పిబరే కృష్ణ .ర.సం.-5
‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా సాహిత్య కారుడు .నాడి పట్టుకొని రోగ నిదానం చేసి చికిత్స చేసినట్లు ,చూపులతో లోకాన్ని ఆరసి ,లోపాలను కని పెట్టి సాహితీ చికిత్స చేయగల పరేంగితావ గాహి .ఎందరి హృదయాలలోనో పరకాయ ప్రవేశం గా దూరి వారి ఆంతర్యాన్ని వెలువరించిన హృదయ పరిశీలకుడు .హోసూరు ప్రాంత కొండా కోనా ,చెట్టూ పుట్టా వివరాలేరిగిన .వాడుబండ బతుకుల ఆంతర్యం తెలిసిన వాడు .జబ్బును డబ్బు జబ్బునూ కనిపెత్తటగాలాడు .న్యాయం గా ఆయన భాష సంస్కార వంతమైనది .కాని మట్టిని నమ్మిన వాడు .అందులో బతుకుతున్న వాడు .మరి ఆ భాష లో రాస్తే నే అది చరితార్ధమౌతుందని నమ్మి ,తన ప్రాంతం వారు మాట్లాడే భాషను విని తెలుసుకొని అధ్యయనం చేసి అలవర్చుకుని ఆ భాషను సంపన్నం చేయటానికే రాశాడు .ఈ పుస్తకానికి శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’పత్రికల తెలుగు అద్దాల అరల్లో అందాల బొమ్మ అయితే తావు (నేటివ్)తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ .తెలుగు తల్లి కనిన గారాల బిడ్డ మా హోసూరు తెలుగు ‘’అంటూ రాసిన ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు సత్యాలే .కొంచెం ఓపికతో చదవటం ప్రారంభిస్తే వదల లేము .ఇవన్నీ పూర్తిగా కదా కృతిలో లేక పోవచ్చు గల్పిక మాదిరీ ఉండచ్చు .కాని చదివించే కండ గల కతలు .ఇందులోని ముఖ్య విషయాలే మీ ముందుంచుతున్నాను .
హోసూరు లాంటి చలవ ప్రాంతాల్లో తెల్ల జొన్నలు ,ఏడాకుల జొన్నలు తింటే ఉడుకు పుట్టి ఆరోగ్యానికి మంచిది .ఆనపకాయలు అంటే సోరకాయల్ని ఉడకేసుకుని తింటే ఒంటికి మంచిది .సంక్రాంతికి ,కజ్జాయలపండక్కి (దీపావళి )తప్పక సొరకాయలు ఉడకేసి తినాలి .దొంగ సాములోరు దేవుడినే దొంగిలించే కద ‘గవి గుట్ట ‘’.కడుపు లో నులి పురుగులు పడి బడికుర్రాడేడుస్తుంటే వాణ్ని నానా అల్లరి పెట్టి ‘’జగిని లోడు ‘’అని నిక్ నేం పెట్టి న సావాసగాళ్ళ భరతం పట్టింది బడిలోనే వాళ్ళమ్మ –కైవారం తాతగారి పాట ‘’తోక పురుగులు మూడు పాళ్ళు నిండి ఉంది నీచు నీళ్ళు ‘’పాడి బుద్ధి చెప్పింది ‘’జగిని గోడు ‘’అంటే నులిపురుగులున్నవాడు .అని అర్ధం .బియ్యం మరలో మోసాన్ని బయటపెట్టాదొక రైతుకొడుకు పాలేరు చేయని సాహసం చేసి దొబ్బిన బియ్యాన్ని తిరిగిపొండాడు ఆ మూటను వాడి పెద్దమ్మకిస్తే వాడి ‘’ఆపెకారానికి ‘’అంటే ఆపేక్షకు మురిసిపోయింది .కడుపులో పురుగులు పడకండా అపుడపుడు బెది మందుగా బెది నూనె అంటే ఆముదం తాగించటం ఇంకా అక్కడ ఉంది .మనకు అవుట్ ఆఫ్ ఫేషన్ అయింది .
చేను పక్కల వాళ్ళు దొంగతనం గా గోడల మేత కోసుకోవటం గొడ్లను మేపటం సాధారణం గా జరిగేదే .దొరికితే దొంగ దొరక్క పొతే దొర .పక్క చేలో మేస్తోంది గా మనకేం అని ఏ రైతైనా అనుకుంటే రేపు వాడి చేలో మేయ్యవని గ్యారంటీ లేదు అందుకే ఒక రైతు పక్క చేలల్లో పడిన పక్కూరి ఆవుల మందను బయటికి తోలి ఊరందరి మెప్ప్పు పొందాడు .జండా పార్టీ ఓళ్ళు అంటే నక్స లైట్లు గ్గ్రామాల్లో వేలుగుతెద్దామనుకొంటే గ్రామస్తులు పాత దోరణిలోనే సాగటం వాళ్లకు విసుగు తెప్పించింది .చేను పక్క కల్లు కాచి తాగుబోతులకు పోసి వీరంగం సృష్టిస్తుంటే తెలివైన రైతు ఆ కల్లు కుళ్ళిన అరటిపళ్ళూ కుక్క తలకాయ తో కాచారని ప్రచారం చేసి వారిని హడల కొట్టి అక్కడ దుకాణం లేకుండా చేశాడు పాక పీకెట్లు చేశాడు .అపాయానికి ఉపాయం ఉన్న వాడే తెలివైన వాడు జొన్న చేలల్లో ఆవులు దొంగతనం గా పది మేస్తుంటే ఒక యజమాని బామ్మర్ది వాటికి జొన్న కంకుల్లో గుండు సూదులు గుచ్చ్చాడు అవి తిని ఆవులు చచ్చిపోయాయి .ఈ పాపం తనదే నని భావించి ఆ రోజు నుంచి కొంత మేత కోసి గట్టు మీద పడేసి కావాల్సిన వాళ్ళు తీసుకుని పోయేట్లు చేశాడు ఆసామి .మేతలు లేని వాళ్ళు హాయిగా తీసుకెళ్ళి మేపుకుంటున్నారు .సోషలిజం అంటే ఇంతకంటే ఎక్కడుంది స్వామీ?
ఆ ఊళ్ళో కాపులకు .మాల వాళ్లకు బ్రాహ్మలకు విడి విడిగా బావులున్నాయి .ఒకరి నూతినీరు ఇంకొరు తాగరు .బావులు తవ్వేటప్పుడు మొట్టమొదట నీళ్ళ రుచి చూసినవాడు తాత .ఏదో మాటల సందర్భం గా ఈ మాట బయట పెట్టాడు తాత .’’అయితే ఈ ఊర్లా మూడు బాయిల్నీ ముందర ఎంగిలి సేసింది నువ్వేనా తాతా ‘’అని నవ్వాడు బాపన కుర్రాడు .అందరూ నవ్వుకున్నారు .అంతే బాపనోళ్ళ బాయి ఎంగిలైందని మూసేసి బోరు వేసేసుకున్నారు మర్నాడే .అప్పుడు తాత ‘’మనుషులు మారి నట్లున్దారుకాని వాళ్ళ మనసులు మారలేదురా .ఆళ్ళ పిల్లోడు ఇని ఆల్లకు సేప్పింటాడు .అందుకే ఇంతపని సేస్తిరి ‘’అన్నాడు తాత మనవడితో .
ఆ ఊళ్ళో వీరుల గుడి ఉంది .అక్కడికెళ్ళి మొక్కితే వీరత్వం తన్నుకోస్తుందని నమ్మకం .ఆ గుడిలో నిధి ఉందని దొంగలు తవ్వటం ఒక కుర్రాడు అనుకోకుండా చూసి గుడిలో దణ్ణం పెట్టుకొని వీరత్వం విజ్రుమ్భించి వాళ్ళని చితక బాది తోలేశాడు .అప్పటి నుంచి వాడిని ‘’వీర గాడు ‘’అన్నారు .కన్నడ వాగ్గేయ కారుడు పురందరదాసు చెప్పాడని ఒక పకీరు సాయిబుల పండక్కి వచ్చిన అందరి విస్తళ్లలో ఉమ్మేస్తున్నాడు .అందులో నే భోజనాలు వద్దిన్చుకుని మహా ప్రసాదం గా తింటున్నారందరూ .రచయిత ఇలా చేయటం బాగాలేదన్నాడు .అప్పుడు పకీరు పురందరదాసు చెప్పిందే తానూ ఫాలో అవుతున్నానని చెప్పి కావాలంటే పెద్దవాళ్ళను కనుక్కోమన్నాడు ఒక పెద్దాయన ‘’తురు కరు కరిదరే ఉన్నబహుదన్నా-తురుకరు వెంజలు అతి పుణ్యవయ ‘’అని చదివాడు .ఇది విన్న రచయిత పగల బడి నవ్వాడు అసలు అర్ధం తెలీకుండా ఇంతకాలం మూఢం గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని గ్రాహించాడు లోతు విచారించి అందరికి అందులోని గూడార్ధం వివరించాడు .ఒక సారి ఒక తురక రాజు పురందర దాసుకు ఎదురై తురకల మీద ఒక పాటకాని పద్యం కాని చెప్పమన్నాడు .చెప్పక పొతే నరికేస్తానని బెదిరించాడు .అప్పుడు చెప్పిన పద్యం ఇది .ఇందులో రెండు రకాల అర్ధాలున్నాయి .మొదటిది –తురకలు పిలిస్తే భోజనానికి వెళ్ళాలి .వాళ్ళ ఎంగిలి చాలా పుణ్యం అని .రెందోఅర్ధం ఆవుదూడ పిండితే లేక పాలు ఇస్తే తినోచ్చు తాగొచ్చు .ఆవుదూడ ఎంగిలి మహా పుణ్యం మొత్తం మీద ఆవుపాలు తాగొచ్చు ఆవు దూడ ఎంగిలి మహా పుణ్యం అని .అర్ధం .తురక రాజు దాసుగారు తన్ను పొగిడాడు అనుకోని ఆయనకు మొక్కి వెళ్ళిపోయాడు ఆ రాజులాగే ఈ పకీరు ,పకీరులాగే మూర్ఖ జనాలు ప్రవర్తించారని బుద్ధి చెప్పాడు .అందరూ దూ దూ అని ఉమ్మేస్తూ వెళ్ళిపోయారు .ఇలాంటిపకీర్లను చూసే హోసూరు ప్రాంతాపు తత్వ వేత్త ,కవి, బోధకుడు,అందరికి ఆరాధ నీయుడు స్వర్గీయ కైవారం తాత గారు ‘’లలాట శూన్యము ,కంట కుల్లావి ,మెడ నిండా దారాలు ,మణి పూసలుకొన్ని ,ఒడ్డు పొడుగునా పెద్ద గడ్డాలు పెంచుక లుంగీ కట్టుకుని గంజాయి పొగ దీసి అల్లా నెరుగని కల్ల కాజీ పకీరుల్లారా ‘’అని యెగతాళి చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు