పిబరే కృష్ణ .ర.సం.-2
కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ లక్షణాలు లేనిది .వాడికి అప్పే దొరకటం లేదు .మధ్యలో నలిగిపోతున్నాడు .వాడు స్నానం చేస్తుంటే వాడి చిన్నపాప మిద్దె మీది నుంచి జారి కిందపడి చెవిలోంచి నెత్తురు కారుతోంది .వనిత ఏడుస్తూ మొగుడ్ని పిల్చింది .ఇంతలో వాడి తల్లి వచ్చి ‘’’’దేవుడా !నా కొడుక్కిన్ని అగచాట్లు ఎందుకు పెడతాఉన్నావు ?పాపిస్తోడా యేమిరా ఈ బాదలు ,అప్పా దేవుడా కనికరము చూపించి కాపాడు తండ్రీ ‘’అని గోడు గోడున ఏడుస్తూ ,పాపను సముదాయిస్తూ ముద్దాడుతోంది .స్నేహితులెవరో కారు తెచ్చారు.పిల్లను హాస్పిటల్ కు తీసుకెళ్ల టానికి .వాడు పిల్లతో కారెక్క బోతుంటే ‘’కొడకా ఇద్దో ఈ నూర్రాపా యలు ఉంది నా తావున .తీసుకో ‘’అని వాడి చేతిలో నలిగిన నోట్లను పెట్టింది ఆ అమ్మ .కన్నపేగు విలువ మరి ఆ తల్లికి కాక ఎవరికి తెలుస్తుంది ?
శ్రీ కలువ కుంట నారాయణ తన ఊరి జ్ఞాపకాలను గుది గుచ్చి చెప్పాడు .పూర్వం అంతా నడకే నని ఇప్పుడీ కార్లు బస్సులు వచ్చి నడక మర్చిపోయారని ‘’గేపకం ‘’చేసుకొన్నాడు .ఊర్లోని బండా గుండూ,చప్పితోడు ,పోట్టబ్బవంటి మారు పేర్లున్న మనషులు గుర్తుకొచ్చారు .’’బాపన చీమలు ,మాల కాకులు ,కుమ్మరి పురుగులు వడ్రంగి పిట్టలు ,సాలె పురుగులు ,దేవాంగ పిల్లులు ,గొల్ల భామలు ,దాసరి పాములు గుర్తుకొచ్చి ప్రపంచం లో ఏ భాషలో కూడా ఇలా కులం పేర్లున్నాయా ?ఇక్కడే ఈ ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తాడు .కప్పల్లాగా వానకు సంబర పడే జీవి లేదని చెబుతాడు .వాటిల్లో కోమటికప్పలు ‘’బేరం సారం ‘’ అని కంసాలి కప్పలు ‘’టక్కుం బిక్కుం ‘’అని ధ్వని చేస్తాయని బాపన కప్పలు ‘’నెయ్యి పప్పూ ‘’అంటా యని చిన్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పింది జ్ఞాపకం వస్తుంది .తండ్రి ని ఊళ్ళో అంతా ‘’ఆయవారా ‘’అని పిలవటం ఆయనే తనకూ గురువవటం ,నాటకాలు ప్రాక్టీస్ చేయటం ,నరసయ్య నాయుడు నిద్ర పోతూకూడా మద్దెల దరువు లయ తప్పకుండా వాయించటం గుర్తుకొచ్చి మురిసి పోతాడు .ఇప్పుడు వేసే నాటకాలలో గందర గోళం ఉందని బాధ పడతాడు .’’నా చిన్న నాటి అనుభవాలు గుత్తులుగా మొలసుకొని వస్తున్డాయి .అందరితో పంచుకోవానే తహ తహ నన్ను ‘’నీ గేసుకొన్న(దార బోసుకున్న ) గ్యాపకాలు ‘’రాయిన్చిందని ముగిస్తాడు .
శ్రీ కారు పల్లి నరసింహ మూర్తి ‘’అమ్మే ఆపేకారము ‘’పేరు తో రాసిన కధలో తల్లి అనాకారితనానికి లొట్ట కన్నుకు కొడుకు చీదరించుకొంటూ దూరం గా పోయి పెద్దింటి పిల్లను పెళ్ళాడి సంపన్నుడై కూడా ఊరికి రాకుండా వచ్చినా తల్లిని చూడకుండా పుట్టిన పిల్లల్ని నాయనమ్మ కు చూపకుండా ఉంటాడు .ఒక సారి వాడు కుటుంబం తో ఊర్లో జరిగే ‘’తేరు ‘’ను చూడటానికి వచ్చాడు .పిల్లలు ముసలి అవ్వ ఫోటో తీశారు ఫ్రెండ్స్ కు చూపిద్దామని .కొడుకును గుర్తుపట్టిన తల్లి వాడికి కనపడకుండా వెళ్ళిపోయి ఊరి కారణం చేత ఒక ఉత్తరం కొడుక్కి రాయించి వాడెక్కడున్నా కని పెట్టి ఉత్తరం ఇమ్మని కోరింది .అలానే అడ్రస పట్టుకొని వాడి చేతిలో ఉత్తరం పెట్టాడు .చదివిన కొడుకు నిలువునా నీరై కన్నీరు కాలువలు కట్టేట్లు గా ఏడ్చాడు .తన తప్పు తెలుసుకొన్నాడు .తల్లి రాసిన ఉత్తరం లో ‘’చని పోయేముందైనా నీకు నిజం తెలియాలని రాస్తున్నా.నాకన్ను ఎలా లొట్ట బోయిందో ఊళ్ళో కరణానికి (శాన బొగులు )నాకే తప్ప ఎవరికీ తెలియదు .నీ చిన్నప్పుడు ఒక ఆబోతు రంకె లేస్తూ వీధిలో వీరంగం చేస్తోంది .అది అక్కడే నుంచున్న నీ మీదకోస్తుంటే దాన్ని నేను అదిలిస్తే అది రెచ్చిపోయి నా పై బడి కుమ్మేసింది .నాకన్ను లొట్ట బోయింది .మొహమంతా గీక్కు పోయి వికారం గా మారింది .నీకూ దెబ్బలు తగిలాయి .నిన్నూ నన్నూ కారణం పట్నానికి తీసికెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాడు .నా గాయాలు మూడ్రోజుల్లో తగ్గాయి .నీజ్వరంనెల్లాళ్ళ దాకా తగ్గ లేదు .మీ నాన్న గుర్తుగా జాగ్రత్త గా పెట్టుకున్న తాళి బొట్టూ, కమ్మలూ అమ్మి ఆసుపత్రికి కట్టి నిన్ను బతికిన్చుకొన్నా . నువ్వు బతికి బాగుండాలని తపన పడి సాకి పెద్దోన్ని చేశా .కూలి నాలి చేసి కరణం ఋణం కూడా తీర్చేశాను .ఇక మిగిలింది నాకు నేనుండే ఇల్లు అది నీ పేర రాసి కరణానికిచ్చి దస్తావేజు పంపిస్తున్నా .నా కొడుక్కోసం పోగొట్టుకున్న కన్ను నా కొడుకును దూరం చేసింది .ఒక సారి ఇంటికొచ్చి నన్ను అమ్మా అని పిలు చాలు ‘’.ఆ ఫోటో లో ఉన్నదే నాయనమ్మ అని వాళ్లకు ఏడుస్తూ చెప్పాడు .తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు .
పిల్లాడు తీసిన అమ్మ ఫోటో ను తీసుకొని కుటుంబం తో పల్లెకొచ్చి ,ఇంటిని స్కూల్ పేర రాసి అందులో డెవలప్ చేసిన అమ్మ ఫోటో పెట్టి ‘’నా ఎట్లా కొడుకు ఇంగేవారికి ఈయద్దుదేవుడా !’’అని అందరికి వినబడేట్లు మొక్కి వెళ్ళిపోయాడు .కళ్ళు చెమర్చే పేగు బంధం కల మరో కద. దృక్కోణం మాత్రం వేరు .
యువకదా రచయిత శ్రీ కేంచప్ప గారి మునిరాజు ‘’ఎనుముపోతు పండుగ ‘’లో పిల్లలకు దున్నపోతును అమ్మవారికి బలివ్వటం ఇష్టం ఉండదు .దాన్ని కాపాడాలని అనుకొంటారు వారి వల్లకాదు .’’సప్పలమ్మ తల్లి దీపాల పండుగ ‘’నాడుదాన్ని తెగేసి బలిస్తారు .మాంసాన్ని ఊరంతా ప్రసాదం గా తీసుకొని వండుకొనే రివాజు .పిల్లలకు కడుపు తరుక్కు పోతూ ఉంటుంది జంతు హింస .కాని ‘’కోసిన పాపం తింటే పోతుంది’’అనే సామెత చెప్పాడో మారెప్ప .సరే నను కొంటారు .దున్నను నరికే వాడి చేతులు పడిపోవాలని కోరుకుంటారు .కాని ఏమీ చేయలేని నిస్సహాయా స్తితి వారిది .చివరికి ఒక్కేటుతో ఎనుమును నరకడం మాంసంఅమ్మవారికి నైవేద్యం పెట్టటం వండుకు తినటం ఆ మసాలా కంపు కు పిల్లలు మురిసి పోవటం జరిగి అమ్మవారు శాంతించి జల్లు కురిపించిందని సంబర పడతారు .ఈ తంతులో జరిగే ప్రతి విషయాన్ని వివరించాడు రాజు .పిల్లల మనస్తత్వమూ మనకు తెలుస్తుందింది ఇందులో .
శ్రీ గోనోళ్ళ సురేష్ రెడ్డి ‘నల్ల రగ్గు ‘’కధలో మంచి సస్పెన్స్ ఉంది .పెద సావు కారు బుచ్చయ్య ,కస్టపడి చేను చేసుకొనే రాజన్నఅనుకోకండా హత్యలకు గురి అవుతారు .ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. రక రకాల ఊహా గానాలు రేగుతాయి .నల్ల రగ్గు కప్పుకొన్న వారెవరో ఈ హత్యలు చేశారని అందరూ అనుకొంటారు .బుచ్చయ్యను రాజన్న చంపాడని రాజన్నను భార్య నరసమ్మ చంపిందని కధనాలు పుకార్లు షికార్లు చేస్తాయి .ఎవరికి అర్ధం కాక బుర్రలు పగల కొట్టుకొంటున్నారు .’’ఏయ్ పుంగు మాట లేలరా .సంపినప్డు సూసినోడేవరూ లేరు .సంపినోడేవడో ఆడికే ఎరిక మనకేలరా “’అను కొంటారు .చివరి వాక్యం లో ‘’ఉతికి ఎండేసి మడిసి పెట్టిండే నల్ల రగ్గు ను తీసి బిడ్డల మీద కప్పుతా కసిగా నగు కొనింది సావుకారి పెండ్లాము బయ్యమ్మ ‘’అని ముగిస్తాడు రచయిత . ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధానం గా ఉండి హత్యకు కారణాలౌతాయని మనకు చివరికి తెలుస్తుంది .ఈ హత్యలు చేసింది షావుకారు బుచ్చయ్య భార్య బయ్యమ్మే నని నమ్మాల్సి వస్తుంది .
శ్రీ మతి కొమాండూరు కృష్ణ కళా వతమ్మ’’ పుట్టింటి బెమ ‘’లో పుట్టింటి సంప్రదాలకు భిన్నం గా అత్తింటి పద్ధతులను అలవర్చుకోవటం మొదట్ల్ కష్టం గా ఉన్నా చివరికి రాజీ పడి అత్తగారి విధానాలనే ఆచరించిన ఒక కోడలి మనస్సు వివరణ ఉంది .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-14-ఉయ్యూరు