పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46

సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

‘’గడ్డి పరకలు ‘’కు కావ్య గౌరవాన్ని సాధించి సమాజం లోని అన్ని వర్గాల వృత్తుల మనుషులకు గౌరవం కలిపించి ఇంగ్లాండ్ భావ దాస్యానికి భరతం పట్టి తేర దించి అసలు సిసలు అమెరికన్ కవిత్వాన్ని రాసిన వాడు జాతీయ కవిగా గుర్తింపు పొందిన వాడు వాల్ట్ విట్మన్ . 31-5-1819న అమెటాంరికా లోని లాంగ్ ఐలాండ్ లో హంటింగ్టన్లో వెస్ట్ హిల్స్ లో జన్మించాడు .తొమ్మిదిమంది సంతానం లో రెండవ వాడు .తండ్రి కార్పెంటర్ .కుటుంబాన్ని బ్రూక్లిన్ కు మార్చాడు .తండ్రికి ‘’టాం పైన్’’  అంటే వీరాభిమానం .ముగ్గురు కొడుకులకు అదే పేరు పెట్టుకొన్నాడు .మిగిలిన వారికి జార్జీ వాషింగ్ టన్ ,థామస్ జెఫర్సన్ ,ఆండ్రూ జాక్సన్ అని ప్రేసిడెంట్ల పేరు పెట్టుకొని మురిశాడు . పెద్దన్న సిఫిలిస్ వ్యాధి కి గురైనాడు .ఒక చెల్లెలు నరాల బలహీనత తో ఇబ్బంది పడింది .ఒక అన్న వాటర్ వర్క్స్ లో పని చేసేవాడు ఈ నేపధ్యం లో విట్మన్ పెరిగాడు .

పదకొండవ ఏట స్కూల్ చదువు పూర్తీ చేశాడు .ప్రింటర్ దగ్గర సహాయకుడైనాడు .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రిక ప్రెస్ లో పని చేశాడు .యువకుడిగా చాలా  రెస్ట్ లెస్  గా ఉండేవాడు .బతకటానికి అనేక పనులు చేశాడు. ఏదీ సంతృప్తినివ్వలేదు .న్యూ యార్క్ లో కంపోజిటర్ గా పని చేశాడు .స్కూల్ టీచర్ అయ్యాడు .చాలా కౌంటీ స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు .ఇరవై లో లాంగ్ ఐలాండర్ ప్రెస్ కొన్నాడు .ఒక ఏడాది స్వంత పత్రిక తేవాలని ప్రయత్నించి విఫలుడై మళ్ళీ ఉద్యోగాన్వేషణ లో పడ్డాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక పోయాడు .ఆరేళ్ళు అరడజన్ పత్రికలలో పని చేశాడు.చివరికి ఇరవై ఎనిమిదో ఏట ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే కొన్ని వచన రచనలు కొన్ని కవితలు రాశాడు .చిన్న కధలూ రాశాడు .’’ది ఇంకాస్ డాటర్ ‘’అనే బాలాద్ద్ స్తాన్జాలను రాసినట్లు  అందరూ మర్చి పోయారు . .ఈగిల్ సంపాదకుడిగా ముప్ఫై వ ఏడు వరకు పని చేశాడు .’’సోగ్గాడు ‘’వేషం తో ఉండేవాడు ఎప్పుడూ .అదే తరువాతతరానికి ఫాషన్ అయింది .న్యు ఆర్లియాన్ దిన పత్రిక ‘’డైలీ క్రిసేంట్ ‘’లో పని కుదిరింది .తమ్ముడు జెఫ్ తో కలిసి న్యూ ఆర్లియాన్స్ అంతా తిరిగి చూశాడు .మూడు నెలల తర్వాతా బ్రూక్లిన్ చేరాడు .ఫ్రీమన్ వార పత్రిక  కు ఎడిటర్ అయ్యాడు . హోమో సెక్సువల్ అయ్యాడు అమ్మాయిలతో తిరిగాడు .ముప్ఫై వ ఏట కవితాశైలి  పై ప్రయోగాలు చేశాడు .ఇది అతనికీ కొత్తా సాహితీ లోకానికి ఇతనూ కొత్త .స్వేచ్చగా ,నిబంధనలేని రైమ్స్ తో రాయటం మొదలు పెట్టాడు . కొంత మిస్టిజం ఉండేది .తన గురించి తన కవిత్వం గురించి చెప్పుకొన్నాడు –

‘’I am the poet of the body –and I am the poet of the soul –I go with the slaves of the earth equally with masters –and I will stand between the masters and the slaves –I will buoy you up –every room of your house do I fill with armed men –lovers of me ,baffles of hell-sleep for ,I and they stand guard this night .god and I are now here –speak !what would you have of us’’ఇదొక కొత్త గొంతు కొత్త భావం కొత్త ఆలోచన అందర్నీ తనతో తీసుకు వెళ్ళే ఆలోచన .అందర్నీ సమానం గా చూసే తత్త్వం .నోట్ పుస్తకం లో గిలికిన కవితలు పన్నెండిటిని  బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో అచ్చు వేశాడు .వీటికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’అని పేరు పెట్టాడు .అమెరికా స్పిరిట్ తో రాసిన కవితలివి .1855లో ఇవి లాంగ్ ఫెలో కవి రాసిన ‘’హైవాత ‘’తో బాటే ప్రింట్ అయ్యాయి .విట్మన్ తో అమెరికా జాతీయ కవిత్వం ఆవిర్భ వించింది .అమెరికా గొంతు విని పించింది .అమెరికా ఆశయం ప్రతిధ్వనించింది .దీనితో పేరు ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొన్నాడు .ముఖ చిత్రం మీద ఈ మార్పు ను స్పష్టం గా చూపించాడు .ఎవరికీ భయపడని మనిషిగా ,కోటు లేకుండా ,చొక్కా పైభాగం ఓపెన్ గా రంగుల లోపలి చొక్కా తో పోకిరీ పోజుతో  దర్శన మిచ్చాడు ముఖ చిత్రం పై .అప్పటినుండే విట్మన్ లిజేండరి ప్రారంభమైంది .

విట్మన్ లెజెండ్ అయిపోయాడు.దానికోసం అహరహం శ్రమించాడు. రాసినది చిత్రిక పడుతున్నాడు .రాయాల్సిన దానికి ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .తనను కూలీల సహచరిడిగా ,చదువు రాని వారి స్నేహితుడి గా చెప్పుకొన్నాడు .మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు .వారిలో మమేకమయ్యాడు .ప్రజాస్వామ్యకవి గా దాని విలువల రక్షకుడయ్యాడు .అప్పటిదాకా అమెరికన్లు సామాన్యులతో కలిసి పని చేయటానికి ఇబ్బంది పడ్డారు .లేబర్ ని దూరం చేశారు .వారి గురించిన కవిత్వమే రాలేదు .వీరందరినీ భాగ స్వాములను చేసి కవిత్వం రాశాడు కొత్త చరిత్ర సృష్టించాడు అదో జగత్ సహోదరులకు అండా దండా గా నిలిచాడు .ఇవేమీ పట్టించుకోని విమర్శక గణం  అతని తాగుడు వ్యభిచారం పొగరు బోతుతనం పోకిరీ వేషాల గురించేరాశారు కాని కవిత్వం గురించి పట్టించుకోలేదు .తన డబ్బా తానె కొట్టుకొంటున్నాడన్నారుకూడా .అతనికవితలు నిజం గానే గడ్డిపరకలని తొక్కి పారేయ దగ్గవని అతను సగం మనిషి సగం  జంతువూ అని ఈసడించారు .అమెరికాలోనే కాదు యూరప్ లో కూడా .విట్టియర్ కవి లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని నిప్పుల్లో వేసి కాలిస్తే ,లోవెల్ ‘’హంబగ్ ‘’కవిత్వమని కొట్టి పారేశాడు .

అయితే మేధావి కవి ఫిలాసఫర్ ఎమర్సన్ మాత్రం ఏంతో మెచ్చుకొన్నాడు ‘’dear sir –I am not blind to the worth of the wonderful gift of leaves of grass .I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy .i give you the joy of your free and brave thought I find the courage of treatment which so delights us .i greet you at the beginning of a great career ‘’అని మనస్పూర్తిగా ఆశీర్వ దించాడు ఆ యోగి  మహర్షి కవి వేదాంతి ,ఉత్తమ దేశికుడు అదే ఆశీర్వాదం అయింది .ఇక విట్మన్ కవితా ప్రవాహానికి అడ్డులేకుండా పోయింది .విమర్శకుల జడి వానలు కురుస్తున్నా అప్రతిహతం గా సాగిపోయాడు .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో –‘’I celebrate my self and sing my self –and what I assume you shall assume –for every atom belonging to me good belongs to you ‘’ఇలా వ్యక్తులతో కలిసి పోయాడు .దీనితో కవితలూ పెరిగాయి .బృహత్ గ్రంధం గా 384 పేజీలతో నూట ఇరవై నాలుగు కవితలతో లీవ్స్ ఆఫ్ గ్రాస్ రూపు దాల్చింది .తొమ్మిదో ఎడిషన్ లో మరిన్ని కవితలు చేరాయి .ఇంకా విమర్శకులు ఉస్త్ర పక్షి ద్రుక్పధాన్నే పాటించి కళ్ళు మూసుకొంటూనే ఉన్నారు .అయినా ఏదీ ఆగ లేదు .ప్రజలు ఏంతో ఇష్టం గా చదివారు ఆదరించారు తమకొక అన్నయ్యా తమ్ముడు మామయ్యా బాబాయి లభించాడని ఊరట చెందారు .బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు .కాని ఆదాయం రాలేదు. మళ్ళీ జర్నలిజం లో ప్రవేశించాడు .

రాజకీయం గా కలత చెందాడు ,స్లేవరిని సమర్ధించే వారేక్కువైనారు .బానిసల పై దయా సానుభూతి చూపే వారే కరువైనారు .దీనితో మనసు వికలమైంది విట్మన్ కు .అమెరికా పై పెట్టుకొన్న ఆశలు అడియాసలయ్యాయి .రాజ్యమే కాదు ,మనుషులూ దగా చేశారనుకొన్నాడు .కోపం ఉద్రేకం పెరిగి ఐరనీ తో ఒక కవిత రాశాడు దాన్ని గ్రాస్ లో చేర్చలేదు –‘’I pronounce openly for a new distribution of roles —–let the sun and moon go –let scenery take the applause of the audience –let there be apathy under the stars –అని ఆవేశం గా ఆలోచనాత్మకం గా కదిలించేలా రాశాడు .డైలీ టైమ్స్ లో పని చేశాడు .యుద్ధం లో చేరి పోరాడాలని భావించాడు ముసలితనం అడ్డమొచ్చినది .క్వేకర్ భావాల వాడుకనుకతుపాకి పట్టలేదు .  .సోదరుడు యుద్ధం లో తీవ్రం గా గాయ పడ్డాడు అతని సేవ చేశాడు .వాషింగ్ టన్అంతా ఒక హాస్పిటల్ గా మారి క్షత గాత్రుల ఆర్తనాదాలతో మారు మొగి పోతోంది .’’హాస్పిటల్ విజిట్స్ ‘’పేర ఆర్టికల్స్ రాశాడు .అంగ వికలురైన సైనికులకు  కట్లు కట్టి విట్మన్ సేవ లందించాడు .ప్రతి క్షణం దయా సాను భూతితో అలుపు లేకుండా   సేవ చేశాడు .అందరూ తన వాళ్ళే అనుకొన్నాడు . తన జీతం లో కొంత భాగం తో పొగాకు ,స్టాంపులు తిను బండారాలు ,పండ్లు ,పాలు బిస్కెట్లు చాకో లెట్లు పుస్తకాలు  కొని గాయ  పడిన సైనికులకు ఇచ్చి వారిలో ధైర్యం ,ఉత్సాహం జీవితేచ్చ కలిగించేవాడు .ఉత్తరాలు రాసి పెట్టేవాడు .’’డ్రం –టాప్స్ ‘’లో వీటిని వివరించాడు .కవిత్వం లో మానవత్వాన్ని ఎలిగెత్తి చాటటమే కాదు ,దాన్ని ఆచరించి చూపి సాటి వారి యెడ ఆత్మీయతానురాగాలను ప్రదర్శించి ,సాను భూతితో సేవలందించిన మానవీయ మాననీయ కవి విట్మన్ .ఈ సంఘటన తర్వాత అతన్ని బాగా అర్ధం చేసుకొన్నారు .గౌరవ ఆదరాలిచ్చి మెచ్చుకొన్నారు

అమెరికా ప్రజలు అత్యంత కృతజ్ఞతా భావాన్ని విట్మన్ పై ప్రదర్శించి అభిమానాన్ని చాటుకొన్నారు .అబ్రహాం లింకన్ కాబినెట్ లో’’ఇండియన్ బ్యూరో ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లో  గుమాస్తా ఉద్యోగం దీని ప్రభావం వలననే దొరికింది . ఇంటీరియర్ కు సెక్రెటరి అయిన జేమ్స్ హార్లాండ్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని ఒక డ్రాయర్ సొరుగు లో చూసి చదివి భయపడి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాడామో నని తొందరపడి ఉద్యోగం తీసేశాడు .దీనికి విట్మన్ స్నేహితులు తీవ్రం గా స్పందించి ‘’గుడ్ గ్రే పోయెట్ ‘’పేర కరపత్రం విడుదల చేశారు .ఖంగు తిన్న ప్రభుత్వం తప్పు తెలుసుకొని ‘’అటార్నీ జెనరల్ ‘’శాఖ కు బదిలీ చేసింది .యాభై మూడవ  ఏడు వచ్చేవరకు అందులోనే హాయిగా సెక్యూర్ గా పని చేశాడు …తరువాత మళ్ళీ కవి రోడ్డున పడాల్సి వచ్చింది .తను రాసిన పాసేజ్ టు ఇండియా ,డెమోక్రాటిక్ విస్టా పుస్తకాలను డాలర్ కు డెబ్భై అయిదు సెంట్లకు అమ్ముకొని జీవించాడు .మెదడులో ఏదో అలజడి అనుభవించాడు .బహుశా రోగ గ్రస్తుల  పుండ్లుపు కడిగి డ్రెస్సింగ్ చేయటం వలన బాక్టీరియా తలలోకి ప్రవేశించి ఉండవచ్చునని భావించారు .తల్లి హృదయం తో మగ వాడిగా సేవ లందించాడు .వాషింగ్ టన్ అంటే ఇష్టం. అక్కడికి వెళ్లి సైనికులకు సేవలు చేస్తూనే ఉన్నాడు .అందరిని ప్రేమ దయ తో పలకరించికష్ట సుఖాలు తెలుసుకొని సహాయం అందించేవాడు .మాత్రు హృదయం తో సేవ చేస్తున్న ఈ ‘’గడ్డం కవి ‘’ని చూసి అమితాశ్చర్య పోయారు .చదివి కృతజ్ఞతలు చెప్పారు .విట్మన్ ‘’మగాడుగా మహిళ’’ గా అందిస్తున్న సేవలకు పులకించి పోయారు .తన ఆరోగ్యాన్ని గూర్చి గొప్పగా చెప్పుకొని తల్లికి జాబులు రాసేవాడు .తనను ‘’వైల్డ్ బఫెలో ‘’అనుకోనేవాడు .యాభై ఏళ్ళకు ఈ ముదురు బెండకాయ బ్రహ్మ చారికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది తనకూ ఒక కుటుంబం కావాలని తపించాడు .

తల్లిని సందర్శించైనా కొన్ని నెలలకే న్యు జెర్సీ లోని కామ్దేన్ లో  తల్లి చనిపోయింది .హతాశుడయ్య్యాడు .జార్జి ఇంటిపైభాగాన ఒక గది ఉండటానికి ఇచ్చాడు .కామ్దేన్ లో ‘’కామ్ ‘’గా ఉంటున్నాడు .ఒక్కసారిగా ముసలి వాడైనట్లు కని  పించాడు .డిప్రెషన్ ,ఫిట్స్ తో బాధ పడ్డాడు .పుస్తకాలను ఎవరూ ప్రింట్ చేయటానికి ముందుకు రానందుకు కున్గిపోయాడు .అదే  ఆధారం అనుకొంటే ఇలా అయింది .కొద్ది గా ఆరోగ్యం బాగు అవగానే కొలరాడో వెళ్లి లింకన్ పై ఉపన్యాసాలిచ్చాడు .’’లిలాక్స్ లాస్ట్ ఇన్ ది డోర్ యార్డ్ బ్లూమేడ్ ‘’కవిత ను ‘’నేటివ్ క్లాసిక్ ‘’అని అందరూ కితాబిచ్చారు .అరవై అయిదు లో చిన్న దీపం ,చుట్టూ న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు .చని పోయిన సైలర్ భార్య ఇంటిని కని  పెట్టుకొని ఉండేది .అభిమానులు చందాలు పోగు చేసి పంపితే దానితో జీవించాడు .ముప్ఫై మంది శ్రేయోభిలాషులు ఒక గుర్రబ్బండీని సమకూర్చారు .

అరవై తొమ్మిది లో పక్ష వాత లాక్షణాలు కని పించాయి .కిడ్నీ బాధ ఎక్కువైంది .డెబ్భై వ పుట్టిన రోజున ఫిలడెల్ఫియా వెళ్లి లింకన్ పై ప్రసంగించాడు .చని పోతున్నా ఓడిపోకుండా ఉంటున్నాడు.ఒంటరిగా మేడ గదిలో .చనిపోతానని తెలిసి సమాధి నిర్మాణం గురించి ఆలోచించాడు .అప్పగింతలన్నీ పూర్తీ చేస్తున్నాడు .డెబ్భై రెండు లో చివరి ఎడిషన్ గా1891 లో లీవ్స్ ఆఫ్ గ్రాస్ ప్రచురించాడు .దీన్నే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అన్నారు .మొదట పన్నెండు తో మొదలైన పుస్తకం ఇప్పుడు మూడు వందలకు పైగా కవితలతో బృహత్ రూపం గా విట్మన్  కవితా విశ్వ రూపం గా అవతరించింది .న్యుమోనియా సోకి 26-3-1892న మానవేయ మహా కవి విట్మన్ మరణించాడు .పెళ్ళికాని బ్రహ్మ చరిగానే మిగిలి పోయాడు .విట్మన్ ఫిలాసఫీ లో అన్ని కలగా పులగం గా కలిసి పోయాయి .అమెరికాపై రాసిన ‘’సాంగ్ ఆఫ్ ఎక్స్పో జిషన్ ‘’ఒక జాటీయ గీతం లాంటిదే .అన్ని రాష్ట్రాలను అన్ని దేశాలను కలిపాడు విశ్వ పౌరుడనిపించాడు .

‘’Whitman became the voice of  a rapidly developing civilization .half idealistic half materialistc some times corrupt  but ever expanding America ‘’

అమెరికాను అమెరికా గా గుర్తించటానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేశాడు. ఇంగ్లీష్ భావ దాస్యానికి దూరం చేశాడు .జాతీయ రక్తం ప్రవహింప జేశాడు .ప్రజా స్వామ్య మానవుడి భవితను నిర్దేశించాడు .తను చేస్తున్న పనేమిటో పూర్తీ అవగాహన ఉన్న వాడు .’’I have allowed the stress of my poems from beginning to end to bear upon American individuality and assist it –not only because that it is a great lesson in nature ,amid all her generalizing laws ,but as counterpoise to the leveling tendencies of democracy ‘’అని ఆరాట పడిన దేశ భక్త కవి .లీవ్స్ లో అతనికల సాకారమైంది .అదొక మాన్యుమెంటల్ బుక్ అయింది .’’it is a national phenomenon in which a poet identifies himself not only with a continent but with the cosmos .uttering the word democratic the word en-masse ‘’he sings seemingly of himself but actually ‘’

.’’of life immence in passion pulse and power –cheerful ,for forest action ,formed under the laws divine –the modern man I sing ‘’అని ఆధునిక మానవుడికోసం గీతాలు రాశాడు గానం చేశాడు .దేశం కోసం తన వీర విధేయతను ప్రదర్శించాడు .తన ‘’గడ్డిపరకలు ‘’గురించి విట్మన్ ఏం చెప్పాడో తెలుసుకొంటేనే మజా –

‘’this is no book .who touches this ,touches a man ‘’అని పొంగిపోయి చెప్పాడు సాహిత్య చరిత్రలో పుస్తకాన్ని మనిషిని ఒకటిగా చేసిన కవి రచయితా లేనే లేదు .’’in it Whitman emerges a titanic and controversial figure –messianic ,intuitive ,and often mistaken ,roughhewn ,and lopsided ,but un questionably the most challenging writer of his time and of ours ‘’అని కీర్తి కిరీటం పెట్టారు .త్రాన్సలిండేజం ,రియలిజం ల మధ్య నిలిచాడు .’’the proof of a poet is that his country absorbs him as affectionately as he has absorbed it ‘’ అని చెప్పాడు .గడ్డిపరకలు అమెరికన్ మహా కావ్యం అయింది .Whitman is American poet .he is America ‘’అని మనస్పూర్తిగా మెచ్చాడు ఎజ్రా పౌండ్.బీట్ ఉద్యమానికి ప్రతినిధిగా వాగా బాండ్ గా నిలిచాదన్నారు .అతని అనుచరుల్ని ‘’ విట్మనైట్స్’’ అని పిలువ బడ్డారు .ఎందరో సంగీతకారులు అతని కవితలకు సంగీతం సమకూర్చి అజరామరం చేశారు .

 

Walt Whitman - George Collins Cox.jpg

 

కవిత్వం లో ఆత్మాన్వేషణ చేసిన –ఎమిలీ డికిన్సన్

10-12-1830 లో మాసాచూసేట్స్ లోని ఆంహెర్స్ట్ లో ఎమిలీ డికెన్ సన్  పుట్టింది .తండ్రి గ్రామీణ లాయర్ ,లెజిస్లేటర్ ,ప్రభుత్వ కౌన్సిల్ మెంబర్ .బాల్యం నుండే తిరుగు బాటు ధోరణి ఉండేది .మౌంట్ హోలీ యెక్ ఫిమేల్ సేమిటరి లో చేరింది .అక్కడి బోధనా మత పద్ధతిలో ఉండేది .మత గ్రంధాలను అందరూ బట్టి పట్టి చెబితే వాటి అంతరార్ధాన్ని గూర్చి ఆలోచించేది .క్రిస్టియన్ కావటానికి వ్యతిరేకత లేదని ఒక సారి క్లాసులో చెప్పింది .నల్ల కళ్ళు తెల్ల శరీరం ఒత్తైన జుట్టు తో అందం గా ఉండేది .

యుక్త వయసు రాగానే కవిత్వమే శ్వాస  అయింది .ఆమే కు సెక్రెట్ లవర్స్ ఉన్నారని చరిత్రకారులు రాశారు .ముప్ఫై రెండేళ్ళ వయసులో థామస్ హిగ్గింసన్ కు ఉత్తరం రాసి తన మనసులోని ఇద్దరి మగాళ్ళ గురించి తెలిపింది .న్యూటన్ తనకు ‘’అమరత్వం ‘’బోధించాడని అన్నది .

‘’my life closed twice before its close –it yet remains to see –if immortality unveil –a third event to me –‘’అని మనో భావాన్ని ఎరుక పరచింది .’’angels twice descending –reimbursed my store-burglar banker  father –I am poor once more’’అని ఎదురు చూసింది .న్యూటన్ చని పోయిన తర్వాత తండ్రితో వాషింగ్ టన్ ,ఫిలడెల్ఫియా లు చూసింది .ఇరవై మూడు లో ప్రెస్బిటేరియన్ చర్చి లోని చార్లెస్ వాడ్స్ వర్త్ ను ప్రేమించింది .ఆయనకు దేవుడి ధ్యాసేకాని’’ ఈ దేవీ ‘’ధ్యాసే లేదు .ఆంహీర్త్స్ కు తిరిగొచ్చి అపస్మారకం గా ఏదేదో రాసి పారేసేది .’’I can’t live with you –it would be life –and life is over there-‘’మొదలైన కవితలు రాసింది .విరహం భరించలేక ‘’so we must keep apart –you there I here –with just door ajar –that oceans are –and prayer –that pale sustenance –despairఅని నిరాశగా రాసు కొంది .తనను తానూ అంకితం చేసుకొంటానని ‘’a wife at day break I shall be –sunrise ,hast thou a flag for me ?at midnight I am but a maid –how short it takes to make it bride ! అంటూ మన ‘’మీరా బాయి ‘’లా వలపు వల విసిరింది .

తండ్రి చనిపోయాడు .అప్పటి నుండి అంటే ఇరవై అయిదు నుండి డికిన్సన్ ఒంటరిగా ఉండిద పోయింది .నలభై లో తండ్రి చిరకాల మిత్రుడు ,మాసా చూసేట్స్త్ సుప్రీం కోర్ట్ లో అసోసియేట్ జస్టిస్అయిన ఓటిస్ పి లార్డ్ కు సుదీర్ఘ ఉత్తరం రాసింది .1883 ఆరోగ్యం దెబ్బతిని ,శోక దేవతగా సుదీర్ఘ కాలం ఉండటం తో నరాలు బాల హీనమై ‘’బ్రైట్స్ డిసీస్ ‘’వచ్చి 15-5-1886న యాభై ఆరో ఏట చని పోయింది .ఆమె చని పోయిన చాలా కాలానికి కాని రచనలు ప్రచురణ కాలేదు .ఆమె సోదరి లావీనియా అన్ని రాత ప్రతులను స్వాధీన పరచుకొంది .పక్కింటి ఆయన మేబల్ టాడ్ స హాయం తో నూట పది హీను కవితలను లిస్టు రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ ఎమిలి  డికేంసన్ ‘’పేర1890లో పబ్లిష్ చేసింది .ఏడాది తర్వాత మరో నూట డెబ్భై ఆరు చేర్చి రెండవఎదిషన్  గా తెచ్చింది .ఎమిలీ ఉత్తరాలను రెండు వాల్యూములుగా తర్వాత తెచ్చారు .ఇవన్నీ సరైన పద్ధతిలో లేవు .ఆమె రాత అర్ధం కాక పోవటం గజి బిజీ గా ఉండటం తో సందిగ్ధత వచ్చింది .

లావియానా పక్కింటి టాడ్ తో స్థలం విషయమై తగాదా పడింది .కోర్ట్ కేసులు వచ్చాయి .ఆమె మరణం తో ఎమిలీ ఆస్తి పాస్తులన్ని మార్తా డికిన్సన్ కు దక్కాయి ‘’ది సింగిల్ హౌన్డ్ ‘’పేర ఇదివరకు ప్రచురిమ్పని 143 కవితలు అచ్చేశారు .ఎమిలీ చనిపోయిన యాభై ఏళ్ళకు ఇంకో నూట ముప్ఫై కవితలు దొరికి 1945లప్ ప్రచురింప బడ్డాయి1958 డికిన్సన్ ఆరాధకులు మూడు గ్రంధాలుగా ఆమె వచన సాహిత్యాన్ని  వెయ్యి ఉత్తరాలతో సహా ముద్రించారు .వీటితో ఆమె కవితా స్వరూపం తెలుసుకొనే వీలు కలిగింది .ఆమె కవితలు క్రమ విధానం లో ఉండవు. ఆలోచనలూ కొద్ది పాటివే .ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలుతుంది .ఒకదానితో ఒకటి కలిపేస్తుంది .కొన్ని పలుకు బడులు అర్ధమవటం కష్టమే .

‘’the brain is wider than the sky –for ,put them side by side –the one the other will contain –with ease ,and you beside .’’

 

 

స్ప్రుంగ్ రిథం ను ప్రవేశ పెట్టిన –   జేరాల్డ్  మాన్లి హాప్కిన్స్

హాప్కిన్ కూడా ఎమిలీ  డికేంసన్  లాగే చనిపోయిన తర్వాతే వెలుగు లోకి వచ్చాడు .ఆధునికకాలపు పాత ధోరణి కవి .మధ్యతరగతి వాడు .శతాబ్దాలుగా రైతులు .గ్రేట్ బ్రిటన్ లో హవాన్ కౌన్సెల్ జెనరల్ గా తండ్రి పని చేశాడు .అనారోగ్యం తో తండ్రి నలభై ఏళ్ళకే చనిపోయాడు .ఎనిమిదో ఏట కుటుంబం హాంప్ స్త్రేడ్ కు మారింది . 28-7-1844 లో హాప్కిన్స్ స్ట్రా ఫర్డ్ ఎస్సెక్స్ లో పుట్టాడు .గ్రామర్ స్కూల్ లో చదివి పదిహేనవ ఏట రాసిన ‘’ది ఎస్కోరియాల్ ‘’కవితకు బహుమతి పొందాడు .ఆక్స్ ఫర్డ్ బిల్లియోల్ కాలేజి లో చేరి ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జెస్ వద్ద చదివాడు .సునాయాసం గా కవితలల్లే వాడు బొమ్మలేసేవాడు .’’trees by their yield –are known  but I –my sap is sealed –my root is dry –if life within –I none can show (except for sin )-nor fruit above –it must be so –I do not love ‘’మొదలైన అందమైన కవితలు రాశాడు .’’I have desires to go-where spring not fail –to fields where flies no sharp and sided hail –and a few lilies blow ‘’వంటివి అద్భుతంగా రాశాడు చర్చ్  ఆఫ్ ఇంగ్లాండ్ లో ఇమడలేక కేధలిక్ అయ్యాడు .చివరి పరీక్ష తర్వాత రోహామ్ప్ టన్లో ‘’సాహిత్య శాస్త్రం ‘’(రేటారిక్ )లో ప్రొఫెసర్ అయ్యాడు .మూడేళ్ళు పని చేసి ప్రీస్ట్ హుడ్ కు సన్నాహం లో ఉన్నాడు .పదేళ్ళు కవిత్వం జోలికే పోలేదు .

పై అధికారి తేమ్స్ నదిలో  జర్మన్ స్టీమర్ ‘’ద్యూచ్ లాండ్ ‘’ మునిగి ఎందరి ప్రాణాలో నీటిలో కలిసి పోయి న విషాద దృశ్యాన్ని గురించి రాయమంటే మళ్ళీ కలం పట్టి  రాశాడు .ఇది వరకు ఎవరూ ఉపయోగించని కొత్త భాషలో ,తన జీవిత చరిత్రను జోడించి అత్యంత విషాదాత్మక కధనం గా రాశాడు .1877లో హాప్కిన్స్ కు ఆర్డినేషన్ జరిగింది .నలభై కే అధిక శ్రమ తో ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది .డబ్లిన్ యూని వర్సిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ క్లాసిక్స్ ‘’అది రోహించాడు కవిత్వం రాయటమే కష్టమైంది .జీవిత చరమాంకం లోనే గొప్ప కవిత్వం రాశాడు .నలభై అయిదవ ఏట ‘’ఐ యాం సో హాపీ ‘’అనుకుంటూ అనాయాసం గా మరణించాడు .

హాప్కిన్స్ చని పోయిన ముప్ఫై ఏళ్ళకు 1918లో ‘’పోయెమ్స్ ఆఫ్ జేరాల్ద్ మాన్లీ హాప్కిన్స్ ‘’పేరిట కొన్ని కవితలను బ్రిడ్జెస్ అనే ఆయన సేకరించి ముద్రించాడు .హాప్కిన్స్ కవిత్వం అంత తేలికగా  అర్ధం కాదు. కఠిన పదాలు అన్వయ క్లిష్టత ఇబ్బంది పెడతాయి .’’or to-fro tender trambeams truckle at the eye ‘’ఇదీ ధోరణి .అలంకారాలను మధ్యలోనే వదిలేసి గందర గోళం సృష్టిస్తాడు .భరించటం కష్టమే నని పిస్తుంది .సాంప్రదాయ కవితను ఇమేజరీ తోకలిపి రాశాడు .’’స్ప్రుంగ్ రిధం ‘’ను ప్రవేశ పెట్టాడు .రొమాంటిక్ –మోడరన్ కవులకు వారధిగా నిలిచాడు .

GerardManleyHopkins.jpg

 

 

ఇరవైయవ శతాబ్ది ఉదయం

పందొమ్మిదో శతాబ్దం తమాషా గా అంతమైంది .మర్యాద పద్ధతుల్ని అడ్డుకొన్నారు .అనేక భూమికలేర్పడ్డాయి .యువతులు పెద్దలపై తిరుగు బాటు చేశారు .మహిళా వోటు హక్కు ఒక ధ్యేయమైంది .యువకులు నిత్య ప్రార్ధనలకు వెళ్ళే వారు కాదు ‘’.ది సావాయ్ ‘’,ది ఎల్లో బుక్ ‘’అనే రెండు మేగజైన్లు ఈ హక్కులకు వేదికగా నిలిచాయి .ఎర్నెస్ట్ డౌసన్ అనే కవి తెగ తాగి ముప్ఫై మూడుకే చచ్చాడు .లిఒనేల్ జాన్సన్ అనారోగ్యం తో ముప్ఫై అయిదేళ్ళకే పోయాడు .జాన్ డేవిడ్ సన్ తిరస్కరణకు గురై యాభై అయిదులో ఆత్మ హత్య చేసుకొన్నాడు .ఆర్టిస్ట్ ఆబ్రే బియర్డ్స్ఇరవై ఆరుకే క్షయ తో చనిపోయాడు .కవి, రచయితా ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ఎనభై దాకా జీవింఛి నాటకాలు కవితలు రాసి సెన్సేషన్ సృష్టించాడు .ఆస్కార్ వైల్డ్ యాభై ఆరులో జైలు పాలై రెండేళ్ళ తర్వాత రచనా లోకం నుండి నిష్క్రమించాడు .

వీరికి  ఒక ధ్యేయం లేదు జీవిత సూత్రం లేదు .అయితే ‘’కళకళకోసమే’’ అని మాత్రం నిన దించారు .గిల్బర్ట్ మాత్రం ఒక కన్ను బ్రిటిష్ ప్రజల మీద రెండో కన్ను ఫ్రెంచ్ వాళ్ళపై ముద్ర వేయటం పైనా ఉంచాడు .లండన్ ఇనుప కచ్చడాల మధ్య నలిగింది .దీన్నే ‘’ఫాల్లెన్ మాగ్డ లేన్సేస్’’అన్నారు .విక్టోరియన్ శకం ముగింపు కొచ్చింది .ఏ బ బాల్ రూమ్ కు వెళ్ళినా అరడజను మంది  చెట్టా పట్టా లేసుకొని సానేట్స్త్స్ పాడుకొంటూ కనిపించారు .ఇంగ్లీష్ యువకులు ఫ్రెంచ్ పార్నాసియాన్ లను అనుకరించారు .పతనమై పోతున్న సంస్కృతికి అద్దం పట్టింది .’’fin de siecle’’అని దీనికి పేరు పెట్టారు .క్షీణ సంస్కృతీ అనవచ్చు .’’a swan song and a death bed repentence ‘’అని వాపోయారు .దింపుడు కళ్ళం ఆశ అన్నమాట .పదేళ్ళు ప్రభావం చూపిన ఆస్కార్ వైల్డ్ ఒక అభియోగం లో ఇరుక్కొని అతని ‘’ఈస్థటిక్ ఉద్యమం ‘’పతనమైపోవటానికి సిద్ధమైంది .గిల్బర్ట్ రాసిన ‘’పెషేన్స్ ‘’లోని సెటైర్లు ,రాబర్ట్ హిచిన్సన్ రాసిన ‘’గ్రీన్ కార్నేషన్ ‘’చావు దెబ్బలే కొట్టాయి .జీవితం అస్తవ్యస్తమై విపరీత ధోరణులకు నిలయమై పోయింది .

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లోనూసంస్కృతీ లో  ద్వంద్వ ధోరణలు వచ్చాయి .కొత్త ఆలోచనలు భావాలు ,చెప్పటం లో నూతనత్వం ఒక ప్రక్కన ,పాత పద్ధతులే శరణ్యం అని మరో ప్రక్కన ద్రుక్పదాలేర్పడ్డాయి .ఒకే వ్యక్తీ ఈ రెండిటిలోనూ నిష్ణాతుడై రాసిన వారున్నారు .కొందరు ఒకే దాన్ని పట్టుకు పాకులాడారు .విధాన భేదాలేర్పడ్డాయి .’’the proper school to learn art in is not life but art ‘’అన్నాడు ఆస్కార్ వైల్డ్ .కాని ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ‘’life and nature were merely the crude materials which were to be woven cunningly into beautiful patterns ‘’అని చెప్పాడు ఈ భిన్న పాయలలో సాహిత్యం ప్రయాణించింది .ఫ్రాన్సిస్ థామ్సన్ మాత్రం సనాతన  భగవదన్వేషణ లోమునిగి పోయి కవిత్వం రాశాడు .ఆయన్ను గురించే మనం తర్వాత  తెలుసుకో బోతున్నాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.