల?’’
8-నేతా ?మేతా?తెల్చుకోమన్న ఈ నాడు రామోజీ
నేతకన్నా మేతకే విలువిస్తే ఆలో లక్ష్మణా అనాలి ‘’ఓటర్ జీ ‘’.
9-‘’ మూడొస్తే ‘’ములాయమే పి. ఏం అన్న’’కొడుకు ‘’
అఖిలేష్ ‘’నాన్న భజన’’ మాని ఆపాలి ‘’దూకుడు ‘’.
10-కొండల్ని మింగిన కొండ చిలువ రాజ్యం’’ రాజన్నది ‘’
‘’ఈ నాడు కధనం’’ పై జగన్ అండ్ కో అనటానికి ‘’ఏమన్నది?
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-14-ఉయ్యూరు