పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23
హేతు వాద యుగం
జాన్ డ్రైడేన్
‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో కవిత్వం ఉండాలన్న భావం ఏర్పడింది .దీనినే పోప్ కవి ‘’ఆర్డర్ ఈజ్ హేవెన్స్ ఫస్ట్ లా’’అని సూత్రీకరించాడు .ఈ కాలంలోనే సైన్స్ లో కొత్త విషయాల ఆవిష్కరణ జరిగింది .కొత్త విధానాల కు ఆదరణ కలిగింది .అందుకే ఈ కాలాన్ని ‘’ఏజ్ ఆఫ్ యెన్ లైటేన్ మెంట్ ‘’అన్నారు .ఊహ కంటే మేధకు ప్రాముఖ్యత వచ్చింది .నాటకాలలో పెళ్లి తంతు లో ఉన్న లోపల ఆవ హేళన ,గౌరవంపై చిన్న చూపు ,విలువలపై హేళన పెరిగాయి .కవిత్వం లో నగిషీలేక్కువైనాయి .విషయ ప్రాధాన్యత లేదు .కాని విధానం మాత్రం వన్నెలు చిన్నెలతో దూసుకు పోయింది .ఛందస్సు తీవ్రం గా స్టైల్ గా కొలువు తీరింది .
జాన్ డ్రైడేన్ ఈ కాలం లో అంటే హేతువాద యుగం లో అగ్రాగామి కవిగా నిలిచాడు .మిల్టన్ కంటే పిరికి వాడు .అంది వచ్చ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొన్నాడు .దేన్నీ లేక్కచేయని తత్త్వం ,నీతి నిజాయితీలను బలాదూర్ చేసి ఇష్టం వచ్చినట్లు విశ్రుమ్ఖలం గా విజ్రుమ్భించాడు .ఉన్నదాన్ని ఉన్నట్లు గా ఉంచటమే అతని ధ్యేయం .ఆంగ్ల కవిత్వం లో భాషాభివృద్ధి జరగాలని కోరాడు .దానికోసమే శ్రమించాడు .
9-8-1631ననార్త్ యాంప్ షైర్ లో ఆలడ్ విన్ క్లిల్ ఆల్ సెయింట్స్ లో జాన్ డ్రైడేన్ పుట్టాడు .పద్నాలుగు మంది సంతానం లో పెద్దవాడు .స్కూల్ లో చదువుతూనే సెటైర్లు రాసి ప్రైజులు గెల్చాడు .లాటిన్ కవి పెర్సియాస్ రచనను ఇంగ్లీష్ లో తర్జుమా చేశాడు .కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చేరి డిగ్రీ పొందాడు .మొదటి ఎలిజీ ‘’అపాన్ ది డెత్ ఆఫ్ లార్డ్ హేస్టింగ్స్ ‘’రాశాడు .కజిన్ ఆనర్ డ్రైడేన్ తో సరససల్లాపాల్లో తేలి కవిత్వం ,వచనం కలగలిపి ఆమె పై రాశాడు .ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోలేదుకాని ఇతనితో చివరిదాకా సంబంధం సాగించింది .
ఇరవై మూడేళ్ళ వయసులో తండ్రి పోయాడు .కొంత ఆస్తి డబ్బు ఇతనికి ఇచ్చాడు .లండన్ వెళ్లి తన విద్యా ప్రతిభ నిరూపించుకోవాలను కొన్నాడు డ్రై డెన్ .సర్ గిల్బర్ట్ ఫ్లికరింగ్ అనే కజిన్ దగ్గర సేక్రేటరిగా చేరాడు ..ఇతను లార్డ్ క్రాం వెల్ కు లార్డ్ చాంబర్లిన్ .కవికి కామన్ వెల్త్ లో చిన్న ఉద్యోగం ఇప్పించాడు .పుస్తకాలకు ముందుమాటలు రాస్తూ సమీక్షలు చేస్తూ ఆదాయాన్ని పెంచుకొన్నాడు .తన స్వంత రచనలు ప్రచురించాడు .ఎవరి కిందో పని చేసి సంపాదించటం నామోషీ గా భావించి స్వంత కాళ్ళ మీద నిల బడాలనుకొన్నాడు .మంచి స్తిరమైన ఉద్యోగం లభించే వయసే అది. కాని తన విశ్వాసాన్ని విధేయతను తరచూ మారుస్తూ ఉండటం తో చిక్కులోచ్చాయి .1658లో క్రామ్వేల్ మరణం తర్వాతా ఆ డిక్టేటర్ ను ఆకాశానికి ఎత్తుతూ ‘’హీరోయిక్ స్టాంజాస్ ‘’రాశాడు .రెండవ చార్లెస్ రాజు ప్రవాసం వదిలి డోవర్ లో అడుగు పెట్టినప్పుడు స్వాగతించిన కవుల్లో తానూ ఒకడుగా ఉండి ‘’ఏ పెనేగేరిక్ ఆన్ హిస్ కారోనేషణ్ ‘’రాసి అంకిత మిచ్చాడు .కొత్త ప్రభుత్వానికి పూర్తీ మద్దతు ప్రకటించాడు .గోడలు దూకుతున్నా కవిత్వాన్ని వదలలేదు .రాబర్ట్ హోవార్డ్ పై రాసిన కవిత వలన ప్రాముఖ్యత పెరగటమే కాదు భార్యనూ ఇచ్చింది .హోవార్ద్ ఎరల్ ఆఫ్ బెర్క్ షైర్ ను అంటకాగాడు .కుటుంబం లో సన్నిహితం గా మెలగి అతని చిన్న కూతురు లేడీ ఎలిజ బెత్ ను వలచి పెళ్లి చేసుకొన్నాడు .ఈ పెళ్లి సుఖం అందించింది .ముగ్గురు పిల్లలు కలిగారు .పొజిషనూ క్రమం గా పెరిగింది .డబ్బూ వస్తోంది .నలభై వ ఏట ద్రైదేన్ రాజుకే డబ్బు అప్పు ఇచ్చే స్థాయికి పెరిగాడు .
అప్పటిదాకా ఇరవై ఏళ్ళు నాటక శాలలు మూత పడి ఉన్నాయి .డ్రై డెన్ చొరవ తో వాటిని తెరిపించాడు .స్వయం గా నాటకాలు రాయాలని అనుకొన్నాడు .’’దివైల్డ్ గాలంట్ ‘’అనే వచన కామేడిని ముప్ఫై రెండో ఏటనే రాశాడు ..అది తన్నింది .నిరాశ పడలేదు ..విధానం టెక్నిక్ మార్చి ‘’దిరైవల్ లేడీస్’’రాశాడు .ఇందులో బ్లాంక్ వేర్స్ ను అంత్యప్రాసలతో రాశాడు .బావ మరిది తోకలిసి ‘’ది ఇండియన్ క్వీన్ ‘’రాసి పేరుపొందాడు .ఇలాంటి హీరోయిక్ నాటకాలే బాగా క్లిక్ అవుతాయనుకొన్నాడు .వీటిల్లో హీరోయిక్ కప్లేట్స్ నిమ్పాడుకూడా .ప్రతి ఏడాది ఒక కొత్తనాటకాన్ని పందొమ్మిదేళ్ళు రాశాడు .ఇందులో ట్రాజిక్ సెమి ట్రాజిక్ లున్నాయి .సీక్రెట్ లవ్ ,ది కాంక్వెస్ట్ ఆఫ్ గ్రనడా ,ఔరంగ జేబ్ వంటివి ఉన్నాయి వీటిలో మిధ్యా క్లాసికల్ పద్ధతులను చౌక బారుతనాన్ని చూపాడు .ఆ కాలానికి తగిన అభిరుచులకు అనుగుణం గా తాత్కాలిక ప్రయోజనం గా రాశాడు .అంతర్గాత భావానికి ప్రాముఖ్యత నివ్వలేదు .షేక్స్ పియర్ ను చాలా కాలం మరిపించేశాడు నాటకాలతో .పది హేడవ శతాబ్ది ఉత్తరార్ధం లో కళను ప్రకృతిని ఆరాధించ టమే కాక భావోద్రేకాలనూ ఆదరించారు .
రేస్తోరేషన్ కాలం లో నాటక రంగం ప్రజలకు దగ్గరైంది .ఈ వికాస యుగం లో షేక్స్పియర్ నాటకాలను అభి వృద్ధి చేశారు పోప్ తనకు నచ్చని లైన్లను తీసేశాడు .నాటక రచన ‘’కవిలోని కవిని’’ అణ చేసింది .35వయసులో డ్రైడేన్ ‘’ఆన్స్ మిరాబిలిస్ ‘’అనే పన్నెండు వందల లైన్ల కవితను రాసి వదిలాడు .ఇది జర్నలిజం కు ప్రేరణ కలిగించింది .చార్లెస్ రాజుకు ఈ కవి కవిత్వం బాగా నచ్చి ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .ముప్ఫై అయిదేళ్ళ వయసులో ఈ పదవి వరించింది .ఇద్దరు గొప్ప రాజుల వద్ద (మొదటి జేమ్స్ మొదటి చార్లెస్ )ఆస్టానకవిని అని గర్వం గా చెప్పుకొన్న విలియం డేవనంట్ స్థానం లో ఆస్థానకవి అయ్యాడు ఆ ఇద్దరు రాజులు డేవనంట్ కు అధికారికం గా ఆ పదవిని ఇవ్వలేదు .ఆయనే చెప్పుకొన్నాడు పాపం .కాని ఇప్పుడు రెండవ చార్లెస్ సాధికారంగ డ్రైడేన్ గ ను మొట్టమొదటి సారిగా ఆస్టానకవిని చేసి గౌరవించాడు .రెండేళ్ళ తర్వాత ‘’హిస్టరియోగ్రాఫర్ ‘’ను చేశాడు .కీర్తి పెరిగి పోయింది .ఇతని తర్వాతా ఆస్థాన కవులైన పద్నాలుగు మందిలో అసలైన అర్హులు వర్డ్స్ వర్త్ , మిల్టన్లు మాత్రమె .మిగతా వాళ్ళంతా కాకా పట్టి బాకా లూది సాధించిన వారే .
రాజుగారి శత్రువులపై అనేక సెటైర్లు రాసి శహభాష్ అని పించాడు .ఏడాదికి రెండువందల పౌన్లు వార్షికం ఇచ్చి తర్వాత మూదొందలకు పెంచారు .పొట్టిగా ఎర్రగా కొంచెం కున్గినట్లు కనిపించేవాడు .నెమ్మదిగా మాట్లాడేవాడు .సెటైర్లూ రిపార్టీలతో రాజ దర్బారు మారు మొగిపోయేది .1679లో ‘’మాక్ ఫ్లేక్నో ‘’రాశాదు .దుందుడుకు స్వభావం వలన నెమ్మదిగా స్నేహితులకు దూరమైనాడు .రాజ బంధువులూ దూర మైనారు .ఒక రోజు కోవర్ట్ గార్డెన్ మీదుగా వెడుతుంటే డ్రైడేన్ ద ను అవమానించి పిచ్చ పిచ్చ గా కొట్టారు .అయినా రాజు దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు .కేధలిక్కులకు టోరీలకు విద్వేషాలోచ్చాయి .’’ఆబ్సలాం అండ్ అచితోఫెల్ ‘’అనే వ్యంగ్యాత్మక నాటకం రాసి సమకాలీన పరిస్తుతులకు అద్దం పట్టాడు .ఎవరినీ వదలలేదు .ఈయన రాసిన సెటైర్ లలో ఇదే గొప్పదని పేరు .ఇది బాగా పేలటం తో దీనికి సీరియల్ అంటే సీక్వెల్ రాయమనే డిమాండ్ పెరిగింది .రెండొందల లైన్లు రాసి కోరిక తీర్చాడు .రాజకీయం గా ఆర్ధికం గా మంచి స్తితిలో ఉండాలనేదే ఎప్పుడూ కోరిక .
ఇంగ్లాండ్ లో విప్లవం ఉవ్వెత్తున విరుచుకు పడ బోతోందనే సంగతి గ్రహించలేక పోయాడు .దానికి సమాయత్తమూకాలేదు కూడా .రెండవ చార్లెస్ పూర్తిగా మతోన్మాడిగా కాధలిక్ మోనార్క్ గా ప్రవర్తించాడు .అప్పటిదాకా విధేయులుగా ఉన్న టోరీలు పూర్తిగా వ్యతిరేకించారు .కొందరు బిషప్పులపై అభియోగాలు మోపి రుజువుకాక వదిలేశారు. రాజు వ్యతిరేకత కట్టలు తెగి పారుతోంది .ఇంగ్లాండ్ ను ‘’పాపల్స్ పాపాల ‘’నుండి రక్షించాలనే సంకల్పం బలీయమైంది .జేమ్స్ కూతురు మేరీ ని పెళ్లి చేసుకొన్న విలియం ఆఫ్ ఆరంజ్ ను రాజు చేయాలనే భావం బల పడింది ఇది తెతెలుసుకొన్న చార్లెస్ పలాయనం చిత్త గించాడు .వెనక్కి రప్పించి విచారించారు .తప్పించుకు పారిపోయాడు విలియం కు మేరీకి ఉమ్మడిగా రాజరికం కట్ట బెట్టారు .కొత్త రాజుకు విధేయత ప్రకటించటానికి ఒప్పుకోలేదు దీనితో ఆస్థాన పదవి హిస్తరియోగ్రాఫార్ పదవీ ఊడ గొట్టారు .డ్రైడేన్ ద్వేషించి సెటైర్ల తో చీల్చి చెండాడ బడిన షాద్ వెల్ ఆస్థాన కవి అయ్యాడు .
మానసికం గా కుంగి ఆదాయాం లేక మనకవి ఇబ్బందిపడ్డాడు .ఏభై ఎనిమిదేల్లోచ్చాయి .నాటాకాలు రాసి అనువాదాలు చేసి డబ్బు చేసుకోనాలని నిర్ణయించాడు .ఒపెరాలకు లిబర్తోస్ రాశాడు .‘’దిస్టేట్ ఆఫ్ ఇన్నోసేన్స్ అండ్ ఫాల్ ఆఫ్ మాన్ ‘’అచ్చు అయింది ఆ ఊపులో అరడజన్ నాటకాలు గీకి పారేశాడు .అరవైలో ఏ ఇంగ్లీష్ రచయితా చేయని గొప్ప ప్రయత్నం చేశాడు .తన పుస్తకాలను అమ్ముకొని బతకటం ప్రారంభించాడు .ఇలా పదేళ్ళు గడిపాడు .అనువాదాలు చేసి అచ్చేసి అమ్ముకొన్నాడు .ఇవన్నీ చాలా సరదాగా కాలక్షేపం బటాణీల్లా ఉన్నాయి .పన్నెండు వందల పౌండ్లు ఆర్జించాడు .అరవై తోమ్మిదో ఏట చివరి రచన ‘’ఫేబుల్స్ , ఎంషేంట్అండ్ మోడరన్ ‘’రాశాడు ఇందులో చాసర్ కధలను ను ఆధునిక ఇంగ్లీష్ లో రాశాడు .చని పోవటానికి మూడు వారాల క్రితం మిసెస్ స్తీవార్డ్ కు తాను ఒక కొత్త మాస్క్ రాశానని తెలియ జేశాడు అదే’’ సెక్యులర్ మాస్క్’’.తను పని చేసిన ఇద్దరు రాజుల ప్రవర్తత, ఆ శతాబ్దాపు ధోరణి అందులో చూపించాడు .వివాదాస్పద రచయితా గానే గుర్తుండిపోయాడు .మెటా ఫిజిక్స్ అవుట్ ఆఫ్ ఫాషన్ అయింది .ప్రక్రుతి గురించి రాశాడు .కవిత్వాన్ని సాన బెట్టి మెరుగులు దిద్దాడు .మాటల మంత్రం జాలం తో ఆకట్టుకొన్నాడు .కవిత్వం లో లాజిక్ ను నింపాడు .కవిత్వానికి వేగం, టైమింగ్ ఇచ్చాడు .’’ he ought to be on our shelves ,but he will rarely be found in our hearts’’అని తేల్చారు అయినా ‘’with the the element of magic .his is in its own characteristic way ,the shortest ,the most pointed and perfectly finished kind of poetry ,if poetry can be attained without wonder .’’12-5-1700న డ్రై డే న్ మరణించాడు .
డోన్నె,మిల్టన్ ల తర్వాతపదిహేడవ శతాబ్దిలో గొప్ప కవి . షేక్స్ పియర్ బెన్ జాన్స న్ ల తర్వాతగొప్ప నాటక రచయిత .సాహిత్య విమర్శ వచన రచనలలో అసామాన్యుడు .డ్రామా లో కవిత్వం లో అందరినీ మించాడు .ప్రఖ్యాత హాస్య రచనలు చేశాడు .అతని అనువాదాలు అనితర సాధ్యమైనవని పించుకోన్నాయి .’’హీరోయిక్ కప్లేట్స్త్’’ను హీరో గా చేశాడు .రెండు సృజనాత్మక సెటైర్లు రాశాడు .అతని ఆకారం కంటే ‘కవితాకారం ‘’బహు సుందరం గా ఉంటుంది .దాదాపు నలభై రచనలు చేశాడు .వర్జిల్ పై గొప్ప పుస్తకం రాశాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-14-ఉయ్యూరు