కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’
హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట ముద్రించి నాకు ఒక కాపి ని పంపగా ఈనెల పదిహేడున అందింది .దాన్ని నిన్న అంటే ఇరవయ్యవ తేదీ న చదివేశాను .ఇలా జాతీయ కవి సమ్మెళన కవితల్ని ఆకాశ వాణి పుస్తకం గా ముద్రించటం ఇదే ప్రధమం .ఈ పూనిక ,ఆలోచన ,శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి వచ్చినందుకు బహుదా అభినంద నీయులు .నాకు తెలిసి నంత వరకు జాతీయ కవి సమ్మెళన.తెలుగు అనువాద కవితలను శ్రీ సాగి కమలాకర శర్మ గారు తమ ‘’మూసీ ‘’మాస పత్రిక లో ,ప్రతిఏడాది ఫిబ్రవరి సంచికలో ప్రచురించే వారు .ఇప్పుడిది ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రానికి దక్కింది .కొత్త గా ఆలోచించటం నవ్య మార్గాలను పాత విధానాలపై నిర్మించిటం,అనుక్షణ పరిశోధన ల లో ఆయన అందె వేసిన చెయ్యి .సంగీత సాహిత్య సంపన్నులైన వారి కీర్తి కిరీటం లో ఇది కలికితురాయి .నా మీద ఉన్న ప్రత్యెక అభిమానం తో నాకు పంపినందుకు వారికి కృతజ్ఞతలు అంద జేస్తూ ఇందులోని విశేషాలను ‘’కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’శీర్షిక తో మీకు అందజేస్తున్నాను .
2014గణ తంత్ర దినోత్సవ జాతీయ కవి సమ్మేళనం హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జనవరి తొమ్మిదవ తేదీ బాగ్ లింగం పల్లి లోని ఏ.పి ఎస్.ఆర్ .టి.సి.కళా భవనం లో జరిగింది .22 భారతీయ భాషలకు చెందిన వివిధ కవులు సమర్పించిన కవితలను 22మంది కవులు హిందీలోకి అనువాదం చేయగా ,సుప్రసిద్ధులైన 22 మంది తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు .మొత్తం 66మంది కవీశ్వరుల భువన విజయం లాంటి ఈ బృహత్తర కార్య క్రమాన్ని మాన్యులు శ్రీ మంగళ గిరి వారి చొరవ సాహసం అంకిత భావం తో దిగ్విజయం గా నిర్వహించి ఢిల్లీ అధికారులను మెప్పించటమే కాక స్థానికులు ,సాహిత్యాభిమానులు అశేషం గా విచ్చేసి కవితా సోయగాలకు మురిసి అభినందించారు .సాహసం చొరవ ,దీక్ష ,ఆలోచన ,ఆచరణలో అద్వితీయులైన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధతకు నిదర్శనం గా ఈ కవి సమ్మేళనం న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగిందని వార్తా మాధ్యమాలు బహుదా ప్రశంశా వర్షం కురిపించాయి .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఇ .ఎస్. ఎల్.నరసింహన్ ,సభాధ్యక్షులుగా ఆలిండియా రేడియో న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ .వెంకటేశ్వర్లు వేదికను సుసంపన్నం చేయగా ,చెన్నై ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ శ్రీ కే.పి. శ్రీనివాసన్ శుభాకాంక్షలు తెలిపారు .హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ప్రస్తావన చేసి శోభ తెచ్చి ఆ కాంక్షను వివరించారు .’’ఇది అత్యంత అరుదైన కార్యక్రమమని ‘’న భూతో గా ‘’నిర్వహించిన హైదరాబాద్ కేంద్రం ,నిర్వాహకులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధ బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు ‘’అని ఆనందం గా చెప్పారు శ్రీ వెంకటేశ్వర్లు .ప్రసంగం కొనసాగిస్తూ ‘’మానవీయ విలువలను ఒక తరం నుండి మరో తరానికి అందించే అద్భుత సాధనం సాహిత్యం అని ,భిన్నత్వం లో ఏకత్వాన్ని ప్రశంసిస్తూ ,సమాకాలీన సామాజిక సమస్యలకు సున్నితం గా స్పందిస్తూ హృదయ స్పర్శిగా ఉన్న ప్రతి కవితా ఖండికా చీకట్లను పార దోలే చిరు దీప కళిక అన్నారు .మొట్టమొదటి సారిగా జాతీయ కవి సమ్మేళనం వేదిక పై ప్రాంతీయ భాషాను వాదాలు అంటే’’ మన తెలుగు’’ అనువాదాలు సమర్పించటం అద్భుత ప్రయత్నమని ,వీటిని పుస్తక రూపం లో తీసుకు రావటం అభినంద నీయమని దీనికి ప్రేక్షకుల స్పందన అత్యద్భుతం గా ఉండటం కొనియాడ దగిన విషయమనీ అన్నారు .శ్రీ శ్రీనివాస్ ‘’జాతీయ సమైక్య వేదిక పై ,భాషాఐక్యత ,సామరస్యం వెళ్లి విరిశాయి.పరస్పర అవగాహనకు తోడ్పడింది .’’అని కీర్తించారు .
శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ తమ ప్రస్తావనలో ‘’ఈ రోజు ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర చరిత్రలోనే కాకుండా ,దేశ వ్యాప్తం గా ఉన్న ఆకాశ వాణి వ్యవస్థలోనే ఒక అపూర్వ ఘట్టం అని ,సాధారణం గా ఆతీయ కవి సమ్మేళనాలు ఉత్తర హిందూ దేశ ఆకాశ వాణి కేంద్రాలలో నిర్వహించటం ఆన వాయితీ గా వస్తోందని ,అక్కడ హిందీ అనువాదాలకే స్తానం ఉండేదిని ,ఈ వేదిక పై తెలుగు అనువాదాలకు చోటు కల్పించమని డైరెక్టర్ జనరల్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని కోరిన వెంటనే అనుమతించటం మరువ రాని అనుభూతి అని ,గవర్నర్ గారు అన్నిటిలో దిట్ట అని వారి రాక అందరికి ఆనంద దాయకమని జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ సి నారాయణ రెడ్డి గారు సభా ప్రారంభాకులుగా విచ్చేయటం సభా గౌరవాని ఇనుమ డింప జేసిందని ,తమ సిబ్బంది అహరహం కష్టించి దీన్ని దిగ్విజయం చేశారని ,పని దినం లో నిర్వ హించిన ఈ కవి సమ్మేళనానికి అనూహ్యం గా యువత ,రసజ్న ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోహాజరవటం చిరస్మరణీయం ‘’అని ఆనడాను భూతులతో కృతజ్ఞతలు తెలియ జేశారు .
మొదటి కవిత ‘’కేదార విలయ తాండవం ‘’ప్రో .జి ఎస్.ఆర్ కృష్ణ మూర్తి సంస్క్రుత కవితకు డా..తాడేపల్లి పతంజలి గారి తెలుగు అనువాదం .ఛందో గర్భితమైన పద్యాలివి .ఎందరినో పొట్ట పెట్టుకున్న కేదార నాద్ వరద భీభత్సం దీనికి నేపధ్యం .కంటిముందే తండ్రి తల్లి అన్నా చెల్లీ అందరూ ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయి విగత జీవులై పోతుంటే గుండెలు పిందించే దృశ్యాన్ని కవులిద్దరూ భావ గర్భితం గా దృశ్యమానం చేశారు .’’నట్టింటిలో ప్రాణముల్ అల్లల్లాడేది వేల వారి తుది వాన్చాకార మేమౌనోకో “”అని బాధ పడ్డారు .శివుడికి ఆశుతోషుడు అనే పేరుంది .అంటే సుఖాలను ఇచ్చేవాడు కాని ఇక్కడ దుఖాన్ని కలిగించాడు .’’వేల్పుల దేవర యాశుతోషుకున్ కేలిది మొక్కినంశివుడు కీడును గోడును ఆప లేదు ‘’అని వ్యధ చెందాడుకవి .’’వికారాళ భీకర విద్యుల్లతా దంస్ట్రాo కురమ్ములముల దండ దాల్చే ‘’పద్యం విలయ తాండవానికి శాబ్దిక స్వరూపమే .ఈ కవిత సమకాలీన స్పృహకు నిదర్శనం
‘’వ్యాఖ్యాన రహితం ‘’కవితను డా కరబిదేక హజారికా అస్సామీ భాషలో రాస్తే డా.దేవరాజు మహారాజు తెలుగు సేత చేశారు .’’కొన్ని సంబంధాలకు పేర్లు ఉండవని ,కొన్ని వర్దిల్లటానికి ఇల్లు కూడా ఉండవని ,అలా నగర మంతా చుట్టి గోధూళి లో వెనుదిరుగుతారని ఎండు టాకుల పరుపుల మీద మేనువాల్చి సంకల్పం సంశయం ,నిస్సహాయాల భూమికల్ని మరుసటి రోజు కోసం చుట్టిపెడతారని’’ అన్నారు .’కొందరు ఎలాంటి వారంటే ‘’వాళ్ళను చూస్తూనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి –వాళ్ళకు గుక్కెడు నీళ్ళిచ్చే వారుండరు .వేల వేల సంబంధాల విచిత్ర సమ్మేళనం ఇది .అయినా వారి పేరు ఏ పట్టిక లోను ఉండదు ‘’అని అనామకుల గురించి ఆవేదన చెందుతాడు కవి .కాని ఒక హెచ్చరిక మాత్రం చేస్తాడు ‘’అస్తిరమైన క్షణాలపై నిఘా పెడుతూ –దూరం నుంచి కాలం చూస్తూ ఉంటుంది ‘’ జాగ్రత్త కోసం హితవు తో కూడిన హెచ్చ్చరిక ఇది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-14-ఉయ్యూరు