పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26

పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

‘’  విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త ,తమాషా రైమ్స్ తో కవిత్వాన్ని పండించిన వాడు .కాలాతీత కవిత్వాన్ని సృష్టించాడని ఇరవయ్యవ శతాబ్ది విమర్శకుల అభిప్రాయం .’’one of the greatest poets of our poets who is in his two finest poems perhaps the most flawless artist of our race has produced ‘’అని ఎడిత్ సిట్వేల్ చేత ప్రశంసింప బడ్డాడు .ఆయన రచనలు అనేక ఆలోచనలకు  పదకోశం .షేక్స్ పియర్ తర్వాత తరచుగా ఉదహరింప బడే కవి .’’to  err is human to forgive is divine ‘’,a little learning is a dangerous thing ‘’,fools rush where angels fear to tread ‘’men must wlalk before they dance ‘’మొదలైనవి అందరూ తరచుగా ఉదాహరించేవే .

అలేక్సాండర్ పోప్ లండన్ లో 22-5-1688న జన్మించాడు .ముసలి తలిదండ్రులకు ఒక్కడే కొడుకు .తండ్రి లినెన్ డ్రీపర్ .చిన్నప్పుడు కుర్రాడు బానే ఉండే వాడు .కాని చిన్ననాటే జబ్బుకు గురై ఆరోగ్యాన్ని కోల్పోయాడు మళ్ళీ పూర్వ ఆరోగ్యాన్ని పొందలేదు .ఇక పొందలేదని కూడా రూఢి అయింది .పూర్తిగా ఎదగక పొట్టి వాడుగా నే ఉండిద పోయాడు .డొక్క లోపలి పోయి యూని వర్సిటీలలో చదవ లేదు .సామాన్య కుటుంబం లో పుట్టటం వలన అన్నిటికీ దూరమైనాడు .జీవితాంతం బాధించిన ఆవ్యాధియేఅన్నిటికీ కారణమైంది .విధి వక్రించింది ఒక రకం గా .పదేళ్ళ వయసులో గ్రీక్ లాటిన్ లను అనువదించిన మేధావి .పన్నెండుకు హోరేస్ రాసిన సాలిట్యూడ్ కు పారా ఫ్రేజ్ రాశాడు .అది ఇప్పటికీ గొప్ప ఆ యాన్తాలజి గా గుర్తింపు పొందుతోంది .ఒక మహా కావ్యాన్ని ‘’అలేక్సాండర్ ప్రిన్స్ ఆఫ్ రోడ్స్ ‘’పేరిట రాయటం ప్రారంభించాడు .ఇందులో తానూ అభిమానించిన అందరికవుల చాయలూ ఉన్నాయి .ముఖ్యం గా వర్జిల్ ,హోమర్ లంటే వీరాభిమానం .

లండన్ నుంచి కుటుంబం విన్ స్టార్ ఫారెస్ట్ లోని బిన్ ఫీల్డ్ కు మారినప్పుడు ఈ కావ్యం మొదలెట్టాడు .దాన్ని తగల బెట్టేశానని చెప్పాడు కాని పన్నెండు పదిహేనేళ్ళ మధ్య దాన్ని మళ్ళీ రాసి వెలుగు లోకి తెచ్చాడంటే పొట్టోడు గట్టొడే అని పిస్తుంది అందుకే ‘జయంట్’డ్వార్ఫ్ ‘’అన్నారు .పద్నాలుగో ఏట ‘’ఆన్ సైలెన్స్ ‘’,అపాన్ నతింగ్ ‘’లు రాశాడు .పదహారు లో వరుస ‘’పాస్తోరల్ ‘’పోయెమ్స్ రాశాడు .ఇవి వ్రాతప్రతులుగా అందుకొన్న వాల్ష్ ,జార్జి గ్రాన్ విల్లీ వంటి వారిని మెప్పించాయి ‘’ఒక అజ్ఞాత మహా మేధావి అడవిలో మగ్గుతున్నాడు ‘’అను కొన్నారు .ఇలాగే విజ్రుమ్భించి రాస్తే అందర్నీ మించిపోయే మహా కవి అవుతాడని మురిశారు .ఇది తెలిసిన జాకబ్ తాన్సన్ అనే ముద్రాపకుడు వాటిని ముద్రిస్తానని  ముందుకొచ్చ్చాడు .అతనిలో మహా పాండిత్యం కవితా ప్రతిభా ఉన్నాయని గ్రహించాడు .వాటి ముద్రణ తో పోప్ గొప్ప కవి అయి పోయాడు ఇరవై కే .

ఇందులో పోప్ గొర్రెల కాపర్లు లండన్ వాసుల్లా మాట్లాడి ఆశ్చర్య పరుస్తారు .ఒకే రైం ను కొన్ని పంక్తుల్లో వాడాడు .చెవికి ఇంపైన పదజాలం తో అతనొక  మాటల  సృష్టి కర్త అయ్యాడు .

ఇరవై రెండో ఏట ‘’ఎస్సే ఆన్ క్రిటిసిజం ‘’రాశాడు .ఇందులో భాష లో భావం లో శబ్ద కూర్పులో హోయాల్లో లయలలో ఆయన పోకడలు అనంతం .ఇది పోయెం ఆఫ్ ది పీరియడ్ గా గుర్తింపు పొందింది .సరి అయిన విద్య నేర్వాలని హెచ్చరించాడు .కొత్తదనం కోసం పాకులాడ వద్దన్నాడు .కొత్తొక వింతా పాతొక రోత అనే భావం వదిలేయ్యమన్నాడు .’’fear not the anger of the wise to raise .those best can bear reproof who merit praise ‘’అని బోధించాడు .

‘’his life is had been no longer than one of his poems –the life of half a day ‘’అని కొందరు ఈసడించారు .అతని శారీరక అవ లక్షణాన్ని ఆవ హేళన చేయటం తో ఆ ఇరవై మూడేళ్ళ యువకుడు మానసికం గా కున్గిపోయాడు .కాని ఎక్కడా బయట పడలేదు .కాని లోలోపల కుములుతున్నాడు .తన బాధను ఒక కవితలో’’ గే కవి’’కి చెప్పుకొన్నాడు .యాభై లో ఎవరొ ఒకరి సాయం లేకపోతే నిలబడ గలిగే వాడుకాదు .దీన్ని జాన్సన్ ఎద్దేవా చేశాడు .అబట్టలు మార్చటం కూడా ఎవరో చేయాల్సిందే. ఎప్పుడూ ఒకసేవకుడు   ఉండాల్సి వచ్చేది .నరక యాతన అనుభవించాడు .దీనికి తోడూ సూటి పోటీ మాటలు .ఆయనకు తెలియ కుండా జోనాధన్ స్విఫ్ట్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు  ప్రింట్ చేశారు .స్విఫ్ట్ గ్రహించి  తనకు పోప్ రాసినవి తిరిగి పంపించేశాడు .ఇలా ఆ కురచ మహా కవిని అన్ని విధాలా అవహేళన చేశారు .ఇందులో పోప్ స్వయం క్రుతాపరాధమూ లేక పోలేదు .

ఏంతో మంది స్త్రీల తో తిరిగాడంటారు .అందులో తెరెసా ,మార్తా బ్లౌంట్ అనే సిస్టర్స్ ఉన్నారు .ఇందులో ఒకరు ఆయన అర్ధాంగి అయి ఉంటారని ఊహా గానం .అనుమానాలకు తావు ఇవ్వటం పోప్  లక్షణం కూడా .లేడీ మాంటేగ్ తో ఒప తగాదా పడ్డాడు .ఆమె చేసిన అవమానాన్ని మర్చిపోలేక పోయాడు ఒకదాని వెంట ఒకటి కవితలు గిలికి పారేశాడు .ఆమె కున్న మర్మావయవ జబ్బును అందరికి  అంటించింది అని కూడా   .’’ది రోప్ ఆఫ్ దిలాక్ ‘’లో అనేక అసందర్భాలున్నాయి ‘ది ఎపిసిల్ టు డాక్టర్ ఆర్బత్ నాట్ ‘’ను నలభై ఆరో ఏట ప్రచురించాడు .పోప్ కంటే పాతికేళ్ళు పెద్ద వాడైన ఆర్బర్త్ నాట్ ‘’ద్వేషం వదిలేయి మానవ ప్రకృతిలోని మంచినీ నీతినీ గురించి ఇక నుంచైనా రాయి ‘’అని సలహా ఇచ్చాడు .అది తనమంచికోసమే ననీ చెప్పాడు .దీనితో పోప్ కళ్ళు తెరుచుకొన్నాయి కొత్త భావాలు ఆలోచనలు దర్శనాలు తో కవిత్వం దారి మళ్ళింది .వ్యక్తిగత ద్వేషాన్ని దూరం చేసుకొన్నాడు .’ఎపిజిల్స్ ‘’లో తన నూతన ప్కడలు చూపాడు కాని లోపల లార్డ్ హీర్వీ పై ద్వేషం వదలలేదు  .

పోప్ అనువాదం చేసిన ఇలియడ్ ప్రచురణ తో ఆర్ధికం గా పున్జుకొన్నాడు ఒక్కో దానికి గినియా రేటు పెట్టాడు ఆరు వందల మందికొన్నారు .రాజు రెండు వందల పౌండ్లు కానుక ఇచ్చాడు .ఆరుగురు అసిస్టంట్ లతో ఆ అనువాదాన్ని ఆరేళ్లలో పూర్తీ చేశాడు .అయిదు వేల పౌండ్ల ధనాన్ని చేకూర్చింది ఇది .దీనిపై విమర్శలోచ్చాయి ఇది హోమర్ రచన లా లేదన్నారు .ఇవేవీ పోప్ ను ఆపలేక పోయాయి ఆ కాలపు ‘’సాహిత్యమార్తాండుడే ‘’అయ్యాడు .దీనితర్వాత ‘’ట్వికెన్ హాం ‘కు మకాం మార్చాడు చిన్న ఇల్లు తోట ఏర్పాటు చేసుకొన్నాడు .స్విఫ్ట్ వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాడు పోప్ ను గురించి ‘’.Pope has the talent well to speak –but not to reach the ear his loudest voice is low and wea k –the Dean too deaf to hear ‘’అని స్విఫ్ట్  తన అనుభవాన్ని గురించి రాశాడు .ఒడిస్సీ కి పోప్ రాసిన మూడు భాగాల పుస్తకాలు అప్పుడే పబ్లిష్ అయ్యాయి నాలుగు అయిదు భాగాలు ఏడాది తర్వాతా వచ్చాయి .’’the story is Homer;s  but the accent is Pope;s ‘’అన్నారు .ఇరవై నాలుగు భాగాలలో అయిదు తప్ప మిగిలినవ్నీ పోప్ ట్రాన్స్లేట్ చేశాడు .నిజానికి ఆయన చేసినవి పన్నెండు మాత్రమె. మిగిలిన వాటికి పర్య వేక్షణ చేశాడు .

నలభై లో’’ది దంసియాడ్’’అనే స్వీయ రచన ప్రారంభించాడు ,ఇందులోపగా ద్వేషం పరాకాష్ట లో ఉంటాయి .యాభై ఒకటిలో దైవం మానవుడు అనే విషయాల మీద రాయాలని ఉందని జాన్ కార్లైల్ కు రాశాడు .’’ఎస్సే ఆన్ మాన్ ‘’రాశాడు .దీన్ని ముద్రించిన తర్వాతా అయిదేళ్ళు సెటైర్స్ వగైరా రాశాడు .’’డి వర్క్స్ ఆఫ్ అలేక్సాండర్ పోప్ ‘’ముప్ఫై వ ఏట నే ముద్రించారు .రెండో భాగం నలభై ఏడులో దీనితో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలూ అచ్చయ్యాయి .సన్నిహితురాలైన మార్తా బ్లాంట్ కు చివరి ఉత్తరం మార్చ్ లో రాశాడు .రెండు నెలల తర్వాతా’’30-5-1744లో ‘’మరు గుజ్జు మహా కవి ‘’మరణించాడు . డాక్టర్ ను తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు చనిపోయే ముందు బాగుందని వాళ్ళు అంటే ‘’here I am dying hundred good symptoms ‘’అని తన చావు దగ్గర పడిందని చెప్పాడు .రోమన్ కేధలిక్ చర్చి విధానం లో అంత్య క్రియలు చేశారు  చేశారు .చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ,చర్చ ఆఫ్ సెయింట్ మేరీ ది విర్జిన్  ఆఫ్ ట్వింకిల్ హాం లలో సమాధి చేశారు .

‘’Pope was an accurate recorder of a society that flourished on cliques and intrigues and countless subterfuges.to this society Pope was a victim and mocking contributor .he was also un acknowledged laureate .it is a poetry that speaking almost entirely to the disillusioned intelligence ,springs from the dischanted mind –a saddened but a cynical mind ,aware that while men;s  machanations may make for ignoble living ,they also make entertaining and some times enduring literature ‘’అని పోప్ ను అతని కవిత్వాన్ని అంచనా వేశారు .

హీరోయిక్ కప్లేట్స్ లో సుప్రసిద్ధుడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో పోప్ ను అనేక మార్లు షేక్స్పియర్, టెన్నిసన్ ల తర్వాతా ఉదాహరించారు .బైబిల్ సంస్కృతికి ప్రతి బింబం గా ఉన్నాడు .స్త్రీ భావ వ్యతిరేకి అని స్త్రీ వాద రచయితలు భావించారు .

 

 

Alexander Pope by Michael Dahl.jpg        

  

పోప్  మరణ దృశ్యం

 

సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.