పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27

సోగాసు,లాలిత్యాల పతనం

పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై పంటలకాలవాలమైంది  .వీటి అందాలను కవిత్వం లో నింపారు కవులు .అలాంటి వారిలో మాధ్యూ గ్రీన్ జేమ్స్ థామ్సన్ ,థామస్ గ్రే జాన్ డయ్యర్ ,విలియం కాలిన్స్ ,విలియం కూపర్ .మారుతున్న పల్లె స్తితి గతులను ఆలివర్ గోల్డ్  స్మిత్ గ  జార్జి క్రాబిల్ లు ఆవిష్కరించారు .క్రిస్టోఫర్ స్మార్ట్ ,థామస్ చాట్టేర్ట న్ ,కొంతపట్న  వాసనను పల్లె కవిత్వానికి అంటించారు .రాబర్ట్ బర్న్స్ పాటలు విలియం బ్లేక్ ,విజన్ మరి కొంత మార్పును చూపాయి . రెండో తరాహా కవులు సామ్యుల్ జాన్సన్ ,చార్లెస్ చర్చిల్ లు మాత్రం పోప్ తరహా కవిత్వాన్నే అనుసరించారు .హీరోయిక్ కప్లేట్స్ రాశారు .భావాలను వృద్ధి చేసి కవిత్వ విధానం లో మార్పులు చూపారు .ఈ ప్రయత్నాలు ,కొత్త పోకడలు ,రీతి ఉన్నా కన్సర్వేటివ్ మనస్తత్వం ఉందని ఇలియట్ అన్నాడు .

సాహిత్య షరాబు ,నిఘంటు నిర్మాత – సామ్యుల్ జాన్సన్

కవిగా గుర్తింపు లేక పోయినా అసలు కవే కాక పోయినా సామ్యుల్ జాన్సన్ ఆగస్టస్ కాలం లో విశేష ప్రాభవం ఉన్న వ్యక్తీ .వ్యాస కర్త ,జీవిత చరిత్రకారుడు ,లేక్సికో గ్రాఫర్ ,విమర్శకుడు ,గొప్ప సంభాషణా చతురుడు .17-9-1709లో శాఫోర్డ్ షైర్ లోని లిచ్ ఫీల్డ్ లో జన్మించాడు .తండ్రి పుస్తక వ్యాపారి .బాల్యం బాలారిస్టాలతో గడిచింది .నాలుగేళ్ళప్పుడు ‘’కింగ్స్ ఈవిల్ ‘’అనే జబ్బు సోకి ,రాజుగారి హస్త స్పర్శ తో తగ్గుతుందనే నమ్మకం తో లండన్ కు  తీసికెళ్లారు .అన్నే రాణి చేయాల్సింది అంతా చేసింది కాని గుణం కనీ పించలేదు .ఆ జబ్బుతోనే జీవితాంతం  బాధ పడ్డాడు .కంటి చూపు తగ్గి పోయింది .ఇన్ని అవరోదాలెదురైనా  స్వయం గా విజ్ఞాన సముపార్జన చేశాడు  .అతని జ్ఞాపక శక్తి అసాధారణం .గ్రామర్ స్కూల్ లో లాటిన్ నేర్చాడు పందోమ్మిదిలో ఆక్స్ ఫర్డ్ లోని పెంబ్రూక్  కాలేజిలో చేరి ,ఒక ఏడాది చదివి ఆర్ధిక ఇబ్బందులతో మానేశాడు .అతని బూట్లు చిరిగి పోయి పాదాలు బయట పడేవి కొత్తవి కొనుక్కోలేనంత నిర్భాగ్యుడు .

రెండేళ్ళ తర్వాత తండ్రి మరణం తో ఆయన ఇచ్చిన ఇరవై పౌండ్ల తో జీవించాల్సి వచ్చింది .మార్కెట్ బాస్ వర్త్ లోని ఒక స్కూల్ లో టీచర్ గా చేరి పొట్ట పోసుకొన్నాడు .బిమ్మింగ్ హాం జర్నల్ కు రాస్తూ కాస్తో కూస్తో సంపాదిస్తూండే వాడు .అక్కడి పుస్తక వ్యాపారి జాన్సన్ మొదటి పుస్తకం ‘’ ఏ ఒడ్ టు అబిసీనియా ‘’ను ప్రచురించాడు .ఇరవై ఆరో ఏట ఎలిజ బెత్ పోర్టర్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఇతితని కంటే ఇరవై ఏళ్ళు పెద్దదైన వితంతువు .ఇద్దరు కలిసి బోర్డింగ్ స్కూల్ నడిపారు .ఏడాదికే మూత పడింది .జాన్సన్ లండన్ చేరి అక్కడే ఉండిపోయాడు .చూడటానికి అందం గా ఉండే వాడుకాదు .కోపం ఉద్రేకం ,సరైన వస్త్ర ధారణ లేక పోవటం ,తీవ్ర స్వభావం జాన్సన్ బాహ్య  లక్ష ణాలు .సన్నగా అస్తిపంజరం లా ఉండేవాడని శిష్యుడు బాస్వేల్ గురువును వర్ణించాడు .ఒక కంటితోనే చూడా గలిగే వాడు .అవయవాలను స్వేచ్చగా కదిలించ గలిగే వాడు కాదు .కాని మానవత్వం ఉన్నవాడు .న్యాయ ధర్మాలతో సంచరించేవాడు  సాహిత్యాన్ని బేరీజు వేసి తూచి నాణ్యతను నిగ్గు తేల్చే గొప్ప సమర్ధత ఉన్న షరాబు .ప్రతి సాహిత్య కారుది మీదా జాన్సన్ ఏం చెప్పాడు అని అందరూ ఎదురు చూసే వారు .

‘’ది జెంటిల్ మానస్ మెగ జైన్ ‘’ ప్రింటర్ పబ్లిషర్ ఎద్వార్డ్ కేవ్ –జాన్సన్ కు ఉద్యోగం ఇచ్చాడు .అందులో పని చేస్తూ వ్యాసాలూ స్కెచ్ లు కవితలు ,పార్ల మెంటరీ చర్చల పై  రిపోర్టులు రాశాడు .వినపడని వాటిని స్వయం గా సందర్భానికి తగి నట్లు కూర్చి రాసేవాడు .జువేనాల్ రాసిన ‘’మూడవ సెటైర్ ‘’పారా ఫ్రేజ్ రాశాడు తర్వాత ‘’వానిటీ ఆఫ్ హ్యూమన్ విషెస్ ‘’పదకొండేళ్ళ తర్వాతా రాశాడు .అతని కామెంటరీ లన్నీ లాటిన్ పద జాలం తో బైబిల్ సూక్తి ముక్తావళి తో ఉండేవి .ఒక సమగ్ర డిక్షనరీ తయారు చేయాలనే కోరిక కలిగి దానికి తగిన ప్రణాళిక తయారు చేసి లార్డ్ చెస్టర్ ఫీల్డ్ కు సమర్పించాడు .యేళ్ళు  గడిచినా దానిపై రాజు స్పందించలేదు నిర్లక్ష్యానికి బాధ  పడ్డాడు .అనుమతి లేక పోయినా మొదలు పెట్టాడు .పూర్తీ చేశాడు దీనిమీదా రాజు పెద్దగా ద్రుష్టిపెట్టలేదు .విసిగెత్తి విన్నపాలుగా జాబులు రాశాడు .కావాలనే రాజు అలా చేశాడని గ్రహించాడు

జాన్సన్ అదృష్టం దోబూచు లాడింది .’’ఐరీన్ ‘’పేరరాసిన బ్లాంక్ వేర్స్ ట్రాజెడీని గార్ర్రిక్ అనే శిష్యుడు ప్రదర్శించాడు దీని కి రెండు వందల పౌండ్లు మాత్రమె వచ్చాయి .ట్రాజెడీ ట్రాజేడీనే మిగిల్చింది త .’’రాసీల్స్ –ప్రిన్స్ ఆఫ్ అబిసీనియా ‘’నవల రాశాడు  దీన్ని ఒల్తైర్  రాసిన ‘’కాన్దీద్ ‘’తో పోల్చారు .మూడవ జార్జి అధికారం లోకి వచ్చిన తర్వాత జాన్సన్ కు ఏడాదికి మూడొందల పెన్షన్ ఏర్పాటు చేశాడు .ఆర్ధిక స్తితి బాగు పడింది .షేక్స్ పియర్ నాటకాలను ఎనిమిది పుస్తకాలుగా పూర్వపు వారి కామెంటరీ ల ననుసరించి తెచ్చాడు. అందులో జాన్సన్ సామర్ధ్యం తక్కువే నన్నారు .చివరి రచన గా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’ను డెబ్భై వ ఏట రాయటం ప్రారంభించాడు. అదే వ్యాపకం గా జీవించాడు. రెండు వందల గినీలోచ్చాయి అతని జ్ఞాపక శక్తి మేధా ,కూర్పు అనితర సాధ్యమని పించాయి .రెండు వందల ఏళ్ళ  పాటు అదే కవుల జీవితాలకు కరదీపిక గా నిలిచింది .కవుల జీవితం కవిత్వం అందులోని సొంపులు ఇంపులు విమర్శనాత్మకం గా రాశాడు .సత్యాన్వేషణ లో ఎవరినీ వదలలేదు .’’un disputed leader of thought for a quarter of a century –a writer whose prodigious reputation surpassed his out put .’’డెబ్భై అయిదేళ్ళ వయసులో 13-12-1784 న జాన్సన్ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .

జాన్సన్ రాసిన చిన్న కవితాలలో మెరుపులు లేవు గుర్తుండి పోయేవీకావు .’’రాసిలాస్’’ లో జాన్సన్ ‘’the business of a poet is to examine not the individual but the species –to remark general properties and large appearences .he does not number the streaks of the tulip or describe the different shades of verdure of the forest ‘’అని భాష్యం చెప్పాడు .సాహిత్యం లో జీవిత చరిత్రలకు తేరా దీసిన వాడు జాన్సన్ .రాసి తక్కువైనా వాసి ఎక్కువ అనేట్లు కవిత్వం రాశాడని కొందరి అభిప్రాయం .’’క్రిటిక్కుల క్రిటిక్ ‘’అన్నారు .

Portrait of Samuel Johnson after Sir Joshua Reynolds

 

వ్యంగ్య కవి చార్లెస్ చర్చిల్

చర్చిల్ కవిత్వం ఏవగింపు అన్నాడు సామ్యుల్ జాన్సన్ .చర్చిల్ కవిత్వం తాత్కాలికానందాన్నిస్తుందని శిష్యుడు బాస్వేల్  అంటాడు .సమకాలీనులను ఆశ్చర్య చకితుల్ని చేశాడు చర్చిల్ .ఒక క్లేర్జిమన్ కు 1732లో పుట్టిన చర్చిల్ వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జి సెయింట్ జాన్ కాలేజిలో చదివాడు కాని మెట్రి కూడా పాస్ కాలేదు .బాకీ ఉన్న డబ్బులు కవిత్వం రాసి తీరుస్తానన్నాడు .’’అపాలజీ ‘’రాసి వెయ్యి పౌన్లు ఆర్జించాడు .భార్యనోదిలేసి కనపడిన అందరితో కులికాడు .ఒక వ్యాపారి కూతురికి లైన్ వేసి కొంపలో కూర్చో బెట్టాడు. ముతక కవిత్వం గిలికాడు ‘’ది ప్రాఫేసీ ఆఫ్ ఫామిన్ ‘’రాసి కొంచెం కదిల్చాడుజనాన్ని .జనం మర్చిపోయిన కవుల్లో చర్చిల్ ఒకడయ్యాడు .ముప్ఫై రెండులో ఒక ప్రయాణం లో ఆక్సి డెంట్ వలన4-11- 1764లో చనిపోయాడు .1763లో రచనలు ముద్రింప బడ్డాయి.

 

  

 

గ్రీన్ ,డయ్యర్ ,థామ్సన్

ప్రయోజన కరమైన కవిత్వాన్ని రాసిన వారిలో మాధ్యూ గ్రీన్ ఉన్నాడు .1697లో పుట్టి 1737లో చని పోయాడు .లండన్ లో పుట్టి అదే ప్రపంచం గా బతికాడు మర్యాదాపూర్వక కవితలల్లాడు .క్వేకర్స్ కోసం ది సీకర్ ‘’,’’అపాలజీ ఫర్ క్వేకర్స్ రాశాడు .ఒకరకం గా క్వేకర్ కవి .

ఉన్నికవి-  జాన్ డయ్యర్ వేల్స్ 1699-1744వాడు .ఇటలీలో పెయింటింగ్ కోర్సు చదివాడు .ప్రక్రుతి దృశ్యాలను చిత్రకారుడి దృష్టితో చూశాడు కవిత్వం సాహిత్య భ్రాంతి తో ఉంటున్దని అన్నారు  .ప్రతి నామ వాచాకానికి విశేషనం ఉంటుంది .క్లేర్జిమన్ అయిన డయ్యర్ పరిశీలనను నీతి బోధనాన్ని చేర్చి మనిషి కోసం రాశాడు. విషయాన్ని వాస్తవ దృష్టితో చూసి కవిత్వం రాశాడు .ఏడు వందల లైన్ ల ‘’ప్లీస్ ‘’రాశాడు .ఇది వర్జిల్ రాసిన జిఅర్జిక్స్ లా ఉంటుంది .ఉన్ని నేత విషయమే ఎక్కువ ..మగ్గాల ధ్వనుల్ని పసికట్టి కవిత్వం లో చోటుకల్పించాడు. మాంచెస్టర్ ,చెస్ ఫీల్డ్ లకు వృత్తికి ప్రతీకలివి ‘’the cries of sorrow sadden all the streets –and the disease of intemperate wealth ‘’ అను ఉన్ని వ్రుత్తి లో వారి కష్ట సుఖాలన్నీ కళ్ళకు కట్టించాడు .’’ఉన్ని కవి ‘’అని పిస్తాడు ‘’గ్రాన్గేర్ హిల్’’అనే ప్రసిద్ధ కవిత లో పతన వాస కవిత్వం లోని డొల్ల తనాన్ని చూపాడు .సూక్తి ముక్తావళి లాంటి కవిత్వాన్ని రాశాడు .

బ్రిటన్ జాతీయ గీతాన్ని రాసిన  జేమ్స్ థామ్సన్ 1700లో పుట్టి 1748లో మరణించిన స్కాట్ లాండ్ కవి .ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో చదివి చర్చి మినిస్టర్ కు సెలెక్ట్ అయి మనసు మార్చుకొని లండన్ చేరి పోప్ సర్కిల్ లో చేరి ,పోషకుల వలన ఇటలీ ఫ్రాన్స్ లు తిరిగి ఫ్రాన్స్ లో లార్డ్ చాన్స్ లర్ కొడుకుకు కు ట్యూటర్ అయ్యాడు .డ్రామటిస్ట్  గా విజయ దుందుభి మొగిన్చి లండన్  తిరిగి వచ్చాడు .గ్రామీణ రిచ్ మాండ్ లో కాపురమున్నాడు .అయిదు ట్రాజేడీలు రాశాడు .టెన్ సిలబిల్ బ్లాంక్ వేర్స్ ను వాడాడు .’’ఒ సోఫియా సోఫియా ‘’అనే దీర్ఘ ఎలిగరి  కవిత రాశాడు .’’ది కాజిల్ ఆఫ్ ఇండోలేసేన్స్ ,’’ఆల్ఫ్రెడ్ ‘’లు కూడా రాసి మెప్పించాడు .ఆల్ఫ్రెడ్ లో బ్రిటన్ జాతీయ  గీతం ఉంది .ప్రకృతిని ప్రేమిస్తూ చాలా రాశాడు .దీర్ఘకవితల్లో బ్లాంక్ వేర్స్ నుపయోగించాడు. కొత్త పరిశోధనలపై కవిత్వం రాసి అంతకు ముందెవరూ చేయని సాహసం చేశాడు .శరదృతువులో జాబిలీ అతనికి ‘’week and blunt ,is wide refracted rays ‘’లా కని పించింది .’’ది సీజన్స్ ‘’లో పెద్దగా సంచలనాత్మకమైన విషయాలు లేవు .కాని ఆ పంక్తులలో సంగీతం మనసుకు హాయి నిస్తుంది .ఆ తరం కవులలో ఎవరికీ అబ్బని ఈ సంగీత గుణం థామ్సన్ కవిత్వం లో చేరి బంగారానికి తావి అబ్బి నట్లయిది .దీనికి జెర్మనీ అనువాదం ప్రపంచ ప్రసిద్ద మైంది .ధాంసన్ మరణం పై జాన్సన్ స్పందిస్తూ ‘’ by taking cold on the waters between London and Kew ,he caught a disorder which careless exasperation ended in a fever that put end to his life’’అన్నాడు .

సశేషం

రేపు శ్రీ హనుమజ్జయంతి -శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-14-ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.