మోడీ సునామీ

మోడీ సునామీ

‘’మోడీ పెళ్ళాన్నే ఎలుకోలేని వాడు .దేశాన్ని ఎలా పాలిస్తాడు?ఆయన భార్య ఎవరో చెప్పమనండి.ఆయన వస్తే ఇరవై వేల మంది ఊచ కోత తప్పదు .క్రిస్తియన్లు దేశం విడిచిపోవాలేమో?కాషాయం రెపరెప లాడుతుంది .దేశమంతా బాబ్రీ మసీద్ అవుతుంది .గుజరాత్ అల్లల్ర్లనే అదుపు చేయలేక పోయాడు .చాయ్ అమ్ముకొనే వాడు ఈ దేశానికి ప్రధాని అవటం హాస్యాస్పదం .గుజరాత్ లో అభి వృద్ధి అనేదే లేదు .అక్కడ రైతులు పీకల లోతు కష్టాల్లో కూరుకు పోయారు .పై అంతస్తు వాళ్ళకే ఏదైనా చేశాడేమో కాని కిందివారికి మేలు జరగ లేదు ఆమ్బానీలను ఆద్వానీలను వెనకేసుకోస్తాడు దేశం భ్రస్టు పట్టి పోతుంది .కుంభకోణాలు మా పాలన లో లేనే లేవు. ఇంత విశాల దేశం లో అవి సముద్రం లో నీటి బుడగలు .రెండు సార్లు ప్రధాని పదవి తిరస్కరించింది సోనియా .రాహులే దేశానికి యువ రాజు .మన్ మోహనే మా మారాజు. ఆయన ఏది చేసినా దేశం కోసమే .హిందూత్వం మూల మూలలకు విస్తరిస్తుంది .ఆర్ ఎస్ ఎస్ వాళ్ళ చేతుల్లో దేశం బందీ అవుతుంది .దేశం లో ముస్లిం లు మోడీ ని వ్యతిరేకిస్తున్నారు .క్రిస్తియన్లు మండి పడుతున్నారు.అంతర్యుద్ధం వస్తుంది  సెక్యులరిజం మంట గలుస్తుంది .అమెరికాకు దాసోహం అంటాడు .ప్రపంచ దేశాల్లో మన పరువు కొల్లేరే ‘’ఇదీ గత ఏడాదిగా కాంగ్రెస్ అధినాయకత్వం  తో బాటు, అంగుస్టమాత్రులు .వెదచల్లిన విష ప్రచారం ..

అంతే తప్ప తమ కుంభకోణాలు ,అవినీతి పనులు రాజ్యాంగేతర శక్తుల విచ్చల విడితనం ,ప్రధానిని ఒక’’ రోబో ‘’లాగా వాడుకోవటం .కూతురు మొగుడు కుమ్భకోణాలపై స్పందించక పోవటం ,కరుణానిధి కను సన్నల లో మెలగటం ,ప్రజలతో సంబంధమే లేని చతుస్టయాన్ని కోటరీని నమ్ముకొని ప్రజల దగ్గరకు రాలేక పోవటం. రాసిచ్చింది చదవటమే తప్ప విషయం ఏదీ తెలియని అది నేత్రి ,ప్రధానిని బహిర్గతం గా మాటలతో చేష్టలతో అవమాన పరుస్తున్నా నోరు మేదపక పోవటం కొడుకు దుందుడుకు తనానికి అడ్డ కట్ట వెయ్యలేక పోవటం ,దేశం పరువు అన్ని రంగాల్లో దిగాజారినా ఏమీ పట్టించుకోక పోవటం ,అనాలోచిత నిర్ణయాలు ఆ తర్వాత చెంప లేసుకోవటాలు ,దుర్భర జీవితాలనుభవిస్తున్న ప్రజల బాగోగులు పట్టించుకోక పోవటం అవినీతి పరుల కొమ్ము కాయటం ,కరుణా నిధి కరుణ కోసమే ఎదురు చూడటం లెఫ్ట్ పార్టీలను దూరం చేసుకోవటం ,ఆంధ్ర ప్రదేశం అట్టుడికి పోతున్నా చిద్విలాసం గా ధిల్లీ లోనే కూర్చోటం ,ఏమీ సాధించలేని చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలో కలిపేసుకోవటం ,అవినీతి ఆశ్రిత పక్షపాతం తో నిండా మునిగిన జగన్ ను జైల్లో నుంచి తప్పించటానికి ,తేరా వెనుక నాటకాలాడటం ,పనికి మాలిన ఏ సన్నాసి వచ్చినా పార్టీలో చేర్చుకోవటం ,రాష్ట్రం గురించి మంచి మాటలు చెప్పిన వారి నందర్నీ దూరం చేసుకోవటం ,ములాయం, లాలూ ల మీదకేసులేత్తేసే ప్రయత్నాలు. ఏ సపోర్టూ లేని అజిత్ సింగ్ ను అక్కున చేర్చుకోవటం ,తెలంగాణా ఇస్తే కెసిఆర్ పార్టీని కలిపే స్తా దాని నమ్మటం  ,తానూ తప్ప ఇతరులను గెలిపించలేని తెలంగాణా రెడ్డి మంత్రిని నమ్మటం  అన్నీ కాంగ్రెస్ అధినేత్రి చారిత్రాత్మ క తప్పిదాలు .ఆమెయే దేవత ఇచ్చినా ఇవ్వకున్నా అమ్మే .ఆమె దయ మీదే బతుకుతున్నాం అని మోకాలు దండాలు వేయటం .ప్రజల సెంటి మెంట్ లను పట్టించుకోక పోవటం ,ఆంధ్రాలో ఎన్ని అవినీతి భాగోతాలు జరుగుతున్నా పదేళ్ళ నుంచి నోరు మెదపక పోవటం యై ఎస్ ను గుడ్డిగా పూర్తిగా నమ్మటం .కెవిపి చెప్పు చేతల్లో నడవటం అంతా స్వయం క్రుతాప రాధమే .వీటిని గురించి కాంగ్రెస్ వాళ్ళుపట్టించుకో లేదు .సుఖం గా ప్రశాంతం గా యెన్ డి ఏ  మూడు  రాష్ట్రాలని విభజించి అందరి ఆమోదాన్ని సంతృప్తి గా పొందితే దాన్ని ఖాతరు చేయకుండా తన విల్ అండ్ ఫాన్సీ తో పదవి పూర్తీ అయ్యే సమయం లో విభజన జరిపి ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని రేప్ చేయించి తూ తూ మంత్రంగా ,రౌడీఇజమ్ తో బిల్లు పాస్ చేయించటం ,స్పీకర్ పదవిని దిగాజర్చటం ,పార్ల మెంటు ను బైపాస్ చేయించటం ఏంతో నమ్మకం పెట్టుకొన్న రాష్ట్ర పతి  కాడి పారెయ్యటం ,విభజనకు ఇది సమయం కాదని తెలుసుకోక పోవటం ,అది నేత్రి ,ఆవిడ ముఠా చేసిన అనకానేక తప్పిదాల నిర్వాకాల  లిస్టు .

రాష్ట్రం లో ఆరు నెలలు ప్రజలు రోడ్డు మీద పడి ఆందోళన చేస్తే వారి తో మాట్లాడి సమస్య మూలాలను తెలుసుకోలేక పోవటం శ్రీ కృష్ణ కమిషన్ ను చెత్త బుట్టలో పదేయ్యటం ,ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోక పోవటం సంభాషణ లతో సమస్యా పరిష్కారానికి పూనుకోక పోవటం ,రెచ్చి పోతున్న ముఖ్య మంత్రి ని అదుపు చేయలేక పోవటం ,అసెంబ్లీ తీర్మానానికి విలువ నివ్వక పోవటం ,అన్నీ ఇంకెన్నో స్వయం క్రుతాపరాదాలు .తన కేన్సర్ జబ్బు ,కొడుకు అప్రయోజకత్వం. అతడు తప్ప దేశానికి దిక్కు లేదని మీడియా ,పార్టీ వేదికల ద్వారా ఊదర కొట్టటం .అతను ఏ ఉద్యమాన్నీ నడిపి సక్సెస్ కాక పోవటం. వీడెక్కడి దరిద్రం రా బాబూ మన నేత్తినేక్కటానికని జనం బావించటం, పసి గట్ట లేని కబోది తనం తో ప్రబుత్వమూ, పార్టీ ఉండటం తో ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు .బీహార్ లో నితీష్ కుమార్ మచ్చ లేని నాయకుడే అప్పటి దాకా .పెద్దమనిషే .అందరూ తలచుకొంటే ప్రధాని అయ్యే చాన్స్ ఉన్న వాడె .అతని తాత్కాలిక మోడీపై ద్వేషం శృతి మించి కూటమి నుంచి బయటికొచ్చి అవినీతి కశ్మలం లో ముంగి కంపు కొట్టే సోనియా పక్కన చేరటం అతన్నీ భ్రస్టు పట్టించింది .జయలలితను మమతనూ దూరం చేసుకోవటం మాయావతి మాయ మాటలకు మోసపోవటం దోబూచులాట చూసి చూసి విసిగెత్తి పోయారు జనం ఆసేతు హిమాచలం .కమ్మీలు క్రెడిబిలిటి కోల్పోయారు .వాళ్ళపై నమ్మకం పోయింది థర్డ్ ఫ్రంట్ తో మళ్ళీ కాంగ్రెస్ ను అధికారానికి తెచ్చే తేర వెనుక నాటకాన్నీ గమ నించారు .అందుకే పది సీట్ల తో చాలు పొమ్మన్నారు .ఎవరినో ఒకర్ని అంటకాగటం నాలుగు ఓట్లు తెచ్చుకోవటం వాళ్లకు మామూలై పోయింది .వారిలో వారికి వైరం ఒకడు కాంగ్రెస్ కు జో హుజూర్ ఆటే వేడొకడు జగన్ జిందాబాద్ అని తలవంపులు తెచ్చుకొన్నారు .

మంచి మాటలు చెప్పే వాడు చెప్పింది చేసి చూపించేవాడు, విజన్ ఉన్న వాడు, యువతకు నమ్మకమైన వాడు ఆరోపణే తప్ప గుజరాత్ ముద్ర రుజువు కాని వాడు, వ్యూహ రచయితా, గొప్ప కమిట్ మెంట్ ఉన్నవాడు ,స్వాప్నికుడే కాదు కార్య సాధకుడు అని నమ్మకం కలిగించిన వాడు నరేంద్రా మోడీ అని నిజం తెలుసుకొన్నారు .అతను వస్తేనే దేశం సౌభాగ్య వంతం అవుతుంది ‘’సురాజ్యం ‘’వస్తుంది  కలలు నేర వేరుతాయి .అభివృద్ధి అతనికే సాధ్యం .మాట నిల బెట్టుకొంటాడు .అందర్నీ ఆప్యాయం గా పలకరిస్తాడు. గొప్ప సంభాషణా చతురుడు ,జవం బలం నిస్టా ,అవగాహనా  ఉన్న వాడు ఆధునిక టెక్నాలజీ అంతా కరతలా మలకం గా ఉన్నవాడు అని ‘’నమో నమో ‘’అన్నారు .ఇక్కడ హిందూ ,ముస్లిం క్రిస్టియన్ జాట్ ,జైన్ బౌద్ధ విభేదాలేవీ కనీ పించలేదు ఉద్యోగులు నిరుద్యోగులు పెంషనర్లు  వీటన్నిటికి అతీతం గా ముందుకొచ్చారు .దేశం అంతా మోడీ ప్రభంజనం తో మునిగి పోయింది. మోడీ సునామి చుట్టేసింది .దీని ముందు ఏ గడ్డిపోచా నిలవ లేక పోయింది ఏ మహా వృక్షమూ నిలవ లేక పోయింది .అన్నీ కూకటి వేళ్ళతో సహా నేల మట్టం అయ్యాయి .సమర్ధుడు వస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఆంద్ర జ్యోతి భాషలో ‘’కసి గా ‘’వేశారు ఓట్లు .జగన్ డబ్బు మందూ కులం మతం తండ్రి పేరూ తో అడ్డొచ్చినా చంద్ర బాబు జైత్ర యాత్ర ను ఆపలేక పోయాయి .అవినీతి ఫాను గాలిని వద్దని కరెంటు పీకేశారు .విభజిస్తే ఉభయ భ్రస్టూత్వమే అని ఉండవల్లి ,హర్ష కుమార్ ,రాయపాటి మొదలైన వాళ్ళు నెత్తిన నోరు పెట్టుకొని చెప్పినా సీమాన్ధ్రను నడి బజార్లో నిల బెట్టి చీల్చిన విధానం జుగుప్స కలిగించింది .బి జే పి పై అపోహలను వదిలి మోడీ వెంట ముందుకు కదిలారు .పవన్ ప్రాభవం తోడైంది .అంతే వోట్ల వర్షం కురిసింది నేర చరితులు సుడిగాలికి కొట్టుకు పోయారు .సునామీ లో దిగ్గజాలు మదించిన మత్త గజాలు ,చిచ్చుపెట్టిన శకుని గాళ్ళు ,అందరూ కొట్టుకు పోయారు .దిక్కూ మొక్కూ లేకుండా పోయారు .అక్కడ మోడీకి ఇక్కడ బాబుకు పట్టం కట్టారు రెండుకళ్ళ సిద్ధాంతం అని ఎద్దేవా చేసిన వాళ్ళే నెత్తి కేత్తుకొన్నారు .ఇక్కడా మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం రాజ దాని ఏర్పాటు యువతకు ఉద్యోగాలు బాబు వల్లనే సాధ్యం అనుకోని అందలం ఎక్కించారు. దీనికి యెన్ ఆర్ ఐ ల సహకారమూ తోడైంది .మోడీ వ్యూహం ఆచరణ ,ఓట్లను కుమ్మరించాయి. కొన్ని రాష్ట్రాల్లో ‘’చెయ్యి ‘’విరిగే పోయింది .కొన్ని చోట్ల’’ మొండి చెయ్యి గా’’ మిగిలింది .ప్రజాగ్రహం అంటే ఏమిటో చూపించారు .అసలే రగిలి పోతున్న జనానికి మోడీ ఒక దేవుడే అయ్యాడు .ఎద్దేవా చేసిన వారిని ‘’చేదు చాయ్ ‘’రుచి చూపించారు .అయితే ఈ సునామీ తప్పించుకొన్న మమత ,జయా ,తామ ప్రాభవాన్ని నిల బెట్టుకొన్నారు గుడ్డి రాజు ద్రుత రాస్త్రుడి లా కూలి పోయాడు తమిళనాడులో అందర్నీ కోల్పోయి .కెసిఆర్ తెలంగాణలో రాజయ్యాడు .బాబు సీమాన్ధ్రకు చంద్రుడయ్యాడు మోడీ దేశానికి నరెంద్రుదయ్యాడు .రాజ నాద సింగ్ అన్నట్లు ‘’మోడేసిన్’’పాత కొత్తా రోగాల్ని పోగొట్టి శుభ్ర ,భద్ర ,స్వచ్చ ప్రజాస్వామ్యం సురాజ్యం భారత్ లో ఏర్పడి ప్రపంచం లో అగ్ర గామి గా వెలుగొందాలని మనసారా కోరుకుందాం .శుభం భూయాత్ .మేరా భారత్ మహాన్ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-14-ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.