పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45

అమెరికా కవులు –

మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని  కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా చదివి నా ప్రాక్టీస్ చేయలేదు .ఆఫీసు పెట్టినా క్లైంట్ ల కంటే పబ్లిషర్లు ఎడిటర్లను ఆకర్షించాడు .’’పెన్సిల్వేనియా ఫ్రీమన్ ‘’పేపర్ లో బానిసత్వ నిర్మూలనపై వ్యాసాలూ రాశాడు .మెక్సికో తో యుద్ధం వలన బానిస రాష్ట్రాలు  పెరుగుతాయని భావించాడు ‘’బిగ్లో పేపర్స్ ‘’లో సెటైర్లు దంచి రాశాడు .మొదటి కవితా సంపుటి ముద్రించాడు .ఇరవైలో ‘’ది విజన్ ఆఫ్ సర్ లాంఫాల్ ‘’రాసి రొమాంటిక్ అభిరుచి ఉన్నవారిని ఆకర్షించాడు .బిగ్లో పేపర్స్ లో ‘’బోస్టన్ కొరియర్ ‘’ ప్రారంభించి భిన్నత్వ ధోరణిలో నడిపాడు .యుద్ధ వ్యతిరేకం గా ఎన్నో కవితలు రాసి మెప్పించాడు .

‘’ez for war I call it murder –there you have it plain an flat –I donot want to go no further ‘’అన్నాడు ‘’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’రాసి తేలిక విషయాలపై దృష్టినీ పెట్టాడు .ఎమర్సన్ పో ,బ్రయంట్ మొదలైన వారి నందరిని ఉతికి ఆరేశాడు .

ఒక ఏడాది యూరప్ లో గడిపాడు .భార్య చనిపోయింది రచనలో మునిగాడు .లాంగ్ ఫెలో చైర్ కు ఎంపికైఆధునిక భాషలపై అనేక ఉపన్యాసాలిచ్చాడు .జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ భాషల్లో పండితుడైనాడు .స్పెయిన్ దేశానికి మంత్రి అయ్యాడు .రెండవ భార్య ఇంగ్లాండ్ లో ఉండగా చనిపోయింది .అమెరికా తిరిగి వచ్చి అనేక విమర్శనాత్మక వ్యాసాలూ రాశాడు .పది వాల్యూముల గ్రంధ రచన చేసిన ఉద్దండ పండితుడు .వందేళ్ళ వరకు రాయాల్సిన వన్నీ సిద్ధం చేసుకొన్నాడు .కాని పుట్టిన ఇంటిలోనే 12-8-1891న డెబ్భై రెండేళ్లకే చనిపోయాడు ..మధురమైన భాషలో కవిత్వం రాశాడు .రైమింగ్ బాగా తెలిసిన వాడు .మాండలికానికి హోదా ,గౌరవం కల్పించాడు .నిజాయితీ గా అసలైన యాంకీ గా ‘’హ్యూమర్ ను హ్యూమన్ ‘’ను మేళవించాడు .అమెరికం రొమాంటిక్ కవిగా ,’’ఫైర్ సైడ్ ‘’కవుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు .’’who ever is most universal is most national ‘’అని అంటాడు .బోస్టన్ ,హార్వర్డ్ బ్రాహ్మిన్ కల్చర్ కు ప్రతినిధి .ఆధునిక సివ్ల్ రైట్స్ ఉద్యమానికి ప్లాట్ ఫారం నిర్మించాడు .’’ది ప్రెసెంట్ క్రిసిస్ ‘’కవిత సివి ల్  వార్  కల్లోలాన్ని దృష్టికి తెచ్చింది .

James Russell Lowell circa 1855.jpg

 

 

అన్ని ప్రక్రియలకు ఆద్యుడు – ఎడ్గార్ అల్లాన్ పో

పేరులోనే ‘’ఎలోన్ ‘’ఉంది కనుక ఒంటరివాడుగానే జీవించాడు  .జీవితం లోని కస్టాలు దుఖాలకు కుంగి విచారమే పరమావధిగా ప్రవర్తించాడు ,రాశాడు  .తల్లీ తండ్రీ ఇద్దరూ స్టేజి నటులే .మాసా చూసేట్స్ లోని  బోస్టన్ లో19-1-1809 న జన్మించాడు .రిచ్మాండ్ లో న్యుమోనియా వచ్చింది .తండ్రి తరఫు తాత పెంపకం లో పెరిగాడు .రిచ్మాండ్ వ్యాపారి జాన్ అలన్ సంరక్షణ లో ఉన్నాడు .అలాన్ కు పిల్లల్లేరు .ఇంగ్లాండ్ లో మంచి స్కూల్ లో చేర్పించాడు అక్కడ ఒంటరితనం బాధించి ‘’ది లేక్ ‘’కవిత రాశాడు ‘’death was in that poisonous wave –and in its gulf a fitting grave –for him who thence would solace bring –to this lone imagining ‘’అని భావ గర్భిత కవిత రాశాడు .అమెరికా తిరిగి వచ్చిఒక స్నేహితుని తల్లి  మిసెస్ స్తానర్డ్ పై తల్లి భావం తో ప్రవర్తించాడు .వర్జీనియా వర్సిటిలో చేరి శ్రద్ధ చూపకుండా తాగుడులో పడి గెంటి వేయ బడ్డాడు .పెంపుడు తండ్రి అలాన్ తో పోట్లాడి బయటికొచ్చేశాడు .’’టామర్లేన్ ‘’ ‘’బై ఏ బోస్తోనియన్ ‘’అని తన పేరు లేకుండా రాసి ప్రచురించాడు .ఎవరికీ పట్టలేదు .రెండేళ్ళు సైన్యం లో పని చేసి ,అలాన్ వలన బయటికొచ్చాడు .మళ్ళీ అలాన్ తో పోట్లాడి తాగుడుతో చనిపోతున్న తమ్మిడికి సేవ చేశాడు .మళ్ళీ వెస్ట్ పాయింట్ లో ఉద్యోగం పొందాడు .అధికారుల ఆజ్ఞలను ఉల్లంఘించి నందుకు ఉద్యోగం లోంచి తప్పించేశారు .

పెంపుడు తండ్రి అలాన్ తో మళ్ళీ పోట్లాడి ,అతనేమీ ఇవ్వక పోయేసరికి’’ పెన్నీ లెస్ ఫెలో’’ గా రోడ్డున పడ్డాడు పో .అనారోగ్యం తాగుడు ,దరిద్రం నిరాశ దుఖం ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .సృజనాత్మక రచనలు చేశాడు .ఒక కదా రాస్తే యాభై డాలర్ల ప్రైజ్ వచ్చింది .కజిన్ వర్జీనియాను పెళ్లి చేసుకొన్నాడు .అనేక పత్ర్తికలకు ఎడిటర్ గా పని చేసి వదిలేశాడు .తాగనిదే ఉండ లేక పోయేవాడు కిక్కు కోసం తాగి జీవితాన్నికిక్ చేసుకొని  నాశనం చేసుకొన్నాడు .కుటుంబాన్ని ఫోర్డ్ హాం కు మార్చాడు.కుటుంబ  బాధ్యతలనుంచి ఎప్పుడూ వెనక్కు పోలేదు .భార్య చనిపోయింది .మరీ విషాదం లో మునిగాడు .తల్లి లేని లోటును జీవితాంతం అనుభవించి వేదన చెందాడు .అందుకే రచనలలో మాత్రుభావానికి పెద్ద పీట వేస్తాడు .

ముప్ఫై ఎనిమిది లో న్యూరోటిక్ ,గా మతి స్తిమితం లేని వాడుగా మారి పోయాడు .విధవ రాలైన సారా విలియం విట్మన్ తో కలిసి ఉన్నాడు .అస్తిమితత్వం తో ఆత్మా హత్యా ప్రయత్నాలు చేశాడు .భ్రమ, భ్రాంతులతో చివరి రోజులు గడిపాడు .ఎవరూ పట్టించుకో లేదు .రోడ్ల వెంబడి పది తిరిగే వాడు .అంత గొప్ప కవి అనాధగా రోడ్డు పక్క మురికి కాలవ దగ్గర పడి7-10-1849 లో నలభై రాకుండానే చనిపోయాడు .

‘’almost without the first sign of moral principle or the simpler affections of the heart ,poe;s verses illustrate an intense faculty of technical and abstract beauty with the rhyming art to excess ,an incorrigible propensity toward nocturnal themes and demoniac under tone behind every page ‘’ అని వాల్ట్ విట్మన్ ప్రశంసించాడు .అన్ని విషయాలలో అందమైన అమ్మాయి చావు ను వర్ణించాడు .క్రియ కు అత్యంత ప్రాధాన్యత నిచ్చి కవిత్వం రాశాడు .కవిత్వం అంటే ‘’is opposed to a work of science by having ,for its immediate object ,an idefinite instead of a definite pleasure being a poem only so far as the objects attained .అని అభిప్రాయ పడ్డాడు పోప్.గోల్డ్ బాగ్ రెవిన ,మర్డర్ ఇన్ ర్యు మాంటేగ్ ‘’కవితలు అతని ప్రతిభకు నిదర్శనాలు .దెయ్యాలు భూతాల కధలు రాశాడు .డిటెక్టివ్  కధలల్లాడు. కవిత్వం పై గొప్ప వ్యాస పరంపర రాశాడు .చివరగా ‘’poe;s poems are full of the music of another sphere ,a shadowy half world ,out of space ,out of time ,where Poe;s spirit was un happy at home ‘’అని అంచనా వేయ వచ్చు .మిస్టరి కధలకు ఆద్యుడు .కవిత్వం రాసి జీవితం గడప వచ్చునని రుజువు చేసిన కవి .గోదిక్ రచనలలో సుప్రసిద్ధుడు .హారర్ కదల సృష్టికర్త .పజిల్ నిర్మాత సాహిత్య విమర్శన లో శిఖరాగ్రాన నిలిచాడు ..నిర్దాక్షిణ్య సంపాదకీయాలు సాహితీ విమర్శలు చేశాడు .యూరప్ అంతటా ఆరాధనీయుడైన కవి .ఫిజిక్స్ లోను కాస్మాలజి  లోను ప్రవీణుడు .’’యురేకా’’ నుపూర్తీ  అంతరజ్ఞానం తో (ఇంట్యూషన్ )రాసి మెప్పు పొందాడు .’’క్రిప్టోగ్రఫీ ‘’అంతు చూసిన వాడు .చిన్నకధలు నాటికలు రాసి సుసంపన్నం చేశాడు .

Inline image 1

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.