పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30

స్వర్గ నరకాల  పరిణయం

చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు భ్రమించాడు .ప్రతి పొదలో నక్షత్రాలున్నట్లు అను భూతి పొందాడు .వాటిని తన చేతి అర్రతో స్పర్శించి ఆనందాన్ని పొందాడు .తమ్ముడు రాబర్ట్ ఈ అనుభవానికి ప్రత్యక్ష సాక్షి .పెద్దన్న జేమ్స్ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తే మూడో వాడు జాన్ తప్ప తాగి చనిపోయాడు .సోదరి కేతరీన్ అవివాహితగానే ఉండి పోయింది

బ్లేక్ స్కూల్ లో చదవనే లేదు .ఎప్పుడూ యేవో బొమ్మలు వేసుకొంటూ ఆ నాటి లండన్ ను కొత్తకోణం లో చిత్రించేవాడు  ఇంటికి ధేమ్స్ నది అతి దగ్గర.ఇవే అతని జీవితాన్ని మలుపు తిప్పాయి .ఆ నాటి కుర్ర కారు కు విరుద్ధం గా కొడుకు ఉండటాన్ని తండ్రి విపరీత ధోరణిగా భావించక ప్రోత్సహించాడు .పదో సంవత్సరం లోనే ఆర్ట్ క్లాసులకు పంపాడు .ప్లాస్టర్ ,గ్రీకు దేవతలా చిత్రాలు డబ్బు  ఇచ్చి అతని సృజనను ప్రోత్సహించాడు .బ్లేక్ జీవితాదర్శం మైకేల్ యాంజే లో ల అవ్వాలని .సొసైటీ ఆఫ్ అప్ప్రేన్టిస్  లో చేరాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఉన్న స్మ్రుతి చిహ్నాలను కాపీ చేసుకొన్నాడు .అందులోని గోదిక్ ఆభరణాలపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .ఈ భావన ను ఎప్పుడూ వదలుకోలేదు .పదహారు లో స్వంత ‘’జోసెఫ్ ఆఫ్ అరిమాటియా అమాంగ్ ది రాక్స్ ఆఫ్ ఆల్బియాన్ ‘’అనే శిల్పాన్ని తయారు చేశాడు .దీని నేపధ్యం అంతా సృజన తో కల్పించాడు .ఇది మైకేలాన్జేలో శిల్పం ‘’ క్రూసి ఫిక్సేషన్ ఆఫ్ సెయింట్ పీటర్ ‘’ను గుర్తుకు తెస్తుంది .దీనిని వర్ణిస్తూ’’ఈ పదహారేళ్ళ పడుచు కుర్రాడు ‘’ రాసిన  కేప్షన్ తలలు పండిన పండితులు రాసినట్లు గా ఉండి అందర్నీ ఆశ్చర్య పరచింది అదే –‘’this is one of the Greek artists who built the cathedrels in what we call the Dark ages wandering about in sheepskins and goat skins ,of whom the world was not worthy .Such were the Christians in all ages ‘’.

ఇరవై ఒకటి లో బసీర్ దగ్గర శిక్షణ పూర్తీ చేసుకొని స్విస్ ఆర్టిస్ట్ జార్జి మోసర్ దగ్గర చేరి మెరుగులు దిద్దుకొన్నాడు .మానసిక దృష్టితో ప్రతి విషయాన్ని దర్శించి అనుభూతి చెంది చిత్రించే వాడు, శిల్పించేవాడు .గోదిక్ కళలో శిల్పాలు జీవంలేక శవాక్రుతి లో ఉన్నాయని పించేవి .వాటికి అమరత్వం లేదని  అనుకొన్నాడు .స్వీయ భావన తో అనేక చిత్రాలు గీశాడు ,చెక్కాడు  కాని అవి జీవన భ్రుతికి సరిపడడబ్బు నివ్వలేదు .’’ఎటర్నల్ యూత్ ,ఎటర్నల్ మాన్ ‘’గా తయారు చేశాడు .ఏంతో మానసిక ఆనందాన్ని అనుభ వించాడు .’’గ్లాడ్ డే ‘’అనేది బ్లేక్ ఆదర్శ చిత్ర రాజం .అన్నారు   బంగారు రంగు జుట్టుతో బ్లేక్ స్వర్ణ  కిరీట దారి గా కనిపించేవాడు .ఇరవై అయిదులో కీధరిన్ సోఫియా బూచర్ తో సల్లాపం సాగించాడు .నల్ల కళ్ళచదువు రాని ఆ సుందరిని పెళ్ళాడి తానె గురువై చదవటం రాయటం నేర్పాడు .ఆదర్శ గృహిణి గా ఆమె సహకరించింది .తన భర్త ఎప్పుడూ స్వర్గ లోక విహారే అనేది ఆమె .తిండికి కూర్చున్నప్పుడు ఖాళీ ప్లేట్ మాత్రామే పెట్టేది .తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పెద్దన్న చూసుకొన్నాడు .బ్లేక్ ఒక ప్రింట్ షాప్ పెట్టాడు .అన్న రాబర్ట్ అకస్మాత్తుగా మరణించాడు .రాబర్ట్ ఆత్మా సీలింగ్ దాటి విశాల గగనం లోకి చేరటం తాను చూశానని బ్లేక్ చెప్పాడు .సచిత్ర మేగజైన్లను తాయారు చేయటం స్వీయానుభవం తో సాధించాడు .ప్రింట్ షాప్ అచ్చి రాలేదు .పబ్లిషర్ల పుస్తకాలకు సొగసులు కూర్చే పని చేశాడు .బ్లేక్ అందంగా కవితాలను చదివేవాడు మాథ్యూస్ తో కలిసి తన పుస్తకం ‘’పోలిటికల్ స్కెచెస్ ‘’ముద్రించాడు .రాత మాథ్యూస్ ,బొమ్మలు బ్లేక్ తో బాగా వచ్చింది .ఎలిజబెతేన్ జాకోబిన్ కవుల ధోరణి లోనే రాశాడు .కానివీటికి  కొత్త స్వేచ్చ ,స్వచ్చత అద్దాడు .పునరుజ్జీవనం రొమాంటి కవిత్వాలకు మధ్య వారధి గా బ్లేక్ కొత్త పోకడలు పోయి కవిత్వం రాశాడు .

ముప్ఫై లో ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నోసేన్స్ ‘’రాసి ప్రచురించాడు .వినటానికి మహదానందం గా ఉండేవి .బ్లేక్ కవితా లక్షణాన్ని మోనా విల్సన్ ‘’a return from the idea of Excellence to that of Ecstasy as the aim and justification of poetical enterprise ‘’అని శ్లాఘించాడు .బ్లేక్ అరాసిన దిలాంబ్ ,దిలిటిల్ బ్లాక్ బాయ్ ,యాన్ అనదర్  సారో  నైట్ ‘’కవితలు అందరూ చదివిన వాళ్ళమే .భారీ సహాయం తో బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ పుస్తకాన్ని చేతితో తయారు చేసి ,ఇంకెవరూ పబ్లిష్ చేయ కుండా విడుదల చేసి చరిత్ర సృష్టించాడు .ఇలా ఇంతకూ ముందెవరూ చేయలేదు .దీనినే బ్లేక్’’ఇల్ల్యూమినేటేడ్ ప్రింటింగ్ ‘’అన్నాడు .కాగితాలను అందం గా ఆకర్శ ణీయం గా బంగారు రంగుతో కొన్ని పేజీలు  వివిధ వర్ణాలతో తయారు చేసి ధగ ధగ మెరిసేట్లు చేశారు .అతని ఆలోచనకు ఆచరణకు సృజనాత్మక శక్తికి అందరూ నివ్వెర పోయారు ..స్పష్టం గా నిర్డుస్టం గా కంటికి బాగా కనిపించి విందు చేస్తూ చదివిన్చేట్లు చేసి తయారు చేశారు బ్లేక్ దంపతులు .

దీనికి సీక్వెల్ గా కొన్ని లిరిక్కులు రాశాడు .బ్లేక్ భావన ప్రకారం చిన్నపిల్లాడు ఈడెన్ వదిలి ,ప్రపంచంలో ఎదిరించి బతుకుతూ ,స్వర్గం లో పోగొట్టుకోన్నదాన్ని ఇక్కడ పొందాలి .ద్వంద్వాలను ఏకం చేయటమే బ్లేక్ ఆదర్శం’’a fusion of innocence and experience ,good and evil ,flesh and spirit and as he was so enunciate with challenging vehemence ,the marriage of heaven and hell’’ .రెండు విభిన్న ప్రపంచాలలో బ్లేక్ జీవించాడు .అలానే అతని సృజన కళకూడా ఉండేది .కొద్ది కాలం తర్వాత ‘’ట్రయల్ ‘’ దిబుక్ ఆఫ్ ది తేల్’’రాశాడు కాని ఎనభై అయిదేళ్ళ తర్వాతాకాని ముఉద్రింప బడ లేదు .బ్లేక్ స్వీడిష్ ఫిలాసఫర్ ‘’స్వీడెన్ బర్గ్ ‘’అను యాయి .బర్గ్ ‘’దేవుడిని దివ్య మానవుడు ‘’అన్నాడు .బ్లేక్ ధనాత్మక స్వభావం ఉన్న వాడు .వార్ధక్యం పై పడిన కొద్దీ బ్లేక్ అందరికి దూరం గా ఉన్నాడు .

1793లో గ్రామీణ లామ్బెత్ కు చేరి చిన్న ఇంట్లో ఉన్నాడు .పిల్లల జంజాటం లేదు భార్యా భర్త హాయిగా ఆనందాన్ని అనుభవించారు .ధనమూ బాగానే వస్తోంది .సుఖ జీవితం గడుపుతున్నారు .ముప్ఫై లలో సంతృప్తికర జీవితాన్ని అనుభవించాడు .కొత్తా భావనలు మనసులో చోటు చేసుకొన్నాయి .పాత వాటిని మార్చి కొత్తగా తయారు చేశాడు భార్య సాయం తో .వాటిని ‘’richly illuminated volumes’’అన్నాడు .ఇంగ్లాండ్ చరిత్ర ,ను పిల్లల కోసం రాశాడు .గేట్స్ ఆఫ్ పారడైజ్ ను కూడా పిల్లలకోసమే .దీర్ఘ కవితలను రంగుల హర్మ్యం గా తయారు చేశాడు. అమెరికా రివల్యూషన్ కు మద్దతుగా ‘’అమెరికా –ఏ ప్రాఫసీ ‘’రాశాడు ఊహా  ప్రపంచం లో ఉన్దేవాప్పుడూ .బ్లేక్ చిత్రాలు దివ్య కళా విభూతితో దర్శన మిచ్చేవి . జార్జి  కంబర్ లాండ్ అనే నేషనల్ ఆర్ట్ గాలరీ కి చెందిన ఆయనతో పరిచయం ఏర్పడింది .బ్లేక్ ను ఎడ్వర్డ్ యంగ్ రచన ‘’నైట్ థాట్స్ ‘’కు చిత్రాలు వేయమనికోరితే వేశాడు .నలభై మూడు చిత్రాలతో ఇది మొదటిభాగం గా వెలువడింది .

నలభై లో ‘’ది ఫోర్ జోస్ ‘’అనే సింబాలిక్ రచన ప్రారంభించాడు .ఇందులో పాత కొత్త నిబంధనలకు సంబంధిన వన్నీ చోటు చేసుకొన్నాయి .కొంత గందర గోళాన్ని సృష్టించాడు .’’he who works and has his health can not starve ‘’అనే దృఢమైన నమ్మకం బ్లేక్ కు ఉండేది ..ఆగస్ట్ గ్రామం లో ఒక ఇల్లు   అద్దెకు తీసుకొని ఉన్నారు జంట .’’ఫెల్హాం ‘’అనే రచన ప్రారంభించి చిక్కుల్లోపడ్డాడు .సహాయకుడి గా పెట్టుకొన్న వాడి పధ్ధతి బాగాలేక తరిమేస్తే వాడు రాజుకు ఫిర్యాదు చేస్తే రాజుకు  విషయం వివరిస్తూ ఉత్తరం రాశాడు .ఒక సైన్కాదికారిని కొట్టాడని నేరం మోపారు .కేసైంది .బ్లేక్ నిర్దోషి అని తీర్పు వచ్చింది .రాజు బ్లేక్ ను సెక్రెటరి అసిస్టంట్ ను చేశాడు .పాపం బ్లేక్తను ద్వేషించిన  ‘’హెలీ కవి ‘’రాసిన దాన్ని విని,, పొగడాల్సిన  కష్టం వచ్చింది .దీనికి విచారపడుతూ ‘’o why was I born with a different face ?-why was I not orn like the rest of my race?-when I look ,each one starts !when I speak ,I offend –when I am silent and passive ,I lose every friend ‘’అని రాసుకొన్నాడు .శత్రుకవుల దాడిని సునాయాసం గా తిప్పికొట్ట గలుగుతున్నాడు కాని శ్రేయోభిలాషులు  పెట్టె ఇబ్బందుల్ని  భరించ లేక పోతున్నాడు .విసుగొచ్చి లండన్ వదిలి పుట్టిన ఊరికి చేరాడు .పవిత్ర జీవితాన్ని ప్రశాంతం గా గడుపుతున్నాడు .కొత్త సింబాలిక్ కవితలు’’మిల్టన్ అండ్ జెరూసలెం’’  రాస్తున్నాడు .ఇవి మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ కు వివరణలతోకూడిన చిత్ర దృశ్యాలు .రెండేళ్ళు బాగానే గడిచింది .

లాభా పేక్ష తో ముచ్చటైన డిజైన్ లతో ‘’కాంటర్ బారీ పిలిగ్రిమ్స్   ‘మొదలు పెట్టాడు .ఇది తెలుసుకొన్న స్తాత్ బాండ్ అనే వాడు పబ్లిక్ ఎక్సిబిషన్ పెట్టి కుబేరుడయ్యాడు .అందరూ బ్లేక్ ను కవిగా అంతగా గుర్తించలేదు .బాధ పడ్డాడు .అతని సృజన కళను ఎవరూ గుర్తించక పోవటం దురదృష్టం .ఒక ‘’డిస్క్రిప్టివ్ కేటలాగ్ తయారు చేసి తన చిత్రాలను ప్రదర్శించాడు .ఫలితం శూన్యం .యాభైలలో పేదరికం వరించింది. భార్య ఆతను ఊహల్లో విహరిస్తుంటే భార్య సంసారాన్ని దిద్దుకోన్నది .ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్తితి .కొద్ది మంది ఉదారుల సహాయం లభించక పోయి ఉంటె బ్లేక్ దంపతులు ఆకలితో చని పోయి ఉండేవారు .అతని శిష్యులు గురువు లోని అసామాన్య కళను ఆరాధిస్తూ సహాయం చేశారు .ఇంకా ఇరవై ఏళ్ళు బతికి అసలైన రచన చేయాల్సి ఉంది .మిల్టన్ పై పుస్తకాల డిజైన్ పూర్తీ అయింది .దిఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ‘’ఇంకా రావాలి .గేట్స్ ఆఫ్ పారడైజ్ మళ్ళీ తేవాలి చాసర్ కధలు పునర్ముద్రణ పొందాలి .వీటిలో మిల్టన్ పై వచ్చింది అత్యంత ఆశ్చర్యకరమై నదే .దీన్ని బ్లేక్’’sublime allegory for future generations similar to Homer;s Illiad ‘’and Milton;s paradise lost .వీటిని అంతరాత్మ ప్రబోధం గా రాశానని చెప్పాడు .దీన్ని ‘’grandest poem that this world contains ‘’అని బ్లేక్ చెప్పుకొంటే ‘’the most confusing of his long parables an un successful melding ‘’అన్నారు విమర్శకులు .

నిజం గా బ్లేక్ మిల్టన్ తో తాదాత్మ్యం చెంది రాశాడు .మిల్టన్ ను ‘’క్లాసిక్ ఎథీస్ట్ ‘’అన్నాడు బ్లేక్ .ముసలితనం వస్తున్న కొద్దీ మిల్టన్ లా కాకుండా బ్లేక్ జాగ్రత్త పడ్డాడు .మానసిక పోరాటాన్ని ఆపలేదు .విప్లవం గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు .అరవై లో ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .ఒణుకు ,ఫిట్లు వస్తున్నాయి .చిత్రకళా కారుడిగా నే గుర్తుండి పోయాడు .1827ఏప్రిల్ లో తాను మృత్యు ద్వారం  నిరీక్షిస్తున్నట్లు జార్జి కంబర్లాండ్ కు జాబు రాశాడు .శరీరం క్రుశిస్తున్నా బుద్ధి మనసూ బలం గా నే ఉన్నాయన్నాడు .ఇదే ఆఖరి ఉత్తరం అయినా చివరి రచన మాత్రం కాదు .విపరీతమైనశ్రమ ,రచనల తో చిక్కి శల్యమైనాడు .మూత్రపిండాలలో రాళ్ళ బాధ తో ఉన్నా డాంటేపై చిత్రాలు గీస్తూనే ఉన్నాడు .12-8-1827నచిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ ఇహం అనే నరకాన్ని  వదలి పరం అనే స్వర్గాన్ని చేరుకొన్నాడు .

‘’to see a world in a grain of sand –and a heven in wild flower –hold infinity in in the palm of your hand –and Eternity in an hour ‘’అన్న కవిత దేశదేశాలలో బహుళ ప్రచారమైంది .బ్లేక్ ను పిచ్చోడు అన్నారు సమకాలికులు .కాని ‘’Blake was like the figures he loved to draw bound to no law of nature moving gravely to his goal, employing the emanations of earth ,air ,fire and water at home among the elements .this outward creation  was a transparent shell though which Blake beheld the fiery secret ,the burning core of e cstacy ‘’.సూర్యోదయం అయినప్పుడు ఆయన చుట్టూ గోల్డ్ గినియా లాంటి వలయం కనీ పిస్తుంది అనటం వాస్తవం కాదు –నాకు మాత్రం  ‘’an innumerable company of heavenly host crying Holy Holy Holy is the Lord god Almighty ‘’కనిపించటం యదార్ధం అని తాదాత్మ్యం తో అన్న దివ్య విభూతి పొందిన ప్రక్రుతిఆరాధకుడు. చిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ మహాశయుడు .ఫ్రీ లవ్ సొసైటీ కి ఈజమ్ వేసింది బ్లేక్ అంటారు .వివాహ బంధం విషయం లో క్రిస్టియానితికి  వ్యతిరేకం గా ఉండేవాడు .’అతనిది ”  enlightened philosophy ”

William Blake by Thomas Phillips.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-14-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.