పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20
కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్
కొంటెతనం చిలిపిదనం తో తన తరాన్ని ప్రభావితం చేసిన రాబర్ట్ హీర్రిక్ వాజ్రాల నగిషీ చేసే కంసాలి కుటుంబం వాడు .లండన్ లో 1591లో పుట్టి కుల వ్రుత్తి లో రాణించాడు .కవితలనూ వజ్రాల్లాగానే సాన బట్టిమేరుగులు తీర్చటం అలవాటైంది .అందుకే కవితలు ధగ దగా కాంతితో మిరు మిట్లు గొలుపుతాయి .పదహారవ ఏటఉంగరాలను అద్భుతం గా తయారు చేసే నేర్పున్న బాబాయి పనికి అప్రెంటిస్ గా ఉన్నాడు .చదువు సంగతి తెలియదు . కేంబ్రిడ్జి లో రెండేళ్ళు చదివాడు .రెండు డిగ్రీలు ట్రినిటి కాలేజి నుంచి పొందాడు .’’లా’’చదవాలని కోరిక ఉండేదట .చదివి ఉద్ధరించాడో లేదో తెలియదు .
లండన్ చేరి బెన్ జాన్సన్ ముఠా లోచేరాడు .బెన్ ఇతన్ని తన’’ వారసకవి ‘’ అని చెప్పుకొన్నాడు . హీర్రిక్ ను అందరూ ‘’జాన్సన్ కొడుకు ‘’అనే వారు .కవిత్వం రాయటం మొదలేట్టాడు .మొదటి కవిత ‘’ప్రేయర్ టు బెన్ జాన్సన్ ‘’రాశాడు ‘’when I a verse shall make –know I have prayed thee –for old religion’s sake –saint ben to aid me’’అని మొదలు పెట్టి కైమోడ్పు లందించాడు తండ్రికాని తండ్రి కవితకు వారసుడు అయిన హీర్రిక్ .1629లో హుందాగా జీవించటానికి అభిమానులు వికారేజ్ డీన్ ప్రియర్ ‘’ను డేవాన్ షైర్ లో చేశారు. ఇక్కడే మరో పద్ద్దేనిమిదేళ్లున్నాడు .చక్కని ప్రకృతి ప్రశాంత పల్లె వాతావరణం నచ్చాయి .కాని ఎందుకో ఉండాలని పించేదికాదు .ఒక చెరసాలలో ఉన్నానని భావించే వాడు .పెద్దగా స్నేహి తులు యేర్పడ లేదు .గ్రామీణ అనాగరక జనం పై అసహ్య భావం ఏర్పడింది ..దానినే కవితలో ‘’a people currish churlish as the seas –and rude almost as rudest as savages ‘’అని మండి పడ్డాడు .ఒంటరితనం మరీ బాధించింది .ఎటూ పాలు పోనీ స్థితి .
పల్లె ఊసులు అతన్ని ఆ కట్టుకోన్నాయి .అవే ప్రేరణ నిచ్చి కవిత్వం రాయించాయి. గొప్ప పరిశీలన ,ఊహ ఉండటం తో అనేక మూడ్స్ లో ఉండి ‘’బే ఫరవా కవితలు ‘’రాసి పారేశాడు .గ్రామీణ సెమి పాగన్ ఆకర్షించింది .గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నాడు .పెంపుడు జంతువుల్ని బాగా చూసుకొన్నాడు .కొంచెం సేపు ఈ వాతా వరణం విసుగని పించేది .రాసినది అంతా’’ ఇనీసి ఏషన్’’ కోసం వచ్చిన వారిపై విసిరి పారేసి’’ మాన్ ఆఫ్ మూడ్స్’’ అని పించుకొన్నాడు .వాళ్ళు ఇతన్ని అర్ధం చేసుకొని మరింత ప్రేమ చూపారు .ఇతనూ కలిసి పోయాడు .ఈ మట్టి నుంచే మంచి కవిత్వం సృష్టించాడు .ఈ గ్రామీణ జీవితాన్ని నేపధ్యం గా చేసుకొనే అనాకానేక కవితలు సృష్టించాడు .యాభై ఆరో ఏట జీవిక పోయింది .సివిల్ వార్ లో రాజును సమర్ధించాడ ని కామన్ వెల్త్ ఇతని పదవి ఊడ బెరికింది .లండన్ రావటం పెద్ద గా ఇష్టం లేదు .
నోబుల్ నంబర్స్ అని గొప్ప గా చెప్పుకొనే పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు అందులో కొన్ని మంచి కవితే ఉన్నాయి .కవికి ,అతని నిజ జీవితానికి వైవిధ్యం కనీ పిస్తుంది .కవిగా ఒక రకం గా ప్రీస్ట్ గా వేరొక రకం గా వ్యవహరించాడు .అంటే ‘’స్ప్లిట్ పెర్సానాలిటి ‘’అన్న మాట .పదమూడు వందల కవితలు రాశాడు .హుషారు ,ఖుషీ ఉన్నకవి .ఎస్పెరిడేస్ అనే కవితా సంపుటి ప్రసిద్ధి చెందింది .స్విన్ బరన్ కవి హీర్రిక్ ను’’గ్రేటెస్ట్ సాంగ్ రైటర్ ‘ఎవర్ బారన్ ఇన్ ఇంగ్లీష్ రేస్’’’అన్నాడు ..
ధామస్ కారే
అరిస్టాక్రాట్ గా పుట్టి మొదటి చార్లెస్ రాజుతో సహవాసం చేసిన కవి ధామస్ కారే 1595లో పుట్టాడు. చాన్సారి లో మాస్టర్ అని పించుకొని ఆక్స్ ఫర్డ్ మేర్టాన్ కాలేజి లోచేరి పదమూడో ఏట డిగ్రీ పొందాడు .మిడిల్ టెంపుల్ లో పదహారవ ఏట ప్రవేశించాడు .ఇరవై ఏళ్ళ వయసులోపే ఇటలీకి రాయబారి అయ్యాడు .చాలా కాలం తర్వాత ప్రీవీ చేంబర్ లో జెంటిల్ మాన్ హోదా పొందాడు .ముప్ఫై రెండేళ్ళ వయసులో రాజు గారికి ‘’సర్వర్ ‘’అయ్యాడు .కవిత్వం రాశాడు అందులో బాధలూ ,వేదనలు చూపాడు .
హీరోయిక్ కప్లేట్ కవి -ఎడ్మండ్ వాలేర్
3-3-1606లో హెర్ట్ ఫోడ్స్ షైర్ లో లో విలాస వంతమైన ఎస్టేట్ లో ఎడ్మండ్ వాలేర్ పుట్టాడు .బకిం హాం షైర్ లో బీకన్ స్ ఫీల్డ్ లో గొప్ప ఎస్టేట్ కు వారసుడయ్యాడు .కేంబ్రిడ్జి ఈతాన్ కింగ్స్ కాలేజి లో పదహారో ఏట ఏం ఏ పాస్ అయ్యాడు .పార్ల మెంట్ లలో శిక్షణ పొందాడని అంటారు .అధికారం లో ఉండి అసూయ తో అనేక సార్లు ‘’జంప్ జిలాని ‘’గా రాజకీయం మార్చాడు .స్తిరత్వం యేర్పడ లేదు .విధేయత లేకుండానే ప్రతి వెధవ నూ అంటకాగాడు .దగ్గరికి యెంత స్పీడ్ గా చేరే వాడో అంత వేగం గా ఓదిలేసేవాడు.’’trained sychophant ‘’అని పించుకున్నాడు .చార్లెస్ రాజు దగ్గర బాగానే ఉన్నాడు ‘’వాలేర్ ప్లాట్ అని పిలువా బడే కుట్రలో పాలు పంచుకోన్నాడనే నేరం తో అరెస్ట్ అయ్యాడు .టవర్ జైలు కు పంపారు .పది వేల పౌండ్లు ఫైన్ చెల్లించి విడుదలయ్యాడు .రికార్డు కాని ఇంకా ఎన్నో కుట్రాల్లో స్నేహితుల్నీ మోసం చేశాడు .
ప్రొఫెషనల్ కవిగా గొప్ప గౌరవాన్ని పొందాడు .యాభైయో ఏట ‘’పెనిగ్రిక్ టు మై లార్డ్ ప్రోటేకతాక్తర్’’రాశాడు .తర్వాత ‘’ట్రిబ్యూట్ టు ది కింగ్ అపాన్ హిస్ మెజెస్టీ ‘’రాశాడు .ఇరవై ఐదో ఏట ఒకమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు కాని మూడేళ్లకే చని పోయింది .మొదటి పుస్తకం కంటే రెండోది పేలవం గా ఉంది .పెన్ షార్ట్ లో లార్డ్ సిడ్నీ కుటుంబం తో పరిచయం ఏర్పడి లేడీ డరోతీ ని వలచి ఆమె పై ‘’సచ్చరిస్సా ‘’రాశాడు. కాని ఆమె ప్రేమను తిరస్కరించింది .మేరీ బ్రాసీ ని పెళ్ళాడాడు .సమకాలీనులకు దూరం గా అర్దాయుస్సు తో చని పాయిన వారిని గురించి కలవర పడ్డాడు .వారికి భిన్నం గా ఎనభై రెండేళ్ళ దీర్ఘ జీవితాన్ని గడిపి 21-101687మరణించాడు .
పద్దేనిమిదో ఏటనే కవిత్వం రాశాడు .రాజకీయాలలో మునిగి తేలుతూ కూడా మంచికవిత్వమేచేప్పాడు .మెటాఫిజికల్ కవిత్వం వదిలేసి ప్రక్రుతి కవిత్వాన్ని సరాళం గా చెప్పాడు .అతని ‘’హీరోయిక్ కప్లేట్స్’’మహా ఆదరణ పొందాయి .పది హేడవ శతాబ్ది అంతానికి ఇవి బాగా జనం లోకి చొచ్చుకు వెళ్లి ఇంగ్లీష్ కవిత్వాన్ని డామినేట్ చేశాయి .
‘’క్రిబ్బెజ్’’ఆటను కనీ పెట్టిన- జాన్ సక్లింగ్
ఇతని సాహిత్య సహవాసులు గొప్పకవిగా,అతని తో ఆడిన వాళ్ళు తమ నాయకుడిగా జాన్ సక్లింగ్ ను మెచ్చుకొన్నారు .ఆ కాలం లో గొప్ప వేటకాడు జూదగాడు .రెండు వందల ఏళ్ళు సమాజం అతనికి రుణ పడి ఉంది .కారణం ‘’cribbage’’అనే ఆటను కనీ పెట్టింది అతనే .మిడిల్ సెక్స్ లో ట్వికెన్ హాం లో 1-2-1609లో డబ్బున్న కుటుంబం లో పుట్టాడు .కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చదివాడు పదిహేనవ ఏట .మొదటి జేమ్స్ రాజు తండ్రి కి నైట్ హోదా ఇచ్చాడు కాని త్వరలోనే తండ్రి మరణించటం తో ఎంతో విలువైన ఆస్తికి వారసుడయ్యాడు .స్నేహిత బృందం పెద్దది .పందొమ్మిదో ఏట ఎందుకూ పనికి రాని బేవార్సు గా తిరుగు బోతు గా మారిపోయాడు .ఫ్రాన్స్ ,ఇటలీలు చూశాడు. డబ్బు హజం కిందా పైనా కాన నీయ లేదు .జేర్మనిలో గుస్తావాస్ అదోల్ఫాస్ తరఫున యుద్ధం చేశాడు. ఇంగ్లాండ్ తిరిగి వచ్చి ఏదో ఒక పనికి మాలిన సాహస కృత్యాల తో విచ్చల విడిగా డబ్బు దుబారా చేస్తూ గడిపాడు .
ఇరవై ఒకటవ ఏట నైట్ హుడ్ లభించింది .చతుర సంభాషణం ,విచ్చల విడి ప్రవర్తన్ అందర్నీ ఆకర్షించింది .రాజ దర్బారు లో చేరి అందర్నీ ఆకట్టుకొన్నాడు .అతని నాటకం ‘’ఆల్గార ‘’ప్రదర్శించినప్పుడు నటులు వేసుకొనే సాధారణ దుస్తులను వేసుకో నివ్వ లేదు అసలైన జరీ లేసుల్ని ,ఏమ్బ్రాయిదరీలను అసలైన బంగారు వెండి లతో చేయించి వేయించాడు .చార్లెస్ రాజు తో స్కాట్లాండ్ పరిశోధనకు బయల్దేరినపుడు వంద గుర్రాల తో పన్నెండు వేల పౌండ్లు ఖర్చు చేసిఒక దళాన్ని ఏర్పాటు చేశాడు .గుర్రాలకు సింగారం ఆశ్వికులకు అదిరే దుస్తులు స్కార్లెట్ కోట్లు సమకూర్చాడు .ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు. కాని ఒక చిన్న పొరబాటు జరిగింది .ఎరల్ ను బహిష్కరించిన తర్వాత విధేయుడైన స్త్రాఫార్డ్ ను రక్షించే ప్రయత్నం లో విఫలమయ్యాడు .ఇది బయట పడింది .ఫ్రాన్స్ కు పరారయ్యాడు .అక్కడే ముప్ఫై మూడో ఏట చని పోయాడు .తన డబ్బంతా ‘’సక్ ‘’చేసి ఊరందరికీ పెట్టిన సాక్లింగ్ ప్రవాసం లో చావటం విడ్డూరం .ఆత్మ హత్య చేసుకోన్నాడని అంటారు .కాదు అవిధేయుడైన నౌకరు పొడిచి చంపాడని రుజువైంది
నాటక రచయిత గా కొన్నే రాసినా పెద్ద కవితలు చాలా రాశాడు ప్రజలకు దగ్గరవ్వాలనే ధ్యేయం తో తన ‘’అగ్లారా ‘’ను ఒకదాన్ని ట్రాజిక్ గా మరోదాన్ని హాపీ ఎండింగ్ గా సవ్య సాచిత్వం తో రాశాడు .అతాని నాటకాలేవీ బతికి బట్ట కట్ట లేదు .’’సెషన్ ఆఫ్ దిపోఎట్స్ ‘’ను మాత్రం విద్యా వంతులు ఆదరించారు .బెన్ జాన్సన్ కు తనను గురించి ‘’హావ్ యు సీన్ బట్ ఏ బ్రైట్ లిలీ గ్రో’’అని తెలియ జేశాడు అతని’’ బాలడ్ అపాన్ వెడ్డింగ్’’ బాగుంటుంది .సంభాషణా చాతుర్యం తో కవిత నడిపిస్తాడు .
రిచార్డ్ లవ్ లేస్
మొదటి జేమ్స్ వలన నైట్ హుడ్ పొందిన ఒక పెద్ద మనిషి కొడుకే రిచర్డ్ లవ్ లేస్.బంగారు చెంచా ఉన్న నోటి తో పుట్టిన భాగ్య వంతుల బిడ్డ .అందమైన రూపం ,సాహసం లతో రాజాస్థాన ఉద్యోగి అయ్యాడు సక్లింగ్ లా కాకుండా ఎప్పుడూ కస్టాల అంచులలోనే బతికాడు .ఎక్కువ కాల జైలు లోనే గడిపి. కావాలనే 1657లో చచ్చి పోయాడు .
1618లో పూర్వ కేంటిష్ కుటుంబం లో వూల్ విచ్ లో జన్మించాడు .చార్టర్ హౌస్ స్కూల్ లో చదివాడు .ఆక్స్ ఫర్డ్ గ్లూసేస్టర్ హాల్ లో పై చదువు .నాలుగు పెద్ద ఎస్టేట్లకు వారసుడయ్యాడు .తారా పధం లోకి దూసుకు పోయాడు .సరైన రాజకీయ పక్షం వైపుకు చేరకుండా తప్పుడు నిర్ణయం తో ఇరవై నాలుగో ఏట గెట్ హౌస్ జైలు శిక్ష అనుభవించాడు .అతని కవితల్లో గొప్పదైన ‘’టు ఆల్తియా ఫ్రం ప్రిజన్ ‘’రాశాడు .’’stone walls do not make a prision make –nor iron bars a cage –minds innocent and quiet take –that for an hermitage –if I have freedomin my love –in my soul am free –angels alone that soar aove –enjoy such liberty ‘’అని నిబ్బరం గా రాసుకొన్నాడు
జైలు నుంచి విడుదల అయిన తర్వాత నలభై వేల పౌండ్ల ధనవంతుడుగానే ఉన్నాడు .స్నేహితులు కవుల బృందం చేరింది .తాను దేశ భక్తుడినని రుజువు చేసుకోవాలనుకొన్నాడు .పెరోల్ మీద ఉండగానే రాయలిస్ట్ ఆర్మీ కోసం ఒక రెజిమెంట్ ను ఏర్పరచాడు .కాని అది పూర్తిగా ఓడిపోయింది యుద్ధం లో .నాలుగు ముదనస్టపు ఆస్తులను హారతి కర్పూరం లా హరిన్చేశాడు .పదేళ్ళు చేతిలో పెన్నీ లేకుండా కటిక దరిద్రాన్ని అనుభవించాడు .రాజ లాంచనాలతో ఖరీదైన దుస్తులతో వెలిగి పోయిన వాడు చీకి గుడ్డలతో మురికి వాసనతో ఏవ గిమ్పుగా కనీ పించి అందరికీ దూరమయ్యాడు .poor in body and purse be fitting the worst of beggars and the poorest of the servants’’లాగా తన పరిస్తితి ఉందని వాపోయాడు .చేసుకొన్నా వాడికి చేసుకోన్నంత. విధీ వక్రించింది పాపం .స్నేహితులు కవులు అంటే భయమేసింది .రోడ్ల మీద పడ్డ ఎంగిలి పదార్ధాలను ఏరుకొని తినే దుస్తితి వచ్చింది .గన్ పౌడర్ ఆల్లీ లో ఉన్నాడు క్షయ సోకింది .
చిన్న కవితలకే పేరొచ్చింది .కవితల వెనక కవే కనీ పిస్తాడు .రూపకాలన్కారాలను స్వేచ్చగా వాడాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-14-ఉయ్యూరు