పిబరే కృష్ణ.ర.సం.
మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల తీరు తెన్నులను అడిగి తెలుసుకొని ,వారిమాతల్లోనే రికార్డ్ చేసుకొన్నాను .హోసూరు కు ఒక ప్రత్యేకత ఉంది .దాన్ని తమిళం వాళ్ళు కన్నడిగులు పట్టించుకోవటం లేదు .భాషా ప్రయుక్త రాస్త్రల్లు ఎర్పదినప్పుదేర్పడ్డ ఆంద్ర రాష్ట్రం కాని ఇప్పుడు విడి పోయి అప్పుడు కలిసి ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాని హోసూరు మొర ఆలకిన్చాలేదని తమల్ని రెంటికి చెడ్డ రేవళ్ళు గా చూస్తున్నారని మనసులోని బాధ నంతా వెల్ల గక్కారు .వీలైనప్పుడల్లా వెల్ల గాక్కుతూనే ఉన్నారు .అయితే ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా అక్కడి మిత్రులందరూ కలిసి తమ తెలుగును కాపాడుకోవాలని కృత నిశ్చయం తో ఉద్యమాలు చేసి తెలుగు బడులను భాషను బతికిన్చుకొంతున్నారు .హోసూరు కృష్ణ గిరి జిల్లాలో తమిళ నాడులో ఉంది .అందుకని కృష్ణ గిరి రచయితల సంఘం గా అంటే ‘’కృష్ణ రసం ‘’గా ఏర్పడి సామూహికం గా పండగలు ,పబ్బాలు ,జాతీయ దినోత్సవాలు అరుపు కొంటున్నారు .హోసూరు తెలుగు మాండలికాన్ని జీవింప జేయటానికి కవితాలు కతలు ఆ యాసలోనే రాసి రూపు కట్టిస్తున్నారు .విడువ కుండా పుస్తక ప్రచురణ చేస్తున్నారు .నాతో మూడేళ్ళ క్రితం ఏర్పడ్డ సన్నిహితత్వాన్ని మర్చిపోకుండా వారి ప్రచురణలు నాకు పంపిస్తూనే ఉన్నారు నేనూ సరసభారతి రచనలను వారికి చేరుస్తూనే ఉన్నాను .ఈ నెల పడవ తేదీన డాక్టర్ వసంత్ గారు ఈ సంవత్సరం మే నెలలో ప్రచురించిన రెండు కదా సంకలనాలు ‘’మోతుకు పూల వాన ‘’,వెండి మొయిళ్ళు బండ బతుకులు ‘’పుస్తకాలు పంపారు .మా అమ్మాయి వాళ్ళను అమెరికాకు ఫ్లైట్ ఎక్కించటానికి పన్నెండు రాత్రికి హైదరాబాద్ బయల్దేరి వెళ్లాం .పదమూడు ,పద్నాలుగు ,పది హీను తేదీలలో ఆ పుస్తకాలను ఆబగా చదివేశాను .నిజమైన జీవితం వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కస్టాలు సుఖాలు ,ప్రక్రుతి సంపద ,ఆపేక్షలు అనురాగాలు ,ఆత్మీయతలు పరోపకారం మోసం ,దగా,తెలుగు భాషను మనవాళ్ళు పట్టించుకోక పోవటం ,పండగలు ,పబ్బాలు అన్నీ ఈ రెండిటిలో పుష్కలం గా ఉన్నాయి .అన్నిటిలో అంతర్వాహినిగా వారి వేదన ఉంది .వారి హోసూరు మాధ్యమం లో పుట్టిపెరిగిన కతలివి .వారి జీవిత ,జీవన విధానాలకు దర్పణాలివి .వారి ఆవేదనకు గుర్తులివి .ఆ భాషా మాధుర్యం లో అలా కొట్టుకు పోతూనే ఉంటాం. ఆ తీయ తేనియ తెలుగు రసాన్ని తాగుతూనే ఉంటాం మనం మర్చి పోయిన తిక్కన తెలుగును పాదు చేసి చక్కగా పోషిస్తున్నారు .చిక్కగా రాస్తున్నారు మత్తేక్కిస్తున్నారు .వారి నిరంతర సాహితీ కృషికి మనసారా అభినందిస్తున్నాను .ఇంత గొప్ప సేవ చేస్తున్న వారిని బయట ప్రాంతాలలో ఉన్న ఏ సాహితీ సంస్థా గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదని బాధగా కూడా ఉంది .అయితే ఎవరి సాయం అక్కరలేని అసహాయ శూరులు కృష్ణ గిరి రచయితల సంఘం సభ్యులు .సూటిగా నడవటమే వారికి తెలిసిన విద్య .అదే వారికి రాచ మార్గం .ఈ సంఘానికి మార్గ దర్షులు శ్రీ సామల రమేష్ బాబు ,శ్రీ సా వేం రమేష్ గార్లు .వారంటే వీరికి అపారమైన గౌరవం . ఆ సాహితీ మూర్తులందించిన కదల గురించే నేను మీకు తెలియ జేస్తూ ‘’పిబరే కృష్ణ రసం ‘’అంటున్నాను
మోతుకు పూల వాన
ఈ పుస్తకం లో ముందు మాట రాస్తూ కృష్ణ రసం సభ్యులు శ్రీ జి నారాయణ రెడ్డి ‘’తల్లికోసం తల్లి నుదికోసం ,తల్లి నుడి లో మాట కోసం ,పాట కోసం ,చదువుకోసం ,చదువును చెప్పించే బడి కోసం ,తెలుగు ఏలుబడికోసం –ఈ గడ్డ పడుతున్న తపన లో నుంచి పుట్టిందే మా కృష్ణ రసం .సుమారు ఏభై మంది కవులు రచయితల వేదిక ఇది ‘’అని చెప్పారు .ఈ సంస్థ 2010నుంచి ఏడాదికి రెండు ‘’పోత్తాలు ‘’వెలువరిస్తున్నారు .ఇందులో పందొమ్మిది మంది కధకుల కధలున్నాయి .వీరిలో నలుగురు దేవి శెట్టి పల్లెకు చెందిన వారే కావటం విశేషం .వారి ఆశయాన్ని పద్య రూపం లో నారాయణ రెడ్డి గారు ‘’వత్సరంబున కోక సారి వరుసగాను –వింత వింత గా కతలు విస్తరింప
పుస్తకంబులు ముద్రించి పంచు చుండు –తెలుగు భాషను నిల బెట్టు దీక్ష తోడ ‘’అని చెప్పారు .
..శ్రీ అగరం వసంత్ రాసిన ‘’కొరివి పెట్టె కొడుకు ‘’కద’’ప్రక్రుతి గురించినది .’’బంగారం తింటారా?బదికేకి బోజనము కావాల.’’అని ప్రక్రుతి పిల్లను సోమ్ముగలాడైన సూర్యుడి కిచ్చి పెళ్లి చేస్తే దాని బతుకు బూడిదే అవుతుందని ఒక నాయనమ్మ కొడుక్కి చెబుతుంది .సూర్యుడిని ‘’పోద్దప్ప ‘’అని చంద్రుడిని’’ వెలుగు నాయాల ‘’అని ఆప్యాయం గా పిల్చుకొంటారు .పెళ్ళికి సూర్యుడి కొడుకు అంగారకుడు మధ్యలో అగ్గి రాజేస్తాడు .అవ్వను తిడతాడు .అవ్వకు వెలుగు నాయాలకిచ్చి పెళ్లి చేస్తే కాపురం బాగుంటుందని చెప్పింది. చివరికి అందరూ ఒప్పుకుని ప్రకృతిని వెలుగు నాయాలకిచ్చి లగ్గం చేస్తారు . పెళ్లి అయిన ఏడాదికి ప్రక్రుతి ప్రక్రుతమ్మ అయింది . ‘’నేల చరాలు ‘’అనే బిడ్డను కన్నది .కొన్నేళ్ళకు ఉభయ చరాల్ని కని ,పక్షులను ప్రసవించి ఇక చాలనుకొని ‘’మనిషి ‘’ అనే బిడ్డడిని కన్నది .వాడు పెరిగి తల్లికే కొరివి పెట్టె ప్రక్రుతి వినాశకుడైనాడు .ఈ విషయం ప్రక్రుతమ్మకు తెలియక కన్నది అని ముగిస్తాడు డాక్టర్ వసంత్ .
శ్రీ అమర నారా బసవ రాజు రాసిన ‘’మా వూరు బతికి పోయే ‘’కదఒక కుక్క ఆంతర్యం .అది విన్న కధలూ కమామీషు .బలే కమ్మగా చెప్పారు రాజు గారు .తన చిన్నతనం లో ఏంతో హాయిగా బతికానని ఇప్పుడు ముద్దకు దిక్కు లేదని పెద్దింటి కుక్క బాధ పడుతుంది .ఆ కాలం లో అందరూ హాయిగా వాకిళ్ళలో చేరి రాత్రిపూట పిచ్చా పాటీ కబుర్లు చెప్పుకుని ,’’కుంటి ముట్టిచ్చే ఆట ‘’,’’ఉప్పడి పట్టు ఆట ‘’,ఆదేవారాని ఆడాళ్ళు ముసిలోళ్ళు వక్కాకు నములుతూ కాలక్షేపం చేసేవారని జ్ఞాపకాలను నేమరేసుకొంటుంది .,ఇప్పుడు ‘’మాపు’’అయితే చాలు ఊరు ‘’బెకో ‘’అంటూ ఉంటోంది . అంతా సీరియళ్ళలో మునిగి బయటికే రావటం లేదట .ఆ ఇల్లు ఈ ఇల్లూ తిరిగి అక్కడ దొరికినదేదో తినేది కుక్క బతులని అంటున్నారని ,కాని ఈ కాలం లో ముసిలోళ్ళ బతుకులు కుక్క బతుకుల్ని చేస్తున్నారని వాపోయింది .ఒక ముసలాడు ముసలి భార్యను ఓదారుస్తూ ‘’మనం పండు టాకులం .నీడలో పడితే కుళ్లుతాం .ఎండలో పడితే ఎండుతాం .శివరాత్రికి చివుళ్ళు వస్తాయికదా ,మనకొచ్చిన కాలం ఈ కుర్రనాయాల్లకూ వస్తుందిలే ‘’అని ఊరడించటం కుక్క వింటుంది .ఈ నాటి పిల్లలకు ఒక్క వేమన పద్యమూ రాదు అని క్షోభ పడతాడు తాత .ఆ కాలం చదువులు పండితునికి పామరునికి తెలిసేట్లు తెలుగు లో ఉండేవని మెచ్చాడు .ఇప్పటి సదువులు ఆళ్ళ అబ్బాలకే తెల్వట్లా ఆల్లకేం తెలుస్తాయని ఆవేదన పడ్డాడు .
పెద్దింట్లో రోజూ నీళ్ళు కాచుకొనే కాగు ను విసిరి బయట పారేస్తే అది కుక్క తో తన గోడు వెల్ల బోసుకోన్నది .ఇప్పుడు హీటర్లు గీజర్లు వచ్చి తనకు పని లేకుండా పోయిందని కాగు ఏడ్చింది .గౌడు ఇంట్లో గౌడు సాని పెత్తనం పోయి కోడలు పెత్తనం వచ్చింది ముసలాళ్ళను లెక్క చేయటం లేదు ‘’వెలక్కాయ కంటే కొంచెం పెద్ద రాగి సంకటి ముద్ద ‘’ను మామకు పెడుతోంది .ఆయన ఇక తనకేం పెడతాడు అని వగచింది .కాని ముసలి ‘’’ఎన్ని పిల్లల్ని పెట్టిం డావో .మనిషికే దిక్కు లేని ఈ కొంపను నమ్ముకోన్నావే .తిను కూతురా ‘’అని ఆప్యాయం గా కొంత కుక్కకు పెట్టాడు .’’జూ రాయే ముండా!ఈ కాడి తిని పో ‘’అని రెండు పిడికిళ్ల చద్ది వేశాడు .అదీ జీవకారుణ్యం .ఇవన్నీ గమనిస్తున్న కుక్క ‘’కరెంటు పోవాల అందరూ ఈదిలోకి రావాల సందడి సేయాల ‘’అను కొంటోంది మనసులో .
తధాస్తు దేవతలు దీవించారు .కరెంటు ఎప్పుడిస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలీని పరిస్తితి వచ్చింది .ఇళ్ళల్లో టి విలు బందు అయ్యాయి. కాగు బయటికి తీసి నీళ్ళు కాస్తున్నారు .నూనె దీపాలు వెలిగించుకొంటున్నారు .పగలూ రాతివీది అరుగుల మీదికి చేరుకొని కబుర్లు చెప్పుకొంటూ ఆటా పాటా పాడుకొంటూ కోళ్ళకూ కుక్కలకీ సంగటి మెతుకులు రాలుస్తున్నారు .ప్రతి శనివారం ఆంజనేయ గుడిలో పూజలు భజనలు హరికధలు చెప్పిస్తున్నారు .మళ్ళీ పూర్వకాలం బతికి వచ్చి ‘’మా వూరు బతికి పోయే ‘’అను కొన్నది గ్రామ సింహం .అద్భుతం గా కధను నడిపించారు రాజు గారు .
సశేషం
దక్షిణాయన పుణ్యకాల ప్రవేశ శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-14-ఉయ్యూరు