పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51

ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పోరాడే వారి యుద్ధ క్షేత్రం లారెన్స్ .ఆలోచనా పరుడైన ఫిలాసఫర్ .మానసిక అన్వేషణ ఉన్న రుషి తుల్యుడు .భవిష్యత్ దార్శనికుడు .కొరడా దెబ్బలు కొట్టగల మానవుడు .ఎక్కడా ఇమడలేని వాడు .వీటినన్నిటిని తన ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవల లో ఆవిష్కరించుకొన్నాడు .11-9-1885 న నాటింగ్ హాం షైర్లో ఈస్ట్ వుడ్ లో జన్మించాడు .ముగ్గురబ్బాయిలు ఇద్దరంమాయిలున్న కుటుంబం .అసలు పేరు డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ .కొండ దిగువన చిన్న ఇంట్లో ఉండేవారు .చదువు రాని తండ్రి బొగ్గుగని కార్మికుడు .తల్లి టీచర్ గా కొంతకాలం పని చేసింది .మంచిదే కాని దామినేటింగ్ పెర్సానాలిటి .తండ్రి తాగుబోతు అని తల్లి చెప్పగా తెలుసుకొన్నాడు .

నాటింగ్ హాం హైస్కూల్ లో చేరి చదువులో పెద్ద గా ప్రావీణ్యం చూపకుండా స్కాలర్షిప్ పొందకుండా చదివాడు .ఇంటిపక్క పిల్ల పై పదహారేళ్ళ వయసు లో ప్రేమ లో పడ్డాడు .అది రొమాంటిక్ వ్యవహారమే నని ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’లో రాశాడు ..తల్లి ప్రేమ లో పెరిగి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేశాడు .ప్రేమ శారీరకమైనది కాదని గ్రహించాడు .పదిహేడు కు చదువుకొంటూ చదువు చెబుతూ గడిపాడు .గని కూలీ పిల్లలకు చదువు నేర్పాడు .సాహిత్యాధ్యయనం చేస్తూ  బాతని ఫ్రెంచ్ లను నేర్చాడు .ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ కొంత చదువు చెప్పాడు .తర్వాతా స్వయం గానే చదివి సాధించాడు .దక్షిణ లండన్ లో క్రయోడాన్లోని డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పై తరగతులకు బోధించాడు .చదువు చెప్పటం చదువుకోవటం కంటే ‘’ఫ్లవర్ డ్రాయింగ్ ‘’లో నైపుణ్యం పొందాడు .అందం గా చక్కని శారీరక దారుధ్యం తో ఉండేవాడు .

టీన్ ఏజ్ లోనే అంతర్గత భావాలను రాయాలనే కోరిక కలిగింది .కవిత్వం రాస్తూ పూల బొమ్మలు వేస్తూ తనలాగే ఏ అమ్మాయి అయినా చదివి చూసి ఆనందిన్చాలను కొన్నాడు .ఇరవై లో మొదటి నవల ప్రారంభించాడు .జీవిత సాధనా వైఫల్యమే ముఖ్య విషయం గా రాశాడు .’’ది వైట్ పీకాక్ ‘’లారెన్స్ తోలి ఆవిష్కరణ .ఇరవై అయిదులో రాత –బోధనా మధ్య నలిగాడు .అప్పుడే తల్లి చని పోయింది .మాత్రు ప్రేమ కోసం అలమటించాడు తట్టుకోలేక ఏడ్చేవాడు .అంతా అయి పోయిన్దనుకొనే వాడు .చావు మర్మం ,నిత్య జీవితం లో వెంబడించే చావు పై ద్రుష్టి పడింది .ఎందరో అమ్మాయిలూ వలచారు .వలపించారు .మరణం తర్వాతా కూడా తల్లి ఇంకా బలీయం గా కనిపించింది అనిపించింది .అందుకనే ఏ అమ్మాయినీ ప్రేమించలేక పోయాడు .కొంత భయంతో  కొంత విశ్రాంతి కోసం టీచింగ్ మానేశాడు .కాని బోధిస్తున్నట్లు కలలోచ్చేవి వీటిని వదిలించు కొందామన్నా వదిలేవి కావు .

ఇరవై ఒకటి లో ఫ్రీడ వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ అనే ముప్ఫై ఒక్క ఏళ్ళ స్త్రీ పరిచయమైంది .ఆమె ఒకప్పుడు తనకు ప్రొఫెసర్ అయిన జర్మన్ తండ్రి కూతురే .అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు .ఆమె లో మాత్రు హృదయం ఉందని తెలుసుకొని ప్రేమించి ఆమె తో ఒక ఏడాది జెర్మని ఆస్ట్రేలియా ,ఇతలీలు తిరిగి ఆమె భర్త నుండి విడాకులు పొందిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .ఇదంతా మూడవ కవితా సంపుటిలో నిక్షిప్తం చేశాడు .దీనికి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోర్స్ ;;అని పేరు పెట్టాడు .అలాగే ‘’లుక్ వి హావ్ కం త్రు’’అనే స్వీయ చరిత్రలోనూ రాశాడు .

లారెన్స్ కు ప్రేమ అంటే పెనగులాట .దాని అన్ని ప్రభావాలకు తట్టుకోవాలి .’’I prefer my strife ,infinitely ,to other people;s peace ,havens and heavens ‘’అన్న గొప్ప ఆదర్శ సిద్ధాంతం లారెన్స్ ది .’’god deliver me from the peace of this world .As for the peace beyond understanding ,I find it in conflict ‘’అని సమాధానం చెప్పాడు .

‘’something in me remembers –and will not forget –the stream of my life in the darkness –deathward set ‘’—‘’grief grief ,I suppose and sufficient –grief makes us free –to be faithful and faithful together –as we have to be ‘’ వంటి కవితల్లో జీవిత తత్వాన్ని సత్యాన్ని తెలియ జేశాడు .

ఇరవై ఎనిమిది లో మూడవ నవల ‘’సన్స్ అండ్ లవర్స్’’రాశాడు మొదటి కదా సంపుటి ‘’ది ప్రస్ష్యన్ ఆఫీసర్’’తెచ్చాడు .ముప్ఫై లో ‘’ది రైన్ బో ‘’బాధా తప్త హృదయం తో రాశాడు .చట్టవ్యతిరేకం గా ,సెక్స్ ప్రేరకం గా ఉందని నిషేధించింది ప్రభుత్వం .లేబియన్ భావలున్నయనీ ఆరోపణ .తానూ రాత ప్రతి చదవ కుండా ముద్రించానని పబ్లిషర్ నెత్తీ నోరూ కొట్టుకున్నాడు .ఈ సమయం లో లారెన్స్ ‘’సూపర్ రేషనల్ వే ఆఫ్ లైఫ్ ‘’పై ఆలోచన చేశాడు .బుద్ధి కంటే సహజ జ్ఞానం గొప్ప అన్నాడు . ‘’my great religion is a belief in the blood ,the flesh ,as being wiser than the intellect .we can go wrong in our minds .but what our blood feels aand believes and says is always true ‘’.అని సిద్దాన్తీక రించాడు .

మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ దంపతులను ఇంగ్లాండ్ కు దక్క్షినం లో ఉన్న జేన్నార్ కు తరిమేసింది .అక్కడే కాల్ రిడ్జ్ సూతీ ఆలోచించిన  వదిలేసిన‘’ పాంటిసో క్రసి’’ని అక్కడి ప్రజల మనస్సుల్లో నింపాలని కల గన్నాడు .అందరితో కలిసి ఉంటున్నా లారెన్స్ వంట చేయటం ఇల్లు ఊదవటం లాంటి పనులు చూసి నగర ప్రజలు అనుమాన పడ్డారు .ఇదంతా విద్దూరం అనుకొన్నారు అసలే యుద్ధ భీతి . పైగా జర్మనీ తో యుద్ధం  .లారెన్స్ భార్య జర్మన్ .ఆమె సోదరుడు జర్మన్ వైమానికుడు .కనుక లారెన్స్ ఒక గూద చారి అని అనుమానించారు .లైట్లు ఆర్పేశారు ,ఇల్లంతా సోడా చేసి చివరికి గెంటేశారు .రెండేళ్ళు లండన్ బెర్కశైర్,ద్ర్బి షైర్,మిడ్ల్యాండ్ హిల్స్ లు తిరిగారు యుద్ధం అయి పోయిన తర్వాత1919 లో లారెన్స్ దంపతులు ఇంగ్లాండ్ వదిలి కాంటి నెంట్ కు చేరుకున్నారు .పుస్తకాలను పుంఖాను పుమ్ఖం గా రాస్తున్నా బీదరికం లోనే ఉంది పోవాల్సి వచ్చింది .అతని పుస్తకాలు ముద్రించటం సాహసాం ఇబ్బంది అనుకున్నారు పబ్లిషర్లు.ముప్ఫై అయిదు లో ‘’విమెన్ ఇన్ లవ్ ‘’ రైన్ బో కు సీక్వెల్ గా ప్రచురించాడు .ఇందులో ‘’సూపర్ సెక్సువల్ లవ్ ‘’ను ప్రతిపాదించాడు .ఆరేళ్ళు దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు .అప్పుడప్పుడు లండన్ వచ్చి కొద్ద్దికాలం ఉంది వెళ్లి పోతున్నాడు .’’నా నుంచి నేను దూరమై పారి పోతున్నాను ‘’అని రాసుకొన్నాడు .ఎక్కడ ఉన్నా కొద్దికాలం లో అది బాగా లేదని పించటం ఇంకో చోటికి వెళ్ళటం అక్కడా నచ్చక పోవటం అదీ అతని పరిస్తితి .సార్దినియా ఆస్ట్రేలియా అమెరికా ఎక్కడికెళ్ళినా ఇంతే .మెక్సికో చేరాడు .అక్కడ ఒక ప్రఫెత్గా ,నాయకుడిగా మారాడు అక్కడి సృజనాత్మక రచయితాలను ఆర్టిస్ట్ లను కలిసి తన మనో భావాలను చెప్పాడు .’’ది ప్లూమేడ్ సేర్పెంట్ ‘’,మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’రాసి అందులో ప్రక్రుతి లో ఉన్న ప్రతి వస్తువుపై తనకున్న ప్రేమ ఆరాధనకు పట్టం కట్టాడు .

సూర్యారాధన ,రక్త విజ్ఞానం మొదలైనవాటిని అమలు చేశాడు .ఇవన్నీ చూసిన వారు ‘’ప్రో ఫాసిస్ట్ ‘’అన్నారు .1925లో మళ్ళీ తిరిగి వచ్చ్చే ఉద్దేశ్యం తో అమెరికా వదిలి పెట్టాడు .మళ్ళీ సంచార చేస్తూ జేనోవా ఫ్లారెన్స్ ,ఆస్ట్రియ జెర్మని మొదలైనవి తిరిగి చివరికి ఫ్రాన్స్ చేరాడు .నిరంతర అన్వేషణే ధ్యేయం.ఇదే జీవితం లో చివరి మజిలీ అయింది .ఇక్కడే మరపు రాణి వచన గ్రంధాలు చిరస్మరణీయ కవితా సంకలనాలు రాశాడు .కోపం ఉద్రేకం తో రాసిన కవితలూ ఇక్కడివే .’’లేడీ చాట ర్లీన్ ‘’ఇక్కడ పుట్టిన నవలే.సెక్స్ కు పవిత్ర ప్రేమకు సంఘర్షణ ను ఈ నవలలో గొప్పగా చిత్రించాడు  .సమకాలీన సాహిత్యం లో ఇంట అలజడి సృష్టించిన నవల ఇంకోటి లేదు .అందులో కొన్ని ‘’పాశవిక శృంగార కధనాలు ‘’ఉన్నాయి .అందులోనే లోతైన సాను భూటినీ వ్యక్తీకరించాడు .మొదట దీని కి ‘’టెండర్ నేస్ ‘’అని పేరుపెట్టాడు .దీన్ని వ్యతిరేకించారు బహిష్కరించారు నిషేధించారు .ఆధునిక ప్రపంచం లో విపరీత అనాగారకతకు ,,మానసిక ,ఆధ్యాత్మిక కు మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నమే ఈ నవల .’’the source of all beauty and and all real gentleness ‘’అని విమర్శాకాభిప్రాయమే కాదు లారెన్స్ మహర్షి భావన కూడా .

ఇంకా రెండేళ్ళు జీవించాలి .మెటా ఫిజికల్ రెలిజియస్ ఎంక్వైరీ తో సూర్య స్తుతి ,చాతర్లీన్ పై ప్రతివిమర్శ ,డజను చిన్న కధలు ,వంద కవితలతో ఒక పుస్తకం వెలువ రిమ్చాడు .ప్రపంచ ప్రసిద్ధ హారర్ కధల్లో ఒకటి గా ఒక సూపర్ నేచురల్ చైల్డ్ కద  కూడా ఇందులో ఉంది .క్రమంగా లారెన్స్ ఆరోగ్యం తగ్గి పోతోంది విపరీతమైన ఒత్తిడి శ్రమ .భరించలేక పోతున్నాడు .’’పాన్సీస్ ‘’అనే కవితల రాత ప్రతిని హోమ్ సెక్రెటరి ఆర్డర్ పై సీజ్ చేసి ప్రింటింగ్ ను ఆపెయించారు పోలీస్ సహాయం తో .వెరవని లారెన్స్ ‘’trying to fulfill his living wholeness and his living union ‘’కోసం రాస్తూనే ఉన్నాడు . ‘’for one man ,as  for flower and beast and bird ,the supreme triumph is to be most vividly alive ‘’అని మనస్పూర్తిగా నమ్మిన లారెన్స్ మనీషి 1-3-1930న  ఇతలేఎ లోని వెనిస్ లో ఆద్ ఆస్ట్రఅని పిల్చుకొన్న ఫ్రెంచ్ రివేరా పైన నలభై అయిదేళ్ళ వయసులో  మరణించి అమరుడైనాడు .

జీవిత కాలం లో నలభై పుస్తకాలు రాశాడు లారెన్స్ ‘’a body of creative fiction ,poetry and plays and controversial works as studies in classic American literature ,psycho analysis of the un conscious ,pornography and obscenity and aseries of autobiographical travel books ,a long record of suffering ,agony ,and ecstasy. Almost Lawrence touched was translated into a struggle ,a death and resurrection of the flesh- he wrote as though his throat were choked in its own crimson ‘’.

ఒక తరాన్ని ప్రభావితం చేసిన లారెన్స్ ‘’తాత్కాలిక సంఘటనే చివరిది ‘’అనే భావం తో ఉడుకు రక్తం తోమూసుకున్న కళ్ళ కళ తో రాశాడు .అతనిది చైతన్య శీల ఆత్మాన్వేషణ .అతని కవితాత్మకా వచనం ,మనోహర కవిత్వం మానసిక సంఘర్షణ ,బాహ్య ప్రపంచ హింస కు ప్రతీకలే .లారెన్స్ ‘’one realm we have never conquered –the present .one great mystery of time is terra incognita tous –the instant .The most superb mystery we have hardly recognized –the immediate instant itself ‘’అని తన ఫిలాసఫీ ని స్పష్టం చేశాడు .ఆధునికత పేరుతో మానవతను దూరం చేసుకొంటూ పారిశ్రామిక ప్రగతిలో ఆదర్శాలను బాలి పెట్టుకుంటున్న సమాజాన్ని జాగృతం చేశాడు లారెన్స్ .’’ఆర్టిస్టిక్ ఇంటేగ్రిటి  ,మోరల్ సీరియస్ నేస్ ఉన్న బ్రిటిష్ రచయితఇంగ్లీష్ నవలకు మహా వారసుడు . విట్మన్ మేల్విల్లీ  ,ప్రభావాం తో రాశాడు పో . లారెన్స్ మరణం తరువాత అతని ఆరాధకురాలు కేధరీన్ కార్స్ వెల్ లారెన్స్ పై ఫారేస్తర్ లాంటి వారి క్రూర విమర్శలకు దీటుగా సమాధానం చెప్పింది .ఆల్డస్ హక్స్లీ కూడా1932లో విడుదలైన లారెన్స్ ఉత్తరాల సంచికలో లారెన్స్ ప్రభావాన్ని కీర్తించాడు . తన మనో భావాలను చిత్రాలలో చక్కగా పెయింట్ చేసి వ్యక్తపరచిన చతురుడైన చిత్రకారుడు లారెన్స్ .’’pictures of real beauty and great vitality ‘’అని మెచ్చుకున్నారు .జీవితం లో మూడు వంతులు దరిద్రం తో ,ఆహిష్కార సంచారం తో గడిపిన దురదృష్ట వంతుడు లారెన్స్ .సాంప్రదాయ ఆంగ్ల కల్పనా సాహిత్యానికి గొప్ప దోహదం చేసిన వాడు లారెన్స్ .అప్పుడప్పుడు స్త్రీలకూ వ్యతిరేకం గా రాసినా ,ఆబాల సబల కావాలని ,శక్తి సంపన్నమైన స్వయం  వ్యక్తిత్వం తో  సంపూర్ణ మహిళగా  ఎదగాలని కోరుకున్నాడు ఫెమినిజం అనే పేరు పెట్టక పోయినా వారికి అండగానే రాశాడు .స్వయం పద్ధతిలో సమాజం లో నిలబడిన స్త్రీలనే పాత్రలు చేసి రాశాడు .’’ప్రిసనర్ ఆఫ్ సెక్స్ ‘’నవలలో లారెన్స్ భావాలను నార్మన్ మైలెర్ సమర్ధించాడు .ఆ తరం లోఅన్ని ప్రక్రియలను చే పట్టి  నిరుపమాన రచయిత అని పించుకొన్నాడు లారెన్స్ .

 

D H Lawrence passport photograph.jpg  Lady Chatterley's Lover (1928)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లా పూర్ –హైదరాబాద్

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.