పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28
విలియం కాలిన్స్
విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్ ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల వయసులో మొదటి సంకలనం పబ్లిష్ చేశాడు .ఇరవై ఆరులో ‘హౌ స్లీప్ ది బ్రేవ్ ‘’రాశాడు .ప్రతిభా వంతుడైన కవి అని పించాడు .చర్చి ,సైన్యం లలో దేనిలో చేరాలో తెలీక ఊగిస లాడాడు.ఇరవై ఎనిమిదిలో చేతిలో దమ్మిడీ లేని స్తితి .ఒక అంకుల్ ఆదుకొన్నాడు .ముప్ఫై లో ఉన్మాదం వచ్చింది .చివరి తొమ్మిదేళ్ళు మానసిక ఆందోళన ,శారీరక రుగ్మత లతో బాధ పడ్డాడు .ఆక్స్ ఫర్డ్ లో శరణాలయం లో ఉన్నాడు .ఎవర్నీ చూడ టానికి ఇష్టపడలేదు చని పోయినా ఎవరికీ తెలియ లేదు ఏ పేపర్లోనూ అతని చావు వార్తా రాలేదు .‘’దిర్జీ అండ్ సింబలిన్ ‘’మాత్రం అందర్నీ ఆకర్షించింది .ఇది స్వీయ చరిత్ర .విషాదం గా సాగుతుంది .మంచి భావుకత ఉన్న కవి
. విలియం కూపర్
ఈ ప్రపంచ దుస్తితికి కుంగి కాలిన్స్ లానే పిచ్చివాడైన విలియం కూపర్ 26-11-1731లో బెర్కామ్స్ స్తేడ్ లో పుట్టాడు .అసూయ అతాన్ని తోటివారికి దూరం చేసింది .బోర్డింగ్ స్కూల్ లోనే అందరూ ఏడిపించేవారు .వెస్ట్ మినిస్టర్ చేరాడు …సొలిసిటర్ కు సహాయకుడి గా ఉన్నాడు .మిడిల్ టెంపుల్ లో బార్ లో చేరాడు .ఒక కజిన్ ను ప్రేమించి భంగపడి దెబ్బతిన్నాడు .కొద్దిగా ప్రాక్టీస్ లో ఉండగా తోటి లాయర్ల ఈసడింపుకు గురై రెండో సారి దెబ్బతిన్నాడు నరాల బలహీనత మరీ కుంగ దీసింది .తరచూ డిప్రెషన్ కు లోనయ్యే వాడు .ముప్ఫై రెండులో హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గుమాస్తా ఉద్యోగం వస్తే చేరాడు .అక్కడ చేయాల్సిన పని చూసి మనస్తిమితం కోల్పోయాడు .చావాలని ప్రాయత్ని స్టే శరణాలయం లో చేర్చారు .పద్దెనిమిది నెలల తర్వాతా బయటికొచ్చాడు .హంటింగ్ హాం చేరాడు మొరాలియన్ అన్విన్ దంపతులు ఆదరించారు .రెండేళ్ళ తర్వాతా మొరలె గుర్రపు సవారిలో కిందపడి చనిపోతే కూపర్ బకింగ్ హాం షైర్ లో ఒల్నీ కి చేరాడు .మేరీ అతని వెంట ఉంది జాగ్రత్త గా కనీ పెట్టి చూస్తుండేది .ఇద్దరి మధ్యా వలపులు సాగి పెళ్లిదాకా వచ్చి మళ్ళీ దురదృష్ట వశాత్తు మేరీ చనిపోవటం తో మూడోసారి మానసికం గా దెబ్బ తిన్నాడు .శారీరక, మానసిక ఆరోగ్యాల లేమితో డెబ్భై ఏళ్ళు బతికి 25-4-1800లో చనిపోయాడు .జాన్ న్యూటన్ అనే మత ప్రవక్త ప్రేరణ తో ఇవాంజెలికల్ ధోరణి లో అరవై ఏడు భక్తీ కవితలు రాశాడు .వీటికి ‘ఒల్నీ హైమ్స్’’అని పేరు పెట్ట్టాడు .పెళ్లి చేసుకో దలచిన అమ్మాయి గురించిన చింతన తో రాశాడు .కూపర్ కవి విషాదాన్ని సిసిల్ ‘’ది స్త్రికేన్ ‘’లో రాసిన లార్డ్ డేవిడ్ కు చూపాడు .యాన్తాలజిస్తులు కూపర్ రాసిన ది పాప్యులర్ ఫీల్డ్ ‘’,ఆన్ ది లాస్ ఆఫ్ దిరాయల్ జార్జి ‘’కవితల్ని తరచూ ఉదహరిస్తారు .గొప్ప లేఖా సాహిత్యాన్నీ రచించాడు మంచి ప్రభావం ఉన్నా విధి చేతిలో దెబ్బ తిన్న కవి.”ది డై వేర్తేడ్ హిస్టరీ ఆఫ్ జాన్ గిల్పిన్ ”రాశాడు
బీద డాక్టర్ కవి -జార్జి క్రేబిల్
వివాదాస్పదు డని పించుకొన్న జార్జి క్రేబిల్ 24-12-1754లో ఆల్దేన్ బర్గ్ లోని సఫోల్క్స్ లో పుట్టాడు .విద్యా గంధం లేని వాడు .స్వయం కృషితో అన్నీ నేర్చాడు .ఉప్పు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేశాడు .తర్వాత ఒక సర్జన్ కు అసిస్టంట్ అయ్యాడు .మిడ్ వైఫ్ గానూ ఉన్నాడు.రోజు కూలి చేసీ బతికాడు .చివరకు ఆల్డే బర్గ్ లో డాక్టర్ అయ్యాడు .అతని ఊరి వాళ్ళు ఇతను బీదవాడనే భావన తో ఉండి డాక్టర్ గా గుర్తించలేదు .అతని సామర్ధ్యం పై నమ్మకం పెట్టుకోలేక పోవటం తో కేసులు రాక రాబడిలేక డాక్టర్ గా ఫైల్యూర్ అని పించుకొన్నాడు .ఇరవైఆరుకే చిల్లిగవ్వ లేని డాక్టర్ అయ్యాడు .ఎందరినో కలిశాడు .ప్రయోజనం శూన్యం .ఎడ్మండ్ బర్క్ ఆదరింఛి లండన్ తీసుకొని వెళ్ళాడు .అక్కడ సామ్యుల్ జాన్సన్ వంటి వారిని కలిసి వారి సాయం పొందాడు .బర్క్ సలహాతో చర్చి విధుల్లో చేరాడు .మళ్ళీ స్వంత ఊరు ఆల్దేబర్గ్ చేరినా అతని పేదరికం అతన్ని వెక్కిరించి అతని ద్వారా మత బోధ పొందటానికి ఎవరూ ముందుకు రాలేదు .మళ్ళీ నిరాశ .బర్క్ సలహా మేరకు జార్జిని చాప్లిన్ చేశాడు డ్యూక్ ఆఫ్ రట్ లాండ్ .సారా ఎమిలీ ని పెళ్ళాడాడు . దొర్సేట్ షైర్ లో రెండు పట్టణాలను అప్పగించాడు .
అక్కడే మొదటి ‘’ది విలేజ్ ‘’అనే కవితా సంకలనం తెచ్చాడు .ఇందులో గోల్డ్ స్మిత్ రోమాన్స్ కవితలని చెండాడాడు నవలా కర్త సర్ వాల్టర్ స్కాట్ ఆహ్వానిస్తే ఎడిన్ బర్గ్ వెళ్ళాడు .జార్జి కవిత కు అబ్బుర పడి చదివి విని పించుకొని మెచ్చి పదేళ్ళ తర్వాత కూడా వాటిని మర్చి పోకుండా నోటితో చెప్పాడు స్కాట్ .వయసు పెరిగిన కొద్దీ భావ సాంద్రతా పెరిగింది అరవైలో త్రో బ్రిడ్జి చర్చి కి మినిస్టర్ అయ్యాడు ‘’టేల్స్ ఆఫ్ ది హాల్ ‘’రాశాడు .థామస్ హార్డీ ‘’నేను క్రేబిల్ రాసిన విలేజ్ చదవక పోయి ఉంటె నా నవలలను రాసి ఉండే వాడిని కాను ‘’అని కితాబు ఇచ్చాడు .అభిమానులు ,కవుల మధ్య చివరి రోజులు గడిపాడు .జలుబు తో ప్రారంభమైన జబ్బు అతని ప్రాణాలను 3-2-1832న బలి కొన్నది .దాదాపు అజ్ఞాత కవిగా మిగిలాడు .ఒక శతాబ్దం తర్వాతా ఎడ్విన్ ఆర్లింగ్ టన్ క్రేబిల్ గుణ గణాలను ‘’ ‘’plain excellence and stubborn skill ‘’ ‘అని పొగిడారు .
ఆస్థాన కవి హోదా ను తిరస్కరించిన – థామస్ గ్రే
పన్నెండు మంది పిల్లలలోమిగిలింది ఒక్క ధామస్ గ్రే ఒకడుమాత్రమె .అలాగే ఒకే ఒక్క ‘’ఎలిజీ ‘’తో కవుల్లో అగ్రేసరుడని పించుకొన్నాడు గ్రే .లండన్ లో 26-12-1716జననం .చిన్నప్పుడే క్షయ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు .నుదుటిపై ఒక రక్త నాళాన్ని కోసి తల్లి బతికించింది. తండ్రి ముక్కోపి .దమ్మిడీ సంపాదన లేదు భార్య వదిలేసి పోయి కొడుకును స్వంతం గా పెంచుకోంది .తల్లి తరఫు బంధువు ఆదుకొన్నాడు .ప్రధాని ,రిచార్డ్ వెస్ట్ మరియు లార్డ్ చాన్స్ లర్ ఆఫ్ ఐర్లాండ్ కొడుకు హోరేస్ వాల్ పోల్ కు అసిస్టంట్ గా చేరాడు .లార్డ్ అకస్మాత్తుగా చనిపోతే గ్రే ఒకసానెట్ ను రాశాడు అది బాగుందని అన్నారు ’’and weep the more because I weep in vain ‘’ .పీటర్ హౌస్ లో లాయర్ అవాలనే కోరిక ఉండేది క్లాసిక్స్ పై ద్రుష్టి పడింది గణితం మానేసి అనువాదాలు చేశాడు కేమ్ బ్రిడ్జి లో చదివినా డిగ్రీ పొందలేదు .వాల్ పోల్ తనతో యూరప్ పర్యటనకు గ్రే ను వెంట తీసుకొని వెళ్ళాడు .రెండేళ్ళు ఇటలీ ఫ్రాన్స్ వగైరాలు చూశారు .ధన గర్వంతో గ్రే ను చిన్న చూపు చూసేవాడు వాల్ పోల్ .గ్రే ఇంగ్లాండ్ తిరిగోచ్చేశాడు .రెండేళ్ళు చదివి లాలో డిగ్రీ పొందాడు .కాని ప్రాక్టీస్ చేసిన దాఖలాలు లేవు
తల్లి రిటైర్ అయి ఇతని దగ్గరే ఉంది .వాల్ పోల్ జరిగిన దాన్ని క్షమించమని మిత్రుడికి కబురు పంపాడు అతను రాసిన ఎలిజీ అద్భుతం అన్నాడు .దాన్ని కావ్యం గా రాయమని కోరాడు .ఏడేళ్ళు రాసి అద్భుతం అని పించాడు ..పరువు ,ప్రతిస్టా పెరిగాయి .వ్రాత ప్రతి పైరేట్ అయి ఒక పబ్లిషర్ చేతికొచ్చి ప్రింట్ చేశాడు .డబ్బు తీసుకోవటానికి గ్రే తిరస్కరించి దెబ్బతిన్నాడు .దాన్ని అమ్ముకొన్న పబ్లిషర్ వెయ్యి పౌండ్లు సంపాదించుకొన్నాడు .తల్లి చని పోయిన తర్వాత పల్లెటూరిలోనే ఉన్నాడు .పూర్వ చరిత్ర ,ఐస్ లాండిక్ వేర్స్ లపై దృష్టి పడింది .’’పిండారిక్ ఓడ్స్ ‘’రాశాడు .నలభై లలో రాజాస్థాన కవి పదవి కి ఆహ్వానం వచ్చినా తిరస్కరించాడు .అది ఏ సరుకూ బుర్రా లేని విలియం’’ వైట్ హెడ్ ‘’కు దక్కింది .
ప్రొఫెసర్ అయి బోధించాలని ఆరాట పడ్డాడు. రాలేదు యాభై రెండులో ‘’ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ అండ్ మోడరన్ లాంగ్ వేజేస్ ‘’అయ్యాడు .యాభై మూడులో స్విట్జెర్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు .వాత రోగం వచ్చి క్షయ ముదిరి యాభై అయిదేళ్ళలో 30-7-1771.నచనిపోయాడు .పిండారీ ఓడ్స్ అందర్నీ మెప్పించాయి దానికి సరి అయిన రచన రాలేదు .అందుకే ‘’elegy is the one poem which entitles Gray to enduring fame .He presents a series of twilight pictures and condenses a philosophy which is both sad and soothing .youth to fortune and to fame unknown ‘’అని అతని స్నేహితుడు భావించాడు .
”the elegy written in a country church yard ” కు విశేష ప్రాభవం పొందాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు