పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33

ముగ్గురు కవుల ముచ్చట్లు

కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ లో ఉన్న వర్డ్స్ వర్త్ ను కలుసుకొన్నాడు .అనుంగు మిత్రుల్లా ఉన్నారు .సూతే విషయం చర్చించారు .సాధారణం గా తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వర్డ్స్ వర్త్ ఇప్పుడు ఆతిధ్యం లో ఆరి తేరాడు .ఆల్ఫాక్సేన్ కు మారిన ఆయన్ను దాదాపు రోజూ చూసేవాడు .1798ఈ కవులిద్దరు కలిసి ‘’లిరికల్ బాల్లడ్స్ ‘’ను రొమాంటిక్ పద్ధతిలో రాయాలని నిశ్చయించారు .రాసిన దానికి కొత్తదనం ఆకర్షణ తెచ్చాడు కాల్ రిడ్జి.అది1800లో విడుదలైంది .మరో రెండేళ్ళ తర్వాత మార్పులు చేసి మళ్ళీ ప్రచురించారు .వర్డ్స్ వర్త్ ముందు మాట రాశాడు .’’wonder and beauty could be achieved by the mere mention of words like wondrous beautiful and that the clichés and circumlocuationsof the established poetic diction were in themselves poetry .’’ అనే అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు .’’poetry not only could but should be written in the language really used by men ‘’అని చెప్పాడు .లిరికల్ బాలడ్స్ కు స్పందన పెద్దగా రాలేదు .నిరుత్సాహ పడ్డారిద్దరూ .కొన్ని తరాలను ప్రభావితం చేసిన ఈ కవితలు అప్పుడు మాత్రం ఆదరణకు నోచుకోలేదు .కాల్ రిడ్జి రాసిన ‘’దిరైం ఆఫ్ ది ఎంషేంట్ మారినర్’’ఇంగ్లీష్ సాహిత్యానికే వన్నె తెచ్చింది .అలాగే వర్డ్స్ వర్త్ రాసిన సాలి లోక్వి ‘’lines composed a few miles above Tintern Abbey’’గోప్పప్రభావాన్ని కలిగించినా దానిపై దృష్టిపడలేదు .అందరూ ఎక్కువ గా ఉదహరించే వర్డ్స్ వర్త్ నిర్వచనం poetry is the spontaneous overflow of powerful feeling –takes its origin from emotion recollected in tranquility ‘’ కు మంచి ఉదాహరణ .

దీని తర్వాత కాల్ రిడ్జి కష్టాల్లో బాధల్లో పడ్డాడు .ప్రారంభించిన ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’పూర్తికాలేదు .అది పెద్ద నష్టం అన్నాడు .కుబ్లాయ్ ఖాన్ లో మంత్రాలున్నాయని ,పునరావ్వృతమైన ప్రతి చోటా అద్భుత శక్తి గోచరిస్తుందని ,అది గోదిక్ నమ్మకానికి విజయమని ,సర్వోత్కృష్ట రచన అని భావించాడు .

సూతీ ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు పోర్చుగల్ లో ఆరు నేలలుండిస్వభావాన్ని మార్చుకొన్నాడు .సూతీ వర్డ్స్ వర్త్ ను కాల్ రిడ్జి ని మరీ సన్నిహితులయ్యేట్లు చేశాడు .ఈ ఇద్దరు కలిసి జర్మని వెళ్ళారు .జర్మని సాహిత్యాన్ని అవలోడనం చేసి ఆ  ఫిలాసఫీని క్షుణ్ణం గా అవగాహన చేసుకొన్నాడు కాల్ రిడ్జి .వర్త్ మాత్రం అంత ఉత్సాహం చూపకుండా గోస్లార్ వెళ్ళాడు అక్కడ ‘’లూసీ పోయెమ్స్ ‘’రాయటం ప్రారంభించాడు .దీనికి దోరోతి కాని వేరెవరైనా అజ్ఞాత వ్యక్తీ కాని ప్రేరణ అయి ఉండాలి .ఇందులో తన బాల్య జ్ఞాపకాలను పొందు పరచాడు. జర్మన్ భాష నేర్వలేక పోయాడు. జర్మన్లను ప్రేమించ లేక పోయాడుకూడా .మన శ్రీనాధుడు రాయల సీమ బాధల్ని చాటువులుగా చెప్పినట్లు జర్మని అనుభవాల్ని కవిత్వీకరించాడు –‘

‘’I travelled among unknown men in lands beyond the sea –nor England ,didi I know till then –what love I bore to thee –it is past melancholy dream –nor will I quit the shore –a second time ,for still I seem –t love thee more and more ‘’అంటూ మాతృదేశం ఇంగ్లాండ్ కు దూరమైనందుకు బాధ పడ్డాడు .

1799 డిసెంబర్ ర్ లో దోరోతి తో విండర్ మియర్ దగ్గర డవ్ కాటేజీ లో కాపురం పెట్టాడు .పల్లె ప్రాంతం .అందమైన కొండలు ఆకర్షణీయ ప్రక్రుతి అందాలు మనసును పరవశింప జేశాయి .తాను డెమొక్రాట్ గా ఉన్నానని అక్కడే విశ్రాంతి పొందుతానని చెప్పాడు .డోరోతికూడా తన ‘’డార్లింగ్ బ్రదర్ ‘’వివాదాల జోలికి పోకుండా ప్రశాంతం గా ఇక్కడే ఉండటం ఇష్టం .ఆమెకు కాల్ రిడ్జి అంటే ఫాసినేషన్ ఏర్పడింది .అతను భార్యకు ఇంకా విడాకులివ్వలేదు .ఆమె మెంటల్ గా దెబ్బ తిన్నది .ఆమెను చిన్న పిల్లలా చూసుకోవాల్సి వచ్చింది .

విలియం తో యూరప్ వెళ్ళింది .ఆతను భార్య అన్నేట్టే ను కూతుర్ని చూశాడు .పెళ్లి సంగతి తేల లేదు .భర్తగా ఆమెను సంతృప్తి పరచలేదు .ఫ్రాన్స్ లో ఒక నెల ఉండి కూతురు కరోలిన్ తో షికార్లు చేస్తూ గడిపాడు .ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చి మేరీ హచిన్సన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెపై కవితలు చిలికాడు ‘’she was a phantom of delight –when first she gleamed upon my sight ‘’-a perfect woman nobly planned –to warm ,to comfort and command ‘’అని పొగిడాడు .మేరీదోరోతీలు అన్యోన్యం గా ఉన్నారు .హనీమూన్ కు ఈమె కూడా వెళ్ళింది ..మేరీ నలుగురు పిల్లల్ని కంటే ఇద్దరు ముందే పోయారు .సారా హచిన్సన్ కూడా వీరితో కలిసి పోయింది .

కాల్ రిడ్జి పరిస్తితి ‘’నానాటికి తీసి కట్టు నాగం భొట్లు ‘’గా తయారైంది .తనలో కవి చచ్చిపోయాడని చెప్పాడు ఆరోగ్యం కోసం మాల్టా వెళ్ళాడు .వర్డ్స్ వర్త్ తో కలిసి పని చేయలేననుకొని దానిని ‘’the lachet of whose shoes I am unworthy to unloose ‘’అని కవితాపరం గా చెప్పుకొన్నాడు .ఆధారం లేకుండా ఉండలేక పోతున్నాడు ఇబ్బందులూ పడుతున్నాడు, పెడుతున్నాడు .కవితా శక్తి మందగించింది ఆరోగ్యం తో బాటు .’క్రిస్టబెల్ ‘’మొదలు పెట్టి చాలా కాలం అయినా పూర్తీ చేయ లేదు .టెక్నికల్ క్రిటిసిజం ,వ్యాసాలూ ,జర్నలిజం తో గడపాలను కొన్నాడు .మాట్లాడటం మొదలెట్టితే నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడని హేజ్లిట్ అన్నాడు .ఉపన్యాసలిస్తున్నాడుకాని చప్పట్లు కొట్టించుకో లేక పోతున్నాడు .లండన్ వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు నలభై అయిదు లో కవళికల్లో మార్పు బాగా వచ్చింది .చివరి పద్దెనిమిదేళ్ళు కస్టాలు కొంత తగ్గాయి కొడుకులిద్దరూ కవిత్వం లో దూసుకు పోతున్నారు .ట్రీట్ మెంట్ పొందుతూ కూడా సృజన ఆపలేదు ‘’బయాగ్రఫా లిటరేటా ’’రాశాడు వ్యాసాలను పరిష్కరించి పునర్ ముద్రించాడు .మిల్టన్ షేక్స్ పియర్ లపై ఉపన్యాసాలిచ్చాడు .జనం మెచ్చారు దిఫ్రెండ్ అండ్ సిబిలిన్ ‘’కూ ఆదరణ వచ్చింది .ఫిలాసఫర్లు సైంటిస్టులు కాల్ రిడ్జి తో సమావేశమై చర్చలు జరిపి ఆయన విలువైన అనుభవాలను తెలుసుకొనేవారు .’’reason is much nearer to sense than to understanding –for reason is direct aspect of truth an inward beholding –‘’అని అభిప్రాయ పడ్డాడు .ఆ ఆత్మ శక్తి తోనే చివరి రోజులు గడిపి 25-7-1834నకాల్ రిడ్జి మహా కాలం లో కలిసి పోయాడు .

చనిపోయే ముందు సూతీ ని వచ్చి ఉండమన్నాడు .కాని అతను ఒక ఆదర్శం లో ఉన్నాడు ‘’all man needed to be successful was a comfortable religion and simply of common sense ‘’అని రాసి రాలేదు .అతని ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’బాగా పేరు పొందింది .అతని ఉత్తరాలూ బాగా ప్రఖ్యాతి తెచ్చుకోన్నాయి. చిన్న కవితలు బాగా ఆకర్షించాయి .’’టాలబా ది డి స్ట్రాయర్ ‘’,ది కార్స్ ఆఫ్ కహేమ ‘’అనే ఎపిక్ లు రాసి విమర్శకుల ప్రశంసలు పొందాడు.క్వార్తర్లి రివ్యు లో అతను రాసిన వ్యాసాలూ అందర్నీ అలరించాయి .’’హెన్రి జేమ్స్ పై’’ కవి చనిపోయిన తర్వాత మూడవ జార్జి సూతీ ని ఆస్థాన కవిని చేశాడు .సర్ వాల్టర్ స్కాట్ కు ఇవ్వాలని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించాడు .తగిన వాడు అని అందరూ మెచ్చారు .కాని నైతిక విలువలు లేని వాడికి ఈ పెద్దరికం ఏమిటి అని కొందరు గుసగుసలాడారు .గౌరవం తో బాటు కస్టాలు వచ్చాయి .చాలా కాలందూరం గా ఉన్న భార్యా పిల్లల్లో ఏడుగురు పిల్లలు చనిపోయారు .భార్యకు మతిస్తిమితం లేక శరణాలయం లో చేర్చారు .ఆమె చనిపోయిన వెంటనే కరోలిన్ బౌవేల్స్ అనే ఆవిడను పెళ్లి చేసుకొన్నాడు ..మనస్సాక్షికి ,సర్దుబాటుకు మధ్య నలిగిపోయాడు .21-3-1843నరాజాస్థానకవి సూతీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .యాభై వాల్యూముల వచనం కవిత్వం వెలువరించాడు .ఒకటి రెండు బాలడ్స్ తప్ప ఏవీ మిగల్లేదు .

ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి వర్డ్స్ వర్త్

ఈ త్రయం లో అందరికంటే పెద్ద వాడు వర్డ్స్ వర్త్ .సహచరుల మరణం తర్వాత చాలాకాలం జీవించి ఉన్నాడు .ఆత్మా దర్శనం ,ఆత్మా సంతృప్తి తో జీవించాడు .అతని మాటలు ‘’మోనో లోగ్స్ ‘’లా ఉంటాయి .సంభాషణాచాతుర్యం లేదు .లేక్ డిస్ట్రిక్ట్ లో మరో వైపున్న రైడాల్ మౌంట్ కు చేరాడు స్పానిష్ ప్రజలు క్రూర నియంత ప్రభుత్వాన్ని కూల దోసినప్పుడు మాట్లాడలేదు .ఇటాలియన్లు విముక్తి సాధించినప్పుడూ మౌనమే .స్వేచ్చ కంటే రక్షణ ముఖ్యం అని భావించాడు .ఫ్రీప్రెస్  ను వ్యతిరేకించాడు .వెస్ట్ మోర్ లాండ్ కు స్టాంప్స్ దిస్త్రిబ్యూటర్ గా నియమింప బడ్డాడు .లిబరల్ వ్యతిరేకులను   ఎదిరించాడు .దీనికి కానుక గా వెస్ట్ మోర్ లాండ్ కు ‘’జస్టిస్ ఆఫ్ దిపీస్ ‘’ను చేశారు డెబ్భై రెండులో పూర్తీ గా టోరీ అయి పోయాడు .రాజు ఏడాదికి మూడు వందల పౌన్ల్ పెన్షన్ ఏర్పాటు చేశాడు .సూతీ మరణించిన తర్వాత ఆస్థాన కవి అయ్యాడు .డ్రెస్ ను అరువు తెచ్చుకొని వేసుకొన్నాడు .రాణి విక్టోరియా ముందు ఆ డ్రస్ వేసి ఒంగొని సలాం చేశాడు .దీన్ని ఆయనకు సరిపోయేట్లు కత్తిరించి సరి చేయటానికి టైలర్ మాక్స్ టన్ చాలా కష్టపడ్డాడట .రాబర్ట్ బ్రౌనింగ్ అసూయ పడి కవితలో ఏడ్చాడు .

వర్డ్స్ వర్త్ జీవితం లో చివరి పాతిక ఏళ్ళలో పెద్దగా ఏమీ రాయనే లేదు .కవిత్వాన్ని సరిదిద్దుకొంటూ ,చర్చలు జరుపుతూ గడిపాడు ‘’యాభై లో మొదలు పెట్టిన ‘’దిఎక్స్ కర్షన్ ‘’జీవిత సాఫల్య రచనగా భావించాడు .అందులో ఫిలాసఫీ కానికవిత్వం కనీ లేదాన్నారు దోరోతి ఆరోగ్యం కుదుట బడలేదు .కళ్ళు సరిగ్గా కనిపించక చదవటం మానేశాడు. .ఎనభై వ పుట్టిన రోజు  తర్వాతా కొన్ని రోజులకే 23-4-1850వర్డ్స్ వర్త్ కవి ‘’ఈ వరల్డ్ ‘’ను వదిలేసి ‘’వర్త్ ను మాత్రమె’’ మిగిల్చిఉంచేసి ,పై లోకాలకు చేరాడు .ఆయన సమాధిపై ‘’two voices are there –one is of the sea –one of the mountains –each a mighty voice ‘’అని ఆయనే రాసుకొన్న కప్లేట్ ను రాసిన శిలా ఫలకాన్ని ఉంచారు .

ఇంగ్లాండ్ లో గొప్ప కవుల్లో ఒకడు .గొప్ప ఫిలాసఫర్ ..అందరు ఉదహరించే అనేక కవితా పంక్తుల్ని రాసి జనం నాలుక పై వర్దిల్లాడు అతనిలో రెండు విరుద్ధ ప్రక్రుతులున్నాయి ఒకటి యువ బే ఫర్వాతనం ,తీవ్ర మనస్తత్వం రెండోది పండిన ముసలితనం లో జ్ఞాన సంపాదన తో రాసిన ఆదర్శ కవిత్వం .ఇందులో ప్రతిమాటకూ సార్ధకత ఉంది .తన కవిత్వాన్ని తానె ఎస్టిమేట్ చేస్తూ ‘’to console the afflicted ,to add sunshine to day light  by making the happy happier .But a poem is not primarily a therapy its purpose is not to instruct ,although it may do so ,but to delight .అని చెప్పాడు .ఆత్మ పరిశీలన ఉన్నవాడు .ఒక ట్యూటర్ లాగా చెబుతాడు .అందుకని ఆయన కవిత్వం పాఠంలాగా కాకుండా రిపోర్ట్ కార్డ్ ల్లాగా ఉంటుందని కొందరి అభిప్రాయం .ఉపదేశం ఇవ్వటానికే ప్రాధాన్యం ఇచ్చాడు ఇది అబ్సర్డ్ గా అనిపిస్తుంది .మనుషుల యదార్ధ భాష నేమీ ఆయన ఉపయోగించలేక పోయాడు .గ్రామీణ ప్రజల గురించి రాసినా వారి ఆదరణ పొందలేదు .తనకు తాను తప్ప ఎవరూ తెలియదన్నాడు .

‘’the giant Words Worth –god love him ‘’అని కాల్ రిడ్జి మెచ్చాడు .మిల్టన్ తర్వాత ఇంత గొప్ప కవి ఇంగ్లాండ్ లో పుట్టలేదన్నారు .ప్రక్రుతి తన ఆరాధనకు స్పందించింది అంటాడాయన .ప్రక్రుతిని చూసి మురిసే పసి వాడి కంటే ఆరాధించే కుమారుడిలా కని  పిస్తాడు .ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా, అన్నా ఆయన మాత్రం ‘’mover and shaker ‘’గా ఉండిపోయాడు .’’He altered the course of English literature by the very contradictions of his theory and practice .he made us revise our concept of the poetic idiom and ,in his revitalization of the language ,changed the tone as well as the direction of modern poetry ‘’.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-14-ఉయ్యూరు

‘’ .

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.