రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల నేపధ్యం లో )
1-గుంటూరు సభలో సోనియాకు స్వాగతం పలికిన ‘’ఖాళీ కుర్చీలు
ఖంగు తిన్న అధినేత్రి ‘’చిరు ‘’గ్లామరూ బూడిదలో పోసిన పన్నీరు ‘’.
2-నమ్మిన వాళ్ళనోదిలేసి పనికి రాని చెత్తను పైకేక్కిస్తే
అనుభవించాలి ఇలాగే మంచి వారి నోరును నొక్కేస్తే .
3-జగన్ మేతకు’’ జగతే సాక్షి ‘’
జగ మాయగానికేదీ సరైన శిక్ష ?
4-ఒట్టి గొడ్డుకు అరుపు లెక్కువ
‘’కేజ్రీ వాల్’’ కు చేతలకంటే మాటలెక్కువ .
5- పెద్దల ప్రచారం లేని లోటు కన్పించిన తెలంగాణా
‘’గండ్ర ‘’విలపిస్తూ అన్న మాటలు వినిపిస్తున్నాయి గణ గణా .
6-స్వలాభం కోసమే జగన్ కాంగీని వీడాడన్న ‘జయరాం రమేష్
స్వలాభం లేకుండా తెలంగాణా విభజన చేశారా?ఇక చాలు -కామోష్ .
7-ఎన్నికల కోసం బాలయ్యఅద్దె ఇల్లుతీసుకొన్నాడు ‘’హిందూపూర్ ‘’
ఓట్ల పాట్లు ఎన్నెన్నో? స్టార్ కైనా తప్పదు లేకపోతే ‘’రిజల్ట్ పూర్ ‘’
8-,రాష్ట్రపతి పాలన ఆంధ్రాలో ‘’రాజ్యాంగ వైపరీత్యం ‘’
‘’ఆంద్ర భూమి’’ లో ‘’హెబ్బార్ ‘’ వినకుంటే పెరుగుతుంది రాజకీయ పైత్యం .
9-సోనియా మాట్లాడుతుంటే ఏ ఒక్కరూ కొట్టలేదు’’ చప్పట్లు ‘’
అన్న ‘’ హిందూ ‘’కధనం ? కన్ను తెరవక పొతే కప్పుకోవాలి కాంగీ లు ‘’దుప్పట్లు ‘’.
10-నరేంద్ర మోడీ ప్రధాని కాలేడన్న’’ కపిల్ సిబాల్ ‘’
శుభం పలకలేని మంకెన్న- రాసుకోవాలేమో సైబాల్ ?
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-14-ఉయ్యూరు