బ్రాహ్మణాల కదా కమామీషు -14
ఛాందోగ్య బ్రాహ్మణం
ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి .గృహ్య సూత్రాలకు ఇది మార్గ దర్శి .ఇందులోని చివరి ఎనిమిది ప్రపాఠకాలను ‘’ఛాందోగ్య ఉపనిషత్ ‘’అంటారు .
ఈ బ్రాహ్మణం లో రెండు ప్రపాఠకాలు ,ఒక్కొక్క టి ఎనిమిది ఖండాలుగా ఉన్నాయి మొదటి దానిలో 136,రెండవ దానిలో 121మంత్రాలున్నాయి .ఎనిమిదవ శాతబ్దికి చెందినది .దీనికి గుణ విష్ణువు ‘’ఛాందోగ్య మంత్రం భాష్యం ‘’,సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’పేర్ల తో వ్యాఖ్యానాలున్నాయి .ఈ బ్రాహ్మణం వివాహం ,గర్భాదానం ,సీమంతం మొదలైన గృహ కర్మలకు ప్రాధాన్యమిచ్చింది .కనుక మిగిలిన వాటికంటే ప్రత్యేకతను పొందింది .వివాహ సమయం లో వరుడు వధువుతో ‘’నీ హృదయం అంటే ణనీ అభీష్టం నాది కావాలి .నా హృదయం నీదికావాలి .మనిద్దరి ఆలోచనలు అభిలాషలు ఒకటికావాలి ‘’అని అంటాడు ఇది ఏంతో ఉదాత్త విషయం .వివాహ ప్రయోజనం ,గృహస్తాశ్రమ వాసం బాగా వివరింప బడింది .కుటుంబం లో స్త్రీ మకుటం లేని మహా రాణి కుటుంబ గౌరవ ప్రతిష్టలు ఆమె మూలం గా నే వృద్ధి చెందుతాయి అని చెప్పబడి ఉండటం తో అ నాడు స్త్రీకి ఉన్న అధిక ప్రాధాన్యం తెలుస్తోంది .వరుడు ‘’అత్త వారింట్లో అత్త మామ ఆడ బిడ్డలు బావలు బావ మరదులు మొదలైన వారందరిని ప్రేమాను బంధాలతో బాగా చూస్తూ ఇంటికి దీపం లాగ యజమానురాలు లాగా ఉండు ‘’అని వధువుతో అంటాడు మహిళామతల్లి బాధ్యతలను బాగా గుర్తు చేసిన బ్రాహ్మణం .సమాజం లో స్త్రీకి అత్యంత ఉన్నత స్తానాన్నిచ్చిన బ్రాహ్మణం ఇది .
దంపతులు కలిసి మెలిసి జీవిస్తే స్వర్గం అని చెప్పింది .ఇంట్లో పశువులు ,బిడ్డలు ,అపారమైన దనం ఉంటె కాపురం పాడి పంటలతో కళకళ లాడుతుందని ,సతీపతుల హృదయాలు ఏకమై అన్యోన్యం గా ఉంటె సంసార రధం చక్కగా సాగుతుందని చెప్ప బడింది .వివాహం తర్వాత వరుడి ఇంట్లో గృహ ప్రవేశం జరిగినప్పుడు ఒకే శయ్యపై నూతన దంపతులను కూర్చోబెట్టినప్పుడు వరుడు వధువుతో ‘’ఈ ఇంట్లో ధైర్య సాహసాలతో ఉండు .ఇక్కడే నాతో సుఖించు .నీకు ,నీ బంధువర్గానికి నాపై ప్రసన్న భావం ఏర్పడేలా ప్రవర్తించు .నాతో అనురాగం తో మెలగు ‘’అంటాడు .మగ పిల్లలే ఎక్కువగా పుట్ట్టాలని కోరుకొంటాడు .
గ్రామాంతరం వెళ్లి వచ్చిన తండ్రి కొడుకు శిరస్సును తాకుతూ ‘’అంగా దంగా త్సం స్రవసి’’ అనే మంత్రం చదివి దీర్ఘాయుస్సు తో జీవించమని ఆశీర్వ దిస్తాడు .పుత్రుడు ద్రుఢం గా ,తీక్షణం గా సువర్ణంలా తేజస్విశ గా నూరేండ్లు వర్ధిల్లాలని తండ్రి ఆకాంక్ష .పిల్లాడి మూడో ఏడులో ‘’చూడాకరణం ‘’చేయాలి .దీన్ని చేసే మంగలిని ‘’సావిత్రు దేవత ‘’గా భావించాలి ‘’ఆయమగాత్ సవితా క్షురేణ’’అనే మంత్రం వల్లఇది తెలుస్తోంది అంటే పనిలో దేవుణ్ణి చూసే విధానం ఇందులో కానీ పిస్తుంది ..క్షురకర్మ దీర్ఘాయుష్యానికి దోహాదమని చెప్పింది .ఉపనయనానికి ముందు వటువు అగ్ని వాయు సూర్య ,చంద్ర ఇంద్రులనుద్దేశించి హోమం చేయాలి .ఆ దేవతలను పేరు పేరునా పిలిచి ‘’’’దేవతలారా !ఉపనయనం అనే కర్మను అనుస్టింస్తిచ బోతున్నాను .ఈ సంగతి మీకు మనవి చేస్తున్నాను .మీ అనుజ్న తో దీన్ని సుఖం గా చేయగలను .ఇలా చేసి విద్యాభ్యాసం మొదలైన వాటిల్లో సమృద్ధిని సాధిస్తాను .అసత్యాన్ని వదిలి సత్యాన్ని ఆశ్రయిస్తాను ‘’అని అంటాడు
చదువుల్లో నైపుణ్యం ,సత్య వ్రత పాలన ఉపనయనానికి ముఖ్య ప్రయోజనాలని తెలియ జెప్పింది .బ్రహ్మ చారి అగ్ని కార్యం ,గురు శుశ్రూషస మొదలైనవి చేయాలని,పగలు నిద్ర పోరాదని ఈ బ్రాహ్మణం నిర్దేశిస్తోంది .మేఖలా బంధం (నడుం చుట్టూ త్రాడు )చేస్తారు దీని వలన పవిత్రత ,బల వృద్ధి తపో వృద్ధి శత్రు రక్షణ లభిస్తాయి .దీని తర్వాతా శిష్యుడు ఆచార్యుని దగ్గర కూర్చుని తనకోసం అధ్యయనం ప్రారంభించమని వేడుకొంటాడు .ఇలా అధ్యయనం కోసం గురువు చెంతాకు చేరటమే ఉపనయనానికి అర్ధం .గురువు శిష్యునితో మొదటగా గాయత్రీ మంత్రాన్ని చది వించటం తో వేదాధ్యయనం ప్రారంభ మౌతుంది .గానం చేసే వాడిని రక్షిస్తుంది కనుక ‘’గాయత్రి ‘’అయింది .
పశు క్షేమం ,స్వేచ్చామరణం ,దారిద్ర్య నిర్మూలనం ,కీర్తి అభి వృద్ధి ,శుభ ప్రాప్తి ,ఈశ్వర ప్రసాదం ,పుణ్య లాభం వృత్తిలో నిరాటంకం ,విష నివారణం ,క్రిమి నాశనం మొదలైన ఎన్నో ప్రయోజనాల గురించి వివరించింది .వంకరగా నడిచేవి ,రెండు తలలున్నవి ,తెల్లవి మొదలైన క్రిముల వర్ణన ఉంది .ఆచార్యుడు ,ఋత్విక్కు ,స్నాతకుడు ,రాజు ,వివాహం చేయ దగిన వాడు ,అతిధి లను సత్కరించాలి .ఈ బ్రాహ్మణం ఆ నాటి సాంఘిక వ్యవస్థకు ప్రతీక మాత్రమె కాదు నేటి సామాజికానికి మార్గ దర్శనం కూడా .స్శ్రౌత ,గృహ్య ,ధర్మ సూత్రాలను సంస్కృత వాజ్మయం లో ‘’కల్ప సూత్రాలు ‘’అని మహర్షులేపేరు పెట్టారు .బ్రాహ్మణాలలో ఉన్న మంత్రాలను గ్రహించి వివాహాది కార్య క్రమాలకు గృహ్య సూత్రాలను ఏర్పాటు చేశారు
స్త్రీ పురుషుల సంగమమే వివాహం .సంతానానికి కామ మూలకం .కామం సురా మూలకం ..కనుక పెళ్లి చేసుకొనేకన్యను సుర తో అభిషేకించాలి అని చెప్పారు .ఇదిప్పుడు పాటించటం లేదు .కన్య యొక్క ఉపస్థ ఇంద్రియాన్ని ‘’ఆనందేన్ద్రియం ‘’అని బ్రహ్మ దేవుని రెండవ ముఖమని వర్ణించారు .బ్రహ్మ ఒక ముఖం తో వేదాలు చదువుతూ రెండో ముఖం తో సంతానోత్పత్తి చేస్తాడట .ఈ ఇంద్రియం ద్వారానే స్త్రీలు పురుషుల్ని వశ పరచుకొంటారు .అందుకే అధికారిణులవుతున్నారని చెప్ప బడింది .పురుషుడు స్త్రీ యోని లో రేతస్సు అనే ఆజ్యాన్ని ఉంచటం వల్లనే సంతానం కలుగుతుంది అని యజ్న భాషలో చెప్పారు .కన్యలు ధరించేనూతన వస్త్రాలను స్త్రీలే నేయాలి .కొత్త బట్టలు కట్టిన వధువును భర్త నూరేళ్ళు కాంతిమంతం గా ,ధనవంతురాలుగా జీవించమని ఆశీర్వ దిస్తాడు .పెళ్ళిలో గుండ్రాయిని తోక్కించటం లో విశేషం ఉంది .ఆ రాయిలాగా వధువు స్తిరం గా ఉండిశత్రు బాధ లేకుండా చేసుకోమని సూచన .వధువు తన జ్ఞాతి వర్గాన్ని వృద్ధి పొందించాలని భర్త దీర్ఘాయుస్సు తో ఉండాలని పేలాల తో అంటే లాజ లతో హోమం చేస్తుంది .సప్త పది లో అన్యోన్యాను రాగం పెరుగుతుంది బలిని అణచిన విష్ణువును ప్రార్ధించి అగ్ని హోత్రం చుట్టూ ఏడడుగులు నడిపిస్తారు .అన్న సమృద్ధికోసం మొదటి అడుగు ,బలం కోసం రెండవది ,యజ్ఞం కోసం మూడోది ,సౌఖ్యం కోసం నాల్గవది,పశు సంపదకోసం అయిదవది ,పుష్టికోసం ఆరవది ,సప్త హోమ సాధ్య సోమ యాగం కోసం ఏడవ అడుగు వేయిస్తారు .
‘’ఏక మిషె విశ్నుస్త్యా నయతుహ్ –ద్వే ఊర్జేస్త్వా నయతు –త్రీణివ్రతాయ విష్ణుస్త్వా నయతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వా నయతు –పంచ పశుభ్యో విష్ణుస్త్వ్యా నయతు –షడ్ రాయ స్పోషాయ విష్ణుస్వ్యా నయతు –సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు ‘’
పెళ్లి లో పాణిగ్రహణం ముఖ్యమైంది .దీనితో వధువుకు అత్తమామలు ఆడ బడుచులు ,మరుదుల మీద అధికారం వస్తుంది .సర్వాధికారి అయి తనకూ బంధువులకూ భర్తకూ సంతృప్తిని ఆనందాన్ని కలిగించాలని భావన .కనుక గృహస్తాశ్రమ ధర్మాలేన్నిటినో ఈ బ్రాహ్మణం తెలియ జేసి మార్గ దర్శనం చేసింది .ఇది సామ వేదానికే చెందినా చాలా సూక్తాలు యజుర్వేదం నుండి గ్రహింప బడ్డాయి .నిత్య కర్మ చేసేవారికి ఇది కరదీపిక .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14—ఉయ్యూరు .