ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్

‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్. ఒకప్పటి హీరోయిన్ శ్రీప్రియ డైరెక్ట్ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ పత్రికల వారితో విపులంగా సంభాషించారు వెంకటేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
చాలా రోజుల తర్వాత సింపుల్, హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్ చేశాను. ఫ్యామిలీ సబ్జెక్ట్‌లోనే నైస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది. అది నచ్చి చేశా. నాకూ కాస్త భిన్నమైన పాత్ర. భార్య, ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడిపే రాంబాబు ఆనే కేబుల్ టీవీ ఆపరేటర్ పాత్ర. జీవితంలో జాగ్రత్తగా ఉండాలనే, డబ్బు విలువ తెలిసిన మనిషి. సినిమాలను ఇష్టంగా చూస్తూ వాటితో ప్రభావితమయ్యే మనిషి. కుటుంబంలో అనుకోని ఓ ఘటన జరిగితే దాన్ని రాంబాబు ఎలా తెలివిగా, ఆసక్తికరంగా హ్యాండిల్ చేశాడనేది ప్రధానాంశం. ఈ మనసుకు బాగా దగ్గరైన పాత్ర. నిజ జీవితంలో నేను పిల్లల తండ్రినే కాబట్టి ఆ పాత్రలో సులువుగా ఇమిడిపోయా. ఎప్పుడూ చెయ్యని థ్రిల్లర్ 27 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులో థ్రిల్లర్ చేయలేదు. అది చేసే మంచి అవకాశం వచ్చింది. మంచి స్ర్కిప్టులు రావట్లేదని ఎప్పుడూ అంటుంటాం. వచ్చినప్పుడు వాటిని చెయ్యాలి కదా. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నా. ఇది ప్రేక్షకుల భావోద్వేగాలను అందుకునే సినిమా. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యం ఉన్న సినిమా. ఇండసీ్ట్రవాళ్లతో పాటు జనం కూడా ఇలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నా ఇందులో రాంబాబు సినిమాలు చూస్తూ ఏవైనా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంటాడు. నిజ జీవితంలో నేనైనా, ఎవరైనా అంతే. నా సినిమాల్లోనే కాదు, ఎవరి సినిమాల్లో అయినా మనసును కదిలిందే భావోద్వేగ సన్నివేశాలు వచ్చినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నావి ఎక్కువగా కన్నీళ్లు తెప్పించే సినిమాలే కదా. నేను చేసిన వాటిలోనే ‘రాజా’, ‘ధర్మచక్రం’, ‘ప్రేమ’, ‘వసంతం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటివి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను. లేడీ డైరెక్టర్‌తో మొదటిసారి శ్రీప్రియ అనుభవం ఉన్న నటి. ఎనర్జిటిక్ పర్సనాలిటీ. ఇదివరకే ఓ సినిమాని డైరెక్ట్ చేశారు. టెలివిజన్‌లో చాలా వర్క్ చేశారు. షి డన్ గుడ్ జాబ్. ఈ సినిమాని ఆమె చాలా బాగా రూపొందించారు. సబ్జెక్ట్‌ను బాగా హ్యాండిల్ చేశారు. నటులందరితో మంచి పర్ఫార్మెన్స్ను రాబట్టుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెలుగులో ఈ సినిమాని చెయ్యాలనుకున్నప్పుడు ఆమెకు మొదటి ఛాయిస్‌ను నేనే. ఓ రెండు సార్లు కూర్చొని మాట్లాడుకున్నాం. దానితో పరస్పరం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకొని, ఏ ఇబ్బందీ లేకుండా చేశాం. అలా మొదటిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో చేశాను. రజనీకాంత్‌ను ఇమిటేట్ చేశా ‘దృశ్యం’ విశ్వజనీనత ఉన్న సబ్జెక్ట్. ఏ ప్రాంతంలోని కుటుంబంలోనైనా జరిగే సంఘటనలతో తయారైన సినిమా. ఎక్స్ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. అందువల్ల ఒరిజినల్‌కు ఎక్కువ మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అందులో మోహన్‌లాల్ ఓ చోట మమ్ముట్టిని ఇమిటేట్ చేస్తే, ఇందులో నేను రజనీకాంత్‌ను ఇమిటేట్ చేశాను. ఛాలెంజ్‌గా తీసుకున్నా ఈ సినిమా ఒరిజినల్ చేసిన మోహన్‌లాల్‌తో మాట్లాడా. చాలా కాలం తర్వాత ఆయన చేసిన డిఫరెంట్ ఫిల్మ్ ఇది. అక్కడ అతి పెద్ద హిట్లలో ఇదొకటి. సాధారణంగా ఆయన సినిమాలను రీమేక్ చెయ్యడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఆయనది ఔట్‌స్టాండింగ్ అండ్ డిఫరెంట్ స్టయిల్ ఆఫ్ యాక్టింగ్. ఆయన వాయిస్‌తో, నటనతో మ్యాచ్ కావడం అంత ఈజీ కాదు. అయితే ఇది యూనివర్సల్ ఫీల్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఛాలెంజ్‌గా తీసుకుని చేశా. కొత్త అనుభవం సాధారణంగా నా సినిమాల గురించి నేనెక్కువగా చెప్పను. కానీ దీనికి చెప్పాలనిపిస్తోంది. మొత్తంగా ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభవాన్నిస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. నా కెరీర్లో అందరి ప్రశంసలూ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇవాళ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్ అవసరం లేని ఇలాంటి సబ్జెక్టుల వల్లా నిర్మాతలకూ, డిసి్ట్రబ్యూటర్లకూ సంతోషం కలుగుతుంది. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అభిమానులకూ ఇది ఆనందాన్నిచ్చే సినిమా. ఇండసీ్ట్రకి మేలు ఈ సినిమాకి ప్రధాన బలం స్ర్కిప్టే. వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎక్స్ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. మానవ భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి. సినిమా ప్రారంభమైన అరగంటలో మనం సినిమా చూస్తున్నామనేది మరిచిపోయి, కథలో భాగంగా మారిపోతాం. మన జీవితంలోనే అలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు లీనమైపోతాం. అందులో సందేహమే లేదు. ఆ ఇన్‌వాల్వ్‌మెంటే ఈ సినిమాకి కీలకం. కమర్షియల్ సినిమాలు తీస్తున్నాం. వాటిలో పది శాతం సినిమాలే ఆడుతున్నాయి. ఆ ఆడుతున్న వాటిలో జనం ఏదో ఓ ఎమోషన్‌కు కనెక్టయ్యారన్నమాట. ఇది అలా ప్రేక్షకులకు కనెక్టయ్యే సినిమా. కనెక్టయితే చాలు జనం చూస్తారు. ఇలాంటి సినిమాలు హిట్టయితే ఇండసీ్ట్రకి కూడా మేలు జరుగుతుంది. భిన్నమైన కథలు వస్తాయి. వాళ్లను అడుగుతా మల్టీస్టారర్స్‌లో నాకు మంచి రోల్ ఇస్తే తప్పకుండా చేస్తా. ఇవాళ్టి యంగ్ హీరోస్ అందరూ నాకు మంచి స్నేహితులే. వాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతా. అలాగే డైరెక్టర్లు నాకు చాలా సన్నిహితం. తప్పకుండా మంచి పాత్రలను డిజైన్ చెయ్యమని వాళ్లను అడుగుతా. నాకు విలన్‌గా చెయ్యాలని ఉంది. అయితే జనం నన్ను యాక్సెప్ట్ చేస్తారో, నా కోసం డైరెక్టర్స్ విలన్ రోల్ సృష్టిస్తారో, లేదో.. నా చేతుల్లో లేదు. నాకు కావాల్సింది ఒకటి, వచ్చేది ఒకటి, తీసుకోవడం ఒకటి. ‘నాగమల్లి’లో గ్రే షేడ్స్‌లో ఉన్న పాత్ర చేశా. దాన్నెవరూ చూడలేదు. అందరికీ పని దొరకాలి నేనెప్పుడూ పని కోసం ఎదురు చూస్తుంటాను. ప్రతి ఒక్కరితో కలిసి పనిచెయ్యాలనుకుంటా. వాళ్లు ఏ రాషా్ట్రనికి సంబంధించిన వాళ్లనేది నేను పట్టించుకోను. నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండసీ్ట్రని సెపరేట్ చెయ్యాలని ఎవరికీ లేదనుకుంటాను. నిజంగా ఎవరైనా కోరుకుంటే పెద్దలు కూర్చొని సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాను. ఏదైనా విభజన అనేది ఎవరికీ ఇబ్బంది కలగకుండా, మృదువుగా జరగాలని కోరుకుంటా. ఇది వినోద పరిశ్రమ. అన్ని భాషా చిత్రాలను మన తెలుగువాళ్లు ఆదరిస్తుంటారు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలెన్నో ఇక్కడ బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. అందరూ ఒకటిగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. విభజన జరిగినా అందరికీ పని దొరకాలి. ప్రతిభకు అవకాశం లభించాలి. ఏం జరుగుతుందో చూడాలి. యావరేజ్ స్ర్కిప్టులొస్తున్నాయి ‘మనం’ వంటి సబ్జెక్ట్ దొరకడం నాగ్ అదృష్టం. నాగేశ్వరరావుగారి చివరి సినిమా. ఆయనకు సరైన నివాళి. ఆ సినిమా రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ సబ్జెక్ట్ వాళ్లకి కరెక్ట్. ఆ సినిమాని చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. నాన్న, నేను, రానా కలిసి నటించాలంటే మంచి స్ర్కిప్ట్ దొరకాలి. అందరూ యావరేజ్ స్ర్కిప్టులు తెస్తుంటే ఎవరు చేస్తారు? మంచి స్ర్కిప్టులు మా వద్దకు రావట్లేదు. ‘రాధ’ చెయ్యట్లేదు ‘గోపాల గోపాల’ మొదటి షెడ్యూల్ పూర్తయింది. ‘దృశ్యం’ రిలీజ్‌కు రావడంతో దానికి కాస్త విరామం ఇచ్చాం. ప్రధాన పాత్ర దేవుని మీద కేసు వెయ్యడం అనేది ఆసక్తికరమైన పాయింట్. పవన్‌కల్యాణ్ ఈ నెలాఖరున షూటింగ్లో జాయినవుతారు. మొదట నా కేరక్టర్ వర్క్ మొదలైంది. మా మధ్య చాలా ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయి. ఈ సినిమాని జనం కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య ఓ పెద్ద సీన్ చేశాను. ఫెంటాస్టిక్ అనిపించింది. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. ఒరిజినల్ స్ర్కిప్టు (ఓఎంజి – ఓ మై గాడ్)లో మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశారు. ‘రాధ’ సినిమా చెయ్యట్లేదు. కొత్తగా ఏ సినిమాకీ కమిట్ కాలేదు. స్ర్కిప్టులు వింటున్నా.