పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53
ఆందోళన కాలం
అమెరికా ,బ్రిటన్ దేశాలలో గడచిన రెండు శతాబ్దాలలో రెండు వందలకు పైగా కవులున్నట్లు తెలుస్తోంది .ఇందులో ఎవర్ని గుర్తుంచుకుంటారో ఎవర్ని మర్చి పోతారో కాలమే నిర్ణయించాలి .అందులో ఒక పదహారుగురు మాత్రం తమకాలం లోని సమస్యల్ని ,ఒత్తిడులను తట్టుకొని నిలిచారు .ఇరవై వ శతాబ్ది మొదటి భాగం అంతా రెండు ప్రపంచ యుద్దాలతో మరికొన్ని చిన్న యుద్దాలతో గడిచింది .వీటివలన శాంతి చేకూర లేదు కాని నిరంతర ఘర్షణ వాతావరణమేర్పడింది .మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చు అనే భయం తో కొంత మంచితనం దేశాల మధ్య వికసిస్తోంది ..సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ తోరో నమ్మినట్లు ‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలకు ,లోపలి టెన్షన్ లకు గురైన వాళ్ళే .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు ,అలవి కాక విసిరి వేయబడ్డారు .మరి కొందరు పలాయనానికి సిద్ధ పడ్డారు .వారిని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
వామ భావ కవి – డబ్ల్యు .హెచ్ .ఆడెన్
విస్టాన్ హగ్ ఆడెన్ ‘’ది ఏజ్ ఆఫ్ యాన్క్సైటీ ‘’రాసిన పుస్తకం లో ఈ కవిత ముఖ్యమైనదే కాదుఆధునిక మానవుని లోని భయాలు ,ఆందోళన ,కలవరం ,అసూయ ,నిరాశ లకు ప్రతిధ్వని ‘’factories bred them –corporate companies ,college towns –mothered his mind ,and many journals –backed his beliefs .He was born here ,The –bravura of revolvers in vogue now –and the cult of death are at home –inside the city ‘’ .తనకాలాన్ని అత్యధిక ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .రిటైర్డ్ డాక్టర్ పుత్ర రత్నం .ఆక్స్ ఫర్డ్ గ్రేశం స్కూల్ ,హాల్ట్ ,క్రిస్ట్ చర్చ్ లలో చదివాడు .మొదటి కవిత సంకలనం ‘’పోయెమ్స్ ‘’ఇరవై మూడు లో తెచ్చాడు .ఇరవై ఎనిమిది వరకు సక్లాలో లో పని చేసి వామపక్ష భావ కవుల్లో చేరాడు .తర్వాత ఫిలిం యూనిట్ కు పని చేశాడు స్పానిష్ సివిల్ వార్ లో స్త్రేచేర్ లాగే పని చేశాడు .’’స్పెయిన్ ‘’కవిత రాసి కింగ్స్ మెడల్ పొందాడు .’’ది పోయెట్స్ టంగ్ ‘’పత్రికకు సహాయ సంపాదకుడు .’’ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ లైట్ వేర్స్’’కు పూర్తీ బాధ్యతలతో ఎడిటర్ అయ్యాడు .థామస్ మాన్ కూతురు ఎరికా మాన్ ను పెళ్ళాడాడు .అమెరికా వచ్చి1846లో సిటిజన్ అయ్యాడు .
ఇప్పటికే కవిత్వం లో నాలుగు పుస్తకాలు మూడు డ్రామాలు ,వ్యాస సంపుటి ,యాత్రపై రెండు ,మూడు ఆన్తాలజీలు వెలువరించాడు .రాజకీయాల్లో ,కవితా టెక్నిక్ లలో వివాదాలకు కేంద్రమయ్యాడు .ఆడెన్ పేర’’;ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’ అనే ఒక ఇంగ్లీష్ మేగజైన్ తెచ్చారు .దీనికే ఉప శీర్షిక గా ‘’ది లిబరేషన్ ఆఫ్ పోయేట్రి’’అని పేరు పెట్టారు .ఇలియట్ తర్వాత సాహిత్యం లో పెద్ద దిక్కు ఆడెన్ అయ్యాడు .బాల్యం నుండి కవిత్వం రాస్తున్న తనకు హార్డీ ఆదర్శం అన్నాడు .వెయ్యేళ్ళ కిందటి ఆంగ్లో సాక్సన్ కవిత్వం పై ఆడెన్ కు మోజేక్కువ .వ్యక్తిగా ,కవిగా తనకొక స్థానాన్ని తన దేశం లో పొందాడు .అమెరికా తనను రాయటానికి ఆకర్షించింది అని చెప్పాడు ‘’.అమెరికా లో ఏది జరుగుతుందో ప్రాపంచమంతటా అదే జరుగుతుంది ‘’అని నమ్మకం గా చెప్పాడు .’’అమెరికన్ అకాడెమీఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’ అవార్డ్ ,పొందట మే కాదు అందులో సభ్యత్వాన్ని కూడా పొంది గౌరవం పెంచుకున్నాడు .పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .అనేక కాలేజీలలో యూని వర్సిటీలలో బోధించాడు .’’లండన్ టైమ్స్ ‘’ఆడెన్ పై సాహిత్య ప్రత్యెక సంచిక వెలువరించింది .
1956మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లేక్చర్లిచ్చాడు .మాధ్యూ ఆర్నాల్డ్ తర్వాతా ఆక్స్ ఫర్డ్ లో ‘’చైర్ ఆఫ్ పోయెట్రి ‘’స్థానం పొందాడు .కవితలు నాటకాలు రాస్తూనే ఉండి అయిదు సంపుటాలు తెచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్ ‘’ను ‘’ఏ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’పుస్తకాలు తెచ్చాడు .’’ది ఎంచేఫేడ్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు కాల్రిడ్జ్ ,లూయీస్ ,మాన్లి హాప్కిన్ మెల్విల్లే ,బాదేర్లిర్ ,జూల్స్ వెర్న్ వగైరాలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,పాస్కల్,వోల్టైర్ ,మాంటేగ్ , ఐన్స్టీన్ ,కీర్క్ గార్డ్ ,మొదలైన వారిపై కవితలు అల్లాడు .’’కవిత కు ఏదీ అనర్హం కాదు ‘’అని చాలా సార్లు రుజువు చేశాడు .ఆంగ్లో కేధలిజం ప్రవర్తనను ఎండగట్టాడు ‘’ఆన్ ది ఐలాండ్ ‘’లో సాంఘిక భావాలు స్పష్టం గా ఉన్నాయి .కొన్ని చోట్ల ఏంతో ఉదాత్తం గా రాస్తే మరి కొన్ని సార్లు వీధి రౌడీగా వెంబడించాడు .’’లా సే ది గార్దేనర్స్ ఈజ్ ది సన్ ‘’లో
‘’law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law as you know suppose –law is let me explain it once more –law is the law ‘’లో సహజ ప్రాకృతిక కవిలా కనిపిస్తాడు .’’but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty but to me –the entirely beautiful ‘’ లో లిరికల్ అని పిస్తాడు .కొత్త జాడలను పాత విధానాలలో రాశాడు .నాశనమై పోతున్న నాగరకత నుండి కొద్దిగా మత దృష్టిలోకి మళ్లాడు .న్యు యార్క్ లో ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపించాడు .కుంగిన ప్రపంచాన్ని చూసి –intellectual disgrace –stars from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’అని కలత చెందాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .’’ఒకరిపై ఒకరం ప్రేమ చూపించాలి లేక చచ్చి పోవాలి’’అని బాధగా రాస్తాడు .’’in the deserts of the heart –let the healing fountain start –in the prison of his days –teach the freeman how to praise ‘’అని రావాల్సిన మార్పు ను ఆశించాడు ఆడెన్ ‘’ఆమెన్ ‘’.
ప్రేమ ,రాజకీయం మతం నీతి పౌరసత్వం సైకాలజీ లపై గొప్ప శైలితో టెక్నిక్ తో రాశాడు ఆడెన్ . అతని భావాలపై ఎన్నో డాక్యుమెంటరి ఫిలిం లను తయారు చేశారు .’’ఫనేరల్ బ్లూస్ ‘’,అ నోన్ సిటిజెన్ ,సెప్టెంబర్ ఫస్ట్ ,రెఫ్యూజీ బ్లూస్ ‘’కవితలు ఇప్పటికీ చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లో దూసుకు వెళ్ళిన కవిగా ఆధునిక కవులలో గొప్పవాడిగా భావించారు .నోబెల్ ప్రైజ్ కు ఎంపికయ్యాడు కాని రాలేదు .29-9-1973న అరవై ఆరేళ్ళ వయసులో ఆస్ట్రియా లోని వియన్నాలో చనిపోయాడు . లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక చిహ్నం ఉంచారు .ఇరవై వ శాతాబ్దపు గొప్ప రచయితలలో ఒకడు ఆడెన్ .ఒపేరా లిబర్టోస్ రాసి భావాలను బలంగా సూటిగా చెప్పాడు .
సాంఘిక న్యాయం కోసం పోరాడిన రచయిత – స్టీఫెన్ స్పెండర్
ఆడెన్ తో లింక్ ఉన్న వాడు స్టీఫెన్ స్పెండర్ .28-2-1909లో లండన్ లో జర్మన్ జ్యూయిష్ గా ఆంగ్ల ఆరిజిన్ తోజన్మించాడు . తండ్రి హెరాల్డ్ స్పెండర్ గొప్ప జర్నలిస్ట్ .తల్లి ‘’వయొలెట్ శస్టర్’’పదిహేడు లూ కేమిస్త్స్ లేబిల్స్ ను చైనా ప్రెస్ లో ముద్రించి జీవించాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి కాలేజిలో చదివి ఆడెన్ కు అసోసియేట్ అయ్యాడు .కమ్యూనిస్ట్ పార్టి లో చేరి వారి నిర్బంధ విధానాన్ని ఎదిరించి బయటపడి ‘’ది గాడ్ దట్ ఫైల్ద్ ‘’లో తెలియ జేశాడు .
పందొమ్మిది లో దారుణం గా’’ నైన్ ఎక్స్ పెరి మెంట్స్ ‘’ను పేపర్ బౌండ్ పాం ఫ్లేట్ గా ముద్రించి,రెండేళ్ళ తర్వాత ‘’ట్వెంటి పోయెమ్స్ ‘’అచ్చు వేశాడు .వీసా ను తిరస్కరించినా విదేశాలకు వెళ్ళిస్పెయిన్ లో ’’ఇంటర్ నేషనల్ రైటర్స్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొన్నాడు . కొన్ని నెలలు ఉండి స్పానిష్ లాయలిస్ట్ కవుల రచనలను అనువాదం చేశాడు .మొదటి భార్యకు విడాకు లిచ్చి పియానిస్ట్ నటాషా లిత్విన్ ‘’ను రెండో పెళ్లి చేసుకున్నాడు .’’ది హోరైజన్ ‘’పత్రికను మిత్రుడి తోకలిపి నడిపి రెండవ ప్రపంచ యుద్ధం లో ,తరచుగా అమెరికా వెళ్లి ఉపన్యాసా లిచ్చాడు .1953లో ఇర్వింగ్ క్రిస్టల్ తో కలిసి ‘’ఎన్కౌంటర్ ‘’ అనే అంతర్జాతీయ మాస పత్రికను ‘’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం’’ ఆర్ధిక సాయం తో నడిపాడు .సమకాలీన సమస్యలపైనే స్పందించి ఎక్కువ గా రాశాడు .’’ది లాండ్ స్కేప్ నియర్ ఏరో డ్రోం’’కవితలో ‘’more beautiful and soft than any moth –with burning furred antennae feeling its huge path –through dusk ,the air-liner with shut off engines ‘’ అని సహజ వర్ణన చేశాడు .
‘’ఆధునిక కవిత్వం యంత్రాన్ని జీర్ణించుకోవాలి’’ అన్న హార్ట్ క్రేన్ అభిప్రాయం తో ఏకీభ వించాడు .యంత్రం కూడా చెట్టు పుట్ట ,పిట్ట ,పశువు లాంటిదే అన్నాడు .సాంకేతిక సింబల్స్ ను కవిత్వం లో ప్రవేశ పెట్టాడు .యంత్రం వెనక ఉన్న భావాన్ని అర్ధం చేసుకోవాలన్నాడు ‘’నాట్ పాలసేస్ ‘’లో మానవుని పై యంత్రం యొక్క ప్రభావాన్ని తెలిపాడు ‘’drink from here energy and only energy –as from the electric charge of a battery ‘’ ప్రక్రుతి లోని సర్వాన్గాలు శాఖలు సహక రించుకోవాలని కోరాడు .’’డెత్ టు ది కిల్లర్స్ బ్రింగింగ్ లైట్ టు లైఫ్ ‘అనేది అతని సిద్ధాంతం .’’యాన్ ఎలిమెంటరి క్లాస్ రూమ్ ఇన్ ఏ స్లం’’లో మానవ పీడనను చిత్రించాడు –‘’how that works, money, interest building ,could ever hide –the palable and obvious love of man for man ‘’అంటాడు.నీతి భావనలు చూస్తున్న ఈ దారుణాలలోంచే పుట్టాయి .అప్పుడు ఉపన్యాసాం అయింది కవిత . Poet Laureate Consultant in Poetry to the United States Library of Congress in 1965. అయ్యాడు 16-7-1995న ఎనభై ఆరవ ఏట లండన్ లో చనిపోయాడు ..ఇరవయ్యవ శాతాబ్ద విజ్ఞానాన్ని అందించటానికి స్టీఫెన్ స్పెండర్ క్లబ్ ఏర్పడి సేవ చేస్తోంది .జీన్ పాల్ సాత్రే వర్జీనియా ఉల్ఫ్ ల ప్రభావం స్పెండర్ పై అధికం .సాంఘిక న్యాయం కోసం పోరాడిన కవి రచయితా స్పెండర్ .
కొత్త విమర్శ కు మార్గం వేసిన – విలియం ఎంప్సన్
‘’ రొమాంటిక్ ఇర్రేషనాలిటి’’ పై పోరాడిన వాడు విలియం ఎంప్ సన్ .కవిగా కంటే రచయితగా ప్రసిద్ధుడు .27-9-1906లో యార్క్ షైర్ లో పుట్టి ,విన్చేస్టర్ ,కేంబ్రిడ్జి లోని మాగ్డలీన్ కాలేజి లలో చదివి గణితం ప్రధాన విషయం గా డిగ్రీ పొందాడు .’’సెవెన్ టైప్స్ఆఫ్ ఆమ్బిగ్యుటి’’అనే మొదటి పుస్తకాన్ని ఇరవై నాలుగు లో ముద్రించాడు .’’న్యూ క్రిటిసిజం ‘’కు పునాది రాయి వేశాడు .పాతికేళ్ళ వయసు నుండే టీచర్ .టోక్యో చైనా ,ఇంగ్లాండ్ అమెరికాలలో లేక్చార్లిచ్చాడు .ముప్ఫై లో బి బి సి .లో ఉద్యోగి అయి ,ఏడాది తర్వాతా చైనీస్ భాషఉపన్యాసాలకు సూపర్వైజర్ అయ్యాడు .’’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’పేరిట రెండు కవితా సంకలనాలు పబ్లిష్ చేశాడు ఆ తర్వాత వచనానికే పరిమితమైనాడు .’’Johnson could see no bicycle would go –you bear yourself ,and the machine as well ‘’gannets for germans not from othello –and ixion rides upon a single wheel ‘’అని జరగా వను కొన్నవి జరుగుతున్నాయని తెలియ జేశాడు .మంచి వక్త గా గొప్ప టీచర్ గా ఎమ్ ప్సన్ ప్రసిద్ధుడు .15-4-1984 న 77వయసులో మరణించాడు .సోషియో పొలిటికల్ భావ వ్యాప్తి చేశాడు . Empson’s Milton’s God is often described as a sustained attack on Christianity and defence of Milton‘s attempt to ‘justify God’s ways to man’ in Paradise Lost. .బౌద్ధ ఫిలాసఫీ ని రచనలలో కలిపి రాశాడు .
జాజ్ సంగీతానికి దారి వేసిన – ఎడిత్ సిట్వేల్
7-9-1887లో స్కార్ బరో లో పుట్టింది .ఆకర్షణ కల యువతి ‘’క్లౌన్స్ హౌసెస్ ‘’,ది వుడేన్.పీగాస్ ‘’,ఫెకేడ్ ‘’సంపుటాలు రాసి ప్రచురించింది .భూలోక స్వర్గాన్ని స్వయం గా నిర్మించుకోన్నది .ఆబెద్ అనే కవితలో ‘’jane ,jane –tall as crane –the morning light creaks down again ‘’అంటూ నరస్రి రైం గా రాసింది .అరా మూత కన్నులతో ప్రాభాత సూర్యోదయాన్ని ,ఊహాత్మకం గా రాసింది .’’సర్ బెల్జేబబ్ ‘’లో ‘’when –sir –Beelzebub called for his syllabub in the hotel in hell –where Proserpine fell –blue as the grandarmerie were the waves of the sea ‘’ అంటూ కలలలోకం లో విహరిస్తూ చెప్పింది
నలభై ఆరవ ఏట ఎదిత్ కు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ పతకం ఇచ్చి గౌరవించింది .రెండవ ఎలిజ బెత్ రాణి ‘’డేమ్ కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ‘’ను చేసింది .రోమన్ కేధలిక్ అయింది .కవిత్వం తో పాటు విమర్శ గ్రంధాలు ఎక్కువే రాసింది .పోప్ జీవిత చరిత్ర రాసి రికార్డ్ సృష్టించింది .అనేక ఆన్తాలజీలు రాసింది .9-12-1964న డెబ్భై ఏడు వయసులో మరణించింది . hythms of the tom-tom and of jazz, and shows considerable technical skill. .సృజన తో అందరికి దగ్గరైంది .
ప్రయోగ శీలి – విల్ఫ్రెడ్ ఓవెన్
మొదటి ప్రపంచ యుద్ధం కొత్త తరహా కవులను పరిచయం చేసింది .న్యాయ మైన యుద్ధం లేదని యువ గ్రూప్ వాదించింది .అందులో విల్ఫ్రెడ్ ఓవెన్ గొప్ప ప్రభావం చూపించాడు .శ్రోఫైర్ లో 18-3-1893లో పుట్టిన ఓవెన్ లండన్ యూని వర్సిటి లోని బర్కెన్ హెడ్ ఇంష్టి ట్యూట్ లో చేరి చదివి ట్యూటర్ అయి ,యుద్ధం లో సైనికుడిగా చేరి గాయ పడితే వార్ హాస్పిటల్ లో చేర్చారు . తోటి బాధితుడుసీగ్ ఫ్రీడ్ ససూన్ ప్రేరణ తో కవిత్వం రాయటం ప్రారంభించాడు .ఏడాది తర్వాత వేస్త్రెన్ ఫ్రంట్ కు పంపేశారు .సాహస క్రుత్యానికి మిలిటరీ క్రాస్ అవార్డ్ పొందాడు .సామ్బెర్ కెనాల్ లో తన బృందాన్ని రక్షించే పనిలో చనిపోయాడు .ససూన్ బయట పెట్టిన వ్రాత ప్రతుల ద్వారానే కవిగా లోకానికి పరిచయమైనాడు .ముందు మాటగా ‘’this book is not about heroes >English poetry is not yet fit to speak of them .not is about deeds or lands not any thing about glory ,honour or dominion –except war –above all this book is not concerned with poetry .the subject of it is war ,and the pity of war .the poetry is in the pity ‘’అని నిజాన్ని ‘’గన్ షాట్’’ గా చెప్పాడు .
ఓవెన్ ఇంగ్లిష్ వెర్స్ర్స్ లో ప్రయోగాలు చేశాడు .ఆడెన్ స్పెండర్ స మొదలైన కవుల మార్గాన్ని అనుసరించాడు .అతనిలో కవిత్వం చివరి రోజుల్లో జ్వాలగా వెలిగింది .కీట్స్ సమాధిని దర్శించి రాసిన కవిత కదలిన్చేస్తుంది .’’move him into the sun –gently in touch awoke him once –at home whispering of fields unsown –always it woke him even in France –until this morning and this snow –if anything might rouse him now –to kind old sun will know ‘’
4-11-1918న ఓవెన్ ఫ్రాన్స్ లో చనిపోయాడు .ఫ్రాయిడ్ ప్రభావం ఉన్న కవి ‘’యాంతం ఫర్ డూమ్డ్.యూత్ ‘’కవిత అద్భుతమైనది .’’యుద్ధ సాను భూతికి ;;అద్దంపట్టిన కవిత్వం రాశాడు .
ఇండివిడ్యువలిస్టు కవి – రాబర్ట్ గ్రేవ్స్
‘’ఇండివిడ్యువలిస్ట్’’అయిన రాబర్ట్ గ్రేవ్స్ ఐరిష్ కవి కుమారుడు .26-7-1895 లో లండన్ లో పుట్టి ఆక్స్ ఫర్డ్ కాలేజి లో స్కాలర్షిప్ తో చదివి యూని వర్సిటి లో చేరకుండా రాయల్ వేశ్ ఫుసిలర్స్ లో పేరు నమోదు చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసి మూడు కవితా సంకలానాలు తెచ్చాడు .సెయింట్ జోసెఫ్ లో డిగ్రీ పొంది ఈజిప్ట్ వెళ్లి కేయిరో యూని వర్సిటి లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి,ఏడాదికే బయటికొచ్చి పెళ్ళాన్ని ఇంగ్లాండ్ నీ వదిలేశాడు .ఒక ప్రెస్ కొని అమెరికా కవి లార రైడింగ్ తో కలిసి అనేక విమర్శనాత్మక వ్యసాలు రాశాసి ప్రింట్ చేశాడు ‘’గుడ్ బై టు ఆల్ దట్’’అనే స్వీయ చరిత్ర రాసుకున్నాడు .అనేక చారిత్రిక నవలలు సీరియాల్ గా రాశాడు .గ్రీక్ మైధాలాజేఎ మీద మోజు ఏర్పడి ‘’క్రౌనింగ్ ప్రివిలేజ్ ‘’వగైరా రాశాడు .పౌండ్ వై-ఇలియట్ ,ఆడెన్ మొదలైన వారి పై విరుచుకు పడ్డాడు .వీళ్ళను ‘’ఫాల్స్ గాడ్స్ ఆఫ్ మోడరన్ పోయట్రి’’ అని నిందించాడు .’’ట్రాడ్డ్జి,’’కవిత లో ‘’Trudge body and climb ,trudge and climb –but not to stand again on any peak of time –trudge body –I will cool you ,body,with hot sun that draws the sweat –I will warm you body with ice –water that stings the blood –I will enrage you ,body with idleness ,to do –and having done tosleep the long night through –trudge body ‘’
ఇది చదువుతుంటే త్వమేవాహం లో ఆరుద్ర కవిత ‘’తోయ్యోయ్ మోయ్యూయ్ తోయ్’’జ్ఞాపకం వస్తుంది .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక ఫలకాన్ని ఉంచి గౌరవించారు
మోడర్నిస్ట్ కవి – వాలెస్ స్టేవెన్స్
సమకాలీన సమస్యలతో ,ఆందోళనల తో విసిగి పోయిన వాలెస్ స్టే వెన్స్ ఆధునిక కవిత్వానికి కొంచెం దూరమైనాడు .రాక్షస యుద్దాన్నించి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు .ఎక్సి క్యూటివ్ గా ఉండాలనుకొన్నాడు .అక్టోబర్ రెండు1879 లో డచ్ ,జర్మన్ కుటుంబం లో పెన్సిల్వేనియా లోని రీడింగ్ లో పుట్టాడు .హార్వర్డ్ యూని వర్సిటి లో చేరి సంప్రదాయ సానేత్స్ రాశాడు .రైంకు ప్రాధాన్యత నిచ్చాడు హార్వర్డ్ అడ్వొకేట్ ‘’లో బాలడ్స్ సెంటిమెంటల్ పాటలు రాశాడు .న్యు యార్క్ లో లా చదివి బార్ సభ్యుడై కనెక్టి కట్ వెళ్లి హార్డ్ ఫోర్డ్ యాక్సి డెంట్ అండ్ ఇండెమ్నిటి ఇన్స్యూరెన్స్ కంపెని లో లీగల్ అడ్వైసర్ అయ్యాడు .యాభై అయిదులో దానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు .డెబ్భై అయిదేళ్ళ వయసులో 2-8-1955వరకు అందులోనే ఉద్యోగించాడు .
ద్వంద్వ మనస్తత్వానికి ఇష్టపడ లేదు .’’I prefer to think just a man ,not a poet part time businessman the rest ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .నలభై నాలుగో ఏడు వచ్చేదాకా రచనలను ప్రచురించ లేదు .నాలుగు కవితలు మాత్రం ఏ మేగజైన్ ఆఫ్ వేర్స్ ‘’లో వచ్చాయి తొమ్మిదేళ్ళ తర్వాత మొదటి పుస్తకం ‘’హార్మోనియం ‘’,తర్వాత ఐడియాస్ ఆఫ్ ఆర్డర్ ‘’,ది మాన్ విత్ ది బ్లూగిటార్ ,,పార్ట్ ఆఫ్ ఏ వరల్డ్ ,ట్రాన్స్ పోర్ట్ టు సమ్మర్ వగైరా లను ప్రచురించాడు నేషనల్ బుక్ అవార్డ్ తో బాటు పులిట్జర్ బహుమతి పొందాడు .’’ఓపస్ పాస్తుమాస్ ‘’1957 లో విడుదల చేశాడు .’’తర్తీన్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఏ బ్లాక్ బర్డ్ ‘’కవిత లో’’I donot know which to prefer –the beauty of inflections –or the beauty of innuendos ‘అని సందేహ పడుతూ రాశాడు .’’ది ఎమ్పరార్ ఆఫ్ ఐస్ క్రీం’’ ‘’ది వర్మ్స్ ఎట్ హేవెంస్ గేట్ ‘’ది కిచెన్ కప్స్ ‘’మొదలైన కవితలు సందర్భ శుద్ధికి ఉదాహరణలు .’’the poem must resist the intelligence almost successfully ‘’అని అభిప్రాయ పడ్డాడు . ‘’the body;s death and beauty;s deathlessness ‘’,పై చక్కని కవిత రాసి మెప్పించాడు స్టే వెన్స్ .
Beauty is momentary in the mind-the fitful tracing of portal –but in the flesh it is immortal –the body dies ,the body;s beauty lives ‘-so evenings die in the green going –a wave interminably flowing ‘’అంటూ సాగుతుంది ఆ కవిత .విలియం కవితలు ‘’not of the second part of life –they don’t make the visible a little hard to see ‘’అని అంచనా వేశారు .’’he employed every nuance of rhetoric dissolving imagery and paradoxical epigrams to achieve a mystical reality –a supreme fiction to move his readers in the direction of fact as we want it to be ‘’
అమెరికన్ మోడర్నిస్ట్ పోయేట్ గా గుర్తింపు పొందాడు .2-8-1955న కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించాడు .మనస్సాక్షికి వాస్తవానికి ఉన్న సంబంధం పై ఎక్కువ గా రాశాడు .అతని ఇమాజినేషన్ అంత స్సాక్షీ కాదు వాస్తవమూ కాదన్నారు .ఇది పొడిగా ఉన్న విషయం కాదు కానిజీవితం లో నిజాన్ని దాని అంతరార్ధాన్ని కనిపెట్టే సరైన అన్వేషణా విధానం .
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-15-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్