పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54
ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్
వాలెస్ స్టేవెంస్ కు స్నేహితుడు ,అభిమాని అయినా అతని భావాలు నచ్చని వాడు విలియం కార్లోస్ విలియమ్స్ ‘జీఎవితం లోని అప సవ్యాన్ని ప్రేమించి ,ఏ కోరికను వదలక అనుభవించాడు .’’no ideas but in things ‘’అన్నదే సిద్ధాంతం .విలియమ్స్ న్యు జేర్సిలోని రూత్ ఫర్డ్ లో 17-9-1883న జన్మించాడు .పేరెంట్స్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ కుటుంబాలకు చెందిన వాళ్ళు .జ్యూయిష్ రక్తం ప్రవహిస్తున్న వాడు .తల్లి కేథలిక్ గా తండ్రి ఎపిక్యూరియాన్ గా విలియంస్ ను పెంచారు .న్యు యార్క్ లో హోరేస్ మాన్ హైస్కూల్ లో చదివి ,స్విట్జెర్లాండ్ లో మెడిసిన్ లో చేరి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో పూర్తీ చేసి ఎం డి.డిగ్రీ పొందాడు .ఇరవై మూడులో మొదటి కవితా సంకలం తెచ్చాడు .ఫ్లారెన్స్ హీర్మాన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులను కని ,ఒక కొడుకును డాక్టర్ ను చేశాడు .
ఇమేజిస్ట్ పౌండ్ ను అనుకరించాడు .క్రమం గా అమెరికన్ జాతీయాలకే ప్రాముఖ్యమిచ్చి రాశాడు .’’ఫ స్ట్ సెలెక్షన్ ఆఫ్ పోయెమ్స్ ‘’విడుదల చేశాడు దీనికి ముందు మాట రాసిన స్టీవెన్ ‘’the passion of anti poetic is a blood passion and not a passion of ink-pot’’అన్నాడు .వాస్తవ అవాస్తవాలను కలిపి రాసిన తీరు బాగుందని మెచ్చాడు .సెంటిమెంట్ ను యాంటి పోఎటిక్ ను కలిపి రెండు విరుద్ధాలకు ఒకే చోట స్థానం కల్పించాడు .డెబ్భై అయిదేళ్లకు ముప్ఫై అయిదుకు పైగా పుస్తకాలు రాసి ప్రచురించాడు .అనేక పురస్కారాలు గౌరవాలు పొందాడు అందులో గొప్పది బెల్లిన్జేన్ అవార్డ్ .దీనికి అయిదు వేల డాలర్ల పారితోషికం పొందాడు .ఎకాడేమి ఆఫ్ అమెరికన్ పోఎట్స్ లో ఫెలోషిప్ పొందాడు ‘’బుక్ టు ఆఫ్ పీటర్సన్ ‘’కు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .
‘’ఫ్లవర్స్ బై ది సి ‘’,ట్రాక్ట్ ‘’,ఏ గుడ్ నైట్ ‘’మొదలైనవి వ్యక్తిగతమైన ఆ నాటి ఫ్రీ వేర్స్ కవితలు .అన్నిటిని ప్రేమించే గొప్ప లక్షణం విలియమ్స్ కుండేది .వ్యత్యాసం తెలియని కవి .పనికిరానిది ఉందా అని ఆశ్చర్య పోయే వాడు .ప్రస్తుతాన్ని ,ప్రశ్నించరాని సాను భూతి తో రాయటం అతని ప్రత్యేకత .పేపర్ వార్త బజారు వార్తా అన్నీ కవిత్వం లో దిగాల్సిందే .దీన్ని’’If Williams errs on the side of objectivity ,he uses those objects ,fragments and disjointed documents to attain fresh and startling immediacy ‘’ గా అభి వర్ణించారు .4-3-1963న డెబ్భై తొమ్మిదేళ్ళ వయసులో చని పోయాడు .డాక్టర్ గా కంటే రచయితగానే ఎక్కువ సేవ చేశాడు .నిత్య జీవిత సంఘటనలే విలియమ్స్ కవితా వస్తువులు .’’poetry is equipment for living a necessary guide amid the bewilderments of life’’అని భావించాడు .మోడర్నిజాన్ని ఇమేజిజం తో కలగలిపి రాసిన వాడు కార్లోస్ విలియమ్స్ .
ఐరనీ విట్ ల కవయిత్రి — మరియాన్నే మూర్
మరియాన్నే క్రైగ్ మూర్ అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయీస్ లో 15-11-1887లో జన్మించింది బ్రయాన్ మార్ లో చదివి బి ఏ పాసై స్టేనోగ్రఫీ, టైపింగ్; బుక్ కీపింగ్ ,ఇంగ్లీష్ కమ్మర్షియల్ లా లను పెన్సిల్వేనియా లో బోధించింది .న్యూ యార్క్ హడ్సన్ పార్క్ బ్రాంచ్ కి అసిస్టంట్ గా మూడేళ్ళు పని చేసింది ..సంప్రదాయం పధ్ధతి ఉన్న వనిత .మొదటి కవితా సంకలనం ‘’పోయెమ్స్ ‘’లండన్ లో ను ,’’అబ్సర్వేషన్స్ ‘’ను తర్వాతా ప్రచురించి రెండవ దానికి ‘’డయల్ అవార్డ్ ‘’ను కవిత్వం లో విశిష్ట సేవకు పొందింది .1944లో ‘’కాంటెంపరి పోయిట్రీ పేట్రన్స్ ప్రైజ్ ‘’ను పొందింది .చికాగో వర్సిటి నుండి ప్రతిష్టాత్మక హారియట్ మన్రో పోయెట్రి పురస్కారం అందుకొన్నది .గగ్గెన్ హీం ఫెలోషిప్ గౌరవం పొందింది .
1951లో ప్రచురించిన ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘కు బోలింజేన్ ,నేషనల్ బుక్ ,పులిట్జర్ ప్రైజ్ లను గెలుచు కొంది .నేషనల్ ఇంష్టి ట్యూట్ ఆఫ్ పోయెట్రి అండ్ లెటర్స్ ’నుండి స్వర్ణ పతకం అందుకొన్నది .’’ఇందరు ఉండగా నా కవిత్వానికే ఇన్ని అవార్డులు యందు కిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు బహుశా న్యాయ నిర్ణేతలు నా కవితలలో కవిత్వం ఉంది అని గుర్తించినందుకు కృతజ్ఞతలు ‘’అని చెప్పింది .
మూర్ కవిత్వం లో ‘’పారడాక్స్ ‘’ఎక్కువ .అంతకంటే ఆ కాలం లో బాగా రాసిన వారు లేరు .ఆమె రాసిన వాటిని ఎందరో ఉదాహరించేవారు అందుకే ఆమెది ‘’సిజర్ లైక్ మెథడ్‘’అన్నారు . ఇన్ వర్తేడ్ కామాలలో ఉండే ఫ్రేజులు ఆమె ప్రత్యేకం .’’వుడ్ వీసెల్ ‘’లో ఆమె సాంకేతిక ఆధిపత్యం పతాక స్తాయిని చేరింది .కవిత్వం లోసంగీతమే ఉండదు రెండు మూడు సార్లు చదివి అర్ధం చేసుకోవాలి .తాను రాసిన ప్రతిదీ ‘’the chief interest is borrowed and since I have not been able to overgrow this hybrid method of composition ,acknowledgements seem only honest ‘’అని నిజాయితీని ప్రకటించింది .ఆమె కవిత్వం తెలివి తేటలు ,రుచికర స్తాయి నుండి నైతిక నిజాయితీ స్తాయికి చేరింది .’’this is a poetry made of personal notations ,verbal niceties ,and preserved curiosities ,but it is also playful ,surprising and as penetrating as it is exquisite ‘’అని ఆమె కవిత్వాన్ని విశ్లేషించారు .5-2-1972 న 84ఏళ్ళ వయసులో మరణించింది .ఎజ్రా పౌండ్ ను అభిమానిన్చినా ఆయన ఫాసిస్ట్ సమర్ధతను వ్యతిరేకించింది .అమెరికా మోడర్నిస్ట్ కవయిత్రి రచయిత్రి గా మంచి గుర్తింపు పొందింది .ఐరనీ విట్ లలో అనితర సాధ్యకవితలల్లింది .
వ్యవసాయాధారిత పారిశ్రామిక విప్లవం కోరిన కవి -జాన్ క్రూ రాన్సం –ఫుజిటివ్ ఉద్యమం
జాన్ క్రూ రాన్సం అమెరికా లోని టెన్నిసీ లో పులస్కి లో 30-4-1888 లో పుట్టాడు స్కాటిష్ ఐరిష్ వంశం వాడు .తండ్రి మినిస్టర్ .పోర్ర్వీకులు ‘’కు క్లాక్స్ క్లాన్’’సంస్థకు చెందినా వారు .డిగ్రీ పొంది టెన్నిసీ నాష్ విల్ లోని వాండర్ బిల్ట్ యూని వర్సిటి లో ఆక్స్ ఫర్డ్ లోని క్రైస్ట్స్ట్ కాలేజి లో పూర్తీ చేసి అమెరికా వచ్చి వాన్దర్ బిల్ట్ లో లెక్చర్ అయ్యాడు ఇక్కడే ‘’ఫుజిటివ్ గ్రూప్ ‘’ను ఏర్పాటు చేశాడు .సభ్యులందరూ పెన్ నేమ్స్ తో సంతకాలు పెట్టారు ఏడాదిలో సభ్యుఅల సమాఖ్య పదహారైంది .వ్యవసాయవాణిజ్య ఆధారిత పారిశ్రామిక ప్రగతి రావాలని కోరారు .’’ఐ విల్ టెక్ మై స్టాండ్ ‘’అనే సింపోజియం నిర్వహించారు .వీళ్ళు దక్షిణ రాష్ట్రాల వాళ్ళు అందుకని స్తానికులు భయ పడ్డారు .దేనికీ నిబద్దులని ప్రకటించుకోక పోవతామూ ఇబ్బంది కలిగించింది .ఇందులోని ‘’అలెన్ టాటే’’ప్రముఖ కవి రచయితా అయ్యాడు .డోనాల్డ్ డేవిడ్ సన్ స్థానికత ,చరిత్ర పై రెండు గ్రంధాలు ‘’ది తెన్నేస్సి ‘’పేరా రాశాడు .యాభై వేల ఫ్రీ వేర్స్ పంక్తుల్ని ,’’అమెరికన్ సానేట్స్ ‘’ను రాశాడు రాబర్ట్ పెన్ పులిట్జర్ బహుమతి ‘’ప్రామిసెస్ ‘’కవితా సంకలనానికి -పొందాడు .ఫుజితివ్ లు అంటే పలాయనం చిత్త గించే వారని ,అస్తిర మనస్కులని అర్ధం .
ఫుజితివ్ ఉద్యమం మఖ లో పుట్టి పుబ్బ లో మాడినట్లు కనుమరుగైంది .రాన్సం ఒహాయో లోని గాంబియర్ చేరి కెన్యా కాలేజి లో పోయెట్రి ప్రొఫెసర్ అయి ,కెన్యా రివ్యు పేపర్ కు ఎడిటర్ కూడా అయ్యాడు .కెన్యా స్కూల్ ఆఫ్ క్రిటిక్స్ సంస్థను స్తాపింఛి నూతన విమర్శను వ్యతిరేకించాడు . ‘’they insisted an order control ,and attentionto craftsmanship ,objectives which could only have a salutary influence ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించారు .ఈ న్యు క్రిటిక్స్ విశ్లేషణలో ఉన్నారు సృజించిన వాడికంటే విమర్శా విశ్లేషణ చేసేవాడిదే గొప్పఅన్నారు . రచన తోపాటు దాన్ని బహిర్గతం చేసే పరిశీలనాత్మకమైనా ,పరిశోధనాత్మక మైన విశ్లేషణ కే ప్రాధాన్యత నిచ్చారు ..’’poetry to be written not to delight but to dissect ‘’అని స్పష్టం చేశారు .దీనిపై స్పందిస్తూ ఇలియట్ ‘’thirty three years ago it seems to have been the latter type of criticism,the impressionistic –that ha caused the annoyance I felt when I were on ‘’the functions of criticism ‘’.to day it seems to me that we need to be more on guard against the purely explanatory ‘’అని స్పష్టం గా చెప్పాడు .
ఇంప్రె శష నిజం మీద విరక్తి చెందినా రామ్సన్ మాత్రం ప్యూర్లి ఎక్స ప్ల నేటరి కి వ్యతిరేకియే .అతని ‘’ఫస్ట్ ట్రావెల్స్ ‘’,జెంట్ వాకింగ్ ,బ్లూ గర్ల్స్మొదలైన కవితలు బాగా ప్రాచుర్యం చెందాయి .చావును కూడా ‘’కౌంటర్ ఫీట్ గ్రావిటి ‘’గా భావించాడు ‘’’here lies a lady of beauty and high degree –of chills and fever she died ,of fever and chills –to delight of her husband ,her aunts ,an infant of three –and of medicos marveling sweetly on her ills ‘’అని అధిక్షేపించాడు .మనసుకు ఊరట కల్గిస్తూ గుచ్చుకుంటా ఉండేట్లు రాస్తాడు ‘’.his inflection is both nervous and drawling ,a patrician softness of speech that mingles cavilier grace with diablerie ‘’ అని అతని కవిత్వాన్నిబేరీజు వేశారు .3-7-1974లో ఎనభై అరవ ఏట ఒహాయ్ లోని గంబియార్ లో మరణించాడు .
సవన్నా కవి – కాన్రాడ్ ఐకెన్
అమెరికా లో జార్జియా లోని సవన్నా లో కాన్రాడ్ ఐకెన్ 5-8-1889 లో పుట్టాడు సమకాలీన కవులు సంగీతాన్ని వదిలేస్తే దాన్నే పట్టుకొని పట్టు సాధించాడు .పదేళ్ళప్పుడే తండ్రి తల్లిని చంపేసి ఆత్మా హత్య చేసుకున్నాడు .దీనితో జీవితమంతా విచారమే మిగిలింది .ఒక దూరపు బంధువు మాసా చూసేట్స్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే జీవితాంతం ఉన్నాడు. హార్వర్డ్ లో చేరాడు ఇలియట్ ఇతనిక్లాస్ మేట్.గ్రాడ్యుయేట్ అవగానే కే కెనడియన్ అమ్మాయి జెస్సీ మాక్దోనాల్ద్ ను పెళ్ళాడాడు .ముగ్గురు పిల్లలు .కొద్దిపాటి ఆదాయం తో కుటుంబ పోషణ చేశాడు కవిత్వం పై దృష్టిపెట్టి స్వంత ప్రయోగాలు చేసి ‘’ఎర్త్ ట్రయంఫంట్ ‘’ పుస్తకం తెచ్చాడు .తర్వాత ‘’టర్న్స్ అండ్ మూవీస్ ‘’ను రెండవదిగా తీసుకొచ్చాడు .
ముప్ఫై లో ఇంగ్లాండ్ వెస్ట్ కోస్ట్ లో గడిపి ,హార్వర్డ్ కు వెళ్లి రెండో పెళ్లి చేసుకుని ,వదిలేసి మూడో పెళ్ళాడి ఐ-ఇంగ్లాండ్ చేరాడు .యాభై లో మాసాచూసేట్స్ లోనే ఉండిపోవాలనుకున్నాడు .’’ది న్యు యార్కర్ ‘’పత్రికకు లండన్ విలేకరిగా ఉన్నాడు .ఎనిమిదేక రాల పొలం కొన్నాడు .గౌరవాలు పురస్కారాలు వెంట పడ్డాయి .సేలేక్టే పోయెమ్స్ కు పులిట్జర్ వచ్చింది నేషనల్ బుక్ అవార్డ్ ,తో బాటు కవిత్వానికి బంగారు పతకం కూడా వచ్చ్చింది .వచనం రాసినా కవిత్వానికి తీసి కట్టు .’’మిస్టర్ ఆర్క్యులరిస్ ‘’ను బాగా ఆదరించారు .’’ he relies too much on the hypnotic power of his smooth phrases’’ .ఒక డజన్ మాటలతోనే విపరీతాన్ని సృష్టించే నేర్పున్నకవి .ఇంగ్లిష్ రొమాంటిక్ కవిత్వం లోని మాజిక్ ను బాగా వాడాడు .ప్రతిధ్వని తో కూడిన సంగీత శబ్దాలను వాడి చెవులకు ఇంపు మనసుకుహాయి కలిగించాడు .’’ఎన్ని హిలేషన్ ‘’కవితలో లైన్లు బాగుంటాయి ,-‘’these are the secret and I could hate you –when as I lean for another kiss –I see in your eyes that I don’t meet you –and that love is this ‘’ అని ప్రేమకు భాష్యం చెప్పాడు . 1973 ఆగస్ట్ పదిహేడు న ఎనభై నాలుగో ఏట చనిపోయాడు . ఉషాంట్ అనే స్వీయ జీవిత చరిత్ర రాసుకున్నాడు నవలా కారుడిగా మంచి పేరుంది .అందులో పెళ్ళిళ్ళు శృంగారం అంగారం అన్నీ రంగ రించాడు . మతిస్తిమితం కోల్పోయి ఆత్మా హత్యా ప్రయత్నానికీ పాల్పడ్డాడు . ‘’పోయెట్రి సొసైటీ ఆఫ్ అమెరికా ‘’ఐకెన్ ” కు మొదటి ‘’షెల్లీ మెమోరియల్ అవార్డ్ ‘’నిచ్చింది .
మొదటి లైబ్రేరియన్ కాంగ్రెస్ కవి, రచయిత- ఆర్చిబాల్డ్ మాక్లీష్
ఇలినాయిస్ లో గ్లేనోయి లో 1892 మే ఏడున పుట్టాడు మాక్లిష్ .పౌండ్ మనసంతా నిండిపోయాడు .విట్మన్ ఊరించాడు .సాంద్ బర్గ్ భావ జాలానికి ఊగి పోయాడు ..స్కాటిష్ మర్చంట్ కొడుకు మాక్లీష్ హార్వర్డ్ ఎల్ యూని వర్సిటి లా స్కూల్ లో చదివి మొదటి ప్రపంచ యుద్ధం లో ఆర్టిలరి గా చేరి తర్వాత బోస్టన్ లో అటార్నీ అయ్యాడు .మూడేళ్ళ తరువాత ‘’గౌను’’ విప్పేసి సంగీతం పాడే ‘’అడా హిచ్ కాక్ ‘’ను పెళ్లి చేసుకుని ,విదేశాలకు వెళ్లి అమెరికా తిరిగి వచ్చి పొలం కొని కనెక్టికట్ లో సెటిల్ అయ్యాడు .పబ్లిక్ ఫిగర్ అనిపించుకున్నాడు .ఫార్ట్యూన్ మేగజైన్ లో చేరి పని చేసి ,కాంగ్రెస్ లో లైబ్రేరియన్ అయి ,రెండవ ప్రపంచ యుద్ధం లో నిజ నిర్ధారణ కమిటి కి డైరెక్టర్ అయ్యాడు .ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కు ఆంతరంగిక బృందం లో ఒకడై ,తర్వాత అసిస్టంట్ సెక్రటరి ఆఫ్ స్టేట్ పదవి సాధించాడు .రెండవ యుద్ధం లో చురుకైన పాత్ర పోషించాడు మాక్లీష్ .హార్వర్డ్ లో బోయిస్తాన్ ప్రొఫెసర్ ఆఫ్ ఆరేటరి అండ్ రేటరిక్ ‘’కి ప్రొఫెసర్ అయ్యాడు . ఇన్ని పదవులు పొంది ప్రాముఖ్యం లో ఉన్నా రచన ఆపలేదు .పద్దెనిమిది కవితా పుస్తకాలు ,అనేక నాటకాలు ,వ్యాసాలూ రాసి ఎన్నో రాజకీయ ప్రసంగాలు చేశాడు .మూడు సార్లు పులిట్జర్ బహుమతి ని ,నేషనల్ బుక్ అవార్డ్ ను పొందాడు .ప్రజలకు ఇష్టమైనది ,తగినదీ రుచికరం గా రాసి వండి వడ్డించాడు .ప్రతిభ తో పాటు అదృష్టం ఉన్న రచయిత .’’. and there there over heard there thee hung over – those thousands of white faces those dozed eyes –there in the starless dark ,the poise ,the hover –there with vast wings across the canceled skies –there in the sudden blackness ,the black pall –of nothing nothing nothing at all ‘’అని ‘’ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ‘’కవితలో గొప్పగా వర్ణించాడు . The library, almost alone of the great monuments of civilization, stands taller now than it ever did before. The city… decays. The nation loses its grandeur… The university is not always certain what it is. But the library remains: a silent and enduring affirmation that the great Reports still speak, and not alone but somehow all together…అని గ్రంధాలయ విశిష్టతను చాటి చెప్పాడు .పుస్తకం అంటే ‘’రిపోర్ట్ అపాన్ మిస్టరి ఆఫ్ థింగ్స్ ‘’అని గొప్ప నిర్వచనం చెప్పాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్