పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47
ఫ్రాన్సిస్ థామ్సన్
రోమన్ కేధలిక్ గా 18-12-1859న జన్మించి మాంచెస్టర్ లోని ఓవెన్స్ కాలేజి లో చేరి ఇష్టం లేక ,సరిగ్గా చదవక తప్పి ,లండన్ వెళ్ళాడు .అక్కడా జ్యేస్టా దేవే ఎదురైంది .అగ్గిపెట్టెలు దగ్గర నుంచీ అన్నీ అమ్మాడు .బీదరికం తో కుంగిపోయాడు .కవిత్వమే భిక్ష పెట్టాలి అనుకోని దిగాడు .రాసుకోవటానికి పేపర్లూ కూడా కొనుక్కో లేని దరిద్రం .తండ్రి బ్రిటిష్ మ్యూజియం లోని రీడింగ్ రూమ్ కు అప్పుడప్పుడు డబ్బులు పంపుతున్నా అతని మురికి బట్టలు ,వాలకం చూసి లోపలి అనుమతించే వారు కాదు .అక్కడే బయట అరుగుల మీద పడుకొంటుంటే ఒక వేశ్య దయ తలచి ఇంటికి తీసుకొని వెళ్ళి అన్ని సమకూర్చి సహాయం చేసింది .ఆమె దయతో బతుకుతూ కూడా నిర్లక్ష్యం గా డబ్బు తగలేస్తూ నల్లమందు కు అలవాటు పడ్డాడు .
మెర్రీ ఇంగ్లాండ్ పేపర్ కు కవిత రాసి పంపాడు .వేసుకోవటానికి ఎడిటర్ ఇష్టపడి లెటర్ పంపిస్తే అప్పటికే ఇల్లు మార్చ టం వలన అందుకోలేక పోయాడు .చివరికి పేపర్ వాళ్ళే అడ్రస్ కనుక్కొని ఎడిటోరియల్ ఆఫీసుకు వచ్చి మాట్లాడమన్నారు .చినిగిన బూట్లు ,షర్ట్ లేకుండా పైన వేసుకొన్న మురికి కోటు తో వెళ్ళాడు .మత్తు మందు మానెయ్యమని చెప్పి ఉద్యోగం ఇచ్చారు పందొమ్మిదేళ్ళు అందులోనే పని చేసి బతికాడు .ఎడిటర్ విల్ఫ్రిడ్ మే నెల్ అతని భార్య రచయిత్రి అయిన ఆలిస్ మే నెల్ లు థామ్సన్ రాసిన కవితల మొదటి సంపుటిని ముద్రించారు .బాగా ప్రోత్సాహం లభించింది .షెల్లీ రాసిన హౌన్డ్ ఆఫ్ హెవెన్ పై గొప్ప వ్యాసం రాశాడు .’’సిస్టర్ సాంగ్స్ ‘’రెండవ పుస్తకం గా వచ్చింది .దీనిని మే నెల్ పిల్లలకు అంకితమిచ్చాడు .చాలా జర్నల్స్ కు వ్యాసాలు రాశాడు .’’హెల్త్ అండ్ హోలినేస్ ‘’పై రాయటానికి ఎక్కువ కష్టపడ్డాడు .’’I would be the the poet of the return to god ‘’అని చెప్పుకొన్నాడు అమాయకత్వం పసి మనస్తత్వం తో రాసేవాడు .’’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు ‘’కవితకు మంచి పేరు .
‘’o world invisible ,we view thee –o world intangible ,we touch thee –o world unknowable ,we know thee –inapprehensible ,we clutch thee ‘’—‘’yea ,in the night ,my soul ,my daughter –cry –clinging heaven by the hems –and lo Christ walking on the water –not of Gennesareth ,but Thames ‘’
ఏ యి .హౌస్మన్
హూస్మన్ రాసిన ‘’ఏ స్ట్రోఫైర్ లాడ్’’అనే నిరాశా జనక కవిత రాసి ఫిట్జెరాల్డ్ తో సమాన ప్రాముఖ్యం సంపాదించిన అల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌస్మన్ 26-3-1859లో వార్సేస్తర్ షైర్లోని బ్రూమస్ గ్రోవ్ లో పుట్టాడు .వయసుకంటే చిన్నగా కానీ పించేవాడు .అందుకే స్నేహితులు ‘’చిట్టెలుక ‘’(మౌసీ )అని పిలిచేవారు .తలిదండ్రులు బాగా పలుకుబడి ఉన్నవారు .ఆక్స్ ఫర్డ్ సెయింట్ జాన్ కాలేజి లో చేరటానికి స్కాలర్ షిప్ వచ్చింది .అప్పటికే గ్రీకు లాటిన్ లో ప్రజ్న ఉండేది .హిస్టరీ ,ఫిలాసఫీ లపై మోజు లేదు .చదువు చెప్పాలనే కోరిక ఉండేది .డిగ్రీ పూర్తీ చేయలేదు కనుక యూని వర్సిటి ప్రవేశం జరగ లేదు ..
లండన్ వెళ్లి పేటెంట్ ఆఫీస్ లో చిన్న గుమాస్తా అయ్యాడు .జీతం తక్కువ క్లాసిక్స్ చదివాడు .పదకొండేళ్ళు నిరంతర శ్రమ చేసి అనుకొన్నది సాధించి లండన్ యూని వర్సిటి కాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ అయ్యాడు .పందొమ్మిదేళ్ళు పని చేసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ లాటిన్ ‘’పొందాడు .లండన్ లో ఉన్న కాలాన్ని దారుణ కాలం అన్నాడు .జాక్సన్ భావాలకు పూర్తీ విరుద్ధం గా ఉండేవాడు .తన కవిత్వానికి క్లాసికల్ ఆరిజన్ ఉంది అంటే ఒప్పుకోలేదు ,లాడ్ రాసిన చాలా కాలానికి కాని ఏదీ రాయకపోవటానికి తానూ కవిని కాదని లాటిన్ ప్రొఫెసర్ నని చెప్పాడు .ముప్ఫై ఆరేళ్ళ తర్వాత పోయెమ్స్ పేరిట రెండో పుస్తకం తెచ్చాడు .చనిపోయిన తర్వాత ‘’మోర్ పోయెమ్స్ ‘’ఎడిషనల్ పోయెమ్స్ ‘’ముద్రించారు .చివరి పాతికేళ్ళు కవిత్వం రాయలేదు .ఎనభై ఆరేళ్ళ వయసులో 3-4-1936 న మరణించాడు .
జంగిల్ బుక్ రచయిత – రుడ్యార్డ్ కిప్లింగ్
వచనమే రాసి కవిత్వం తక్కువ రాసిన వాడు రుడ్యార్డ్ కిప్లింగ్ 30-12-1865 ఇండియాలోని బొంబాయ్ లో పుట్టాడు .మేతడిస్ట్ కుటుంబం .ఆరో ఏట ఇంగ్లాండ్ వెళ్ళాడు .నార్త్ డేవాన్ లో వెస్ట్ వార్డ్లో చదివాడు .స్కూల్ మేగజైన్ కు రచనలు చేసేవాడు .యూని వర్సిటి లో చేరకుండా ఇండియా తిరిగి వచ్చేశాడు .లాహోర్ సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ కు సహాయ సంపాదకుడు గ పదిహేడవ ఏట అయ్యాడు .’’ డిపార్ట మెంటల్ డిట్టీస్ ‘’ అనే మొదటి పుస్తకం రాశాడు .ఇరవై రెండు లో ‘’ప్లైన్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ,ఆరు భాగాలుగా చిన్న కధలు ప్రచురించి ప్రపంచానికి భారత దేశాన్ని పరిచయం చేశాడు .’’అండర్ ది దేవదార్స్ ‘’,’’సోల్జేర్స్ ట్రీ ‘’లతో డికెన్స్ తో సమానం గా విభిన్న పాత్రలను సృష్టించాడు .ప్రతి విషయాన్ని క్షుణ్ణం గా పరిశీలించటం కిప్లింగ్ గొప్ప తనం .’’జంగిల్ బుక్ ‘’కిం ‘’కధలు సంచలనం సృష్టించాయి .’’బారక్ రూమ్ బాలడ్స్ ‘’’’,’’ది ఫైవ్ నేషన్స్ ‘’కవితలు రాసి ప్రచురించాడు .
ఇరవై ఒకటి లో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లండన్ చేరి కవితలు కధలతో లండన్ ను జయించే శాడు .ఇరవై ఎడుకే ప్రసిద్ధ రచయిత అయ్యాడు .ప్రపంచ పర్యటన చేసి ‘’ది నాలహ్కా ‘’రాసి అమెరికాలోని వెర్మాంట్ లో ఉన్నాడు .ఇంకా ఉండి పోయే వాడేకాని బామ్మర్ది తో తగాదా వల్ల ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది .సాంఘిక వ్యతిరేకి అయ్యాడు .కూతురు, మొదటి ప్రపంచ యుద్ధం లో కొడుకు చనిపోయారు .ససెక్స్ విలేజ్ లో ఒంటరి జీవితం గడిపాడు దుఖం లో .అయిదవ జార్జి రాజుకు ఉపన్యాసాలు రాసేవాడు .తరువాత రాసిన వన్నీ ఇమ్పీరియలిజాం భావాలతో రాశాడు .విధి క్రమశిక్షణ ,అధికారం ,విధేయత లను శాసించాడు .లార్డ్ లు, పై తరగతి వాళ్ళతోనే ఉండేవాడు .సామాన్యుల గోడు పట్టేదికాడు .ఇండియా లో మధ్యతరగతి వారు చదువుకొని పైకి ఎదగటం సహించ లేక పోయే వాడు .తెల్ల జాతి ఉత్క్రుస్టత నే ఎప్పుడూ పొగిడే వాడు .ఫాసిజం భావాలు నర నరానా జీర్ణించుకు పోయిన రచయిత కిప్లింగ్ .అందుకే బెర్నార్డ్ షా ‘’he never grew up .-he began by being behind the times’’అని దెబ్బ కొట్టాడు .విక్టోరియా రాణి డయమండ్ జూబిలీ ఉత్సవాలలో ఆంగ్ల సామ్రాజ్యం జాగ్రత్తగా ఉండాల్సిఉంటుందని హెచ్చరించాడు
క్రమం గా కిప్లింగ్ ప్రాభవం తగ్గి పోయింది .’పాస్తమస్ ఆధర్ ‘’(చనిపోయిన రచయిత ) అని పించుకొన్నాడు .ది లైట్ దట్ ఫైల్డ్ ‘’అనే శీర్షిక తో ‘’the forgotten man in English literature ‘’అని ఆయన అరవయ్యవ ఏట పత్రికలూ ఎడిటోరియల్స్ రాశాయి .స్వీయ జీవిత చరిత్ర గా ‘’సమ్ థింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’రాసి,ప్రచురించిన కొద్ది కాలానికే డెబ్భై వ పుట్టిన రోజు తర్వాత కిప్లింగ్ కాల గర్భం లో కలిసి పోయాడు .ఆయన్ను జాతీయ పొగరు బోతు అన్నారు ఆయన కాలం అంతా బ్రిడ్జి ల నిర్మాణం స్టీం ఇంజిన్ ప్రాభవం ,వైర్లెస్ సృష్టి తో ఆధునికత తాండ వించింది .కిప్లింగ్ సైనిక పద ఘట్టనల పైనా ,నావికుల పాటలా మీదా ,ఇంజినీర్ ల పనులపైనా కవిత లల్లాడు .కాని అతని సమకాలికులు మాత్రం ‘’his triumph was the triumph of the Philistine ,that he could never appreciate the romantic spirit ‘’అని తేల్చి పారేశారు .’ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ‘’ను ‘’confound Romance —-and all unseen –Romance brought up the nine fifteen ‘’అని కిప్లింగ్ రాశాడు .
ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ రచయితలలో కిప్లింగ్ మొదటి తరం వాడు .గొప్ప బాలడ్ మేకర్ .’’full bodied and active verse that kipling excels ‘’అని ఇలియట్ కవి భావించాడు .’’దుర్గా దిన్ ‘’,డాన్నీ డీవార్’’కవితలను ఫుల్ జోష్ తో రాశాడు .కిప్లింగ్ కవితల కిప్లింగులు సాధారణం గా జానపద పాటలుగా ఉంటాయి . స్కౌట్ ఉద్యమానికి సాయం చేశాడు దాని నిర్మాత బెదేన్ పావెల్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ లోని అనేక వాక్యాలను ఉదాహరించాడు .నెహ్రు ‘’కిం ‘’తన ఫేవరైట్ రచన అన్నాడు
మొదటి నోబెల్ బహుమతి పొందిన ఐర్లాండ్ కవి – విలియం బట్లర్ ఏట్స్
కవి నాటక రచయితా అయిన విలియం బట్లర్ ఏట్స్ ఐర్లాండ్ లో డబ్లిన్ లో ని శాండీ మౌంట్ లో ప్రోటేస్తంట్ గా 13-6-1865న పుట్టాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లు .తండ్రి జాన్ బట్లర్ యేట్స్ట్స్ కళా కారుడేకాక రాయల్ హేబెర్నియాన్ అకాడెమి సభ్యుడు కూడా .ఐరిష్ రివైవల్ సాహిత్యంను ముద్రించిన కువాలా ప్రెస్ వీరి బంధువులదే .సోదరుడు జాక్ ల్యాండ్ స్కేప్ పెయింటర్ .చిన్నప్పుడే కుటుంబం లండన్ చేరింది .తల్లి పుట్టిల్లు కౌంటే స్లిగో లో వేసవిలో క్లాసులకు వెళ్ళేవాడు .అది అడవీ ప్రాంతం. గాలిక్ ఫాంటసి కి నిలయం .డబ్లిన్ మెట్రోపాలిటన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లోచేరి టర్నర్ శైలిలో బొమ్మలు తయారు చేశాడు .
ఇరవై ఒకటిలో మొదటి పుస్తకం ‘’మోసడా ‘’రాసి అచ్చ్చేశాడు .లండన్ వచ్చి ఎర్నెస్ట్ రాయి తో కలిసి ‘’రైమేర్స్ క్లబ్ ‘’ఏర్పరచాడు .ఇది ఫ్రెంచ్ సిమ్లిజం మొదలైన ఆధునిక టెక్నిక్ ల గురించి ఆలోచించేది .డబ్బులు లేక గుర్రం మీద వెళ్ళలేక నడిచి డబ్లిన్ నుండి లండన్ చేరేవాడి నని రాసుకొన్నాడు .తన జీవిత చరిత్రలో తానొక కొత్తమతాన్ని కవిత్వం ఆధారం గా నిర్మించానని చెప్పాడు .ఇది సగం ఊహ సగం గారడీ .చివరకు థియాస ఫిస్ట్ అయ్యాడు .మేడం బ్లా వత్స్కి అనుచరుడు గా పేరు పొందాడు .దెయ్యాలను పిలవటం మాట్లాడించటం లో సిద్ధ హస్తుడని పించాడు కాని అసలైన ఫిలాసఫీ ఏమిటో తెలిసేదికాదు .అంతఃకరణ విలువ అర్ధం కాలేదు .
సిగ్గు పడే మనస్త్వం .’’హేర్మటిక్ స్టూడెంట్స్ ఆఫ్ ది గోల్డెన్ డాన్’’బృందం లో చేరాడు .ఇందులో మాయలు మంత్రాలు మాజిక్ ఎక్కువ .కవిత్వమే మార్గమని తెలుసుకొన్నాడు .సెల్టిక్ రివైవల్ లో చేరే నాటికి ఏట్స్ స్పిరిటిస్ట్, ,నేషనలిస్ట్ అని పించాడు .అప్పుడే ఐర్ లాండ్ లో రెండు ఉద్యమాలు మొదలైనాయి .మొదటిది ‘’’గేలిక్ లీగ్ ;;’’ ప్రాచీన ఐరిష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం గేలిక్ ను జాతి భాష గా చేయటం వీరి ధ్యేయం .సహకార వ్యవ సాయం చేసి అధిక దిగు బడి సాధింఛి జీవన స్తితి గతులను మెరుగు పరచటం రెండోది .వీటితో జాతీయ సాంస్కృతి పునర్ వైభవం పొందింది కమ్య్యూనిస్తులు ,జానపదులు ,విద్యా వేత్తలు కవులు రచయితలూ అంతా కలిసి వచ్చి ఉద్యమాలను నడిపి అనుకొన్నవి సాధించారు .జార్జి రసెల్ ‘’ఏ .యి ‘’ అనే మారు పేరుతో కవితలు రాశాడు .ఉద్యమం ఊపు అందుకోగానే నిర్వాహకులు రాడికల్స్ గా మారి పోయారు .ద్వేషాలు పెరిగాయి .ఐరిక్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది . కవుల రక్తం తో నూతన ఫ్రీ ఐర్లాండ్ జన్మించింది . .గేలిక్ లీగ్ వ్యవస్తాపకుడు డగ్లాస్ హైడ్ అనే కవి ఐర్లాండ్ మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .
ఈ ఉద్యమకార్యక్రమాలకు ఐరిష్ లిటరరీ దియేటర్ వేదిక అయింది .దీనితో మనకవి యేట్స్ట్స్ కూ పాత్ర ఉంది .మాడే గొన్నె అనే అందమైన అమ్మాయి ప్రేమలో పడిపోయాడు .ఉద్యమం లో ఆమె ‘’ఫైర్ బాండ్ ‘’పాత్ర వహించింది .ఈ విజయం తో ‘’కేతలీన్ ని హౌలిహాన్ ‘’నాటకాన్ని దేశ భక్తీ ప్రధానం గా రాసి ,అందులో కేతలీన్ అనే యువతి త్యాగాన్ని ధైర్యాన్ని సాహసాన్ని ఉద్యమం నడిపిన తీరును గొప్ప గా ప్రదర్శించి అందరి మెప్పూ పొందాడు .ముప్ఫై కే ఆరు పుస్తకాలు రాసి ప్రచురించాడు .కొద్ది ప్రతీకలు మాత్రమె వాడాడు .క్రమంగా సంపూర్ణ కవి గా రూపొందాడు .యాభై వచ్చేసరికి సెంటి మెంట్ ను ,అలంకారాలను వదిలిన్చుకొన్నాడు .ఐర్లాండ్ రాజకీయ సంక్షోభామూ దానికి కారణ మైంది .1913లో ‘’romantic Ireland is dead and gone –it is with o Leary in the grave ‘’ అని ప్రకటించాడు .’’రేస్పాన్సి బిలిటీస్ ‘’పుస్తకం పేరు లోనుంచే ఈ మార్పు ను తెలియ జేసి ప్రజా కవిత్వం రాశాడు .’’ఏ కోట్ ‘’అనే కవిత లో
‘’I made my song a coat –covered with embroideries –out of old mythologies ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించాడు .అయన రాసిన ‘’the fools caught it –wore it in the world;s eyes –as though they ;d wrought it’’ అన్న పంక్తుల్ని పదే పదే చదివారు జనం .తర్వాత దీన్నీ కాదనుకొన్నాడు .’’ఎస్సేస్ ‘’రాసి ప్రజల్లో ఉన్న నమ్మకాలు ,పాత విధానాలు ఐర్లాండ్ లో రొమాంటిక్ కవితలు ప్రభవిల్లిన నేపధ్యం పై రాశాడు .’’ది వైల్డ్ స్వాన్స్ ఎట్ కూలే ‘’లో మానసిక వాస్తవాలను చెప్పాడు .తర్వాత అయిదేళ్లకు ‘’లేటర్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .
క్రమంగా మంత్రాలు మాజిక్ తంత్రాల వైపు మళ్లాడు .సూపర్ నేచురలిజం వైపు కదిలాడు .’’సియాన్స్ ‘’కు వెళ్ళాడు .ఈ అన్వేషణలో జార్జీ హైడ్ లీ ని చూసి ఆరేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆమెతో కలిసి ‘’ఆటో మేటిక్ రైటింగ్ కమ్మ్యూనికేటర్లు డిక్టేట్ చేస్తుండగా ‘’ప్రాక్తీస్స్ చేశాడు . దీని ఫలితం గా ‘’ఏ విజన్ ‘’రాసి అరవైలో ముద్రించాడు .డెబ్భై రెండులో కొంతమార్చి మళ్ళీ ప్రింట్ చేశాడు .’’’’to me it means a last act of defence against the chaos of the world ‘’అని అదే పరిష్కారం గా నమ్మి నట్లు చెప్పాడు .రెండవ ఎడిషన్ వచ్చే సరికే ఏట్స్ గొప్ప గౌరవం పొందాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా ఉన్నాడు .1923లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు .ప్రపంచ ప్రసిద్ధకవి అయ్యాడు .యాభై వ ఏట నుంచి రాసిన కవిత్వం అంతా సుప్రసిద్ధమైంది .కవిత్వం లో స్పష్టత ,మేలిమి ,సాధికారత సాధించాడు .ఊహా ప్రపంచం ఫైరీ లాండ్ ను వదిలేసి వాస్తవ ప్రజలకోసం ,వారి అభిప్రాయాలకోసం అనుభవాన్ని రంగ రించి రాశాడు .’’in the whole man –blood imagination ,intellect running together .i am content to follow to its source every event in action or in thought ‘’అని నిజాయితీగా చెప్పుకొన్నాడు .
‘’ ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో ‘’when such as I cast out remorse –so great a sweetness flows into the breast –we must laugh and we must sing –we are blest by every thing –every thing we look upon is blest ‘’అని కమ్మని భావ ధార పొంగించాడు ..రాసిన ప్రతి కవితనూ తిరిగి రాస్తూ సాన బెడుతూ తీర్చి దిద్దాడు .ఏట్స్ కు కవిత్వం ఆసు దారగా వచ్చేస్తుంది అదీ ఆయన ప్రత్యేకత .ఫాసిస్ట్ కాదు కాని ఫ్యూడల్ భావాలున్న వాడు ఐర్లాండ్ కు దూరం గా ఇటాలియన్ రెవెరి లోని రాపెల్లో లో చివరి రోజులు గడిపాడు .చివరి దాకా రాస్తున్నా చివరి ముఖ్య గ్రంధం ‘’బైజాంటియం ‘’.ఇందులో యేట్స్ కవిత పర వళ్ళు తొక్కింది .సృజనలో ,ప్రతీకలు ఎంచుకోవటం లో అంతా నవ్యత కని పించి ఉత్కృష్ట రచన అని పిస్తుంది .
డెబ్భై దాటిన తర్వాత బలహీన పడ్డాడు .బతకటం కంటే చావే మేలనిపించేది .1938శీతాకాలాన్ని భరించ లేక పోయాడు .న్యాయం గా అదేమంత చలికాదు కాని శరీరం తట్టుకోలేక బ్రేక్ డౌన్ వచ్చి కోమా లోకి వెళ్లి గుండె ఆగి 28-1-1939న నైస్ లోని రాక్ బర్న్ లో యేట్స్ చనిపోయాడు .రాసిన నాటకాల పై జనం ద్రుష్టి ఇప్పుడు లేక పోయినా కవిత్వాన్ని ఇంకా ఆరాధిస్తున్నారు .చనిపోయిన పన్నెండేళ్ళ కు ‘’ది పెర్మనేన్స్ ఆఫ్ యేట్స్ ‘’అనే పుస్తకాన్ని ఇరవై నలుగురు విమర్శకుల వ్యాసాలతో ప్రచురించి ఘన నివాళి సమర్పించారు .’’we no longer listen to the half conscious music of a trance but to the deliberate and un compromising note of truth ‘’అంటూ శ్రద్ధాంజలి ఘటించారు . Nobel Committee described as “inspired poetry, which in a highly artistic form gives expression to the spirit of a whole nation.” అని మెచ్చింది .రవీంద్రుని గీతాంజలి ఆంగ్ల అనువాదానిక్ యేట్స్ ముందు మాట రాశాడు .సంప్రదాయ కవిత్వం లో మేటి .చరిత్ర పునరా వృత్తం అవుతుందని నమ్మే వాడు అందుకే that his age represented the end of the cycle that began with the rise of Christianity.’’ అని చెప్పుకున్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరా బాద్
—