పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22

స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి –

జాన్ మిల్టన్ -2

వివాహ వివాద కాలం లో మిల్టన్ లోపలా బయటా పెద్ద ఒత్తిడికిలోనైనాడు . 1643లో పార్లమెంట్ అసహనం గా అన్నిరకాల వ్యతిరేకతనూ అణచి వేయాలని నిశ్చయించింది .వాక్ రచనా స్వాతంత్రాలపై నిషేధం విదించింది .పుస్తకాలు రాస్తే సెన్సార్ చేయించి ప్రచురించాలనే నియమం పెట్టింది .విడాకుల విషం పై మిల్టన్ రాసిన కరపత్రాలు అభ్యంతర మైనవని ఎంచింది .ఇలా నిషేధిస్తూ పోతే మానవ స్వాతంత్ర్యమే ఆబాసు పాలవుతున్దన్నాడు మన కవి .దీనికి సమాధానం గానే ‘’’’ఆర్కో పాగాడీస్ ‘’రాశాడు .సాహిత్యాన్ని స్వేచ్చనూ హరిన్చవద్దాని హితవు చెప్పాడు .తన భావాలను ‘’who kills a man kills a reasonable creature ,God;s image ,but he who destroys a book kills reason itself ,kills the image of God as it were the eye.good book is the precious life –blood of a master  spirit ,embalmed and treasured up on purpose to a life beyond life ..killing books is a kind of massacre ,whereof the execution ends not in the slaying of an elemental life ,but strikes at the ethereal and fifth essence the breath of reason itself slays an immorality rather than a life ‘’ అని సాహిత్య ప్రయోజనాన్ని దాన్ని నిషేధిస్తే వచ్చే అనర్ధాన్ని నిర్భయం గా నిర్మోహ మాటం గా తెలిపాడు .అప్పటికి ఇంకా మిల్టన్ విద్య అందరూ పొందే హక్కు , ,రాసి అచ్చు వేసే హక్కు ,సంతోషం గా జీవించే హక్కు  ఇష్టం లేని పెళ్లి నుండి స్వేచ్చ పొందే హక్కు ల గురించి చెప్పలేదు .

1645మొదటి ఇరవై ఎనిమిది కవితా స్సంపుటిని విడుదల చేశాడు .ఇవి అపూర్వం అని పించాయి .ఇందులో కొన్నిఇటాలియన్ భాషలో రాసిన  సానేట్లూ ఉన్నాయి .కాని రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి .ప్యూరిటన్ రివల్యూషన్ కు ‘’అనధికార ఆస్థాన కవి’’ అయ్యాడు .చార్లెస్ రాజు పై విచారణ జరిగింది .యెంత గొప్ప రాజైనా సక్రమ పాలన లేకుండా ,నియంత గా క్రూరం గా ప్రవర్తిస్తే నిర్దాక్షిణ్యం గా చంపెయాల్సిందే అన్నాడు మిల్టన్ .రాజును ఉరి తీసిన తర్వాత మిల్టన్ ను ‘’లాటిన్ సెక్రెటరి ఆఫ్ స్టేట్ ‘’హోదా నిచ్చి గౌరవించారు .ఆ నాడు ప్రభుత్వాల మధ్య వాడుకలో ఉన్న భాష లాటిన్ .రెండవ చార్లెస్ హాలాండ్ లో ప్రవాసం లో ఉండగా సాల్మసియాస్ అనే మర్యాదా సాహిత్య కారుడితో రాజరికం పైనా రాజు దైవాంశ సంభూతుడు అనే విషయం మీద ,రాజు హక్కుల మీదా  రాయించాడు మిల్టన్ ను సమాధానం రాయమని ప్రతినిధిని చేశారు .ఇద్దరి ఉత్తర ప్రత్యుత్తరాలు లాటిన్ లోనే నడిచాయి .వీటిని అధ్యయనం చేస్సిన తత్వ వేత్త థామస్ హాబ్స్ ఎవరి భాష నిర్డుస్టమైనదో ,ఎవరి వాదనలో సారం ఉన్నదో తేల్చి చెప్పలేము అన్నాడు .

మిల్టన్ రాత పని సాగుతూనే ఉంది. కళ్ళు మసకగా కని  పించటం ప్రారంభ మైంది .ఆండ్రూ మార్వేల్ కవి సాయం తీసుకొంటున్నాడు .48వ ఏట మిల్టన్ మళ్ళీ పెళ్లి కొడుకయ్యాడు .కేధరిన్ వుడ్ కాక్ అనే అపరిచిత యువతిని పెళ్లి చేసుకొన్నాడు .మనువు అయిన పది హీను నెలలకే ఆమె ,ఆమె శిశువు మరణించారు .ఆమె పై ఒక సానెట్ రాసి తృప్తి చెందానని జాన్సన్ కు తెలిపాడు .కొద్ది రోజులకే పూర్తిగా గుడ్డి వాడై పోయాడు .దీనికి కారణం పై అందరూ చర్చిన్చారుకాని ఒక నిర్ణయానికి రాలేక పోయారు .సమకాలీన మతాధికారి ‘’దేవుడి తీర్పు ,విదాకులపై అవాకులూ చవాకులూ రాసినందుకు దైవ శిక్ష అన్నాడు .కళ్ళకు అధిక శ్రమ ఇవ్వటం వలన అని కొందరన్నారు .విపరీతమైన మానసిక శారీరక శ్రమ వల్లద్రుష్టి లోపం వచ్చిందని కొందరు .డాక్టరు వారించినా మిల్టన్ వినలేదని మరికొందరన్నారు .కాని నిష్ణాతులు ‘’తల్లి నుండి మిల్టన్ కు’’ కన్జెనీటల్ సిఫిలిస్ ‘’సంక్రమించిన్దన్నారు .దీనివలననే ఇద్దరు భార్యలు ,పుట్టిన పిల్లలు చనిపోయారని తేల్చారు .ఇది పచ్చి అబద్ధం అని అతని పిల్లలు కొందరు బతికే ఉన్నారని అంటూ మిల్టన్ గుడ్డి వాడు అవటానికి ‘’గ్లోకోమా లేక కంటినాడికి పక్ష వాతం కారాణాలు అన్నాడు .ఇవన్నీ మిల్టన్ రాసిన కవితల్లో సానేట్స్ లో స్వీయ చరిత్ర గా రాసుకొన్నాడు .ఇందులో విషాద అనుభవాలతో కూడి అత్యున్నత కళ ఉంటాయి .మనం చాలా మంది చదివిన కొన్ని లైన్లు ‘’doth God exact day labor ,light denied?-I fondly ask –who best bear mild yoke ,they serve him best –they also serve who only stand and wait’’

‘’సెకండ్ డిఫెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ పీపుల్ ‘’అనే పుస్తకం లో తనపై మోప బడిన ఆరోపణలన్నీ అసత్యం అన్నాడు .తనకు గుడ్డితనం వరమేనన్నాడు .వారి మనసులపై మేఘాలు కప్పుకోన్నాయన్నాడు .అందుకే రీజన్ ,అంతరాత్మ చ వారికి చీకటి లోనే ఉండిపోయాయన్నాడు .ఇప్పుడు తనకు హాయిగా స్వేచ్చ లభించింది అని ,మనసుతోనే సౌందర్యాన్ని ,సత్యం  ,నీతి ధర్మం స్తిరత్వాన్ని చూసుకొంటున్నా నని తెలిపాడు .దీని వలన మిల్టన్ లో వచ్చిన పరిపక్వత తెలుస్తోంది .’’it is not so wretched to be blind ,as it is not to be capable of enduring blindness ‘’అని స్పష్టం గా చెప్పాడు .లార్డ్ క్రామ్వేల్ నియంతృత్వం వలన ప్రజలకు మేలు కలుగుతున్దని ఆశించాడు కాని మరీ భ్రస్టు పట్టించాడు .యుద్ధం కంటే శాంతి ముఖ్యం అన్నాడు . రెస్తోరేషన్ తప్పదని తెలిసింది .రాజుకు వ్యతిరేకం గా మాట్లాడటం ప్రారంభించాడు .

క్రామ్వేల్ చావు తర్వాత మిల్టన్ రక్షణ కోసం ఊగాడు .అప్పటికే ఇంగ్లాండు ముఠా తగాదాలతో విసిగి పోయింది .ప్రజా స్వామ్య పాలన అసాధ్యం అని తేల్చారు .మళ్ళీ రాజరికమే గతి అని నిర్ణయించారు .హౌస్ ఆఫ్ లార్డ్స్ ను పునరుద్ధ రించారు రెండవ చార్లెస్ ను రంగ రంగ వైభవం గా స్వాగతించారు .కౌలీ వాలేర్ డ్రైడేన్ మొదలైన కవులు స్వాగత గీతాలు రాసి చదివారు .వీటికి దూరం గా మిల్టన్ ఉన్నాడు .ఇంకా మిల్టన్ కు స్వేచ్చ మీద ఆశ పోలేదు రాచరికం స్వేచ్చను హరిస్తుందని భావించాడు .లండన్ వదిలి వెళ్లి ఎక్కడైనా దాక్కోమని చెప్పారు .కాని మిల్టన్ ను అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ తప్పించుకొన్నాడు .ఆయన పుస్తకాలన్నిటిని పబ్లిక్ గా తగల బెట్టేశారు .మార్వేల్ సాయం తో జైలు నుండి విడుదల అయ్యాడు .మరణశిక్ష విధించక పోయినా ఆయన కస్టాలు తీరలేదు .ఒంటరి తనం వేధిస్తోంది .చేతిలో పెన్నీ లేని దరిద్రం ఆవహించింది .ఉన్న ముగ్గురు పిల్లమీదే ఆధార పడి జీవిస్తున్నాడు .అందులో ఇద్దరమ్మాయిలకు చదువే రాదు .కాని  వారికి ఆరు భాషలను నేర్పాడు .వారు చదివి విని పించేవారు .అందులో ఏమున్నదో వాళ్ళకేమీతెలీదు .పెద్ద పిల్లలు అన్నే మేరీలు ఈ పైకి చదివే పద్ద్ధతిని వ్యతిరేకించారు .తండ్రికి తెలీకుండా మోసం చేసి కొన్ని పుస్తకాలు అమ్మేశారు  .యాభై అయిదేళ్ళ వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొన్నాడు .అతని కంటే ఆమె ముప్ఫై ఏళ్ళు చిన్నది .పిల్లలకు ఇష్టం లేదు ఆమెకు సహక రించలేదు. కాని దేబోరో అనే కూతురు మాత్రమె కొత్త అమ్మపై సాను భూతి చూపింది .యాభైలో ఉన్నా మిల్టన్ కు ముసలితనం వచ్చేసి నట్లని పించింది .కళ్ళు కనీ పించక పోయినా  వాటిల్లో  దివ్య మైన వెలుగు కనీ పిస్తోంది .అంతర్ ద్రుష్టి ఆయనలో విజ్రుమ్భించింది .

అనిబద్ధ కవితా పిత –జాన్ మిల్టన్

యాభై ఏడేళ్ళ వయసులో మిల్టన్ చారిత్రాత్మక ఎపిక్ ను రాయటం ప్రారంభించాడు .కద చారిత్రాత్మకం గా బైబిల్ కు సంబంధించింది గా ఉండాలని నిర్ణయించుకొన్నాడు .దీనికోసం తొంభై డ్రమాటిక్ పోయెమ్స్ ను నోట్సు గా రాసుకొన్నాడు .దానికి ‘’ఆడమన్ పారడైసేడ్ ‘’అని ముందు పేరు పెట్టాడు కాని అది చివరికి ‘’పారడైస్ లాస్ట్ ‘’గా తేలింది .సాహస కృత్యాలను వదిలేశాడు . మతానికి సత్యానికి ప్రాధాన్యత నిచ్చాడు .మానవత్వం కోసం పోరాటమే అతని  ధ్యేయం .తన భావాలను ‘’assert Eternal providence –and justify the ways of God to man ‘’గా తెలిపాడు .ఇలాంటి క్లాసిక్ కు అంత్య ప్రాస అంత నప్పుదుఅనుకొన్నాడు .బ్లాంక్ వేర్స్ ‘’లో మాత్రామే చెప్పదలచుకొన్న భావాలను పకడ్బందీ గా చెప్పగలను అని పించి దానినే ఎన్నుకొన్నాడు .వక్తృత్వ భాష లో తీర్చి దిద్దాడు .అప్పటికి పెద్దగా ఆకర్షణ లో లేని అని బద్ధ కవిత్వానికే పెద్ద పీట వేశాడు .అనేక ఆధునిక కవులు దీన్ని లక్ష్యం చేయలేదు కాని ఇలియట్ మాత్రం‘’Adam and Eve  were not to  be meant to be individuals but proto types of man and Woman ‘’అన్నాడు .

పిల్లలకు చెప్పి రాయిస్తూ ఆ కావ్యాన్ని రాశాడు కొంచెం నెమ్మదిగా సాగింది .పూర్తీ చేసి 1667లో ముద్రించాడు ఒక అయిదు పౌన్లు మాత్రమె లభించాయి .మిల్టన్ రాసిన రెండు లైన్లను ఆ తర్వాత వర్డ్స్ వర్త్ వాడుకొన్నాడు –stood almost single ,phrasing odious truth –darkness before and danger ;s voice behind’’..మిల్టన్ ‘’హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ ‘’గ్రంధం రాశాడు కాని సెన్సార్ అయింది .అందులో సాక్సన్ మాన్క్స్ ను నిందించాడు బహుశా తనకాలపు వారిని చూసి అలా రాసిఉండాలి .లాటిన్ గ్రామర్ ,లాజిక్ పాఠ్య పుస్తకం మత బోధనా పై గ్రంధం రాశాడు పారడైజ్ లాస్ట్ తర్వాత నాలుగేళ్ళకు పారడైజ్ రీ గైనెద్ద్ రాశాడు .ఈ రెండూ మిల్టన్ లో అంతర్ దృష్టినీ దేవుడి సన్నిధిని కలిగించాయి .మానసిక శాంతి లభించింది .చిత్త శుద్ధి ఏర్పడింది .వాదాల జోలికి పోలేదు .ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు చేయలేదు .కూతుళ్ళను ఎంబ్రాయిడరీ నేర్చుకోవటానికి బయటికి పంపేవాడు .మంచి స్త్రీలుగా ఎదగాలని భావించాడు .అరవై అరవ ఏట 8-11-1674మహా కవి మిల్టన్ మరణించాడు ఆత్మా పరమాత్మ లో చేరిపోయింది .’’పారడైజ్ లాస్ట్’’ రాసిన వాడు ‘’పారడైజ్ రీగైన్ ‘’ను  పొందాడు .

యెంత గొప్ప కవి అయినా ఆయన రాసినవి చదివే వారు తక్కువే .కవి, రాజకీయ వేత్త ,ప్రాపగాం డిస్ట్  ,కరపత్ర కార్య దక్షుడు ,పెద్దగా చదువు లేక పోయినా అందరికి జ్ఞానం నం బోధించిన పరిపక్వ మాన వీయ మూర్తి మిల్టన్ .సంగీత ధ్వనుల లాంటి మాటలతో ఏకత్వ బోధన చేసే కవిత్వం రాశాడు .’’Milton was infatigable worker for liberty carved and erected milestones that stil stand on the road to freedom .A religious poet ,he was also a builder .choosing his phrases as though they were stones for a cathedral ,he raised a great edifice ,a monument of words I marble ‘’.

ఎడ్మండ్ బర్క్ మిల్టన్ చిత్రించిన ‘’నరకం ‘’అద్భుతం అన్నాడు .రొమాంటిక్ కవులు మిల్టన్ బ్లాంక్ వేర్స్ పై ఎంతో అన్వేషించారు కాని అందులోని మత భావాలను దూరం చేశారు .వర్డ్స్ వర్త్ ‘’మిల్టన్ ఇప్పుడు మనమధ్య ఉంటె బాగుండును’’ అన్నాడు .జాన్ కీట్స్ ‘’his style is uncongenial.his verse can not be written but in an artful  rather artist;s humor ‘’ అని పొగిడాడు .విక్టోరియన్ యుగం అంతా మిల్టన్ ప్రభావం తోనే నడిచింది .’’Milton  is the central problem  in any theory and  poetic influence in English ‘’అన్నాడు ప్రముఖ విమర్శకుడు రాబర్ట్ బ్లూమ్.’’Milton  is esteemed the parent  and author of blank verse among us .his verse might be  synonymous  for blank verse  as poetry a new poetic terrain independent from both  the drama and the heroic couplet’’.

అని బద్ధ కవితకు పట్టం కట్టి ‘’అనిబద్ధ కవితా పిత’’ అనిపించుకొన్నాడు జాన్ మిల్టన్

  

  

.

 

మరో కవి తో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.