ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి మూడుర్ ఒజుల పాటు వైభవం గా జరిగింది . మొదటి రోజు 21-5-14బుధవారం ఉదయం అయిదు గంటల నుండి అష్ట కలశాల శ్రీ స్వామి స్నపన నిర్వహించాము అనంతరం ,మన్యుసూక్తం తో అభిషేకం నిర్వహించాము ఆలయ అర్చకులు ఛి వేదాంతం మురళీ కృష్ణ ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి వెంకట రమణ స్వయం గా పాల్గొని జరిపించాడు .ఉదయమ్ తొమ్మిది గంటలకు సామూహికం గా గంధ సిందూర పూజ జరిగింది .నైవెద్యమ్ తీర్ధ ప్రసాద వినియోగం తో మొదటి రోజు ఉదయం కార్య క్రమం పూర్తీ అయింది
సాయంత్రం సరసభారతి 61వ కార్య క్రమంలో శ్రీమతి కొమాండూరి కృష్ణ ‘’దాస్య భక్తీ –శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై గంట సేపు అలవోకగా ,ఆసక్తిగా ,ఎన్నో ఉదాహరణలతో ,ప్రసంగించారు .యామెకు ఆలయ మర్త్యాదతోఅర్చకుడు సన్మానించాడు . సరసభారతి ఆమెకు చీరా జాకెట్ శాలువా 500రూపాయల నగదు ,జ్ఞాపిక సరసభారతి పుస్తకాలనిచ్చి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి చేత సత్కరించింది .ఇందులోకార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి సహకరించింది . అంతకు ముందు హనుమాన్ చాలీసా చేసిన శ్రీ గుడిసేవ స్వామి కి రెండు వందల రూపాయలు నగదు కానుక గా అందించాను ..తరువాత శ్రీ సీతారామాంజ నేయ భక్త సమాజం వారు రెండుగంటల సేపు తన్మయత్వం తో భజన చేసి అందరి ప్రశంసలు అందుకొన్నారు .వారి నాయకులు శ్రీ బాబూరావు గారికి ఆలయ మర్యాదలతో ముందుగానూ తరువాత సరసభారతి సత్కరించి500రూపాయలు నగదు కానుక, శాలువా, జ్ఞాపిక పుస్తకాలను అంద జేసింది మొదటి రోజు కార్యక్రమం ఇలా భక్తీ శ్రద్ధలతో బాగా జరిగింది .
రెండవ రోజు 22-5-14గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహికం గా ,రసాల మామిడి పండ్ల తో ,అరటి పండ్ల తో దానిమ్మ ,బత్తాయి ద్రాక్ష జామ సపోటా బొప్పాయి మొదలైన పండ్ల తో విశేష అర్చన నిర్వ హించాము .న భూతో గా సాగిన ఈ పండ్ల పూజ చాలా వైభవం గా జరిగింది .ప్రసాద నైవేద్యం ,మంత్రం పుష్పం తీర్ధ ప్రసాద వినియోగం తో ఉదయం కార్యక్రమం ముగిసింది .సాయంత్రంసరసభారతి నిర్వహించిన 62వ సమావేశం లో మచిలీ పట్నం సోదరులు ఛి వీరు భొట్ల పవన్ కుమార్ (12సం ),వరప్రసాద్ (6సం)లు పల్నాటి బాలచంద్రుడు మాయ సభలో దుర్యోధనుడు ,అర్జునుడు మొదలైన వేషాలతో పౌరాణిక ,వేషధారణ తో ముచ్చటగా నటించి మెప్పించారు .నిన్న ,ఈ రోజు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు జనం పెద్దగా రాక పోవటం బాధించింది .ఎండ వేడి కూడా 43 ఉండటం ఒక కారణం అయి ఉంటుంది .పెళ్ళిళ్ళ సేజన్ కూడా .వీరు భొట్ల చిరంజీవులకు మా మనుమరాలు ఛి రమ్య చేత శాలువాలు కప్పించి ఒక్కొక్కరికి 500రూపాయల కానుక లిప్పించి పుస్తకాలు జ్ఞాపికలు అంద జేయిన్చాము .అంతకు ముందు ఆలయ సంప్రదాయం తో ఆ చిన్నారులకు శేష వస్త్రాలను అర్చకుని చేత అంద జేయిన్చాం .వీరి తండ్రి శ్రీ మూర్తి గారిని సరసభారతి సత్కరించి శాలువా1000రూపాయల నగదు పుస్తకాలు జ్ఞాపికలను మా అన్నయ్య గారి అబ్బాయి ఛి రామనాధ బాబు చేత ఇప్పించాము . మూర్తి గారు ఏంటో శ్రద్ధతో పిల్లలను తీర్చి దిద్దుతూ ,ఆహార్యం తానే సమకూరుస్తూ ,పడుతున్న కష్టం మరిచి పోలేనిది .కార్య దర్శి శ్రీమతి శివ లక్ష్మి కూడా పాల్గొన్నది .తర్వాతా జరగాల్సిన కూనపరెడ్డి వెంకటేశ్వర రావు భజన .అతను రాక పోవటం తో రద్దు అయింది .చక్ర పొంగలి పులిహోర ప్రసాదాలను అందరికి అంద జేశాం.దీనితో రెండవ రోజు కార్యక్రమం పూర్తయింది
23-5-14-శుక్రవారం వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి –సందర్భం గా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు’’ వంద కట్టల ‘’తమల పాకులతో విశేష అర్చన(నాగవల్లీ దళపూజ ) నిర్వహించాము .ఉదయం ఆలయం తెరచినప్పటి నుండి స్వామి వారల దర్శనానికి వందలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు .పది గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారాలకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాము .మా ఆలయ అర్చకుడు మురళి,విశ్వశాంతి ఉపాధ్యాయుడు శ్రీ చక్ర వర్తి పౌరోహిత్యం చేసి విశేషాలను తెలియ జేస్తూ శ్రీ బలరామ కృష్ణ గారి సహకారం తో కల్యాణాన్ని కమ నీయం గా నిర్వహించారు. నేనూ ,మా శ్రీమతి పీటల మీద కూర్చుని శ్రీ స్వామి వారల కల్యాణాన్ని శ్రద్ధ గా నిర్వహించాము .ఎండ 44దిగ్రీలున్నా భక్త జనం సముద్రం లా వచ్చి ఆలయం లో బయటా షామియానాలలో కూర్చుని కన్నుల పండువుగా కల్యాణాన్ని దర్శించి తరించారు .మేము మాత్రమె స్వామి వారాలకు తలంబ్రాలు పోయటం కాకుండా వచ్చిన అందరి చేతా తలంబ్రాలనుప్రతిసారీ లాగే తలంబ్రాలు పోయిన్చాము .భక్తులు పరవశించి పోయారు .శ్రీ బంగారు నాగేశ్వర రావు గారు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడు కూడా స్వామి వారికి వెండి ఉత్త్తర జంధ్యాలు అమ్మ వారికి మట్టెలు ,మంగళ సూత్రాలుతయారు చేసి తలంబ్రాలకు ముత్యాలు తయారు భార్య గారితో అంద జేశారు .ఆమె కూడా కల్యాణం అయేవరకు కూర్చుని ఆనందించారు .సరసభారతి కార్యక్రమాలను ఆలయం లో నిర్వహించ టానికి సహకరించిన మా అర్చకుడు ఛి మురళిని శాలువాతో ను 500రూపాయల నగటు తోను సత్కరించాము .హైదరాబాద్ నుంచి వచ్చిన మా పెద్ద కోడలు ఛి సౌ సమతా మా అమ్మాయి ఛి సౌ విజ్జి మా మనవరాలు ఛి రమ్య వచ్చిన వారందరికీ నిన్న పూజ చేసిన రసాల మామిడి పండ్లు అంద జేశారు .బహుశా ఉయ్యూరు లో ఇలా ప్రతి ఏడూ శ్రీ హనుమజ్జయంతి రోజున మామిడి పండ్లను పంచిపెట్టటం మా ఆలయం లో తప్ప ఏ ఆలయం లోను లేదు .దీనికి నాకు స్పూర్తి –మా చిన్నప్పుడు విష్ణ్వాలయం లో వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణాన్ని నిర్వహించేవారు .ఉయ్యూరు హెడ్ కరణం స్వర్గీయ ఆదిరాజు నరసింహా రావు గారు ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించే వారు .అప్పుడు ‘’పోతుల్లాంటి బంగినపల్లి మామిడి పళ్ళు ‘’ఆందరికీ ఇచ్చేవారు .ఆ తర్వాత ఎవరూ చేసిన జ్ఞాపకం లేదు .మన ఆలయం లో భక్తుల సహకారం తో దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాము ..అప్పాలు ,రవ్వకేసరి ,పులిహోర ,పానకం ల ప్రసాదాలిచ్చి అందరి మన్ననలను పొందాము .సాయంత్రం కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసాను 108సార్లు పారాయణ చేసి భక్తీ ప్రకంపనలు సృష్టించారు .వీరికి ప్రేరణ గా మొదటి నుంచీ ఉన్న యాభై ఏళ్ళ క్రిందటి నా శిష్యురాలు ,నా దగ్గర ఎస్ ఎస్ ఎల్ సి కి ట్యూషన్ చదివి మా ఇంట్లోనే పడుకొని చదివిన ఛి భాగ్య లక్ష్మి కి అందరి మాట గా మా పెద్ద కోడలు ఛి సౌ సమత తో శాలువా కప్పించి 500నగదు జ్ఞాపిక మహిళా మాణిక్యాలు పుస్తకం ఇప్పించాను .మా పెద్దబ్బాయిఛి శాస్త్రి చిన్నప్పుడు భాగ్య లక్ష్మి చదివింది .వాడికి రోజూ జడ వేసి పూలు పెట్టేది .అలాంటి శాస్త్రి భార్య సమత చేత సన్మానం చేయించటం తమాషా అనిపించింది. మా అబ్బాయి ఛి రమణ మొక్కుకున్న108కొబ్బరి కాయలను మా కోడలు అమ్మాయి మనవరాలు బడ్డీ బుడ్డి వాళ్ళన్నయ్య పెద్దాడు సహాయంతో కొట్టారు .అందరికి కొబ్బరి చిప్ప అరటి పండ్లు పనస తొనలు ,స్వామికి ప్రత్యేకం గా వేసిన గారెల దండ లోని గారెలు ప్రసాదం గా అంద జేశాము .సాయంత్రమూ ఖాళీ లేకుండా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకొని పోతూనే ఉన్నారు ..ఈ విధం గా శ్రీ హనుమజ్జయంతి అత్యంత వైభవం గా మూడు రోజులు జరిగి అందరికి ఆనందం కలిగించింది .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు
—