ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1
మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా ,ఇప్పటికీ లక్షలాది దేశీయులు వేలాది విదేశీయులనుఖజురాహో ఆకర్షిస్తోంది .అసలా శిల్పులు ,రాజులు ఏమి ఆశించి వీటిని నిర్మించారనేది అప్పటి నుచి ఇప్పటిదాకా ప్రశ్నార్ధకం గానే ఉండి పోయింది .ఖజురహో ను దర్శించిన ఇంగ్లాండ్ దేశీయుడు ,బి బి సి ప్రతినిధి గ్రంధకర్త మార్క్ టుల్లి ఈ విశేషాలను తన పుస్తకం ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘’లో చర్చించాడు.అందులోని ముఖ్య విషయాలనే నేను మీకు అందిస్తున్నాను .
మనిషిని అనై తిక నుండి కాపాడేది వివాహ బంధమొక్కటే అని అన్నిదేశాల వారి నమ్మకం . వివాహం కాని వారంతా పాపులు అని క్రైస్తవమతాధిపతులు కొందరు భావించారు .ఆదినికత పెచ్చు పెరిగిన ఈ కాలం లో విశ్రుమ్ఖలత పెరిగి,వివాహం లేకుండానే అన్నీ జరిగి పోతున్నాయి .మరి ఈ రెండిటికీ సమతుల్యం సాధించాలేమా?సాధించాలంటే మార్గం ఏమిటి ?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి . దీన్ని గూర్చి జంగియన్ అయిన రశ్నా’’స్వేచ్చ హద్దులు దాటుతోంది ఇది నిజమే .ఇప్పటి పరిస్తితి మల బద్ధకం నుండి అతిసారానికి (కాన్ ష్టి పేషన్ నుండి డయేరియా ) పాకినట్లుంది అన్నది .దీనికి కారణం తలిదండ్రులు భౌతికతకే అధిక ప్రాధాన్యత నివ్వటమే అన్నది .ఆధునిక స్త్రీల వస్త్రధారణ కూడా రెచ్చ గొట్టేట్లు ఉండటం బాధాకరమనీ చెప్పింది .
మహిళను సెక్స్ సింబల్స్ గా వస్తు విక్రయానికి బ్రాండ్ ఎమ్బాసిడర్లుగా మార్చి చూపింటచటమూ పతనానికి కారణమే ,కారు నుండి బారు సబ్బు వరకు స్త్రీ లనే ఆడ్స్ కు వాడి వారిని అవమానిస్తున్నారు . వారిది తెలుసుకోకుండా అందులో ధన సంపాదనే చూసుకొని మోస పోతున్నారు .ఇతర పాశ్చాత్య దేశాల కంటే డ్రెస్ కోడ్ విషయం లో ఇండియా కు ప్రత్యేకత ఉండేది. ఇప్పుడా సరిహద్దు చెరిపేశారు .చానళ్ళ ప్రకటనలో సెక్సీ గా హక్సీ గా మాట్లాడటం ఎక్కువై .ఇది వరకు ఎప్పుడో కాని విని పించని సెక్స్ పదం ఇవాళ ఒక మంత్రమే అయింది .ఇది దారుణం .ప్రతిదానికీ ‘’సెక్సీ సెక్సీ ‘’అంటూ రోదచేసి దాని పవిత్రతను బజారు పాలు చేస్తున్న్నారు .ఒకప్పుడు బ్రిటన్ లో మహిళా వోటు హక్కు కోసం ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పోరాట ఫలితం గా పొందారు. తరువాత సమాన హక్కుల ఉద్యమం చేసి సాధించారు .ఇప్పుడు సంస్కృతిలో సెక్స్ విపరీత ధోరణుల చొరబాటు (హైపర్ సేక్సువలై జేషన్ )పై ఆందోళన చేస్తున్నారు .ఇది అయిస్టతకు ఒక చిహ్నమే .
ఇప్పుడు మహిళలు కొత్త మహిళా విధానం _(న్యూ వేవ్ ఆఫ్ ఫెమినిజం )పై ద్రుష్టి పెట్టారు .దీనివలన స్త్రే పురుషుల మధ్య శక్తి సంబంధాలపై బలమైన ముద్ర పడుతుంది .సమాన హక్కులు సమాన హోదాలు జీతాలు మహిళలు సాదించుకొన్నారు .బ్రిటన్ లో కొన్ని మార్పులొచ్చాయి .పెళ్ళిలో రేప్ చట్ట వ్యతిరేకమైంది .పని చేసే చోట సెక్సువల్ హెరాస్ మెంట్ జరిగితే కోర్టులో కేసు వేయ వచ్చు .ప్రసూతి సెలవు పొందారుమహిళలు .కేధలిక్ ల కబంధ హస్తాల నుండి విడిపించుకొన్న ఐరలాండ్ దేశం లో ఇప్పుడు సుఖ శాంతులేక్కువగా ఉన్నాయిసెక్స్ ను అర్ధం చేసుకోవటం లో అనేక పద్ధతులు కలిసి కట్టుగా పని చేస్తున్నాయి .అతి సెక్స్ పై వెనుకడుగు వేస్తున్నారు .ఇది శుభ సూచకమే .
ఇండియాలో ‘’కామ సూత్ర’ వాత్సాయనుడి చేత ’రచింప బడింది .మానవ ప్రవర్తనను భారతీయులు శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించారు .ధర్మ ,అర్ధ ,కామ మొక్షాలను ఎలా పొందాలో వివరం గా చర్చించారు .కామ సూత్ర రచనలో మూడవదైన కామాన్ని అలక్ష్యం చేయకుండా ఉపెక్షిచకుండా దానినీ శాస్త్రీయం గానే ఆలోచించారు .కామ సూత్ర అంటే సెక్స్ గైడ్ అనుకోవటం పొరబాటు .నైతికతను వాత్సాయనుడు వదిలి పెట్టలేదని గుర్తించాలి .ప్రతి అధ్యాయం చివరా ఇతరుల భార్యలను ఎలా ముగ్గు లోకి దించ వచ్చో చెప్పాడు ఈ టెక్నిక్కులు వ్యభిచారానికో ,అసంగత శృంగారానికో కాదని ,భర్తలు భార్యల చేత మోస గింప బడకుండా ఉండటానికే నని భర్త భార్య కోరికలను తీర్చి సంతృప్తి చెందించ టానికే నని వివరించాడు .కామ సూత్ర మగాళ్ళకు మాత్రమె సంబంధించిందికాదు .ఆడ వాళ్లకు కూడా సెక్స్ కోరికలు ఉంటాయని మగాడు గ్రహించాటానికే .ఆ కోరికలనుఎలా సంతృప్తి పరచాలో తెలియ జెప్పటానికే వాత్సాయనుడు కామ సూత్ర రాశాడు .కన్యలు మంచి భర్తను ఎలా పొందాలి ,ఆడామగా మర్మాంగాల చర్చ ఎలా ఆరోగ్య వంతం గా చేయాలి ,అనే వాటికి మార్గ దర్శకాలు రాశాడు .కామ సూత్రా లో వర్ణింప బడిన స్త్రీలు పప్పు దద్దమ్మలు కాదు. శృంగారం లో అన్గారాన్ని రంగ రించిన స్త్రీమూర్తులు .అధిక చేత ఉన్న వారు .సెక్స్ లో వారికోరికలు ఇష్టాలు ,భంగిమలపై పొందే ఆనందం దీని వల్ల మగాడు చేజారిపోకుండా చూసుకోవటం వివరించాడు .స్త్రీల చురుకుదనాన్ని బాగా వర్ణించాడు ఇవన్నీ చూసి ,చదివి మగాడు జాగ్రత్త పడాల్సినవే .
వాత్సాయనుడు కొత్త మార్గం చూపించాడు కామ సూత్రాలలో .’’సెక్స్ లో ప్రేమ’’ ‘’అనే ది ముఖ్యం గా బల పరచాడు .కన్య భర్తను నమ్మి ప్రేమ తో అతని హృదయాన్ని జయించాలని బోధించాడు .కనుక కామ సూత్రలో వాత్సాయనుడు కామం తో కూడిన ప్రేమకు శృంగార భావాలను కలగి ఉన్నా అణచుకోవటానికి మధ్య సమతుల్యతను సాధించాడు .విచ్చల విడి శృంగారానికి , క్రమ పధ్ధతితో నైతిక శృంగారానికి మధ్య బాలన్స్ రూపొందించాడు .ప్రక్రుతి ప్రేరణకు ,సంస్కృతీ నాగరకతకూ మధ్యే మార్గాన్ని కను గోన్నాడు .కామ సూత్రాలలో అంతర్ ద్రుష్టి ఉందని గ్రహించాలి .ఆనందాన్ని అలవరచుకోవాలని ,శృంగారం లో సంస్కృతి ని రూపొందించు కోవాలని కామ సూత్ర కర్త ధ్యేయం.కామ సూత్రకు అనువాదకులు పెద్ద అన్యాయమే చేశారు .సెక్స్ ప్రేరక సామాగ్రికే ప్రాధాన్యం ఇచ్చి నట్లు అనువాదాలు చేసి గొప్ప ద్రోహం చేశారు
.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు