పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24

చమత్కార ప్రపంచం

డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ పెపీస్ ,ఎవిలిన్ రాసిన విమర్శ ,సమీక్ష ,కరపత్రరచన డైరీ లను ఆదరించారు .సున్నితత్వాన్ని ,వినోదాన్ని కోరారు .ఈ పరిధిలో రాసి గుర్తింపు పొందిన వారిలో జాన్ విల్మాంట్ ఎరల్ఆఫ్ రోచెస్టర్, మార్గరెట్ లూకాస్ ,ఆఫ్రా బెన్ అన్నే ఫించ్ ,లేడీ విన్చేల్సియా ,మొదలైన వారున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలుసుకొందాం .

సెటైర్ వజ్రం -ఎరల్ఆఫ్ రోచెస్టర్ –జాన్  విల్మాంట్

జాన్  విల్ మాంట్ రెక్ లెస్ మనిషి .1-4-1647 న ఆక్స్ ఫర్డ్ షైర్ లో డిచిలీ లో పుట్టాడు .పన్నెండేళ్ళ వయసులోనే తండ్రికి వారసుడై ఎరల్ ఆఫ్ రోచెస్టర్ అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ వాడాన్ కాలేజి లో చదివి పదిహేనవ ఏటనే  ఏం ఏ పాస్ అయ్యాడు .డచ్ వారికి వ్యతిరరేకం గా యుద్ధం లో పాల్గొన్నాడు .ఇంగ్లాండ్ తిరిగి వచ్చి రెండవ చార్లెస్ రాజుకు సన్నిహితుడయ్యాడు .అందం అధికారం ప్రాపకం తో అన్నీ పొందాడు . సెక్సు  స్కాన్దల్స్ ,అవినీతి లో చిక్కుకు పోయాడు .డచ్ రాజు చార్లెస్ ను అవమాన పరుస్తూ రాస్తే అతను ప్రయాణం చేసే నౌకను తగల బెట్టించాడు .రోచెస్టర్ రాజ  వంశానికి చెన్దిన మాలేట్ ను శృంగారం లోకి దించే ప్రయత్నం చేస్తే ఆమె తిరస్కరిస్తే రహస్యం గా  పెళ్లి చేసుకోక తప్ప లేదు .ఆమెతో బాటు అందుబాటులో దొరికిన సామాన్య స్త్రీల దగ్గరనుంచి రాజకన్యలు రాణీ లనూ  అనుభవించటం మొదలెట్టాడు .చార్లెస్ రాజు రాసలీలలను కవితామయం చేశాడు .విసుగెత్తి అతన్ని బహిష్కరించారు .భార్య ఎస్టేట్ లో తల దాచుకొన్నాడు .రాజు ఇతన్ని వదలుకోలేక పోయాడు .

ముప్ఫై ఒకటవ ఏట ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .జ్వరం వచ్చి శరీరాన్ని మనసును ఇబ్బంది పెట్టింది .రెండేళ్ళ తర్వాత తను చేసిన పాప కృత్యాలకు సిగ్గుపడ్డాడు పశ్చాత్తాపం చెందాడు .ముప్ఫై మూడవ ఏట నే 16-6-1680న చని పోయాడు .చాలా అనాగరక భాష లో కవిత్వం రాశాడు .’’ఫేర్ వెల్ టు ది కోర్ట్ ‘’,కవిత అరువు సొమ్ముతో అలంకరించిందే .ఏ సెటైర్ ఎగైనెస్ట్ మాన్ కైండ్’’కవిత  అతని మనసును ఆవిష్కరిస్తుంది . .’’I would be a dog ,a monkey or a bear –or any thing but that vain animal –who is so proud of being rational ‘’అని మనిషిగా పుట్టటానికి ఇష్టం లేదన్నాడు .రోచెస్టర్ అసందిగ్ధ భావాలను వదిలి వెళ్ళాడు .అతను చనిపోయిన తర్వాతే కవితలు అచ్చయ్యాయి .రెండున్నరశతాబ్దాల తర్వాతా1926 లో ముద్రణ కు నోచుకోన్నాయి .జాన్ హోవార్డ్ ఇంగ్లాండ్ లో ప్రింట్ చేశాడు .అమెరికాలో వద్దన్నారు .

‘’love a woman !you are an ass –it is a most insipid passion –to choose out for your happiness –the silliest part of God’s creation ‘’అని తన అనుభవాలను  నెమరేసుకొంటూ బాధ పడుతూ బోధ చేశాడు .తప్పుడు భావాలను వ్యాప్తి చెందిన్చాడని అందరూ నిరసించారు .ఒక్క మాటలో చెప్పాలంటే ‘’Rochester expressed himself in many and often opposed moods –sordid and witty indignant and indifferent ,daring vulgar and always him self ‘’.ప్యూరిటన్ ల ఆధ్యాత్మిక సాధికారతను ఎదిరించి నిలిచినమొదటివాడు .ఆ తరానికి మార్గ దర్శి కూడా .సేటైరిస్ట్ లలో అగ్రగామి అనిపించాడు .విక్టోరియన్ కాలం లో అతని కవిత్వం చాలా భాగం సెన్సార్ అయింది .ఆధునిక కవులు గ్రాహం గ్రీన్ కు ఎజ్రా పౌండ్ కూ ఆదర్శం .హాబెర్ట్ యొక్క మెటీరియలిజం కు దూరం గా ‘’లినర్టి నిజం ‘’రాశాడని విమర్శకులన్నారు .యవ్వన మదం లో చెడ తిరుగుళ్ళు అసభ్య శృంగారం వ్యభిచారం లతో అతనికి ‘’గనేరియా ‘’సోకి దానితోనే చనిపోయాడు .ఆక్స్ ఫర్డ్ షైర్ లో స్పీల్స్ బరి చర్చ లో సమాధి చేశారు .అతను రాసిన ‘’డెత్ బెడ్ రి నన్సిఎషన్ ‘’అనే ‘’లిబర్టి నిజం ‘’ను తర్వాత ప్రచురించారు .ఇందులో భావాలన్నీ ‘’ప్రాడిగల్ సన్ ‘’పశ్చాత్తాపం గ నేఉంటాయి .అతని ‘’ప్రేన్తిస్ వర్క్ ‘’,ఎర్లీ మేచూరితి ‘’ ట్రాజిక్ మేఛూరిటి ,’’దిసిల్యూజన్ అండ్ డెత్ ‘’అనే నాలుగు విమర్శ గ్రంధాలు దాదాపు అతని జీవిత చరిత్రలే .డెబ్భై అయిదు కవితలు రాశాడని తేల్చారు .

చార్లెస్ రాజు పై రాసిన ‘’we have pretty witty king –and whose words no man relies on –he never said a foolish thing –and never did a wise one ‘’ను చదివి రాజు నవ్వుకొని ‘’that is right –my words are my own but my actions are those of my ministers ‘’అన్నాడట .అతని కవిత్వం లో విజ్ఞానం ,ప్రభావం రెండూ ఉంటాయి  మారుపేర్ల తోనే ఎక్కువ గా రాశాడు .నాటక రంగం పై మోజు ఎక్కువ అంతకంటే అందులో నటించే నటీమణులంటే మరీనూ .’’కొడాం ఆర్ దిక్విన్తెసేన్స్ ఆఫ్ డిబాచేరి ‘’నాటకం బాగా పేరు పొందింది .తగల బెట్టగా మిగిలిన ‘’సోడాంనాటకాన్ని అమ్మితే 45,600పౌండ్లు వచ్చాయట .భార్యకూ స్నేహితుడికీ రాసిన ఉత్తరాలు సరస సల్లాపాల్లాగా,చాల తేలిక వచనం తో అందర్నీ ఆకర్షించాయి .

ఆ కాలం లో ఎందరో నటులకు రోచెస్టర్ ఆదర్శం .   శామ్యూల్ జాన్సన్  ‘’worthless and dissolute rake ‘’    అన్నాడు  .ఆండ్రూ మార్వేల్ మాత్రం ‘’the only man in England that had the true vein of satire ‘’అని పొగిడాడు .వోల్ టైర్ ‘’మాన్ ఆఫ్ జీనియస్ అండ్ గ్రేట్ పోయేట్ . సెటై ర్ లలో శక్తి ,సామరధ్యం ఉన్నాయి ‘’అని మెచ్చాడు .   హాజ్ లిట్ రోచేస్టర్ కవితలు సాన బెట్టిన వాజ్రాలని కాంతితో మెరిసి పోతూ ఉంటాయనీ అన్నాడు  . గోతే   తన స్వీయ చరిత్రలో  రీజన్ కు మానవత్వానికి వ్యతిరేకం గా ఉన్న  రోచెస్టర్ సెటైర్ ను పొందు పరచాడు .ఇలా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలన్డుకొన్నాడు రోచెస్టర్ .

John Wilmot.jpg  

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.