ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ
అమెరికా ప్రముఖ నవలా రచయిత ఎర్నెస్ట్ హేమిగ్ వే రాసి నోబెల్ ప్రైజ్ సాధించిన నవలే ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లిటరరీ కంపానియన్ వాళ్ళు దీనిపై ప్రసిద్ధ విమర్శకుల చే వ్యాసాలూ రాయించి ప్రచురించారు .అది నా కంట బడి లైబ్రరి నుండి తెచ్చి చదివాలు .చాలా విలువైన వ్యాస సంపుటి అది .హెమింగ్ వే లోని అంతర్మధనాన్ని బాగా వెలువరించారు .’’the old man;s philosophical musings on the meaning of life of life and death ,and his role on both ,provide a fascinating back drop for his straight forwarding tale .Delbert E.Wylder దాన్ని ‘’sea fable ‘’అన్నాడు .అంతే కాక హెమింగ్ వే లోని సరికొత్త ధోరణి పూర్తిగా అభి వృద్ధి చెందిన కద.ఒక రకం గా చిన్న నవల .ఇందులో హీరో అయిన ముసలాడి’’ ప్రయాణ దాహం’’ గోచరిస్తుంది .సాటియాగో అనే ముసలి సముద్ర జాలరి ప్రత్యెక చేప వేట కు వెళ్లి శక్తి నంతా ధార పోసి అది పూర్తిగా దక్కక దాని అస్తిపంజరాన్ని మాత్రమె ఇంటికి తెచ్చుకొంటాడు .ఒక రకం గా ఇది ముసిలాడి ఓటమే .అయితే అతనిలోని పోరాట పటిమకు నిదర్శనం గా నిలుస్తుంది .అందుకే ‘’ it is a romantic attempt on the part of a champion to test the gods of the universe ,perhaps ,it is even an attempt at regeneration ‘’burning out ‘’of the ego in the god like attempt and the ultimate defeat on the way back to community of men ‘’అని నవలలోని ఆంతర్యాన్ని బయట పెట్టారు .
ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ‘’సముద్రం లో మంచి చెడు అనే ద్వంద్వాలున్నాయి .అది మనకు కావలసినవి ఇస్తుంది ..క్రూరం గా ప్రవర్తిస్తుంది కూడా .ముసలాడు ఒక రోజు అందరు వేట గాళ్ళను వదిలి ఒంటరిగా సముద్రం లో చాలా దూరం వెళ్ళాడు .దాన్నే ‘’across the threshold into the world of gods ‘’అన్నాడు విమర్శకుడు మార్లిన్ అనే ప్రత్యెక చేప ను వల పన్ని పట్టుకోవటమే అతని ధ్యేయం .85వ సారి ‘’over an axis ‘’చేస్తున్న ప్రయత్నం ఇది .ఆతను వేసిన ఏర ఆ చేప నోట్లో గుచ్చుకుంది .అది ముసలాడి పడవను ఆగ్నేయ దిశకు లాక్కెళ్ళింది .దేవతలతో యుద్ధం అంత ‘’వీజీ కాదు ‘’అని అప్పుడు తెలిసింది .అతడు ఎన్నుకున్న మార్గం అతని స్వంత ‘’treachery ‘’.అప్పుడు అతని మనసులో ‘’my choice was to go there to find him beyond all people .Beyond all people in the world No one to help either one of us ‘’.అంటే ఆటను మానవ పరిదిలన్నీ దాటి వెళ్ళాడని భావం .ఒక విధం గా మన ‘’గజేంద్ర మోక్షం ‘’కదఇక్కడ మాత్రం .చివరికి ముసలాడు శక్తి నంతా ఉప యోగించి ‘’హార్పాన్ ‘’తో చేప ను పొడిచాడు .అది నెత్తురు కక్కి సమూద్రపు నీరంతా యెర్ర సముద్రమే అయింది .అతని పరిస్తితీ క్షీణించి పోయింది .అలసి మూర్చ వచ్చేంత పని అయింది జబ్బు చేసినట్లని పించింది .ఇక్కడే దీన్నిప్రముఖ అమెరికన్ నవలా రచయిత ‘’హెర్మన్ మెల్ విల్లీ ‘’రాసిన ప్రఖ్యాత నవల ‘’మోబీ డిక్ ‘’తో పోల్చారు .మోబీ డిక్ లో ‘’అహబ్ ‘’లో’’mono manial dream ‘’ఉంటె ఇందులో వ్రుత్తి పరం గా ముసిలాడికి సముద్ర వేట సంసారానికి ఆహార సంపాదన కోసమే .ఇది ఇతని మానవ విధి, బాధ్యత .ఆ పనినే శక్తి వంచన లేకుండా చేస్తున్నాడు .’’కర్మణ్యేవ కాదికారస్తే –మా ఫలేషు కదా చనా ‘’అన్న గీతా వాక్యం ప్రకారమే చేస్తున్నాడన్న మాట .ప్రయత్నం నీది ఫలితాన్ని ఆశించ కు అని సారాంశం .’’keep my head clear ‘’ he said against the wood of the bow .’’I am a tired old man but I have killed the fish which is my brother and now I must do the slave work ‘’అనుకొంటాడు .ఈ చేప చుట్టూ షార్క్ చేపలు వెంట పడతాయి .దాన్ని తినటం ప్రారంభిస్తాయి .చూస్తూనే ఉన్నాడు .తాను ఓడిపోవటానికి వీలు లేదనుకున్నాడు ‘’a man can be destroyed ,but not defeated .”’I am sorry that I killed the fish though ‘’అని అనుకొన్నాడు .అతనిలో అంతర్మధనం జరుగుతోంది .
‘’it is silly not to hope .Besides I believe it is a sin .Do not think about sin ,he thought .There are enough problems now without sin also I have no understanding of it ‘’అని వితర్కిం చు కున్నాడు .’’perhaps it was a sin to kill the fish .I suppose it was even though I did it tokeep me alive and feed many people .But then every thing is a sin ‘’అని నిర్ణయానికి వచ్చేశాడు .కాని మనసు పీకుతోంది .తను చేసేది తప్పా ఒప్పా తేల్చుకోలేక పోతున్నాడు .చివరి గా మళ్ళీ మనో మధనం సాగించాడు ‘’you killed him for pride and because ,you are a fisherman .you love him when he was alive and you love him after .If you love him it is not a sin to kill him .Or is it more?’’.గీతలో కృష్ణుడు చెప్పినట్లే వీడూ చేశాడు .అప్పటిదాకా అర్జున విషాద యోగం లో ఉన్న వాడు సందేహాలన్నీ తీరి చీకటి తొలగి అజ్ఞానం నశించి కార్యోన్ముఖుదయ్యాడు .అప్పుడు దేహం మనసు ప్రశాంతత ను పొందాయి .’’గజేంద్రుడు మొర పెట్టుకొన్నట్లు ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగ’’ అనుకొన్నాడు .చివరికి కర్తవ్యం చేసి మోక్ష ప్రాప్తి సాధించాడు .హెమింగ్ వే చాల చక్కగా వివరించాడు ‘’hope is replaced by something else .The old man;s head was clear and good now and he was full of resolution but he had little hope ‘’అన్నాడు వాడి పట్ల సాను భూతి చూపిస్తూ .
ముసలాడు ఇంటికి తిరిగోస్తున్నాడు .మళ్ళీ మధన మొదలైంది ‘’I wish it were a dream and that I had never hooked him .I am sorry about, it fish అని చెబుతూ సానుభూతిగా అన్నాడు .’’It makes every thing wrong .I should not have gone out so far .,fish –Neither for you not for me .I am sorry fish ‘’అంటూ తనను ఆ చెప్పాను అనున యించుకొన్నాడు ఓల్డ్ మాన్ .తన తోటి మిగిలిన జాలరులంతా విచారిస్తారేమో .తానుమంచి పట్నం లోనే ఉంటున్నాడు కదా అనుకున్నాడు .తన వారందరూ తనకోసం యెంత ఆరాట పడుతున్నారో ఎదురు చూస్తున్నారో అని ఆలోచించాడు .తానూ పట్టుకున్న చెప్పాను షార్క్ చేపలు తినేయ్యం గా మిగిలింది సగం చేప మాత్రమె .అదీ ఆస్తి పంజరమే మిగిలింది మిగిలిన దంతా షార్కు లు పళ్ళ ఫోర్కులతో నంజుకు తినేశాయి .’’I ruined us both .But we have killed many sharks you and I and ruined many others ‘’అంటూ తానూ ,ఆ చేపా చేసిన పాపాల చిట్టా విప్పాడు .
తిరుగు ప్రయాణం లో ముసలాడు ముగ్గ్గురితో యుద్ధం చేయాల్సి వచ్చింది .మొదటిది ‘’మాకో’’ అనే షార్క్ తో .రెండోది ‘’గాలనాస్ ‘’తో .ఇదే లూజింగ్ బాటిల్ .తన దగ్గరున్న చేపల్ని చంపే పరికరాలన్నీ అయిపోయి నిస్సహాయుడయ్యాడు .చివరి పోరాటం లో సాధించిన విజయ చిహ్నం చేప . .చీకటి పడుతోంది మళ్ళీ ఆశ పెరిగింది కాని ఎవరితోనూ పోరాడా రాదనుకున్నాడు .తానూ ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలచినది .షార్కు లన్నీ మీద పడుతున్నాయి .అప్పుడనుకున్నాడు ‘’man is not created for defeat .’’అని జీవిత పరమార్ధం గ్రహించాడు .చివరగా తానూ దెబ్బతిన్నానని ,దానికి చికత్స లేనే లేదని తెలిసింది .సముద్రం మీద నుంచి కొత్త మనషి గా బయటకు రావాలను కొన్నాడు .సముద్రం గాలి మొదలైనవి తనకు పూర్తిగా సహకరిస్తాయని విశ్వ సించాడు .అవీ శత్రుచ్చేదనం లో పాల్గొని తనకు చేదోడు గా ఉంటాయనుకొన్నాడు .కాని ‘’I was beaten by my own treachery ‘’అనుకొన్నాడు .ఇక్కడే చాలా ఫిలసాఫికల్ గా అనిపిస్తాడు రచయితా హెమింగ్ వే ‘’I t is not society that is to guide and save the creative hero ,but precisely the reverse .And so every one of us shares the supreme ordeal –carries the cross of the redeemer –not in the bright moments of his tribes great victories, but the sincere of his personal despair ‘’అంటే తను తెచ్చిన చేప ఆస్తి పంజరమే ‘’spiritual symbol of his victory ‘’అంటే ‘’క్రాస్ ‘’అని అర్ధం .ఇంటికి రాగానే అక్కడ మానోలిన్ అనే కుర్రాడు తాత కోసం ఎదురు చూస్తూ కని పించాడు .వాడితో ‘’they beat me Manolin they truly beat me .physically the sharks beat me ‘’అన్నాడు షార్కులు సముద్ర ఆవాస జీవులు అక్కడే వాటి జీవనం మనుగడ వాటి జోలికి వెళ్ళటం నేరమే .అవి సముద్రం లో శక్తి సంపన్న జీవులు .ఈ విషయాన్నే విమర్శకుడు ‘’they emphasize the symbolic aspect of the treachery within the sea on the way home ‘’.ముసలాడి మాటలకు కుర్రాడు ‘’he did not beat you nor the fish ‘’ అని అంటే ’’’no-it was after wards ‘’అంటాడు ముసిలి .సముద్రం తో చేసిన ద్వంద్వ యుద్ధం లో ముసలాయన ఒడి పోయాడని భావం
‘’heroic character of man kind can be formed ,it is through the recognition of man;s ultimate defeat –which he endures with resolution and courage and which brings him into an acceptance of reality ,that a conditional victory is won ‘’అని ముగిస్తాడు వ్యాఖ్యాత .ఈ కధలో హీరో ఐన ముసలాడు శాంటిగో యే రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే .అతని జీవితం లో చివరి ది ఈ నవల .
సశేషం
31-10-2002 నాటి నా అమెరికా( హూస్టన్ ) డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-14-ఉయ్యూరు