పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48

అమెరికా లో కొత్త ధోరణులు

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లో అమెరికా చివరి సరిహద్దును నిర్ణయించి సాహసోపేత అన్వేషణ కు దారి తీసింది 1920లో ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ‘’.THE BUSINESS OF AAAMERICAN DEMOCRACY IS BUSINESS’’ అని స్పష్టం గా చెప్పాడు .జాతీయ వాణిజ్యం అత్యంత నిర్మాణాత్మక ఆదర్శం అనీ చెప్పాడు .రాజకీయ నాయకులు ప్రభుత్వ ఆస్తుల పై  బాంకుల నిండా డబ్బు దాచుకొంటే ,గుమాస్తాలు మిలియనీర్లు అయి పోయారు ఒకే ఒక్క రాత్రిలో .ఇది ఆదర్శానికి  విరుద్ధం అని వాపోయారు కొందరు .అలాంటి వారిలో ఎడ్విన్ ఆర్లింగ్ టన్  రాబిన్సన్ ఒకడు.

సానేట్లకు  సాన బెట్టిన – ఎడ్విన్  ఆర్లింగ్ టన్  రాబిన్ సన్

అమెరికా లోని మెయిన్ రాష్ట్రం లో హెడ్ టైడ్ లో 22-12-1869న రాబిన్సన్ జన్మించాడు .తండ్రి దాన్యవ్యాపారి , బాంక్ డైరెక్టర్ ..పుట్టిన ఏడాదికే గార్దినర్ కు వెళ్ళిపోయారు .వేలాది జనాభా ,ఉత్పత్తులకు కేంద్రం అయిన ఇక్కడే తన భవిష్యత్తు తేల్చుకోవాలను కొన్నాడు .అందరిని తోసుకొని ముందుకు వెళ్ళ  లేన ని పించింది .  ఒంటరితనం బాధించినా వ్యక్తిత్వం పెంచుకోవ టానికి అవకాశం కలిగింది .రచయిత కావాలనే ఉద్దేశ్యం తో హార్వర్డ్ లో చేరి దాని మేగజైన్ కు  డజను కవితలు రాస్తే తిరస్కరించారు .రెండేళ్ళ తర్వాత మిల్లులు మూతపడ్డాయి  బాంకులు దివాలా తీశాయి .నలభై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడి ఉద్యమించారు .

బాల్యం లోనే ‘’మాస్టాయిడ్  ఇన్ఫెక్షన్ ‘’సోకి చెవి ఎముకలు బలహీనమై చెవులు వినిపించవేమో నని బాధ పడ్డాడు కళ్ళు కూడా సరిగ్గా కని  పించేవికావు .ఎవరి మీఎదో ఆధార పడుతున్నాననే భావమూ దెబ్బ తీస్తోంది .ప్రపంచం అంటే భయ పడుతున్నాడు .’’లిప్పిన్ కోట్ ‘’మేగజైన్ లో కవిత అచ్చు అయి డబ్బు లిస్తే యెగిరి గంతేశాడు .పో పై కవిత రాశాడు .’’ది టారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’అనే పేరుపెట్టి వంద పేజీలు  రాసి రెండు సార్లు పంపితే తిరస్కారానికి గురైంది .చివరికి ‘’రివర్ సైడ్ ప్రెస్ ‘’కు సంబంధించిన బంధువు రహస్యం గా మూడొందల కాపీలు యాభై రెండు డాలర్లకు ముద్రించి అమ్మాడు .బాగానే అమ్ముడుపోయి కొంత పేరొచ్చింది .’’వానిటి పబ్లిషర్ కొత్త ఎడిషన్ బాగా వేస్తానని ముందుకొచ్చి కొన్ని కవితలు చేర్చి కొన్ని తీసేసి పబ్లిష్ చేశాడు .’’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’అనే పోర్ట్రైట్ పుస్తకం1897లో తెచ్చాడు .

ఎక్కువ కాలం బతకను అని తెలుసుకొని రాయటానికి తొందర పడ్డాడు .వంద డాలర్ల తో న్యూ యార్క్ చేరాడు .అక్కడి పబ్లిషర్ల చుట్టూ తిరిగినా ఎవరూ కన్నెత్తి చూడ లేదు .ఒక పుస్తకాల షాపు వాడో ,టీచరో  అనుకొన్నారు .కాని రచయితగా గుర్తించలేదు .డబ్బులేదు పర్సనాలిటి లేదు .స్నేహితులు మృగ్యం .కనుక కవిత్వం తోనే జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .ఒక దీర్ఘ కవిత రాస్తే ఒకపబ్లిషర్ తీసుకొని రాత ప్రతి పోగొట్టాడు .దీన్ని ఒక వేశ్యా వాటికలో ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ వదిలేస్తే దాన్ని తీసుకొని మూడవ పుస్తకం గా ‘’కెప్టెన్ క్రైగ్ ‘’గ ప్రచురించాడు .దీనికి ఏడు డాలర్లు పొందాడు. ఇదే తోలి సంపాదన కవిత్వం మీద .హోటల్ లలో  ఫ్రీ లంచ్ మీద, మిగిలిన వారి దయా దాక్షిణ్యాల మీద బతికాడు .అద్దె చెల్లించటానికి న్యూ యార్క్ సబ్ వే లో పని చేసి గంటకు ఇరవై సెంట్లు సంపాదించాడు .అదొక నరక కూపం .

వింటర్ లో చలికి తట్టుకోలేక పోయాడు .ప్రెసిడెంట్ రూజ్ వెళ్త కొడుకులు తండ్రికి రాబిన్సన్ రాసిన పుస్తకాన్ని ఇస్తే దయ తలిచి న్యూయార్క్ కష్టం హౌస్ లో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఏడాదికి రెండు వేల డాలర్ల జీతం .స్నేహితుడికి జాబు రాస్తూ తానూ కవిత్వం రాయటానికీ కొత్త బూట్లు కొనుక్కోవ టానికి సరిపడా డబ్బు వస్తోందని చెప్పాడు .నలభై వ ఏట రూజ్ వెల్త్ పదవి అయి పోయినప్పుడు ఉద్యోగం ఊడింది .’’ది టౌన్ డౌన్ ది రివర్ ;;అనే కవితా సంకలం వెలువడి ప్రోత్సాహం లభించింది .బోహీమియన్ స్నేహితుల నుండి డబ్బు అప్పుగా తీసుకొన్నాడు .మరో సారి అదృష్టం తలుపు తట్టింది .కవి ,విమర్శకుడు రాబిన్సన్ జీవిత చరిత్ర కారుడు  అయిన హీర్మాన్ హేగ్ డార్న్ అతని జీవిత చరిత్ర రాసి ,మాక్దోవేల్ కాలనీ లో ఉంచాడు .సృజన శీలుర పాటి కామ ధేనువు అతను .న్యూయార్క్ బోస్టన్ ల మధ్య వింటర్ కాలాలు గడుపుతూ కవిత్వాన్ని ప్రసరిస్తూ ప్రవహింప జేస్తూ పుస్తకాలలో నిక్షిప్తం చేశాడు .

పన్నెండు ఏళ్ళ లో  పన్నెండు పుస్తకాలు రాశాడు .’’కలేక్తేడ్ పోయెమ్స్ ‘’కు పులిట్జర్ బహుమతి రెండు సార్లు వచ్చింది .బ్లాంక్ వేర్స్ లో నిష్ణాతుడయ్యాడు .చాలా కాలానికి బ్లాంక్ వేర్స్ మళ్ళీ అందర్నీ ఆకర్షించింది .మొదట్లో ఇష్టం లేక పోయినా చివర్లో రాసిన మెర్లిన్ ,లాన్సిలాట్ ,త్రిస్త్రాం నాటకాలలో దాన్నే వాడాడు .ఇందులో కదా కధనం అంతా పాత ధోరణి గా సాగింది .అందుకే ఎవరూ మెచ్చుకో లేదు .అరవైకి శారీరకం గా క్షీణించి కవితా పరం గా ఎండి పోయాడు .ఏడాదికి ఒకటి వంతున రాస్తూనే ఉన్నాడు .ఇసడోరా డంకన్ అనే డాన్సర్ ఇతన్ని లొంగ దీసుకొనే ప్రయత్నం చేస్తే తప్పించుకొన్నాడు .అరవై అయిదులో ‘’పాంక్రియాస్ ‘’వచ్చి బలహీనుడై ఆపరేషన్ జరిగినా బతకనని తెలిసి6-4-1935 న చనిపోయాడు .

రాబిన్సన్ చిన్న కవితలనే అందరూ ఇష్టపడి చదివారు .వ్యాపార ధోరణిని నిరసించాడు .’’He created an entire gallery of untypical  of American figures’’అంటారు .పాత విధానాల్లో కొత్త అర్ధాలు చూపాడు .సానెట్ లకు సాన పెట్టి ఎపిగ్రమాటిక్  ఎడ్జెస్ తో మిరుమిట్లు గోలిపించాడు తన ఓటమిని ప్రతి కవితలో ప్రతిబింబింప జేశాడు ..’’miniver cheevy ,born too late –scratched his head and kept on thinking –miniver coughed ,called it fate –and kept on drinking ‘’అని రాసుకొన్న నిర్భాగ్యకవి రాబిన్సన్ .

 

 

Edwin Arlington Robinson.jpg

అమెరికా వ్యావహారిక భాషా కవి – రాబర్ట్ ఫ్రాస్ట్

ప్రక్రుతి కవి అని అపవాదు పడిన రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రదేశాల కంటే  ప్రజలపై మమకారం తో రాశాడు .కాలిఫోర్నియా లోని శ సాన్ ఫ్రాన్సిస్కో లో పుట్టినా  తూర్పు వాడని పించుకొన్న రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1875 న పుట్టాడు .తలిదండ్రులు న్యూ ఇంగ్లాండ్  స్కూల్ టీచర్స్ .ఎనిమిది తరాలనుండీ కుటుంబం ఇక్కడే ఉంది .తల్లి స్కాటిష్ .తండ్రి ఇంగ్లాండ్ నుండి వలస వచ్చిన కుటుంబం వాడు .నాన్ కాన్ఫర్మమిస్ట్ .ఉద్యోగం, రిపబ్లికన్   మాసా చూసేట్స్  వదిలి  కాలిఫోర్నియా వెళ్ళాడు .డెమోక్రాటిక్ పేపర్ ఎడిటరయ్యాడు . ఫ్రాస్ట్ పుట్టటానికి పదేళ్ళ ముందే సివిల్ వార్ సమాప్తమయింది .సౌత్ అంటే ఇష్టం తో కొడుకుకు రాబర్ట్ లీ అని పేరుపెట్టాడు .తండ్రి టి బి తో చనిపోయాడు .తల్లి ఫ్రాస్ట్ ను తీసుకొని మాసాచూసేట్స్ లోని లారెన్స్ చేరింది .

చదువు ఇష్టం లేదు .నాలుగేళ్ళు హైస్కూల్ లో చదివి పదిహేడు లో డార్ట్ మౌత్ లో చేరి మూన్నేల్లకే వదిలేశాడు .ఇరవై ఒకటిలో హార్వర్డ్ లో చేరి రెండేళ్లకే బయటికొచ్చాడు తల్లికి,చెల్లి సాయం చేసేవాడు . టీ దుకాణం లో చెప్పుల షాపులో ,బట్టల మిల్లులో పని చేశాడు  .కార్బన్ పెన్సిల్ లామ్ప్స్ ను శుభ్రం చేసేవాడు .లోకల్ న్యూస్ పేపర్లో రాయటానికి కుదిరాడు .ఇరవైకి న్యూ అంప్ షైర్ వ్యవసాయ దారుడైనాడు .రాళ్ళ భూమి ని చదును చేసి సాగు చేయాలి .వల్ల కాక టీచర్ అయ్యాడు ..అప్పటికే కవితలు రాసి పంపే వాడు .అవి అచ్చు అయి వచ్చేవి .మళ్ళీ కాడి బుజాన వేసుకొన్నాడు .స్నేహితులు కవులుగా చేలా మణి లో ఉన్నారు .మొదటి కవితా సంకలనం నలభయ్యవ ఏట ‘’ఏ బాయ్స్ విల్ ‘’పేర ఇంగ్లాండ్ లో అచ్చు అయిందంటే ఆశ్చర్య పోతాం ..అక్కడే రెండవది ‘’నార్త్ ఆఫ్ బోస్టన్ ‘’కూడా ప్రింట్ అయింది .

ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరేసరికి గొప్ప కవి అని పించుకున్నాడు .నాటకీయతను కవిత్వం లో జోడించాడు ‘’’’I am going out to clean the pasture spring –I will only stop to rake the leaves away –I shall not be gone long –you come too’’లాంటి వెన్నో ఉన్నాయి .నార్త్ బోస్టన్ కే మరో పేరు ‘’య బుక్ ఆఫ్ పీపుల్ ‘’దీనితో బాటు ఎనిమిది వాల్యూముల కవితలు రాశాడు .కవిత్వం రాయటం అందం గా చదవటం పాడటం ఫ్రాస్ట్ ప్రత్యేకత .ఎపిగ్రమాటిక్ గా రాసిన ‘’some say the world will  end in fire –some say in ice –from what I have tasted of desire –I hold with those who favour fire-but if it had to perish twice –I think I know enough of hate –to say that for destruction ice –is also great –and would suffice ‘’మంచి పేరు తెచ్చుకోంది

ఫ్రాస్ట్ ఆలోచనలు భావాలు ప్రక్రుతి దృశ్యాల ప్రేరేపణ లే .అమెరికా రాగానే మళ్ళీ వ్యవసాయం చేశాడు.న్యు అంప్ షైర్ లోని  ఫ్రాన్కోనియా దగ్గర ఎత్తైన కొండ పై ఫారం హౌస్ కొన్నాడు .ఈయన్ని చూసి మిగిలిన వారూ కొన్నారు .’’ఏ పోయేట్ ఇన్ రెసిడెన్స్ ‘’అని పించాడు . అం హీర్స్ట్  లో  మిచిగాన్  లో ఎక్కువ కాలం ఉండి ఏంతో నేర్చుకొన్నాడు నలభై వరకు ఎవరికీ తెలియని ఫ్రాస్ట్ అరవై డెబ్భై లలో అనేక గౌరవాలు పురస్కారాలు అందుకొన్నాడు .నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’నుండి బంగారు పతకం ,నాలుగు సార్లు పులిట్జర్ ప్రైజ్ సాధించి రికార్డ్ సృష్టించాడు ఇరవై ఎనిమిది యూని వర్సిటీల నుండిఅందులో రెండు ఇంగ్లాండ్ యూని వర్సిటీల నుండి  గౌరవ డిగ్రీలు పొందాడు .వెర్మాంట్ రాష్ట్రం ఫ్రాస్ట్ పేరు ను ఒక పర్వతానికి పెట్టి గౌరవించింది .ఎనభై లో ‘ఎఫోర్ సేడ్’’అనే ఆయనే ఎంపిక చేసిన ఆయన కిస్టమైన కవితల సంకలం గా తెచ్చారు .

రాసిన కవితలను బట్టి ఫ్రాస్ట్ ను వర్డ్స్ వర్త్ కవి తో పోలుస్తారు .ఫ్రాస్ట్ రుషియా లేక కవియా అని అనుమానిస్తారు .పబ్లిక్ లోకి బాగా వచ్చేవాడు ‘’గ్రీన్ ఆపిల్ జీనియస్ ‘’అనేవారు .’’క్రాకర్ బాక్స్ ఫిలాసఫర్ ‘’అనీ అంటించారు .ఫ్రాస్ట్ ‘’a poem should begin in delight and end in wisdom –I ;d as soon write free verse as play tennis with the net down ‘’అని కవిత్వ పరమావధి చెప్పాడు.’’ నీకు అదృష్టం దురదృష్టం ఏదైనా పట్ట వచ్చు కాని నీకు చివరికి కావాల్సింది కృప మాత్రమె ‘’అనే వాడు .దీనిపైనే ‘’ఏ మాస్క్ ఆఫ్ రీజన్ ‘’ ఏ మాస్క్ ఆఫ్ మెర్సి’’దీర్ఘ కవితలు రాశాడు .మనిషే కాదు అతని శైలీ ముఖ్యమేనంటాడు .ఎనభైతోమ్మిదేళ్ళు నాన్ కన్ఫర్మార్ గా జీవించి చివరి పుస్తకం గా ‘’ఇన్ ది క్లియరింగ్ ‘’తెచ్చి29-1-1963లో రాబర్ట్ ఫ్రాస్ట్ కవి చనిపోయాడు . అమెరికా వ్యావహారిక భాషలో కవిత్వం రాసిన రియలిస్టిక్ కవి .అరుదైన సాహితీ సంపన్నుడు అందరికి ప్రేమాస్పడుడు ఫ్రాస్ట్ .’’greatest of  the American poets of the century ‘’అని పించుకొన్నాడు .అస్తిత్వ  మూల కారణాలను ప్రశ్నించాడు .perhaps no other poet in our history has put the best of the Yankee spirit into a book so completely.”  his frequent use of rural settings and farm life, a  liked in these poems, Frost is most interested in “showing the human reaction to nature’s processes.” సానుభూతితో ఉన్న హాస్యాన్ని ప్రవేశ పెట్టాడు .న్యూ ఇంగ్లాండ్ జానపదుడు అని పించుకొన్న వాడు జాతీయ అంతర్జాతీయ కవిగా మన్ననలు అందుకొన్నాడు .జాన్ కేనేడి ప్రెసిడెంట్ అయినప్పుడు ఫ్రాస్ట్ కవిని పిలిపించి గౌరవించి ‘’ది గిఫ్ట్ అవుట్ రైట్ ‘’కవితను చదివించాడు .’ఇంతకూ ముందు ఏ అమెరికన్ కవికీ ఇలాంటి గౌరవం దక్కిన దాఖలా లేదు .

 

Robert Frost NYWTS.jpg

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.