సాహితీ బంధువులకు -శుభకామనలు -ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ”హిందూ స్మశాన వాటిక ‘ను రోటరీక్లబ్ వారు ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్న సందర్భం గా నా ద్వారా విషయం తెలుసుకొని ఉడతా భక్తిగాతానూ భాగస్వామి అవాలనే తలంపు తో ఇరవై అయిదు వేల రూపాయలు విరాళం గా నాకు పంపి రోటరీ వారికి అందజేయ మన్నారు .ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి ఆలయం లో ,మీడియా మిత్రుల సమక్షం లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారికి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా చెక్ ద్వారా అంద జేశాను మై నెని వారి వదాన్యతకు క్లబ్ ప్రెసిడెంట్ గారు ఎంతో కృతజ్ఞత తెలియ జేశారు .ఇలాంటి దాతల సహకారం వలననే శ్మశానాన్ని ఒక కోటి రూపాయలతో ఆధునీకరించే ప్రాజెక్ట్ చేబట్టామని ,దాతల సహకారం మరువ లేనిదని స్వచ్చందం గా ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారని మైనేని వారికి ప్రేరణ కలిపించి విరాళం తెప్పించిన దుర్గా ప్రసాద్ గారి లాంటి వారి సహకారం మరచిపో లేనిదని చెప్పారు.దుర్గా ప్రసాద్ .
ఉయ్యూరు హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ అభి వృద్ధికి అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు రోటరీ క్లబ్ వారికి ఇచ్చిన విరాళం ఇరవై అయిదు వేల రూపాయల చెక్ ను అండ జేస్తున్న చిత్రాలు
చాలా మంచి పని చేసారు శ్రీ గొపాల క్రిష్ణ గారు; వారికి, వారికి స్పూర్తి
కలిగించిన మీకు అభినందనలు.