పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19
పవిత్రులు –రంద్రాన్వేషకులు
ఇంగ్లాండ్ లో మొదటి చార్లెస్ రాజుకు నియంత క్రూరుడు అయిన క్రాం వెల్ కు మద్య జరిగిన పోరాటం ఇంగ్లాండ్ లో ప్రతి మూలా జరిగింది .1629-నుండి 1640దాకా పదకొండు ఏళ్ళు సాగిన ఈ విద్వేషాగ్ని దేశం లో పార్ల మెంటే లేకుండాను ,మరో పదకొండేళ్ళు1649-60 రాజే లేకుండాను పరిపాలన చేసింది . న్యూ కామన్ వెల్త్లే ఫ్రీ స్టేట్ ఎలా ఉన్నా బాగా ప్రాచుర్యం పొందింది .దేవుడే తన తో చేయిస్తున్నాడని క్రూరం గా నిర్దాక్షిణ్యం గా మానవ మారణ కాండచేసి క్రూర నియంత గా పాలించిన క్రాం వెల్ చివరికి సహచారులే అసాహ్యించుకొనే స్తితిని తెచ్చుకొన్నాడు .ప్రజలు ఈ నిత్య బాధ భరించలేక సుపరిపాలన కోసం మంచి రాజు కోసం నిరీక్షిస్తున్నారు .ప్రవాసం లో ఉన్న రెండవ చార్లెస్ ను అభిషిక్తుడిని చేశారు .ఈ దశ లో దేశం అంతా రాజకీయం గా ,మత పరం గా విడి పోయింది .దీని ప్రభావం సాహిత్యం మీదా పడింది .ఉత్సాహం,మానవ ద్వేషం (enthusiasm and cynism )ల మధ్య ఊగి పోయింది ప్యూరిటన్లు అనే రంద్రాన్వేషక కవులు (puritans so called caviliar poets)హుషారైన కవితలు రాసి ఊగిపోయారు .బెన్ జాన్సన్ ప్రభావం వీరిమీడా ఇంకా ఉంది .లాటిన్ నుండి విషయాన్ని భావాల్ని అరువు తెక్చుకొని రాయటం లో విజ్రుమ్భించారు .అలాంటి ప్యూరిటన్ కవులలో ఆండ్రూ మార్వేల్,ధామస్ కేర్ రాబర్ట్ హీర్రిక్ ,ఎడ్మండ్ వాలేర్ ,జాన్ సక్లింగ్ ,రిచార్డ్ లవ్ లెస్ ఉన్నారు .ఇప్పుడు వీరి గురించే తెలుసుకో బోతున్నాం .
ఆండ్రూ మార్వేల్
ఆండ్రూ మార్వేల్ ప్యూరిటన్ మాత్రామే కాదు కవిలియర్ కూడా .31-3-1621లో పుట్టి 16-8-1678లో చనిపోయాడు .జీవితం అంతా వైరుధ్యమే .ప్యూరిటన్ కవులలో అగ్రగామి .కాని సహచరులు కేవిలియర్ గా ఇష్టపడ్డారు .మొదటి చార్లెస్ పై పై సాను భూతి ఉన్నది . క్రాం వెల్ సెక్రటరీగా మిల్టన్ ఉన్నప్పుడు ఇతను మిల్టన్ కు అసిస్టంట్ గా ఉన్నాడు .మార్వేల్ ‘’రాక్షకుడి ‘’ని ను సీజర్ తో పోలుస్తూ వొద్ రాశాడు .క్రాం వెల్ చచ్చిన తర్వాత అబ్బే లో అతని అంత్యక్రియలకు హాజరైనాడు .రెండేళ్ళ తర్వాతా ‘’రేస్తోరేషన్ పార్ల మెంట్ ‘’లో సభ్యుడయ్యాడు .ఈ పార్లమెంట్ క్రాం వెల్ సమాధిని తవ్వి పారేసి తలను నరికి అవమాన పరచిన సభలో ఉన్నాడు .ప్రజలకు దగ్గరగా ఉండేవాడు .దీనికోసం దేని నైనా భరించేవాడు .
హాల్ దగ్గర విన్స్తేడ్ లో పుట్టాడు తండ్రి దగ్గరే చదివాడు. ట్రినిటి కాలేజి లో చదివి బి ఏ సాధించాడు .తర్వాతా విరుద్ధ భావాల తో పని చేశాడు .గట్టి రాయలిస్ట్ గా ఉంటూనే పార్ల మెంట్ ను సమర్ధించే వాడు .మిల్టన్ బంధువు సిరియాక్ స్కిన్నార్ డబ్బు తో ఆదుకొనే వాడు .మిల్టన్ కు పరిచయం చేశాడు .క్రాం వెల్ సైన్కాదికారి అయిన లార్డ్ ఫెయిర్ ఫాక్స్ కూతురుకు కు ట్యూటర్ గా ఉన్నాడు .క్రాం వెల్ దుస్ట చేష్టలకు విసిగి వేసారి యార్క్ షైర్ లోని ‘’నన్ ఆప్పిల్ టన్ ‘’కు వెళ్ళిన ఫైర్ ఫాక్స్ తో మార్వేల్ తానూ వెళ్ళాడు .అక్కడే కవిత్వం రాయటం ప్రారంభించాడు .దీన్ని ‘’గార్డెన్ పోయిట్రీ’’అన్నారు .అందరూ ఆదరించి మెచ్చుకొన్నారు .ముప్ఫై అయిదేళ్లకు క్రాం వెల్ వార్డ్ కు ట్యూటర్ అయ్యాడు .తర్వాత మిల్టన్ అసిస్టంట్ట్ అయి, రాయలిస్ట్ లు మిల్టన్ ప్రాసిక్యూట్ చేసినప్పుడు అతన్ని సమర్ధించాడు .క్రాం వెల్ ను సమర్ధించినా చార్లెస్ రాజుకు దగ్గర కాలేక పోయాడు .ఇద్దరి స్వభావాలను బేరీజు వేశాడు .క్రాం వెల్ సమర్ధుడు ,పాలకుడు ,విధి చేతి కీలు బొమ్మ అనుకొన్నాడు చార్లెస్ పవిత్రుడు వివేకం ఉన్న సమర్ధుడు మత ధర్మం తెలిసిన వాడు అని తేల్చుకొనిసివిల్ యుద్ధం గొప్ప విపత్తు తెచ్చిందని భావించాడు .పార్ల మెంట్ మళ్ళీ బతికి బట్ట కట్టిన తర్వాతా మెంబర్ అయ్యాడు .సాదు స్వభావి .అయినా రాస్తే మాత్రం నిప్పులు చేరుగుతాడు .రాజకీయ వ్యంగ్యాత్మక రచనలు చేసి అందర్నీ కడిగి పారేసే వాడు .పారడీ ని పండించాడు .చార్లెస్ శైలిని ఒక ఉపన్యాసం లో పారడీ గా రాసి అందరి దృష్టీ ఆకర్షించాడు .చార్లెస్ ఇంటి వ్యవహారాలూ వివాహేతర సంబంధాలు అన్నిటిని దూది ఎకి నట్లు ఎకేశాడు .రాజు చదివి నవ్వుకొన్నాడు .’’లాస్ట్ ఇంస్త్రక్షన్స్ టు ఏ ప్రింటర్ ‘’లో చార్లెస్ ఉద్యోగుల అవినీతిని డచ్ స్త్రీలతో శృంగారాన్ని తెలియ జెప్పాడు .ప్రబుత్వ ఉద్యోగం ఊదదీయలేదు పబ్లిక్ సర్వెంట్ గా నే యాభై ఎనిమిదవ ఏట చని పోయే దాకా ఉన్నాడు .
విరుద్ధత మార్వేల్ ప్రత్యేకత .’’his verse is both worldly and detached from the world .,classical ,and yet colloquial rhetorical yet eminently reasonable ‘’అతని ఒప్ప కవిత ‘’to his coy mistress ‘’.అతని కవితలో ‘thou by the Indian Ganges side ‘’అని భారత దేశాన్ని పవిత్ర గంగా నదిని అందులో చేర్చాడు .ఇర్వి ఏళ్ళు పార్ల మెంట్ లో మెంబర్ గా ఉంది తన మేధావి తనాన్ని దేశానికి ఉపయోగిమ్చేట్లు చేశాడు .అతని సమాధి పై ‘’the grave is fine private place . But none I think do there embrace’’అని అతని కవితా పంక్తుల్నే రాశారు .’’marvel;s style is more than a technical accomplishment or the vocabulary and sintaaxof an epoch it is what we have designated tentatively as wit a tough reasonableness beneath the lyric grace ‘’అన్నాడు టి ఎస్.ఇలియట్ .’’it is difference between intellectual poet and the reflective poet ‘’అని భావిస్తూ ఈ ట్రెండ్ వలన సాంప్రదాయానికి ఆత్మ అంతఃకరణ సంబంధం పెరిగిందని ,దాని వలన కొత్త బలమైన శిల్పం శైలీ విన్యాసం భావం లో విధానం లో వచ్చి బైబిల్ కు క్లాసికల్ రచనకు కవిత్వం దూరమై కొత్త పోకడలు పోయింది అన్నారు .కవిగా కంటే వచన రచయిత గా మంచి పేరు పొందాడు .
సశేషం
శ్రీ దేవర్షి నారద మహర్షి జయంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-14-ఉయ్యూరు