వ్యాస జయంతి గా గురు పూజ
వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు మహా భారతంరాయటమే కాక అందులో లో ముఖ్య పాత్ర దారికూడా .విష్ణు మూర్తి అవతారమే వ్యాసభగవానుడు .సత్యవతీ దాశరాజుల కుమారుడు .సేతి,మాది నదుల సంగమ స్థానం లో జన్మించాడని కూడా అంటారు .ఈ ప్రదేశానికి ఆయన పేరే పెట్టారు .ప్రస్తుతం నేపాల్ లో తనాహు జిల్లాలోని తనౌళి పట్నం లో వ్యాసుడు జన్మించినట్లు భావిస్తారు . .విచిత్ర వీర్యుడు వ్యాసుడి కుమారుడు .విచిత్ర వీర్యుని కుమారులే పాండురాజు ,ద్రుత రాస్త్రుడు .విదురుడు వీరిద్దరికీ సోదరుడు .
ప్రతి ద్వాపర యుగం లోను వ్యాసుడు జన్మించి వేద విభజన చేస్తాడని విష్ణు పురాణం చెబుతోంది .మహా భారత రచనకు రాయసకారుడిగా గణపతిని పెట్టుకొన్నాడు .తన ఘంటానికి ఆప కుండా పని చెప్పితేనే రాస్తానని షరతుపెట్టి రాశాడు .భారతానికి జయ అనే పేరుంది .ఇందులో విష్ణు సహస్రనామం భగవద్ గీతా ఉన్నాయని మనకు తెలుసు .వ్యాసుని చివరి రచనే మహా భారతం .భారతాన్ని ఉగ్ర సేన సౌతి మౌఖికం గా వ్యాపింప జేశాడు .నైమిశారణ్యం లో శౌనకుడనే కులపతి ,ఆయన శిష్యులైన మహర్షుల సమక్షం లో దీన్ని వినిపించాడు .
వ్యాసుడు బౌద్ధ వాజ్మయం లోను చోటు చేసుకొన్నాడు . పాళీ భాషలో’’ కన్హ దిపాయన’’ అన్నారు .జాతక కధల్లో బాగా కనిపిస్తాడు .సిక్కుల మత గ్రంధం గురు గ్రంధ సాహెబ్ లోవ్యాసుడు బ్రహ్మ దేవుని కుమారుడు అని ఉంది .గురు గోవింద సింగ్ వ్యాసుడిని వేద నిధి అన్నాడు ,కౌటిల్యుడు రాసిన అర్ధ శాస్త్రం లో వ్యాసుని విషయం తమాషాగా ఉంటుంది . దాండక్య అనే పేరున్న భోజుడనే రాజు ఒక బ్రాహ్మణ స్త్రీని బలాత్కరించ బోతే రాజ్యం వంశం పూర్తిగా నాశమై పోయాయి .వాతాపి అనే వాడు అహంకారం తో అగస్త్యుని అవమా నించి నప్పుడు ద్వైపాయనుడిని పైకి వెళ్ళినప్పుడు నశించి పోయారని చాణక్యుడు వివరించాడు .ఈ కదా బౌద్ధ జాతక కధల్లో వృష్ణి కధను పోలి ఉంటుంది .
వ్యాసుడు బదరీ అంటే రేగు చెట్ల వనం లో జన్మించాడుకనుక బాదరాయణుడు అయ్యాడనే కధనం ఒకటి ఉంది .ఈయనే బ్రహ్మ సూత్రాలు రాసి వేద వేదాంత విశేషాలను అందులో నిక్షిప్తం చేశాడు .బ్రహ్మ సూత్రాలు భగవద్ గీత ఉపనిషత్తులను ప్రస్తాన త్రయం అంటారు .ఈ మూడిటికీ కర్త వ్యాసుడే .పతంజలి యోగ శాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలే అని అంటారు .ఇంత విశిష్ట వ్యక్తీ భగవాన్ వేదం వ్యాస మహర్షి జన్మ దినం ఈ రోజు .ఒక్క సారి స్మరించి తరిద్దాం .ఆయన పెట్టిన అక్షర భిక్ష అన్నపూర్ణ గా వెలుగుతోంది .మహర్షి వ్యాసునికి మనః పూర్వకం గా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిద్దాం .
వ్యాసపౌర్ణమి –గురు పౌర్ణమి –వ్యాస జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-14-ఉయ్యూరు