తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం
మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అయితే అశేషంగా ఉన్న మన కవుల/రచయితల పుస్తకాలని సేకరించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడం వలన మీ తోడ్పాటు ని కూడా అర్థిస్తున్నాను. దయచేసి సహకరించండి.
నాకు పంపిన వారందరి బయో డేటాలని మీ ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు బ్లాగ్ లో అప్ డేట్ చేయడం జరుగుతుంది. అలా ఆన్ లైన్ లో మన తెలంగాణా కవుల/రచయితల సమగ్ర సమాచారం శాశ్వతం చేయబడుతుంది. కావున తెలంగాణాలోని అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని పంపవలసిందిగా కోరుతున్నాను.
గమనిక : ఈ మహాకార్యానికి కేవలం రచయితలే కాకుండా ఔత్సాహికులైన తెలంగాణా సాహితీ అభిమానులు కూడా స్పందించవచ్చు.మీ దగ్గరున్న ఏ తెలంగాణా కవి/రచయిత రచించిన పుస్తకమున్నా వెంటనే నాకు పంపండి. ఒక పుస్తకం మొదలు మీకు వీలైనన్నీ పుస్తకాలు పాతవైనా , కొత్తవైనా మంచి కండిషన్ లో ఉంటే వెంటనే నాకు బుక్ పోస్ట్ చేయండి.(బుక్ పోస్ట్ కి పోస్టల్ చార్జీ చాలా తక్కువగా ఉంటుంది.)తెలంగాణా సాహితీ పరిరక్షణలో పాలుపంచుకోండి. నాకు పంపించిన వారందరి వివరాలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా http://telanganaliterature.blogspot.in/ బ్లాగ్ లో పొందుపరచడం జరుగుతుంది.
పుస్తకాలు పంపవలసిన నా చిరునామా :
బొడ్డు మహేందర్,
ఇంటి నంబర్ 2-26,
ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం ,
ఆదిలాబాద్ జిల్లా – 504201
ఫోన్ : 9963427242